• facebook
  • whatsapp
  • telegram

వృక్ష స్వరూప శాస్త్రం

1. కాండం రసభరితంగా, ఆకుపచ్చగా రూపాంతరం చెందడాన్ని ఏమంటారు?
 జ: ఫిల్లోక్లేడ్‌


2. ఉల్లిపాయల్లో మనం తినే భాగం శాస్త్రీయంగా ....
జ: పత్రపీఠాలు 


3. బంగాళదుంపల్లో ‘కన్ను’గా పేర్కొనే భాగాలు శాఖీయ ప్రత్యుత్పత్తికి సహకరిస్తాయి. ఇవి శాస్త్రీయంగా .......
జ: గ్రీవ కోరకాలు 

 

4. కిందివాటిలో దేన్ని ‘సోబోల్‌’ గా సూచిస్తారు?
జ: భూగర్భస్థ రన్నర్‌ 


5. శాఖాయుతమైన గ్రీవ కంటకాలు ఏ మొక్కలో కనిపిస్తాయి? 
జ: కెరిస్సా  


6. కిందివాటిలో సరికానిది?
1) రన్నర్‌ - సైనోడాన్‌           2) సక్కర్‌ - మెంథా
3) ఆఫ్‌సెట్‌ - పిస్టియా          4) స్టోలన్‌ - ఆస్పరాగస్‌
జ: 4) స్టోలన్‌ - ఆస్పరాగస్‌


7. ఆస్పరాగస్‌లో కనిపించే కాండ రూపాంతరం?
జ: క్లాడోడ్‌ 


8. చాలా ఎక్కువగా క్షీణించిన కాండం ఏ కాండ రూపాంతరంలో ఉంటుంది?
జ: లశునం


9. బఠానీ మొక్కలో కనిపించే నులితీగలు దేని రూపాంతరం?
జ: సంయుక్త పత్రంలోని శిఖరస్థ లఘు పత్రకం


10. బ్రయోఫిల్లం మొక్క పత్రభాగాన్ని నేలలో నాటితే, దాని నుంచి కొత్త మొక్కలు ఉత్పత్తవుతాయి. దీనికి కారణం ......
జ: పత్రకోరకాలనే శాఖీయ ప్రత్యుత్పత్తి భాగాలు ఉండటం వల్ల 


11. ఒకే మొక్క పైన ఒకదాని కంటే ఎక్కువ రకానికి చెందిన పత్రాలు కలిగి ఉండే దృగ్విషయాన్ని ఏమంటారు?
జ: హెటిరోఫిల్లీ   


12. లీఫ్‌బ్లాడర్‌ను ప్రదర్శించే మొక్క?
జ: యుట్రిక్యులేరియా  


13. ఫిల్లోటాక్సీ దేన్ని సూచిస్తుంది?
జ: మొక్కపైన పత్రాల అమరిక విధానాన్ని


14. రసభరిత పత్రాలు కింది ఏ మొక్కలో కనిపిస్తాయి?
జ: అలోవెరా


15. కింది మొక్కలను వాటిలో కనిపించే పత్రకంటక రూపాంతరాలతో జతపరచండి.
జాబితా - ఎ     జాబితా - బి

i) జిజిపస్‌        a) మొత్తం పత్రం
ii)  అర్జిమోన్‌    b) పత్రం అగ్రభాగం
iii) యుక్కా       c) పత్రం అంచులు
iv) బెర్బెరిస్‌     d) పత్ర పుచ్ఛాలు
జ: i-d, ii-c, iii-b, iv-a


16. ఫిల్లోడ్‌ పత్ర రూపాంతరాన్ని ప్రదర్శించే మొక్క?
జ: అకేసియా  


17. ఫిల్లోపోడియం పదాన్ని కిందివాటిలో దేన్ని సూచించడానికి వాడతారు?
జ: మొత్తం పత్రం  


18. రెక్కల లాంటి పత్రవృంతాన్ని కలిగి ఉండే మొక్కలకు ఉదాహరణ?
జ: సిట్రస్‌ 


19. కింది మొక్కలను వాటిలో నులితీగల రూపాంతరాన్ని ప్రదర్శించే పత్రభాగాలతో జతపరచండి.
జాబితా - ఎ      జాబితా - బి

i) స్మైలాక్స్‌       a) మొత్తం పత్రం
ii) క్లెమాటిస్‌      b) పత్రం అగ్రభాగం
iii) గ్లోరియోసా    c) పత్రవృంతం
iv) లాథెరస్‌ అఫాకా iv) పత్రపుచ్ఛం
జ: i-d, ii-c, iii-b, iv-a


20. కింది మొక్కల్లో ‘హెటిరోఫిల్లీ’ (భిన్న పత్రయుతం)ను ప్రదర్శించేవి?
i) సాజిట్టేరియా       ii) లిమ్నోఫిలా
iii) మిరియోఫిల్లం    iv) అలిస్మాప్లాంటగో
జ: i, ii, iii, iv


21. ఒకే మొక్కపైన ఒకే గ్రీవ మొగ్గ దగ్గర రెండు వేర్వేరు రకాల పత్రాలను కలిగి ఉండటాన్ని ఏమంటారు?
జ: విషమపత్రయుతం (ఎనైసోఫిల్లీ)


22. ఎనైసోఫిల్లీని ప్రదర్శించే మొక్కకు ఉదాహరణ?
జ: బోయర్‌హీనియా  


23. కీటకాహార మొక్కల్లో కీటకాన్ని బంధించడానికి పత్రాలు బోనుల్లా మారుతాయి. ఇలాంటి నిర్మాణాలను ప్రదర్శించే మొక్కలకు ఉదాహరణ?
జ: నెపంథిస్‌  


24. స్వేచ్ఛగా ఉన్న ఫలదళాలు అభివృద్ధి చెందాక ప్రతిదళం ఒక చిరుఫలంగా మారుతుంది. వీటిని ఏమంటారు?
జ: సంకలిత ఫలం


25. సంకలిత ఫలాలను ప్రదర్శించే మొక్కలకు ఉదాహరణ?
జ: సీతాఫలం  


26. పుష్పవిన్యాసం అంటే?
జ: మొక్కలపై పుష్పాల అమరిక విధానం.


