• facebook
  • whatsapp
  • telegram

పర్యావరణ కాలుష్యం - పర్యావరణ సమస్యలు

1. భారతదేశంలో ఏ ప్రాంతాన్ని అతిపెద్ద కార్బన్‌ సింక్‌గా పేర్కొంటారు? (ఈ ప్రదేశం అత్యంత ఎక్కువ పచ్చదనం కలిగి, ప్రపంచంలోనే అత్యధిక వైవిధ్యం కలిగిన హాట్‌స్పాట్‌గా గుర్తింపు పొందింది. ఈ ప్రాంతంలోని అధిక విస్తీర్ణం ఎల్లప్పుడూ మంచుతో కప్పి ఉంటుంది.)

1) ఇండియన్‌ హిమాలయన్‌ రీజియన్‌    2) దక్కన్‌ పీఠభూమి ప్రాంతం     3) ఆరావళి పర్వత శ్రేణులు     4) చోటా నాగ్‌పుర్‌ ప్రాంతం 

2. భారత ప్రభుత్వం సింగిల్‌ యూజ్‌ ప్లాస్టిక్‌తో తయారుచేసిన క్యారీబ్యాగ్‌లు, స్ట్రాలు, గ్లాసులు, పాలీస్టిరీన్‌ పదార్థాల వాడకాన్ని ఎప్పటి నుంచి నిషేధించింది? (పర్యావరణ పరిరక్షణలో భాగంగా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది.)

1) 2022, జూన్‌ 1       2) 2022, జులై 1        3) 2022, ఆగస్టు 1          4) 2022, సెప్టెంబరు 1

3. ఉత్తరాఖండ్‌లోని ‘నైని’ మంచినీటి సరస్సు ఆవరణ వ్యవస్థ పరిరక్షణకు అక్కడి ప్రజలు అవలంబించిన పథకం?

1) మిషన్‌ భగీరథ       2) హర్‌ ఘర్‌ నల్‌ సే జల్‌     3) మిషన్‌ బటర్‌ఫ్లై        4) నమామి గంగే 


4. జల్‌ జీవన్‌ మిషన్‌ ద్వారా కింది ఏ రాష్ట్రంలోని గృహాలన్నింటికీ 100% నీటి సదుపాయాన్ని కల్పించారు? 

1) గోవా       2) తమిళనాడు       3) ఆంధ్రప్రదేశ్‌       4) దిల్లీ


5. జమ్మూ-కశ్మీర్‌లోని కింది ఏ సరస్సును భారత ప్రభుత్వ సరస్సు పరిరక్షణ పథకం ద్వారా రక్షిస్తున్నారు? (మానవ కార్యకలాపాల వల్ల ఈ సరస్సు అత్యంత కాలుష్యానికి గురైంది.)

1) నైని సరస్సు      2) కొల్లేరు సరస్సు       3) చిలుక సరస్సు     4) దాల్‌ సరస్సు 


6. కింది ఏ రాష్ట్ర ప్రభుత్వం కొండ ప్రాంతాలను విచక్షణా రహితంగా తొలగించకుండా 2006లో చట్టం చేసింది?

1) అసోం        2) బిహార్‌      3) మధ్యప్రదేశ్‌         4) ఒడిశా 


7. కింది ఏ రాష్ట్రం ప్రతి ఇంటి కప్పుపై వర్షపు నీటిని సేకరించే ట్యాంకులను కచ్చితంగా నిర్మించాలని సూచించింది? (దీనిద్వారా రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌లో ఆ రాష్ట్రం మొదటి స్థానంలో నిలిచింది.)

1) ఆంధ్రప్రదేశ్‌     2) తెలంగాణ     3) కర్ణాటక      4) తమిళనాడు 


8. రెయిన్‌ వాటర్‌ హార్వెస్టింగ్‌ పద్ధతులు, వాటిని అమలు చేసే రాష్ట్రాలకు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) హిమాచల్‌ ప్రదేశ్‌ - ఖత్రి       బి) ఉత్తరాఖండ్‌ - నౌల్‌      సి) రాజస్థాన్‌- జాడ్‌       డి) లద్దాఖ్‌ - జింగ్‌ 

1) ఎ, బి      2) బి, సి       3) ఎ, డి       4) పైవన్నీ

9. కిందివాటిలో సరైంది ఏది?

