• facebook
  • whatsapp
  • telegram

జెనెటిక్స్‌

1. జీవుల అనువంశికత, అనువంశిక వైవిధ్యాల గురించి తెలిపే జీవశాస్త్ర శాఖ.......

1) జెనెటిక్స్‌         2) జెరంటాలజీ    

3) జెర్మైనల్‌ బయాలజీ       4) జీరాలజీ

2. జెనెటిక్స్‌ అనే పదాన్ని ప్రతిపాదించింది..... 

1) జాన్‌మెండల్‌        2) బేట్‌సన్‌    

3) సాహిల్‌        4) జిమ్మర్‌మాన్‌

3. కిందివాటిలో జన్యుశాస్త్రం దేన్ని తెలుపుతుంది?

i. జనక జీవుల నుంచి పిల్ల జీవులకు అనువంశికతా పద్ధతులను

ii. జన్యువిస్తరణను    iii. వైవిధ్యాలను

iv. జనాభాలో మార్పులను

1) i, ii, iii          2) ii, iii, iv

3) i, iii        4) i, ii, iii, iv

4. కిందివాటిలో సరైనవి ఏవి?

i. ఒక తరం నుంచి తర్వాతి తరాల వారికి ‘లక్షణాలు’ ఎలా సంక్రమిస్తాయో తెలిపే అధ్యయనమే అనువంశికత.

ii. ఒక తరం నుంచి మరో తరానికి సంక్రమించే లక్షణాలను అనువంశిక లక్షణాలు అంటారు.

iii. ఒక జాతికి చెందిన జీవుల లక్షణాల్లోనూ, ఒకే తల్లిదండ్రుల సంతానంలోనూ కనిపించే తేడాలను వైవిధ్యాలుగా పేర్కొంటారు.

1) i, ii    2) i, iii    3) ii, iii    4) i, ii, iii

5. క్రోమోజోమల్‌ అనువంశిక సిద్ధాంతాన్ని ప్రతిపాదించింది?

1) గ్రిగర్‌ జాన్‌మెండల్‌           2) చార్లెస్‌ డార్విన్‌


3) సట్టన్, బొవెరి        4) డివ్రీస్, కోరెన్స్‌

6. మెండల్‌ అనువంశికతా సూత్రాలను టి.హెచ్‌.మోర్గాన్‌ దేనిలో పరిశోధించి వివరించాడు?

1) బ్లట్టా ఓరియంటాలిస్‌ 

2) డ్రోసోఫిలా మెలనోగాస్టర్‌

3) పెరిపాటస్‌ అమెరికానా 

4) ఎపిస్‌ డార్సేటా

7. మెండల్‌ ప్రతిపాదించిన మొదటి అనువంశికతా సూత్రం.....

1) అలీన సూత్రం 

2) స్వతంత్ర వ్యూహన సూత్రం

3) జన్యు వ్యక్తీకరణ 

4) జన్యుపరిణామ సిద్ధాంతం

8. ఒకే జన్యువు ఎక్కువ దృశ్యరూపాలను ప్రభావితం చేసే దృగ్విషయాన్ని ఏమంటారు?

1) మోనోట్రోపీ     2) పాలీట్రోపీ    

3) ప్లియోట్రోపీ     4) మయోట్రºపీ

9. ఒక జన్యువుకు ఉండే రెండు ప్రత్యామ్నాయ రూపాలను ఏమంటారు?

1) యుగ్మప్రచోదనాలు 

2) అవికల్పయుగ్మాలు

3) జన్యుయుగ్మకాలు               4) యుగ్మవికల్పాలు

10. ఒక జన్యువుకు సమజాత క్రోమోజోమ్‌లలోని ఒకే స్థానం వద్ద రెండు కంటే ఎక్కువ యుగ్మవికల్పకాలు ఉంటే వాటిని ఏమంటారు?

1) బహుళయుగ్మ వికల్పకాలు 

2) బహుళకాల్పనికాలు

3) బహుళ బాహుళ్యాలు 

4) బహుళ వ్యక్తీకరణాలు  

11. మానవుడిలో కనిపించే బహుళయుÞŒ్మ వికల్పకాలకు ఉదాహరణ....