27. కింది ఏ ప్రత్యేక పుష్పవిన్యాసం ఒకే పుష్పంలా కనిపిస్తుంది?
జ: సయాథియం


28. సయాథియం పుష్ప విన్యాసాన్ని ప్రదర్శించే మొక్కలు?
జ: యుఫర్బియా, పోయిన్‌ సెట్టియా 


29. ఫలాన్ని పోలి ఉండే పుష్పవిన్యాసం కిందివాటిలో ఎందులో గమనించొచ్చు?
జ: సమశిఖి 


30. హైపంథోడియం పుష్పవిన్యాసాన్ని ప్రదర్శించే మొక్కకు ఉదాహరణ?
జ: ఫైకస్‌ 


31. శీర్షవత్‌ పుష్పవిన్యాసం కింది ఏ కుటుంబ సామాన్య లక్షణం?
జ: ఆస్టరేసి


32. శీర్షవత్‌ పుష్పవిన్యాసానికి ఉన్న ఇతర పేర్లు?
i) కేపిట్యులమ్‌        ii) ఎంథోడియం         iii) హైపంథోడియం
జ: i, ii 


33. కిందివాటిలో అతిపెద్ద పుష్పాలను ఉత్పత్తిచేసే వేరు పరాన్నజీవి మొక్క ఏది?
జ: రఫ్లీసియా  


34. అరటిమొక్కలో కనిపించే వాయుగత కాండం?
జ: మిథ్యాకాండం


35. ఆహారంగా ఉపయోగపడే కాలీఫ్లవర్‌ అనేది శాస్త్రీయంగా ఒక .....
జ: రసయుత పుష్పవిన్యాసం 


36. కవచ బీజక ఫలాలు (కేరియోప్సిస్‌) కలిగి ఉండే మొక్కలు?
జ: వరి, గోధుమ 


37. మామిడి ఫలంలో తినేభాగం?
జ: మధ్యఫల కవచం  


38. సామాన్య ఫలాలు అంటే?
జ: ఒకే పుష్పానికి చెందిన సంయుక్త అండాశయం నుంచి అభివృద్ధి చెందిన ఫలం.


39. కింది అంశాలను జతపరచండి.
ఫలం రకం        ఉదాహరణ

i) సిప్సెలా        a) మిరాబిలిస్‌
ii) సమారా        b) ఏసర్‌
iii) డబుల్‌ సమారా  c) హిప్టేజ్‌
iv) ఎఖీన్‌         d) హీలియాంథస్‌
జ: i-d, ii-c, iii-b, iv-a


40. కింది అంశాలను జతపరచండి.
పుష్ప విన్యాసం     ఉదాహరణ

i) రెసీమ్‌           a) హైడ్రోకొటైల్‌
ii) కోరింబ్‌         b) కొలకేసియా
iii) స్పాడిక్స్‌      c) ఐబరిస్‌
iv) అంబెల్‌       d) క్రూసిఫరస్‌
జ: i-d, ii-c, iii-b, iv-a


41. కింది అంశాలను జతపరచండి.
ఫలరకం         ఉదాహరణ

i) క్రీమోకార్ప్‌     a) అకేసియా
ii) రెగ్మా       b) ఆసిమమ్‌
iii) కార్‌సెర్యులస్‌  c) రిసినస్‌
iv) లొమెంటం   d) కొరియాండ్రం
జ: i-d, ii-c, iii-b, iv-a


42. ‘‘పోమ్‌’’ ఫలాన్ని కలిగి ఉండే మొక్కకు ఉదాహరణ?
జ: ఆపిల్‌ 


43. దోస ఏ రకమైన ఫలానికి ఉదాహరణ?
జ: పెపో  


44. విత్తనం అంకురించిన తర్వాత ప్రథమ మూలం లేదా రాడికల్‌ భాగం నుంచి ఏర్పడే మొక్క దేహం?
జ: వేరు 


45. కేలిప్ట్రా అనేది.......
జ: వేరు భాగానికి చివర్లో అమరి ఉండే తొడుగు లాంటి నిర్మాణం.  


46. కిందివాటిలో సరైన వాక్యాలు ఏవి?
i. వేరు గురుత్వానువర్తన చలనాన్ని ప్రదర్శిస్తుంది.
ii. వేరుపైన కణుపులు లేదా కణుపు మధ్యమాలు అమరి ఉండవు.
iii. మొక్కల్లో వేరు వ్యవస్థ తల్లి వేరు వ్యవస్థగా లేదా గుబురు వేరు వ్యవస్థగా ఉండొచ్చు.
జ: i, ii, iii


47. తల్లివేరు వ్యవస్థ ఒక ప్రధాన లక్షణంగా కలిగి ఉండే మొక్కలు?
జ: ద్విదళ బీజాలు 


48. వేరు పెరుగుదల ఎక్కువగా జరిగే భాగం?
జ: వేరు అగ్రభాగానికి పక్కన ఉండే ప్రాంతం


49. ‘వేరు తొడుగు’ ప్రధాన విధి?
జ: వేరు అగ్రభాగానికి రక్షణ కల్పించడం, గురుత్వానువర్తన చలనాన్ని నియంత్రించడం. 


50. ‘వెలమిన్‌’ అనే స్పాంజ్‌ లాంటి కణజాలాన్ని కలిగిఉండే వేర్లు?
జ: ఎపిఫైటిక్‌ వేర్లు


51. నిజమైన వేరుభాగాన్ని కలిగి ఉండే మొక్కలు?
జ: పుష్పించే మొక్కలు లేదా ఫేనరోగామ్స్‌గా పిలిచే మొక్కలు


52. పరాన్నజీవ మొక్కలు నీరు, లవణాలను సంగ్రహించడానికి ఉపకరించే వేర్లు?
జ: హాస్టోరియా 


53. న్యుమటోఫోర్లు నిర్వర్తించే ప్రధాన విధి?
జ: శ్వాసక్రియ  


54. కిందివాటిలో నిల్వచేసే సామర్థ్యం కలిగిన వేర్లు ఏ మొక్కల్లో ఉంటాయి?
i. ముల్లంగి        ii. క్యారెట్‌ 
iii. బీట్‌రూట్‌     iv. బంగాళదుంప
జ: i, ii, iii 


55. కిందివాటిలో నిల్వ చేసే సామర్థ్యం ఉన్న గుబురు వేరు వ్యవస్థ ఏ మొక్కల్లో కనిపిస్తుంది?
i. డాలియా         ii. విటిస్‌   
iii. ఐపోమియా    iv. క్యారెట్‌
జ: i, ii, iii  


56. న్యుమటోఫోర్లు కింది ఏ మొక్కల్లో కనిపిస్తాయి? 
జ: మాంగ్రూవ్‌ మొక్కలు 


57. కిందివాటిలో శ్వాసించే వేర్లు వేటి ద్వారా వాయు వినిమయాన్ని జరుపుతాయి?
జ: న్యుమథోడ్స్‌ 


58. లెగ్యూమినేసి మొక్కల్లో ప్రధాన లక్షణంగా కనిపించేవి? 
జ: వేరు బొడిపెలు 


59. కిందివాటిని జతపరచండి. 
జాబితా - ఎ            జాబితా - బి
i) పారాసైటిక్‌ లేదా   a) క్యారెట్‌
  పరాన్న జీవ వేర్లు
ii) ఎపిఫైటిక్‌ లేదా     b) ఆర్కిడ్‌ 
  వృక్షోపజీవ వేర్లు       మొక్కలు
iii) శ్వాసించే వేర్లు లేదా c) అవిసీనియా
  న్యుమటోఫోర్లు
iv) స్తూపాకార నిల్వ    d) కస్కుటా
   చేసే వేర్లు
జ:  i-d, ii-c, iii-b, iv-a 