1) ఇసుక సహజంగా నీటిని నిల్వచేసి (aquifer) ప్రసరింపజేస్తుంది. 

2) ఇసుక నది అడుగు భాగంలో సహజ తివాచీగా పనిచేస్తుంది.

3) విపరీతమైన ఇసుక తవ్వకాల వల్ల నదీ పరీవాహక ప్రాంతంలోని లోతట్టు ప్రాంతాలు కోతకు గురై, నదీ ముఖద్వారాల పరిమాణం పెరుగుతుంది. దీంతో నదులు, నదీ వాయిల్లో ఉండే నీటి శాతం క్రమంగా తగ్గుతుంది. ఈ కారణంగా ఆయా ప్రాంతాల్లో ఉన్న భూగర్భజలాలు కూడా తగ్గుతాయి.

4) పైవన్నీ 

10. కిందివాటిలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల ప్రభావితమైన ప్రాంతం ఏది? 

1) కర్ణాటకలోని పాపాఘ్ని పరీవాహక ప్రాంతం      2) కేరళలోని భరత పూజ ప్రాంతం      3) ఆంధ్రప్రదేశ్‌లోని పంచలింగాల గ్రామ (కర్నూలు) ప్రాంతం     4) పైవన్నీ 


11. కింది ఏ వెజిటబుల్ ఆయిల్‌ని భారత్‌ ఇండోనేసియా నుంచి అధికంగా దిగుమతి చేసుకోవడం వల్ల అక్కడి వర్షారణ్యాలు పర్యావరణ సమస్యలకు గురయ్యాయి? (2012 లెక్కల ప్రకారం మనదేశంలో ఆ ఆయిల్‌ని 74% ఉపయోగించారు.) 

1) సన్‌ఫ్లవర్‌ ఆయిల్‌      2) నువ్వుల నూనె      3) వేరుశెనగ నూనె     4) పామాయిల్‌ 


12. పక్షులు, తేనెటీగలపై సెల్‌ టవర్ల ప్రభావానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) సాధారణంగా పక్షుల శరీరంలో ద్రవాల శాతం తక్కువగా ఉంటుంది. సెల్‌ టవర్ల నుంచి వచ్చే రేడియేషన్‌ వల్ల వాటి శరీరాలు అత్యంత త్వరగా వేడెక్కుతాయి.

బి) పక్షి ఉపరితల వైశాల్యం, శరీర బరువు కంటే ఎక్కువగా ఉండటం వల్ల రేడియేషన్‌ను త్వరగా గ్రహిస్తుంది.

సి) సెల్‌ టవర్ల ద్వారా ఉత్పన్నమయ్యే అయస్కాంత ప్రభావం వల్ల పక్షుల్లో ఉండే నావిగేషన్‌ నైపుణ్యాలు తీవ్రంగా దెబ్బతింటాయి.

డి) టెలీకమ్యూనికేషన్‌ మస్ట్‌ (mast)  తాకిడి వల్ల ఏటా పక్షులు అధిక సంఖ్యలో మరణిస్తున్నాయి. 

1) ఎ, బి       2) ఎ, సి         3) బి, డి       4) పైవన్నీ 


13. సురంగం, కురంబు అనే వర్షపు నీటి నిర్వహణ పద్ధతులను అమలు చేస్తున్న రాష్ట్రం?

1) ఆంధ్రప్రదేశ్‌      2) ఒడిశా     3) కేరళ         4) తెలంగాణ 


14. సెల్‌ టవర్ల నుంచి వెలువడే ఎలక్ట్రోమ్యాగ్నటిక్‌ రేడియేషన్‌ మానవులను ఏ విధంగా ప్రభావితం చేస్తుంది?

