• facebook
  • whatsapp
  • telegram

భాగస్వామ్యం (Partnership)

ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మంది వ్యక్తులు కలిసి ఒక వ్యాపారాన్ని నిర్వహిస్తే దాన్ని భాగస్వామ్యం అని, ఆ వ్యక్తులను భాగస్వాములు అని అంటారు.

* భాగస్వామ్యం రెండు రకాలు. అవి:

1. సామాన్య భాగస్వామ్యం: ఇందులో భాగస్వాముల పెట్టుబడుల కాలం సమానంగా ఉంటుంది. సామాన్య భాగస్వామ్యంలో లాభాన్ని భాగస్వాములు పెట్టుబడి ఆధారంగా, నిష్పత్తి ప్రకారం పంచుకుంటారు. 

* భాగస్వాముల పెట్టుబడుల కాలం సమానం అయితే, లాభాల మధ్య నిష్పత్తి = పెట్టుబడుల నిష్పత్తి 

2. సంయుక్త భాగస్వామ్యం: ఇందులో పెట్టుబడుల కాలం అసమానంగా ఉంటుంది. సంయుక్త భాగస్వామ్యంలో లాభాలను పెట్టుబడి,  కాలం ఆధారంగా పంచుకుంటారు.

* భాగస్వాముల పెట్టుబడుల కాలం అసమానం అయితే, లాభాల మధ్య నిష్పత్తి = పెట్టుబడి x పెట్టుబడి కాలం నిష్పత్తి 

* భాగస్వాములు రెండు రకాలు.

1. వాస్తవ భాగస్వామి (లేదా) నిర్వాహక భాగస్వామి: పెట్టుబడితో పాటు వ్యాపార కార్యకలాపాలను నిర్వహించే భాగస్వామిని నిర్వాహక భాగస్వామి అంటారు. ఈ వ్యక్తికి పెట్టుబడి ఆధారంగా లాభం, వ్యాపారాన్ని నడిపినందుకు వేతనం లభిస్తాయి.

2. నామమాత్రపు భాగస్వామి: వ్యాపారంలో పెట్టుబడి పెట్టి, కార్యకలాపాల్లో పాల్గొనకుండా ఉంటే, అలాంటి వారిని నామమాత్రపు భాగస్వామి అంటారు. 

మాదిరి ప్రశ్నలు

1. A, B, C లు ఒకే వ్యాపారాన్ని వరుసగా రూ.20,000, రూ.50,000, రూ.40,000 పెట్టుబడులతో ప్రారంభించారు. సంవత్సరం చివర్లో వారికి వచ్చిన మొత్తం లాభం రూ.12,100. అయితే B వాటా ఎంత? 

1) రూ.4400       2) రూ.2200   

3) రూ.5500       4) రూ.4500

సాధన: పెట్టుబడుల కాలం సమానం కాబట్టి,లాభాల మధ్య నిష్పత్తి = పెట్టుబడుల మధ్య నిష్పత్తి 

A : B : C = 20000 : 50000 : 40000

               = 2 : 5 : 4

సమాధానం: 3

2. A ఒక వ్యాపారాన్ని రూ.20,000తో ప్రారంభించాడు. 4 నెలల తర్వాత B రూ.25,000తో భాగస్వామిగా చేరాడు. మరో 4 నెలల తర్వాత రూ.30,000 పెట్టుబడితో C అదే వ్యాపారంలో చేరాడు. సంవత్సరం చివర్లో వచ్చిన మొత్తం లాభం రూ.9800. అయితే అందులో C వాటా? 

1) రూ.2100        2) రూ.3200   

3) రూ.2250       4) రూ.2500 

సాధన: B  8 నెలలు, C  4 నెలలు వ్యాపారంలో ఉన్నారు. 

సమాధానం: 1

3. A, B లు ఒక వ్యాపారాన్ని వరుసగా రూ.12,000, రూ.16,000 పెట్టుబడులతో ప్రారంభించారు. 8 నెలల తర్వాత C, రూ.15000 పెట్టుబడితో వ్యాపారంలో చేరాడు. రెండేళ్ల తర్వాత వ్యాపారంలో రూ.45,600 లాభం వచ్చింది. అయితే అందులో C వాటా ఎంత?

1) రూ.13,000    2) రూ.14,000 

3) రూ.11,000        4) రూ.12,000

సాధన: A పెట్టుబడి కాలం = 24 నెలలు, 

B పెట్టుబడి కాలం = 24 నెలలు

C పెట్టుబడి కాలం = 16 నెలలు

సమాధానం: 4

4. A, B, C లు రూ.50,000 పెట్టుబడితో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. అందులో తీ కంటే A రూ.4000, C కంటే    B రూ.5000 ఎక్కువ పెట్టుబడి పెట్టారు. వ్యాపారంలో వారికి వచ్చిన మొత్తం లాభం రూ.35,000. అయితే అందులో A వాటా ఎంత?