60. టినోస్పోరాలో ఏ రకం వేర్లు కనిపిస్తాయి?  
జ: కిరణజన్య సంయోగక్రియ జరిపే వేర్లు 


61. కిరణజన్య సంయోగక్రియ జరిపే వేర్లను ఏ మొక్కల్లో గమనించవచ్చు? 
i. టినోస్పోరా        ii. ట్రాపా          iii. టీనియోఫిల్లమ్‌
జ: i, ii, iii


62. వాయుగతంగా ఉంటూ శోషణ జరిపే వేర్లు కింది ఏ మొక్కల్లో ఉంటాయి?
జ: ఎపిఫైట్‌లు  


63. సంతులన వేర్లను (బ్యాలెన్సింగ్‌ రూట్స్‌) కింది ఏ మొక్కలో పరిశీలించవచ్చు? 
i. లెమ్నా   ii. పిస్టియా   iii. హైడ్రిల్లా 
జ: i, ii  


64. వేరు పైభాగంలో కనిపించే మూలకేశాలకు సంబంధించి కిందివాటిలో సరైంది? 
జ: మూలకేశాలు వేరు పైభాగంలో ప్రత్యేకమైన బాహ్య చర్మకణాలు ఉత్పత్తి చేసే ఏకకణ నిర్మిత భాగాలు.


65. లెగ్యూమ్‌ మొక్కల వేరు బుడిపెల్లో నివసించే బ్యాక్టీరియా?
జ: రైజోబియం  


66. లెగ్యూమ్‌ మొక్కలకు, వాటితో జీవించే బ్యాక్టీరియాకు మధ్యఉన్న జీవ సంబంధాన్ని ఏమంటారు?
జ: సహజీవనం  


67. చాలా వేర్లు అబ్బురపు కోరకాలను కలిగి ఉండటం ద్వారా శాఖీయ ప్రత్యుత్పత్తిని ప్రేరేపిస్తాయి. వీటిని ఏమంటారు?
జ: ప్రత్యుత్పత్తి వేర్లు 


68. ప్రత్యుత్తత్తి వేర్లను కలిగి ఉండే మొక్కలకు ఉదాహరణ?
i. డాల్‌బర్జియా        ii. డాలియా      iii. స్వీట్‌ పొటాటో  
జ: i, ii, iii


69. ఎపిఫైటిక్‌ వేర్లు కలిగి ఉండే మొక్కకు ఉదాహరణ?
జ: వాండా  


70. మూలకేశాల్లో కిందివాటిలో ఏది లోపిస్తుంది?
జ: క్లోరోప్లాస్ట్‌


71. ఆవృత బీజాల్లో పార్శ్వవేర్లు ఎక్కడ నుంచి ఆవిర్భవిస్తాయి?  
జ: పరిచక్రం  


72. ఆర్ధ్రాకర్షక స్వభావాన్ని కలిగి ఉండే వేర్లను కింది ఏ మొక్కలో గమనించవచ్చు?
జ: వాండా  


73. కిందివాటిలో యాంత్రిక బలాన్ని చేకూర్చే వేరు రూపాంతరాలు ఏవి?
i. ప్రాప్‌రూట్స్‌         ii. స్టిల్ట్‌ రూట్స్‌ 

iii. క్లైంబింగ్‌ రూట్స్‌  iv. పుల్‌ రూట్స్‌
జ: i, ii, iii, iv


74. కిందివాటిలో కాండ రూపాంతరాన్ని ప్రదర్శించేది ఏది?
జ: మామిడి అల్లం    


75. కిందివాటిలో పాక్షిక వాయుగత కాండ రూపాంతరాలుగా పేర్కొనదగినవి ఏవి?
i. రన్నర్‌          ii. సక్కర్‌         iii. ఆఫ్‌సెట్‌        iv. స్టోలన్‌
జ: i, ii, iii, iv


76. కిందివాటిలో భూగర్భస్థ కాండ రూపాంతరాలు ఏవి?  
i. రైజోమ్‌         ii. కొమ్ము           iii. లశునం       iv. దుంప
జ: i, ii, iii, iv


77. కింది అంశాలను జతపరచండి.
జాబితా - ఎ       జాబితా - బి  

i) రైజోమ్‌         a) సొలానమ్‌
                      ట్యూబరోజమ్‌ 
ii) కొమ్ము (కోరమ్‌)  b) ఆలియం
                            సటైవమ్‌ 
iii) లశునం (బల్బ్‌)  c) అమార్ఫోఫాలస్‌
iv) దుంప (ట్యూబర్‌)   d) జింజిబర్‌ 
                                   అఫిసినేల్‌
జ: i-d, ii-c, iii-b, iv-a


78. కిందివాటిలో సరైన వాక్యాలేవి? 
i. కాండ వ్యవస్థ విత్తన దశతో ఏర్పడే ప్లూమ్యూల్‌ నుంచి ఆవిర్భవిస్తుంది.
ii. కాండ వ్యవస్థ కణుపులు, కణుపు మధ్యమాలుగా విభేదనం చెంది ఉంటుంది.
iii. కాండాగ్ర విభాజ్య కణజాలం మొత్తం కాండం ఏర్పాటుకు ఆధారంగా ఉంటుంది.
iv. కాండ వ్యవస్థ కాంతి అనువర్తిత చలనాన్ని ప్రదర్శిస్తుంది.
జ: i, ii, iii, iv


79. కిందివాటిని జతపరచండి.
జాబితా - ఎ     జాబితా - బి
i) రన్నర్‌       a) పొటాటో 
ii) సక్కర్‌       b) పిస్టియా
iii) ఆఫ్‌సెట్‌   c) క్రైసాంథిమమ్‌
iv) స్టోలన్‌      d)సైనోడాన్‌
జ:  i-d, ii-c, iii-b, iv-a 


80. కిందివాటిలో వాయుగత కాండ రూపాంతరాలు ఏవి?
i. ఫిల్లోక్లాడ్     ‌       ii. క్లాడోడ్‌            iii. కంటకం (ముళ్లు)   
iv. నులితీగలు      v. లఘులశునాలు (బల్బిల్‌)
జ: i, ii, iii, iv, v


81. కిందివాటిని జతపరచండి. 
జాబితా - ఎ            జాబితా - బి

i) పత్రాభ కాండం    a) విటిస్‌ (ద్రాక్ష)
ii) క్లాడోడ్‌       b) ఉమ్మెత్త (దతురా)
iii) కంటకం (థోర్న్‌) c) ఆస్పరాగస్‌
iv) నులితీగలు     d) ఒపన్షియా 
   (టెండ్రిల్స్‌)       (బ్రహ్మజెముడు)
జ:  i-d, ii-c, iii-b, iv-a 