1) లింగ నిర్ధారణ

2) ఫినైల్‌ కీటోనూరియా

3) మానవ రక్తవర్గాలు 

4) అవశేష అంగాలు

12. మానవుడిలో కనిపించే కింది ఏ స్థితిని ప్లియోట్రోపీకి ఉదాహరణగా పేర్కొంటారు?

1) ఫినైల్‌ కీటోనూరియా 

2) మానవ రక్తవర్గాలు    

3) లింగ నిర్ధారణ   

4) వ్యాధి నిరోధకత

13. మానవుడిలో రక్తవర్గాలను నిర్ధారించే జన్యువులు దేనిపై అమరి ఉంటాయి?

1) X అనే లైంగిక క్రోమోజోమ్‌ మీద

2) తొమ్మిదో దైహిక క్రోమోజోమ్‌ మీద

3) ఆరో దైహిక క్రోమోజోమ్‌ మీద

4) ఇరవయ్యో దైహిక క్రోమోజోమ్‌ మీద

14. ఒక వ్యక్తి ABO రక్తవర్గాన్ని కనుక్కోవడానికి అతడి నుంచి రక్తం నమూనాలను సేకరించి దానికి ఏం కలుపుతారు?

1) వేరే వ్యక్తి రక్తం నుంచి సంగ్రహించిన సీరం

2) వేరే వ్యక్తి రక్తం నుంచి సంగ్రహించిన ప్రతిదేహాలు

3) యాంటీ -  A లేదా యాంటీ - B ప్రతిదేహాలు గల యాంటీ సీరం

4) యాంటీ - A లేదా యాంటీ - B ప్రతిజనకాలు గల సీరం

15. కిందివాటిలో సరైనవి ఏవి?

i. యాంటీ - A సీరంతో మాత్రమే గుచ్ఛీకరణం జరిగితే ఆ రక్తం తి వర్గానికి చెందింది.

ii. యాంటీ - B సీరంతో మాత్రమే గుచ్ఛీకరణం జరిగితే ఆ రక్తం తీ వర్గానికి చెందింది.

iii. యాంటీ - A,  యాంటీ - B సీరంలతో మాత్రమే గుచ్ఛీకరణం జరిగితే ఆ రక్తం తితీ వర్గానికి చెందింది.

iv. యాంటీ - A, యాంటీ - B సీరం రెండింటితో గుచ్ఛీకరణం జరగకపోతే దాన్ని వీ రక్తవర్గంగా చెప్పొచ్చు.

1) i, iv   2) ii, iii   3) iii, iv  4) i, ii, iii, iv

16. రక్తమార్పిడి సమయంలో ప్రధానంగా దేన్ని పరిగణనలోకి తీసుకోవాలి?

1) దాత ప్రతిజనక రకాలను, గ్రహీత ప్రతిదేహాలను

2) దాత ప్రతిజనక రకాలను మాత్రమే

3) గ్రహీత ప్రతిదేహ రూపాలను మాత్రమే

4) దాత, గ్రహీత ప్రతిజనకాలను మాత్రమే

17. Rh ప్రతిజనకాన్ని సాధారణంగా ఏమని వ్యవహరిస్తారు?

1) A - ప్రతిజనకం     2) B - ప్రతిజనకం

3) C - ప్రతిజనకం     4) D - ప్రతిజనకం

18. ఏదైనా ఒక లక్షణం వల్ల అనేక జన్యువులు ఒక సమూహంగా ఏర్పడి అనువంశికతను నిర్ధారించే స్థితిని ఏమంటారు?

1) ప్లియోట్రోపీ 

2) బహుజన్యు అనువంశికత

3) బహులక్షణ అనువంశికత 

4) ఏకజన్యు అనువంశికత

19. బహుజన్యు అనువంశికతకు ఉన్న పేర్లు...

i. పరిమాణాత్మక అనువంశికత   

ii. బహుళకారక అనువంశికత

iii. ప్లియోట్రోపీ

1) i, iii    2) ii, iii    3) i, ii    4) i, ii, iii

20. బహుజన్యు అనువంశికతకు మానవుడిలో కనిపించే ఉదాహరణలు.........

i. చర్మం రంగు        ii. ఎత్తు   

iii. బరువు        iv. మేధోశక్తి

1) i, ii, iii        2) ii, iii, iv

3) i, iii, i్ర        4) i, ii, iii, iv

21. మానవుడిలో  ABO రక్తవర్గాలను  కనిపెట్టింది ఎవరు?