1) రూ.13,700     2) రూ.12,700 

3) రూ.14,700      4) రూ.15,700

సాధన: A, B, C పెట్టుబడుల కాలం సమానం

సమాధానం: 3

5. A ఒక వ్యాపారాన్ని రూ.3750తో ప్రారంభించాడు. కొన్ని నెలల తర్వాత B రూ.5000 పెట్టుబడితో అందులో చేరాడు. సంవత్సరం చివర్లో వారు సమానంగా లాభాలు పొందారు. అయితే B వ్యాపారంలో ఎప్పుడు చేరాడు?

1) 2 నెలలు      2) 3 నెలలు  

3) 9 నెలలు      4) 4 నెలలు

సాధన: 

సమాధానం: 2

6. A ఒక వ్యాపారాన్ని రూ.3500తో ప్రారంభించాడు. 5 నెలల తర్వాత B అందులో చేరాడు. సంవత్సరం చివర్లో వారు లాభాలను 2 : 3 నిష్పత్తిలో పంచుకుంటే, B పెట్టుబడి ఎంత?

1) రూ.4500      2) రూ.8500   

3) రూ.9000       4) రూ.8000

సాధన: 

సమాధానం: 3

7. A, B, C, D లు కొంత మొత్తంతో ఒక వ్యాపారాన్ని ప్రారంభించారు. మొత్తం సొమ్ములో A 1/3 వంతు, B 1/4వ వంతు, C 1/5 వంతు, మిగిలిన మొత్తం D పెట్టుబడిగా పెట్టారు. వ్యాపారంలో వారు పొందిన మొత్తం లాభం రూ.6000. అయితే D వాటా ఎంత?

1) రూ.1300      2) రూ.1250  

3) రూ.1600      4) రూ.2100

సాధన: 

సమాధానం: 1

8. A, B, C లు ఒక వ్యాపారాన్ని వరసగా రూ.15,000, రూ.20,000, రూ.25,000తో ప్రారంభించారు. 4 నెలల తర్వాత A తన పెట్టుబడిలో 1/3వ వంతును అదనంగా చేర్చగా, B 1/4వ వంతును వెనక్కు తీసుకున్నాడు. ఏడాది చివర్లో వారికి వచ్చిన మొత్తం లాభం రూ.72,000. అందులో A వాటా ఎంత?

1) రూ.25,000   2) రూ.24,000   

3) రూ.22,000   4) రూ.32,000

సాధన:

సమాధానం: 3

9. A, B, C లు కలిసి ఒక వ్యాపారాన్ని కొంత మొత్తంతో ప్రారంభించారు. భాగస్వామ్య మొత్తంలో A 1/6వ వంతు పెట్టుబడిని 1/6వ వంతు కాలానికి, B 1/3వ వంతు పెట్టుబడిని 1/3వ వంతు కాలానికి, మిగిలిన దాన్ని C మొత్తం కాలానికి పెట్టుబడిగా పెట్టారు. వ్యాపారంలో వచ్చిన మొత్తం లాభం రూ.4600. అయితే అందులో B వాటా ఎంత?

1) రూ.600       2) రూ.900   

3) రూ.700       4) రూ.800

సాధన:

పెట్టుబడి కాలం = 12 నెలలు అనుకోండి.

సమాధానం: 4

10. హరిత, మాధవి కొంత సొమ్మును 2 : 3 నిష్పత్తిలో పెట్టుబడిగా పెట్టి ఒక వ్యాపారాన్ని ప్రారంభిచారు. హరిత రూ.10,000 అదనంగా పెడితే వారి పెట్టుబడుల నిష్పత్తి 3 : 2 అవుతుంది. అయితే హరిత ఆ వ్యాపారంలో ఎంత సొమ్మును పెట్టుబడిగా పెట్టింది?

1) రూ.8000       2) రూ.8500  

3) రూ.7000      4) రూ.6000

సాధన: ప్రారంభంలో హరిత, మాధవి పెట్టుబడులు వరసగా 2x, 3x

లెక్క ప్రకారం,

సమాధానం: 1

11. A, B అనే ఇద్దరు వ్యక్తులు కొంత సొమ్మును 7 : 8 నిష్పత్తిలో పెట్టుబడిగా పెట్టి ఒక కంపెనీని ప్రారంభించారు. వారు దాని ద్వారా వచ్చిన లాభాన్ని 5 : 4 నిష్పత్తిలో పంచుకున్నారు. తి తన పెట్టుబడిని 10 నెలలు ఉంచితే, తీ తన పెట్టుబడిని ఎన్ని నెలలు ఉంచాడు?

1) 9    2) 6    3) 5    4) 7

సాధన: A పెట్టుబడి = 7x,  B పెట్టుబడి = 8x, A కాలం = 10 నెలలు, B కాలం = T

పెట్టుబడి X పెట్టుబడి కాలం నిష్పత్తి = లాభాల నిష్పత్తి

T = 7 నెలలు (B పెట్టుబడి కాలం)

సమాధానం: 4


 

Posted Date : 17-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