82. లఘులశునాలు కలిగి ఉండే మొక్కకు ఉదాహరణ?
జ: డయాస్కోరియా  


83. నులితీగలు కలిగిఉండటం కింది ఏ మొక్కల సాధారణ లక్షణం?
జ: కుకుర్బిటేసి

 

వృక్ష శరీరధర్మ శాస్త్రం

1. మొక్కలకు కావాల్సిన అకర్బన పదార్థాలు చాలా వరకు మృత్తికలో ఉండే ఖనిజాల నుంచి లభిస్తాయి. అందుకే మొక్కల అకర్బన పోషణను ...... అంటారు.
1) ఖనిజ పోషణ       2) స్వయం పోషణ
3) కిరణ పోషణ        4) పర పోషణ


2. పరిశోధనల ఆధారంగా మొక్కలకు ప్రధానంగా ఎన్ని మూలకాలు ఆవశ్యకమని తేలింది?
1) 18          2) 16          3) 12          4) 10


3. ఆర్నాన్, స్టౌట్‌ ఆవశ్యక సూత్రాలు దేనికి సంబంధించినవి? 
1) మొక్కల కిరణజన్య సంయోగక్రియ చర్యా విధానానికి
2) మొక్కల శ్వాసక్రియలో జరిగే మార్పులకు
3) మొక్కల ఆవశ్యక మూలకాల నిర్ధారణకు 
4) మొక్కల ప్రత్యుత్పత్తికి సంబంధించిన మార్పులకు


4. మొక్కలకు ఒక మూలకం ఆవశ్యకమైంది. అయితే కింది వాటిలో ఏది నిజం?
i. మొక్కల పెరుగుదలకు, ప్రత్యుత్పత్తికి ఆ మూలకం ఆవశ్యకమైందిగా ఉండాలి.
ii. ఆవశ్యక మూలకానికి ప్రత్యామ్నాయంగా మరో మూలకం దాని పనిని నిర్వర్తించకూడదు.
iii.  ఆవశ్యక మూలకం ఆ మొక్క జీవరసాయన చర్యలో భాగమై ఉండే ఏ ఒక్క అణువులోనైనా ఘటకమై ఉండాలి.
1) i, ii           2) ii, iii             3) i, iii           4) i, ii, iii


5. మొక్కల్లో ఆవశ్యక మూలకాలు లోపిస్తే, కిందివాటిలో ఆ లోప లక్షణాలు ఏవి?
i. నిర్హరితం        ii. కణజాలక్షయం           iii. వడిలిపోవడం
1) i, ii         2) ii, iii          3) i, iii          4) i, ii, iii


6. మొక్కలు గిడసబారిపోవడం, వాటిలో ప్రత్యుత్పత్తి తగ్గడం లాంటివి కింది ఏ పరిస్థితుల్లో జరుగుతాయి?
1) మొక్కల్లో అలైంగిక ప్రత్యుత్పత్తి జరిగినప్పుడు.
2) మొక్కల శాఖీయ భాగాలు బాగా  అభివృద్ధి చెందినప్పుడు.
3) మొక్కల్లో ఆవశ్యక మూలకాలు లోపించినప్పుడు.
4) మొక్కలు విత్తనాల ద్వారా ఏర్పడకపోవటం వల్ల.


7. కొన్ని ఆవశ్యక మూలకాల లోప లక్షణాలు ముదురు పత్రాల్లో ముందుగా, లేత పత్రాల్లో తర్వాత కనిపిస్తాయి. ఆ మూలకాలను ఏమంటారు?
1) చలన రహిత మూలకాలు          2) చలనశీలత ఉన్న మూలకాలు
3) క్రిటికల్‌ మూలకాలు          4) స్థూల ఆవశ్యక మూలకాలు


8. చలనశీలతను ప్రదర్శించే మూలకాలకు  ఉదాహరణ?
i. నత్రజని        ii. భాస్వరం         iii. మెగ్నీషియం
1) i, ii, iii        2) i, ii         3) i, iii        4) ii, iii


9. మూలకం లోపించినప్పుడు లోప లక్షణాలు ముందుగా లేత పత్రాల్లో కనిపిస్తే, ఆ మూలకాలను ఏమంటారు?
1) చలనశీలత ఉన్న మూలకాలు       2) చలనశీలత లేని మూలకాలు
3) ట్రేస్‌ మూలకాలు         4) క్రిటికల్‌ మూలకాలు


10. చలనశీలత లేని మూలకాలకు ఉదాహరణ?
i. కాల్షియం       ii. సల్ఫర్‌
iii. మాంగనీస్‌       iv. మాలిబ్డినం
1) i, ii, iii         2) ii, iii, iv        3) i, iii, iv      4) i, ii, iii, iv 


11. మొక్కల ఖనిజ పోషణకు సంబంధించిన ప్రయోగాలు......
1) యానక వర్ధన ప్రయోగాలు  
2) సంకరీకరణ ప్రయోగాలు
3) బ్లాక్‌మెన్‌ అవధికారక ప్రయోగాలు 
4) నత్రీకరణ ప్రయోగాలు


12. మొక్కలను పోషక ద్రావణంలో పెంచే పద్ధతిని ఏమంటారు?
1)  హైడ్రోఫొనిటిక్స్‌       2) హైడ్రోపొనిక్స్‌
3) లిక్విడ్‌ఫొనిటిక్స్‌    4) పవర్‌హైడ్రోనిక్స్‌


13. హైడ్రోపొనిక్స్‌కు ఉన్న మరో పేరు.....
1) గోళీల వర్ధనం     2) కేశనాళికా వర్ధనం
3) మృత్తికారహిత వర్ధనం      4) మృత్తికాయుత వర్ధనం


14. హైడ్రోపొనిక్స్‌ అనే పదాన్ని ప్రవేశపెట్టింది ఎవరు?
1) వాన్‌ హెల్మాంట్‌           2) విలియం క్రిస్ట్‌
3) క్రిస్టోఫర్‌     4) విలియం ఫ్రెడరిక్‌ గెరిక్‌


15. మొక్కల పెరుగుదలకు ఎక్కువ పరిమాణంలో అవసరమయ్యే ఖనిజ పోషకాలు?
1) స్థూల పోషకాలు లేదా స్థూల మూలకాలు
2) సూక్ష్మ పోషకాలు లేదా సూక్ష్మ మూలకాలు
3) నిర్మాణాత్మక పోషకాలు లేదా నిర్మాణాత్మక మూలకాలు
4) ట్రేస్‌ మూలకాలు లేదా ట్రేస్‌ పోషకాలు


16. స్థూల పోషకాలకు ఉదాహరణ?
i. కాల్షియం  ii. మెగ్నీషియం  iii. గంధకం
1) ii, iii       2) i, iii          3) i, ii            4) i, ii, iii 


17. మొక్కలకు అవసరమైన స్థూల పోషకాలు లేదా స్థూల మూలకాల సంఖ్య?
1) 4         2) 8             3) 9            4) 12