1) కార్ల్‌లాండ్‌ స్టీనర్‌     2) మెండల్‌

3) కార్ల్‌లాండ్‌ స్పిన్నర్‌ 

4) థామస్‌ హంట్‌ మోర్గాన్‌

22. కిందివాటిలో సరైనవి ఏవి?

i. అధిక శాతం జంతువుల్లో ఒక జత క్రోమోజోమ్‌లు లింగ నిర్ధారణకు కారణమవుతాయి.

ii. లింగ నిర్ధారణకు కారణమయ్యే క్రోమోజోమ్‌లను లైంగిక క్రోమోజోమ్‌లు అంటారు.

iii. లైంగిక క్రోమోజోమ్‌లు (అల్లో జోమ్‌లు) మినహా మిగిలిన క్రోమోజోమ్‌లను ఆటోజోమ్‌లు లేదా దైహిక క్రోమోజోమ్‌లు అంటారు.

1) i, ii, iii   2) i, ii    3) ii, iii    4) i, iii

23. మానవుడిలో లింగ నిర్ధారణ పద్ధతి.......

1) XX - XO        2) ZZ - ZW

3) XX - XY      4) ZZ - ZO

24. కిందివాటిలో XX - XY పద్ధతి ప్రకారం జరిగే లింగ నిర్ధారణకు సంబంధించి సరైనవి ఏవి?

1) ఈ రకమైన లింగ నిర్ధారణ మానవుడితో పాటు, డ్రోసోఫిలాలో కనిపిస్తుంది.

2) స్త్రీ జీవి X క్రోమోజోమ్‌ కలిగిన అండాలను, పురుష జీవి X లేదా Y క్రోమోజోమ్‌ కలిగిన రెండు రకాల శుక్రకణాలను ఉత్పత్తి చేస్తాయి.

3) ఫలదీకరణ సమయంలో X - అండం, Y - శుక్రకణంతో కలిస్తే పురుష జీవిగా (XY); X - శుక్రణంతో కలిస్తే స్త్రీ జీవిగా XX) వృద్ధి చెందుతాయి.

1) i, ii    2) ii, iii    3) i, iii    4) i, ii, iii

25. సాధారణంగా లింగ నిర్ధారణ ఏ సమయంలో జరుగుతుంది?

1) సంయోగబీజాలు ఏర్పడే దశలో

2) పిండం రూపాంతరం చెందుతున్న దశలో

3) జీవి బీజకణాలను ఉత్పత్తి చేసే ఉష్ణోగ్రతను అనుసరించి

4) ఫలదీకరణం జరిగే దశలో

26. కిందివాటిలో పురుష విషమ సంయోగబీజ రూపంలో లింగ నిర్ధారణ జరిగే పద్ధతులను గుర్తించండి.

i. XX - XY    ii. XX - XO

iii. ZZ - ZW     iv. ZO - ZZ

1) i, ii    2) ii, iii    3) iii, iv    4) i, iii


27. కిందివాటిలో స్త్రీ విషమ సంయోగబీజ రూపంలో లింగ నిర్ధారణ జరిగే పద్ధతులను గుర్తించండి.

 i.  XX - XY        ii. XX - XO

iii.  ZZ - ZW       iv. ZO -ZZ

1) i, ii           2) ii, iii    

3) iii, iv           4) i, iii


28. కింది అంశాలను జతపరచండి.


