• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ కాలుష్యం

పర్యావరణ కాలుష్యం

1. రాళ్లపై ఆమ్ల వర్షాలు కురిసినప్పుడు ఏర్పడే మచ్చలను ఏమంటారు?

1) స్టోన్‌లెప్రసీ        2) ఆయిల్‌స్టీక్‌        3) ఒలిగోట్రోఫికేషన్‌       4) ఏదీకాదు

2. కిందివాటిలో నీటి కాలుష్యానికి కారణాలు ఏవి?

i) వ్యవసాయ రంగంలో ఉపయోగించే రసాయన ఎరువులు, కీటకనాశకాలు.

ii)  కాగితం, పంచదార, తోళ్ల పరిశ్రమల నుంచి వెలువడే విష రసాయనాలు.

iii) మలమూత్ర విసర్జనాలు, సబ్బులు, డిటర్జెంట్‌ మొదలైనవి నీటిలో కలవడం వల్ల ఏర్పడిన మురుగు.

1) i, ii     2) ii, iii     3) ii, iii     4) పైవన్నీ

3. థర్మల్‌ విద్యుత్‌ కేంద్రాల్లో విద్యుత్‌ ఉత్పత్తికి కింది ఏ ద్రావణాన్ని అధిక పరిమాణంలో ఉపయోగిస్తారు?

1) నీరు      2) ఆల్కహాల్‌      3) కర్బన ద్రవం      4) పైవన్నీ

4. కింది ఏ భారలోహాలు నీటిలో కలిసి కాలుష్యానికి కారణమవుతాయి?

1) సీసం        2) పాదరసం(Hg)      3) కాడ్మియం(Cd)       4) పైవన్నీ

5. కిందివాటిలో సరైనవి?

i) కలుషిత నీటిని తాగడం వల్ల కలరా, డయేరియా, టైఫాయిడ్, పచ్చకామెర్లు మొదలైన వ్యాధులు కలుగుతాయి.

ii) స్వచ్ఛమైన నీటికి రంగు, రుచి, వాసన ఉండవు.

iii)  నీరు ఒక విశ్వద్రావణి.

1) i, iii        2) ii, iii        3) i, ii        4) పైవన్నీ

6. మానవుడి శరీర బరువులో నీటి శాతం ఎంత? 

1) 10%      2) 30%      3) 70%      4) 90%

7. భూ ఉపరితలంపై ఉన్న నీటిలో స్వచ్ఛమైన నీటి శాతం ఎంత? 

1) 10%       2) 30%      3) 70%      4) 90%

8. వాయుకాలుష్య నివారణ, నియంత్రణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

1) 2010      2) 2021  3) 1974      4) 1981

9. నీటికాలుష్య నివారణ, నియంత్రణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

1) 1980      2) 1981       3) 1986      4) 1976

10. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలిని ఎప్పుడు ఏర్పాటు చేశారు?

1) 1980        2) 1981      3) 1974        4) 1976

11. కేంద్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) బెంగళూరు      2) పుణె      3) చెన్నై      4) న్యూదిల్లీ

12. కిందివాటిలో పర్యావరణ క్షీణతకు కారణాలు ఏవి?

i) కాలుష్యం     ii) నగరీకరణ       iii) అడవులు నరకడం       iv) పారిశ్రామికీకరణ      v) ప్రకృతి సంబంధ కారణాలు

1) i, iii      2) ii, iii, iv      3) ii, iv    4) పైవన్నీ


13. పర్యావరణ పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు చేశారు?

1) 1982         2) 1984     3) 1986      4) 1980

14. జాతీయ హరిత ప్రత్యేక న్యాయస్థాన చట్టాన్ని ఎప్పుడు ఆమోదించారు? 

1) 2002        2) 2004       3) 2010      4) 1984

15. అడవుల పరిరక్షణ చట్టం ఎప్పుడు అమల్లోకి వచ్చింది?