18. మొక్కకు సంబంధించిన అన్ని సేంద్రియ పదార్థాల్లో అనుఘటకాలుగా ఉన్న కార్బన్, హైడ్రోజన్, ఆక్సిజన్‌లను ఏ మూలకాలు అంటారు?
1) ఫ్రేమ్‌వర్క్‌ మూలకాలు లేదా నిర్మాణాత్మక మూలకాలు
2) నాన్‌మెటల్‌వర్క్‌ మూలకాలు లేదా ముఖ్య మూలకాలు
3) మెటల్‌వర్క్‌ మూలకాలు లేదా అసేంద్రియ మూలకాలు
4) ఆర్గానిక్‌ మూలకాలు లేదా సేంద్రియ మూలకాలు


19. మొక్కలు నైట్రేట్, నైట్రైట్, అమ్మోనియం అయాన్‌ల రూపంలో గ్రహించే ఆవశ్యక మూలకం?
1) కార్బన్‌       2) హైడ్రోజన్‌    
3) నైట్రోజన్‌       4) ఆక్సిజన్‌


20. కిందివాటిలో నత్రజని ప్రధాన అనుఘటకంగా ఉండే సంయోగ పదార్థాలు?
i. ప్రోటీన్‌లు      ii. కేంద్రకామ్లాలు  
iii. పత్రహరితం      iv. ఎమైనో ఆమ్లాలు
1) i, ii, iii       2) ii, iii, iv       3) i, iii, iv        4) i, ii, iii, iv 

21. మృత్తికలో నత్రజని లోపాన్ని సరిచేసేందుకు వాడే రసాయన ఎరువులకు ఉదాహరణ?
i. అమ్మోనియం సల్ఫేట్‌      ii. అమ్మోనియం నైట్రేట్‌            iii. యూరియా
1) i, ii         2) ii, iii          3) i, iii         4) i, ii, iii


22. కిందివాటిలో నత్రజని స్థాపన చేసే జీవులకు ఉదాహరణ?
i. రైజోబియం      ii. అనబినా        iii. నాస్టాక్‌
1) i, ii, iii     2) i, ii     3) i, iii     4) ii, iii


23. నత్రజని లోప లక్షణాన్ని మొక్కల్లో ఎలా గుర్తిస్తారు?
1) ముదురు పత్రాలు ముందుగా ఎరుపు రంగులోకి మారతాయి.
2) ముదురు పత్రాలు మందుగా పసుపుపచ్చగా మారతాయి.
3) లేత పత్రాలు ముందుగా ఎరుపు రంగులోకి మారతాయి.
4) లేత పత్రాలు ముందుగా పసుపుపచ్చగా మారతాయి.


24. మొక్కలు భాస్వరాన్ని ఏ రూపంలో వేర్ల ద్వారా గ్రహిస్తాయి? 
1) ఫాస్ఫరస్‌       2) ఫాస్ఫాటిడిక్‌ ఆమ్లం
3) ఫాస్ఫేట్‌ అయాన్‌లు   
4) సూపర్‌ ఫాస్ఫేట్‌ ఆఫ్‌ లైమ్‌


25. కిందివాటిలో సరైనవి ఏవి? 
i. కేంద్రకామ్లాలు,  NADP, ATPల్లో భాస్వరం ప్రధాన అనుఘటకంగా ఉంటుంది.
ii. కణత్వచాల్లో ఉండే ఫాస్ఫోలిపిడ్లలో భాస్వరం భాగమై ఉంటుంది.
iii. నత్రజని తర్వాత సాధారణంగా నేలలో లోపించి ఉండే మూలకం భాస్వరం. 
1) i, ii     2) ii, iii     3) i, iii     4) i, ii, iii


26. మొక్కల్లో ఫాస్ఫరస్‌ లోపించడం వల్ల ఏ లక్షణాలను గమనించొచ్చు?
i. మొక్కలు పొట్టిగా, గిడసబారతాయి.
ii. పత్రాలు ముదురు ఆకుపచ్చ రంగులోకి మారతాయి.
iii. పంట మొక్కలు ఆలస్యంగా కాపుకు వచ్చి, దిగుబడి తగ్గుతుంది.
1) i, ii, iii        2) i, ii         3) ii, iii         4) i, iii


27. మొక్కల్లో ద్రవాభిసరణ క్రమత, పత్ర రంధ్రాల చలన యాంత్రికం లాంటి వాటిలో ప్రముఖపాత్ర పోషించేది?
1) నత్రజని       2) ఫాస్ఫరస్‌   
3) పొటాషియం   4) ఆక్సిజన్‌


28. క్రిటికల్‌ మూలకాలు అంటే?
1) అన్ని రకాల భూముల్లో లోపించే   మూలకాలు
2) అన్ని రకాల భూముల్లో పుష్కలంగా ఉండే మూలకాలు
3) అన్ని రకాల మొక్కలకు అవసరం లేని మూలకాలు
4) మొక్కలకు అవసరమై, వాతావరణంలో వాయురూపంలో లభించేవి  


29. కిందివాటిలో వేటిని క్రిటికల్‌ మూలకాలుగా పిలుస్తారు?
i. నత్రజని      ii. భాస్వరం   
iii. పొటాషియం   iv. కాల్షియం
1) i, ii        2) ii, iii      3) i, iii, iv        4) i, ii, iii 


30. కణకవచం మధ్య పొరలో పెక్టీట్‌ల రూపంలో వ్యవస్థితమయ్యే మూలకం?
1) పొటాషియం     2) కాల్షియం   
3) భాస్వరం      4) ఫ్లోరిన్‌


31. కిందివాటిలో డైవాలెంట్‌ అయాన్‌ల రూపంలో మొక్కలు శోషించుకునే లవణాలు?
i. గంధకం      ii. మెగ్నీషియం       iii. కాల్షియం
1) i, ii    2) ii, iii    3) i, iii     4) i, ii, iii 


32. మొక్కల పెరుగుదలకు స్వల్ప పరిమాణంలో (0.02 నుంచి 10ppm) అవసరమయ్యే మూలకాలను ఏమంటారు?
1) సూక్ష్మ పోషకాలు          2) మాలిన్య మూలకాలు  
3) అత్యల్ప పోషకాలు        4) స్థూల పోషకాలు

 

33. సూక్ష్మ మూలకాల సంఖ్య?
1) 9    2) 7    3) 8      4) 4


34. కిందివాటిలో మొక్కల పోషణలో ముఖ్యపాత్ర వహించే సూక్ష్మపోషకాలు?
i. ఇనుము      ii. మాంగనీస్‌   
iii. రాగి       iv. జింక్‌
1) i, ii, iii       2) ii, iii, iv       3) i, iii, iv        4) i, ii, iii, iv 

35. కిందివాటిలో మొక్కల పోషణలో ఆవశ్యకమయ్యే సూక్ష్మపోషకం కానిది?
1) బోరాన్‌       2) మాలిబ్డినం  
3) క్లోరిన్‌       4) పాదరసం