లింగ నిర్ధారణ         ఉదాహరణ


పద్ధతి                     జీవులు


i) XX - XY         a)  సీతాకోక చిలుకలు, మాత్‌లు


ii) XX - XO       b) పక్షులు, సరీసృపాలు


iii) ZZ - ZY        c)నల్లులు, బొద్దింకలు, మిడతలు


iv) ZO - ZZ         d) మానవుడు, డ్రోసోఫిలా

1్శ id, iic, iii్a, i్b 

2్శ i‘, ii్ట, iii్జ, i్ర్చ

3్శ i్ట, ii‘, iii్జ, i్ర్చ 

4్శ i్చ, ii్జ, iii‘, i్ర్ట

29. మానవుడిలో లింగ నిర్ధారణకు సంబంధించి కింది వాటిలో సరైనవి ఏవి?

i. పురుషులు ఉత్పత్తి చేసిన మొత్తం శుక్ర కణాల్లో 50% శ్రీ  క్రోమోజోమ్‌లు, 50% ్త్ర  క్రోమోజోమ్‌లు ఉంటాయి.

ii. స్త్రీలు ఉత్పత్తి చేసిన మొత్తం అండాల్లో కేవలం శ్రీ  క్రోమోజోమ్‌లు మాత్రమే ఉంటాయి.

iii. మానవుల్లో పుట్టబోయే శిశువు లింగలక్షణం శుక్రకణం పైనే ఆధారపడి ఉంటుంది.

iv. తల్లి గర్భంలో అభివృద్ధి చెందే పిండం ఆడశిశువుగా పుట్టడానికి 50% అవకాశం ఉండగా, మగబిడ్డగా జన్మించడానికి 50% అవకాశం ఉంటుంది.

1) i, ii, iii        2) ii, iii, iv 

3) i, iii, iv        4) i, ii, iii, iv

30. బ్రిడ్జెస్‌ ప్రతిపాదించిన జన్యుసంతులన సిద్ధాంతం దేన్ని వివరిస్తుంది?

1) మానవుల్లో లింగ నిర్ధారణ

2) డ్రోసోఫిలాలో లింగ నిర్ధారణ

3) సరీసృపాల్లో లింగ నిర్ధారణ

4) పక్షుల్లో లింగ నిర్ధారణ

31. స్త్రీలలో అదనంగా ఉండే శ్రీ - క్రోమోజోమ్‌ పిండం ఆరంభ దశలోనే చుట్టలు చుట్టుకుని గాఢంగా అభిరంజనాన్ని స్వీకరించి, హెటిరో క్రొమాటిన్‌గా కనిపిస్తూ క్రియారహితం అవుతుంది. దీనికి గల ప్రత్యేకమైన పేరు.....

1) గార్‌ దేహం     2) జార్‌ దేహం

3) బార్‌ దేహం     4) ధార్‌ దేహం

32. డ్రోసోఫిలాలో గమనించే ఏకసంకరణ దృశ్యరూప నిష్పత్తి.......

1) 3 : 1        2) 1 : 2 : 1 

3) 9 : 3 : 3 : 1          4) 1 : 4 : 1

33. డ్రోసోఫిలాలో గమనించే ఏకసంకరణ జన్యురూప నిష్పత్తి........

1) 3 : 1          2) 1 : 2 : 1 

3) 9 : 3 : 3 : 1        4) 1 : 3 : 1

34. జన్యువుల స్వతంత్రవ్యూహన సిద్ధాంతం ప్రకారం డ్రోసోఫిలాలో అనువంశికతను వివరించే దృశ్యరూప నిష్పత్తి.....

1) 3 : 1        2) 1 : 2 : 1 

3) 9 : 3 : 3 : 1        4) 1 : 3 : 1

35. డ్రోసోఫిలాలో రెక్కల పరిమాణాన్ని, దేహ వర్ణాన్ని నిర్ణయించే జన్యువులు ఒకే క్రోమోజోమ్‌పై అమరి ఉంటాయి. వీటిని ఏమంటారు?

1) సలక్షణ జన్యువులు 

2) సహలగ్నత జన్యువులు 

3) విలక్షణ జన్యువులు 

4) విలగ్న జన్యువులు

సమాధానాలు

11  22  34  44  53  62  71  83  94  101  113  121  132  143  154  161  174  182  193  204  211  221  233  244  254  262  273  283  294  302  313  321  332  343  352.

రచయిత

కొర్లాం సాయివెంకటేష్‌

అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌  

Posted Date : 19-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