1) 1982       2) 1980       3) 1984        4) 1986 

16. అడవుల పరిరక్షణ చట్టాన్ని ఎప్పుడు సవరించారు?

1) 1980      2) 1988    3) 1984       4) 2010 

17. కేంద్ర ప్రభుత్వం జీవ వైవిధ్య చట్టాన్ని ఎప్పుడు తెచ్చింది? 

1) 2010        2) 2002       3) 1988           4) 1980 

18. భారతదేశంలోని మొత్తం భూభాగంలో అడవుల శాతం ఎంత? 

1) 24.6%      2) 25.6%      3) 26.6%          4) 27.6% 

19. జాతీయ వాయుకాలుష్య సూచికను కేంద్రం ఎప్పుడు ప్రారంభించింది? 

1) 2002       2) 2015       3) 2016       4) 2020


20. కింది ఏ జాతీయ సంస్థతో కలిసి కేంద్ర ప్రభుత్వం జాతీయ వాయు కాలుష్య సూచికను ప్రారంభించింది? 

1) ఐఐటీ మద్రాస్‌     2) ఐఐటీ కాన్పూర్‌       3) ఐఐటీ దిల్లీ      4) ఐఐటీ ఖరగ్‌పూర్‌


21. కిందివాటిలో పర్యావరణ పరిరక్షణకు కృషిచేస్తోన్న సంస్థలు ఏవి? 

ఎ) ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ ఫారెస్ట్రీ రిసెర్చ్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌         బి) ఇందిరాగాంధీ నేషనల్‌ ఫారెస్ట్‌ అకాడమీ      సి) వైల్డ్‌ లైఫ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా

1) ఎ, బి       2) బి, సి            3) ఎ, సి            4) పైవన్నీ

22. మినమాటా వ్యాధికి కారణమైన కలుషిత నీటిలోని విష పదార్థం ఏది? 

1) బ్రోమిన్‌       2) మిథైల్‌ మెర్క్యురీ      3) సీసం      4) కాడ్మియం క్లోరైడ్‌  


23. భారతదేశంలో తొలి పర్యావరణ ఉద్యమం ఏది? 

1) జంగిల్‌ బచావో ఆందోళన      2) చిప్కో ఉద్యమం         3) బిష్ణోయ్‌ ఉద్యమం      4) సెలైంట్‌ వ్యాలీ ఉద్యమం 

24. కింది అంశాలను జతపరచండి.

25. కిందివాటిలో సరైన జత?

1) క్యోటో ప్రొటోకాల్‌ - గ్రీన్‌హౌస్‌ వాయువుల ప్రభావాన్ని తగ్గించడం

2) మాంట్రియల్‌ ప్రొటోకాల్‌ - ఓజోన్‌పొర పరిరక్షణ 

3) కార్టెజినా ప్రొటోకాల్‌  - జీవరాశుల భద్రత 

4) పైవన్నీ 

26. చిప్కో ఉద్యమం ఏ రాష్ట్రంలో ప్రారంభమైంది? 

1) పంజాబ్‌      2) తమిళనాడు          3) ఉత్తరాఖండ్‌         4) బిహార్‌ 

27. సైలెంట్‌ వ్యాలీ ఉద్యమం కేరళలోని ఏ జిల్లాలో మొదలైంది? 

1) పాలక్కడ్‌          2) వేలూరు        3) బీదర్‌         4) త్రిశూర్‌ 


28. కింది దేని ఆధారంగా నీటిలోని సేంద్రియ వ్యర్థ పదార్థాల పరిమాణాన్ని, వాటి కాలుష్య స్థాయిని నిర్ణయిస్తారు?

1) రసాయనిక ఆక్సిజన్‌ అవసరం      2) జీవరసాయన ఆక్సిజన్‌ అవసరం      3) నీటిలో కరిగి ఉన్న ఆక్సిజన్‌      4) 1, 2

29. కింది అంశాలను జతపరచండి.

Posted Date : 23-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