36. ఎలక్ట్రాన్‌ వాహకాలుగా పనిచేసే ఫైటో క్రోమ్‌లు, ఫైరిడాక్సిన్లలో అంతర్భాగంగా ఉండే మూలకం?
1) ఐరన్‌      2) క్లోరిన్‌  
3) నత్రజని       4) పాదరసం


37. RNA సంశ్లేషణకు, పరాగనాళం ఏర్పడటానికి, దారుకణాలు లిగ్నిఫికేషన్‌ చెందటానికి అవసరమయ్యే సూక్ష్మ మూలకం ఏది?
1) బోరాన్‌        2) క్లోరిన్‌  
3) మాలిబ్డినం       4) జింక్‌


38. ఏ మూలక లోపం వల్ల లెగ్యూమినేసి మొక్కల వేరు కణతుల్లో నత్రజని స్థాపన సరిగ్గా జరగదు?
1) బోరాన్‌      2) మాలిబ్డినం  
3) కాల్షియం      4) జింక్‌


39. మొక్కలకు సంబంధించిన ఏ కర్బన పదార్థంలోనూ అనుఘటకంగా లేకపోయినా, ఆవశ్యక మూలకాలని వేటిని పేర్కొంటారు?
1) జింక్, మెగ్నీషియం              2) కాల్షియం, మెగ్నీషియం 
3) క్లోరిన్, పొటాషియం          4) నత్రజని, ఫాస్ఫరస్‌


40. కింది అంశాలను జతపరచండి.
వాహక ప్రోటీన్‌లు       విధి
i) యూనిపోర్టర్స్‌  a) ఈ వాహకాలు అయాన్‌లను లోపలి నుంచి వెలుపలికి లేదా వెలుపలి నుంచి లోపలికి రవాణా చేస్తాయి.
ii) సింపోర్టర్స్‌    b) ఈ వాహకాలు రెండు రకాల అయాన్‌లను ఒకే దశలో రవాణా చేస్తాయి.
iii) యాంటీపోర్టర్స్‌    c) ఈ వాహకాలు రెండు రకాల అయాన్‌లను వ్యతిరేక దిశలో రవాణా చేస్తాయి.
1) i-a, ii-b, iii-c         2) i-b, ii-a, iii-c        3) i-b, ii-c, iii-a          4) i-c, ii-b, iii-a

 

సమాధానాలు: 1-1; 2-2; 3-3; 4-4; 5-4; 6-3; 7-2; 8-1; 9-2; 10-4; 11-1; 12-2; 13-3; 14-4; 15-1; 16-4; 17-3; 18-1; 19-3; 20-4; 21-4; 22-1; 23-2; 24-3; 25-4; 26-1; 27-3; 28-1; 29-4; 30-2; 31-4; 32-1; 33-2; 34-4; 35-4; 36-1; 37-1; 38-2; 39-3; 40-1.
 

వృక్షశరీర ధర్మశాస్త్రం -  కణ శ్వాసక్రియ

1. కార్బోహైడ్రేట్‌లు, ప్రోటీన్‌లు, లిపిడ్‌లు లాంటి సేంద్రియ పదార్థాల్లో నిల్వ ఉన్న రసాయన అంతర్గత శక్తి స్వేచ్ఛాశక్తిగా అందుబాటులోకి వచ్చేందుకు కణస్థాయిలో జరగాల్సిన జీవక్రియ?
1) శ్వాసక్రియ         2) కిరణజన్య సంయోగక్రియ
3) దహనక్రియ      4) జ్వలనక్రియ


2. కిందివాటిలో సరైనవి ఏవి?
i. ఆక్సిజన్‌ లభించినప్పుడు జరిగే శ్వాసక్రియను ‘వాయు శ్వాసక్రియ’ అంటారు.
ii. ఆక్సిజన్‌ లభించనప్పుడు జరిగే శ్వాసక్రియను ‘అవాయు శ్వాసక్రియ’ అంటారు.
iii. వాయు శ్వాసక్రియలో అధస్థ పదార్థాలు పూర్తిగా ఆక్సీకరణం చెందుతాయి.
iv. అవాయు శ్వాసక్రియలో అధస్థ పదార్థాలు అసంపూర్ణంగా ఆక్సీకరణం చెందుతాయి.
1) i, ii, iii               2) ii, iii, iv
3) i, iii, iv              4) i, ii, iii, iv


3. వాయు శ్వాసక్రియ ఒక....
1) శక్తి విమోచక చర్య         2) శక్తి గ్రాహక చర్య
3) శక్తి సంచిత చర్య          4) శక్తి సంధాన చర్య


4. కిందివాటిలో శ్వాసక్రియ అధస్థ పదార్థం కానిది?
1) కార్బోహైడ్రేట్‌    2) ప్రోటీన్‌
3) ఆక్సిజన్‌       4) లిపిడ్‌


5. కణస్థాయిలో పదార్థాల సంపూర్ణ ఆక్సీకరణం జరిగితే ఏర్పడే అంతిమ పదార్థాలు ఏవి?
1) కార్బన్‌డైఆక్సైడ్, ఆక్సిజన్‌        2) కార్బన్‌డైఆక్సైడ్, నీరు
3) నీరు, ఇథైల్‌ ఆల్కహాల్‌            4) కార్బన్‌ మోనాక్సైడ్, నీరు


6. ఆక్సిజన్‌ సమక్షంలో సేంద్రియ పదార్థాలు పూర్తిగా ఆక్సీకరణం చెందడంలోని ప్రధాన దశలు?
i. గ్లైకాలిసిస్‌       ii. లింక్‌ చర్య
iii. క్రెబ్స్‌ వలయం   iv. ఎలక్ట్రాన్‌ రవాణా
1) i, ii, iii, iv          2) i, ii         3) iii, iv           4) i, iv


7. కిందివాటిలో కణ శ్వాసక్రియ జరిగే కణాంగం?
1) పెరాక్సీజోమ్స్‌          2) గ్లైఆక్సీజోమ్స్‌
3) మైటోకాండ్రియా       4) క్లోరోప్లాస్ట్స్‌


8. గ్లైకాలిసిస్‌ చర్యల ద్వారా జరిగేవి?
1) గ్లూకోజ్‌ విచ్ఛిన్నమై ఇథైల్‌ ఆల్కహాల్, నీరు ఏర్పడతాయి.
2) గ్లూకోజ్‌ విచ్ఛిన్నమై పైరూవిక్‌ ఆమ్లం అణువులుగా మారుతుంది.
3) గ్లూకోజ్‌ విచ్ఛిన్నమై నీరు, కార్బన్‌డై ఆక్సైడ్‌లు ఏర్పడతాయి.
4) ఆక్సలో ఎసిటిక్‌ ఆమ్లం ద్వారా గ్లూకోజ్‌ సంశ్లేషణ జరుగుతుంది.


9. గ్లైకాలిసిస్‌ కణంలో ఎక్కడ జరుగుతుంది? 
1) కణద్రవ్యం     2) కేంద్రక ద్రవ్యం
3) కణరసం      4) మైటోకాండ్రియా


10. కిందివాటిలో సరైన వాక్యాలేవి? 
i. గ్లైకాలిసిస్‌ చర్యలు జరగడానికి ఎంజైమ్‌లు అవసరం లేదు.
ii. గ్లైకాలిసిస్‌ రసాయన చర్యాక్రమాన్ని ఎమ్‌డన్, మేయర్‌హాఫ్, పరనాస్‌ శాస్త్రవేత్తలు విశదీకరించారు. 
iii. గ్లైకాలిసిస్‌కు ఉన్న మరో పేరు నిలీశి చర్యాక్రమం లేదా నిలీశి మార్గం.
iv. గ్లైకాలిసిస్‌ చర్యలు వాయుసహిత, వాయురహిత శ్వాసక్రియలు రెండింటిలోనూ ప్రాథమికంగా జరుగుతాయి.
1) i, ii, iii, iv        2) i, ii, iii       3) ii, iii, iv         4) ii, iii 


11. గ్లైకాలిసిస్‌లో మొత్తం చర్యల సంఖ్య?
1) 8           2) 10         3) 12         4) 14


12. కణ శ్వాసక్రియలో లింక్‌ చర్య అంటే?
1) గ్లూకోజ్‌ నుంచి పైరూవిక్‌ ఆమ్లం అణువులు ఏర్పడటం.
2) గ్లూకోజ్‌ నుంచి ఎసిటైల్‌ కో ఎంజైమ్‌ ‘ఎ’ ఏర్పడటం.
3) గ్లూకోజ్‌ నుంచి ఆక్సలో ఎసిటిక్‌ ఆమ్లం ఏర్పడటం.
4) గ్లూకోజ్‌ సంపూర్ణ ఆక్సీకరణ ఆక్సిజన్‌ సమక్షంలో జరగడం.


13. కణశ్వాసక్రియలో భాగమైన లింక్‌ చర్యలో జరిగేది?
1) ఆక్సిడేటివ్‌ కండెన్సేషన్‌ చర్య
2) ఆక్సిడేషన్‌ చర్యలు మాత్రమే
3) ఆక్సిడేటివ్‌ డీ కార్బాక్సిలేషన్‌ చర్య
4) ఆక్సిడేటివ్‌ సింథటిక్‌ చర్య


14. క్రెబ్స్‌ వలయంలో ఎన్ని జీవ రసాయన చర్యలు జరుగుతాయి?
1) 6        2) 8       3) 10        4) 12


15. క్రెబ్స్‌ వలయం ఎక్కడ జరుగుతుంది?
1) నిజకేంద్రక జీవుల కణద్రవ్యంలో
2) కేంద్రకపూర్వ జీవుల కణద్రవ్యంలో 
3) హరితరేణువు ఆవర్ణికలో 
4) మైటోకాండ్రియాలోని మాత్రికలో


16. క్రెబ్స్‌ వలయానికి ఉన్న ఇతర పేర్లు?
i. సిట్రిక్‌ ఆమ్ల వలయం
ii. హెక్సోజ్‌ మోనోఫాస్ఫేట్‌
iii. ట్రైకార్బాక్సిలిక్‌ ఆమ్ల వలయం
1) i, ii        2) ii, iii       3) i, iii    4) i, ii, iii


17. కిందివాటిలో గ్లైకాలిసిస్‌లో జరిగే చర్యలు ఏవి?
i. క్రియాధార స్థాయి ఫాస్ఫారిలేషన్‌ చర్య
ii. డీకార్బాక్సిలేషన్‌ చర్య
iii. డీహైడ్రోజనేషన్‌ చర్య
iv. డీహైడ్రేషన్‌ చర్య
1) i, iii, iv           2) ii, iii, iv
3) i, ii, iii           4) i, ii, iii, iv


18. కిందివాటిలో సరైన వాక్యాలేవి?
i. కణద్రవ్యంలో ఏర్పడిన పైరూవిక్‌ ఆమ్లం మైటోకాండ్రియన్‌ మాత్రికలోకి రవాణా అవుతుంది.
ii. పైరూవిక్‌ ఆమ్లం నేరుగా క్రెబ్స్‌ వలయం చర్యల్లో పాల్గొనలేదు.
iii. పైరూవిక్‌ ఆమ్లం ఆక్సిడేటివ్‌ డీ కార్బాక్సిలేషన్‌ చర్య ఫలితంగా ఎసిటైల్‌ కో ఎంజైమ్‌ ‘ఎ’ ఏర్పడటంతో పాటు CO2 విడుదలవుతుంది.
1) i, ii        2) ii, iii        3) i, iii        4) i, ii, iii


19. గ్లూకోజ్‌ పూర్తిగా ఆక్సీకరణం చెందేందుకు  క్రెబ్స్‌ వలయం ఎన్నిసార్లు జరుగుతుంది? 
1) 1        2) 2        3) 3         4) 4


20. పైరూవిక్‌ ఆమ్ల అణువులు లింక్‌ చర్యతో పాటు క్రెబ్స్‌ వలయంలో పాల్గొనడం వల్ల ఏర్పడే వాటిని జతపరచండి.
జాబితా - ఎ       జాబితా - బి
i) CO2                a) 2
ii) NADH + H+      b) 8
iii) FADH2           c) 6
iv) ATP               d) 4
1) i-d, ii-c, iii-b, iv-a         2) i-c, ii-b, iii-a, iv-a
3) i-a, ii-b, iii-c, iv-d         4) i-c, ii-b, iii-d, iv-a 

 

21. కణ శ్వాసక్రియలో జరిగే వివిధ చర్యల సరైన వరుసక్రమాన్ని గుర్తించండి.
i. గ్లైకాలిసిస్‌        ii. క్రెబ్స్‌ వలయం
iii. ఎలక్ట్రాన్‌ రవాణా     iv.. లింక్‌ చర్య
1) i iv ii iii
2) i ii iii iv
3) i ii iv iii
4) i iv iii ii

 

22. క్రెబ్స్‌ వలయంలో జరిగే చర్యలు ఏవి?
i. డీకార్బాక్సిలేషన్‌ చర్యలు
ii. డీహైడ్రోజనేషన్‌ చర్యలు
iii. ఆక్సిజనేషన్‌ చర్యలు
iv. హైడ్రేషన్‌ చర్యలు
1) i, ii, iii             2) ii, iii, iv
3) i, ii, iv            4) i, ii, iii, iv


23. ఏ చర్యల ఫలితంగా క్రెబ్స్‌ వలయంలో NADH+H+, FADH2లు ఏర్పడతాయి?
1) డీకార్బాక్సిలేషన్‌ చర్యలు          2) హైడ్రేషన్‌ చర్యలు
3) డీహైడ్రోజనేషన్‌ చర్యలు         4) మ్యుటేషన్‌ చర్యలు


24. అధస్థ పదార్థ స్థాయి ఫాస్ఫారిలేషన్‌ లేదా క్రియాధార స్థాయి ఫాస్ఫారిలేషన్‌ చర్యలు క్రెబ్స్‌ వలయంలో ఎన్ని జరుగుతాయి?
1) 1       2) 2       3) 3        4) 4


25. క్రెబ్స్‌ వలయం ప్రధాన విచ్ఛిన్న జీవనక్రియగా పని చేస్తుంది. ఇందులో ఏర్పడే మాధ్యమిక యౌగికాల నిర్మాణ క్రియలకు మూలాధారాలుగా ఉపయోగపడుతుంది. అందుకే దీన్ని .... అంటారు.
1) ఏంఫీబోలిక్‌ ప్రక్రియ           2) ఏంఫీసింథటిక్‌ ప్రక్రియ
3) ఏంఫీక్లస్టర్‌ వలయం          4) ఏంఫీగాస్ట్రిక్‌ వలయం


26. క్రెబ్స్‌ వలయాన్ని అనుసరించి జరిగే ఎలక్ట్రాన్‌ రవాణాతో పాటు కింది ఏ చర్యలు పరస్పర సంబంధంతో జరుగుతాయి? 
i. ప్రోటాన్‌ స్థానాంతరణ
ii. ఆక్సిడేటివ్‌ ఫాస్ఫారిలేషన్‌
iii. ఆక్సిజన్‌ విడుదల
1) i,  ii,  iii               2) ii,  iii
3) i,  iii                   4) i, ii


27. కణ శ్వాసక్రియలో ఎలక్ట్రాన్‌ రవాణా జరిగే భాగం?
1) మైటోకాండ్రియా మాత్రిక భాగం
2) మైటోకాండ్రియా బాహ్యత్వచ పైభాగం
3) మైటోకాండ్రియా లోపలి త్వచాల ముడత భాగాలు
4) కణద్రవ్యంలో ఉండే ప్రోటీన్‌ రేణువులు


28. మైటోకాండ్రియా లోపలి త్వచాల ముడతల వల్ల ఏర్పడే భాగం?
1) క్రిస్టే           2) గ్రానా
3) ఆవర్ణిక         4) మాట్రిక్స్‌


29. మైటోకాండ్రియాలో జరిగే ఎలక్ట్రాన్‌ రవాణాలో అంతర్భాగమైన ఎలక్ట్రాన్‌ వాహకాలు?
i. బహుళ ఎంజైమ్‌ సంక్లిష్టాలు
ii. చలనశీలత ఉన్న ఎలక్ట్రాన్‌ వాహకాలు
iii. ప్రాథమిక రేణువులు
1) i, ii, iii     2) i, ii     3) i, iii    4) ii, iii


30. మైటోకాండ్రియాలోని ఎలక్ట్రాన్‌ రవాణా వ్యవస్థలో ఉండే ప్రధాన చలనశీలత ఎలక్ట్రాన్‌ వాహకాలు?
1) యుబిక్వినోన్, సైటోక్రోమ్‌ C
2) సైటోక్రోమ్స్,  ATP ఏజ్‌
3) ప్లాస్టోసయనిన్, యుబిక్వినోన్‌
4) యుబిక్వినోన్,  ATP ఏజ్‌


31.  NADH+H+, FADH2 ల నుంచి ఎలక్ట్రాన్‌లు రవాణా అయినప్పుడు చివరిగా ఎలక్ట్రాన్‌లను స్వీకరించేది?
1) ఆక్సిజన్‌     2) హైడ్రోజన్‌
3) నైట్రోజన్‌    4) కార్బన్‌డై ఆక్సైడ్‌


32. ఎలక్ట్రాన్‌ రవాణా ఒక NADH+H+ నుంచి జరగడం వల్ల ఏర్పడే ప్రోటాన్‌ మోటివ్‌ ఫోర్స్‌ ద్వారా సంశ్లేషణ చెందే మొత్తం ATP అణువులు ఎన్ని?
1) 1        2) 2         3) 3         4) 4


33. NADH+H+ ఆక్సీకరణ చర్యల ద్వారా ఉత్పత్తయిన ఒక జత ఎలక్ట్రాన్‌ల రవాణాకు మొత్తం ఎన్ని ATP అణువులు సంశ్లేషణ చెందుతాయి?
1) 1       2) 2       3) 3         4) 4


34. ఆక్సిడేటివ్‌ ఫాస్ఫారిలేషన్‌ ద్వారా ATP ఏర్పడటానికి కావాల్సిన ఎంజైమ్‌?
1) ADP సింథేజ్‌   2) ATP ఆక్సిడేజ్‌
3) ATP సింథేజ్‌   4) ADP ఆక్సిడేజ్‌


35. ATP అణువులో సుమారు ఎంత శక్తి నిల్వ ఉంటుంది? (కిలో కాలరీలలో)
1) 6.7        2) 4.6          3) 9.2        4) 7.6 


36. వృక్షకణంలో ఒక గ్లూకోజ్‌ అణువు నుంచి ఉత్పత్తయ్యే మొత్తం నికర ATP ల సంఖ్య?
1) 36       2) 30       3) 42       4) 32


37. శ్వాసక్రియ జరిగేటప్పుడు విడుదలయ్యే కార్బన్‌డైఆక్సైడ్‌ ప్రమాణం, అందుకు వినియోగించే ఆక్సిజన్‌ ప్రమాణం నిష్పత్తిని ఏమంటారు?
1) శ్వాసక్రియ గుణకం             2) శ్వాసక్రియ కోషంట్‌ 
3) శ్వాసక్రియ ఇండెక్స్‌           4) శ్వాసక్రియ స్థిరాంకం


38. కార్బోహైడ్రేట్లు క్రియాధార పదార్థాలుగా ఉన్నప్పుడు R.Q. విలువ..
1) 1       2) 2       3) 3       4) 4


39. కిందివాటిలో కణ శ్వాసక్రియను ప్రభావితం చేసే అంశాలు ఏవి?
i. ఉష్ణోగ్రత     ii. CO2  గాడత          iii. నీరు       iv. కాంతి
1) i, ii, iii           2) ii, iii, iv        3) i, iii, iv          4) i, ii, iii, iv


సమాధానాలు: 1-1; 2-4; 3-1; 4-3; 5-2; 6-1; 7-3; 8-2; 9-1; 10-3; 11-2; 12-2; 13-3; 14-2; 15-4; 16-3; 17-1; 18-4; 19-2; 20-2; 21-1; 22-3; 23-3; 24-1; 25-1; 26-4; 27-3; 28-1; 29-2; 30-1; 31-1; 32-3; 33-2; 34-3; 35-4; 36-1; 37-2; 38-1; 39-4.

Posted Date : 03-08-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