1) మైక్రోవేవ్‌ రేడియేషన్‌ను గ్రహించడం వల్ల మానవ కణజాలాల్లో తీవ్ర మార్పులు, సైకలాజికల్‌ మార్పులు సంభవిస్తాయి.

2) జన్యులోపాలు; ప్రత్యుత్పత్తి వ్యవస్థ, కేంద్ర నాడీవ్యవస్థ ప్రభావితమవుతాయి.

3) మానవ దేహంలో అత్యావశ్యకమైన కాల్షియం, ఇతర అయాన్ల సమతౌల్యత దెబ్బతింటాయి.

4) పైవన్నీ 


15. కర్బన ఆధారిత ఇంధనాలైన పెట్రోల్, డీజిల్, కలపను అసంపూర్తిగా మండించడం వల్ల వెలువడే కాలుష్య కారక వాయువు? (దీనికి రంగు, వాసన ఉండదు.)

1) కార్బన్‌ మోనాక్సైడ్‌      2) ఓజోన్‌      3) క్లోరోఫ్లోరోకార్బన్లు       4) హైడ్రోక్లోరోఫ్లోరోకార్బన్లు 


16. రిఫ్రిజిరేటర్లు, ఎయిర్‌ కండిషనింగ్‌ వ్యవస్థల నుంచి వెలువడే కాలుష్య కారక వాయువు? (ఇది స్ట్రాటోస్పియర్‌లోకి ప్రవేశించినప్పుడు ఓజోన్‌ పొర క్షీణిస్తుంది.)

1) కార్బన్‌ మోనాక్సైడ్‌      2) కార్బన్‌ డైఆక్సైడ్‌      3) క్లోరోఫ్లోరోకార్బన్లు      4) సల్ఫర్‌ డైఆక్సైడ్‌


17. బొగ్గు నిక్షేపాలను మండించడం, థర్మల్‌ పవర్‌ ప్లాంట్లు, ఖనిజాలు కరిగించడం వల్ల వెలువడే అత్యంత కాలుష్య కారక వాయువు?

1) నైట్రోజన్‌ ఆక్సైడ్‌      2) కార్బన్‌ మోనాక్సైడ్‌      3) కార్బన్‌ డైఆక్సైడ్‌      4) సల్ఫర్‌ డైఆక్సైడ్‌

మరికొన్ని..

1. స్మాగ్‌ (smog) కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) ఇది పొగ, మంచు కలయికతో  ఏర్పడుతుంది.

బి) స్మాగ్‌లో ఉన్న రసాయనాలు సూర్యరశ్మితో చర్య జరిపి, వాయుకాలుష్యాన్ని కలిగిస్తాయి. దీన్ని ఫోటో కెమికల్‌ స్మాగ్‌ అంటారు.

సి) ఫోటో కెమికల్‌ స్మాగ్‌లో ప్రధాన కాలుష్య కారకం - ఓజోన్‌.

డి) ఈ స్మాగ్‌ వాతావరణంలో ఉన్న వివిధ వాయువులు, నీటి ఆవిరితో కలిసి హేజ్‌గా మారుతుంది. దీనివల్ల వివిధ రకాలైన శ్వాసకోశ సమస్యలు, విటమిన్‌ డి లోపాలు కలుగుతాయి.

1) ఎ, బి      2) బి, సి      3) సి, డి        4) పైవన్నీ


2. ‘నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రాం’కి సంబంధించి కిందివాటిలో సరైనవి? 

1) దీన్ని 2019లో ప్రారంభించారు. అయిదేళ్లలో వాయు కాలుష్యాన్ని తగ్గించాలని రూపొందించారు.

2) 2024 నాటికి PM2.5, PM10  కాన్సన్‌ట్రేషన్‌లను సుమారు 20 నుంచి 30 శాతానికి తగ్గించటం దీని లక్ష్యం.

3) వాయు కాలుష్యంలో ప్రధాన కాలుష్య కారకాలను వివిధ వర్గాలతో, అంటే స్థానిక సంస్థలు, రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం, ఇతర సంస్థలతో కలిసి గణనీయంగా తగ్గించడానికి అవసరమైన ప్రణాళికలు రచించడం.

4) పైవన్నీ 

3. మానవ శరీరానికి ఎంత శాతం ఫ్లోరిన్‌ లేదా గాఢత ఆరోగ్యకరం?

1) 1.5ppm        2) 2.5ppm      3) 3.5ppm       4) 4.5ppm 


4. తాగునీటిలో కింది ఏ పదార్థం అధికంగా ఉంటే మెథెమోగ్లోబిఎనీమియా లేదా బ్లూబేబీ సిండ్రోమ్‌ వ్యాధి కలుగుతుంది? (ఆ పదార్థం ఆక్సిజన్‌ రవాణాను తగ్గించి మెథెమోగ్లోబిన్‌ని ఉత్పత్తి చేస్తుంది.)

1) నైట్రోజన్‌       2) ఫాస్ఫరస్‌      3) పొటాషియం       4) సల్ఫర్‌ 


5. జపాన్‌లో మినిమెటా వ్యాధి ఏ కాలుష్య కారకం వల్ల సంభవించింది?

1) ఆర్సెనిక్‌     2) కాడ్మియం      3) రాడాన్‌      4) మెర్క్యురీ 


6. న్యూక్లియర్‌ పవర్‌ ప్లాంట్‌లో శీతలీకరణ ద్రావణంగా నీటిని ఉపయోగించి, తద్వారా ఉత్పన్నమైన వేడినీటిని సమీప నీటి సముదాయాల్లోకి విడుదల చేస్తారు. దీంతో ఆ ఆవరణ వ్యవస్థలో నివసించే జీవులన్నీ మరణిస్తాయి. దీనివల్ల ఏర్పడే కాలుష్యాన్ని ఏమంటారు?

1) మెరైన్‌ పొల్యూషన్‌      2) థర్మల్‌ పొల్యూషన్‌      3) అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ పొల్యూషన్‌       4) ఆయిల్‌ స్పిల్‌ పొల్యూషన్‌ 


7. వ్యవసాయ ప్రాంతాల్లో అధికంగా వాడే ఎరువులు, క్రిమిసంహార మందులు; పరిశ్రమలు, మున్సిపాలిటీల నుంచి వెలువడే వ్యర్థాల వల్ల భూగర్భంలో ఏర్పడే కాలుష్యం?

1) మెరైన్‌ పొల్యూషన్‌      2) నాయిస్‌ పొల్యూషన్‌       3) థర్మల్‌ పొల్యూషన్‌      4) అండర్‌ గ్రౌండ్‌ వాటర్‌ పొల్యూషన్‌ 


8. ఆయిల్‌ స్పిల్స్‌కి సంబంధించి కిందివాటిలో సరైనవి?

1) జల కాలుష్య కారకాల్లో ఆయిల్‌ స్పిల్స్‌ అత్యంత ప్రమాదకరమైనవి.

2) జల మార్గాల ద్వారా ట్యాంకుల్లో రవాణ అవుతున్న నూనె పదార్థాలు లీక్‌ అవ్వడం వల్ల ఈ కాలుష్యం కలుగుతుంది. ఇవి తక్కువ సమయంలో ఎక్కువగా విస్తరిస్తాయి.

3) చమురు, ఇతర నూనె పదార్థాలు నీటి కంటే తేలికైనవి. ఇవి నీటి ఉపరితలంపై తేలుతూ ఉంటాయి. ఇవి  నీటిలో ఉన్న ఆక్సిజన్‌ శాతాన్ని తగ్గించి, జీవులకు హాని కలిగిస్తాయి. అంతేకాకుండా ఇవి వాయు, భూగర్భ జలాలను కూడా కలుషితం చేస్తాయి. 

4) పైవన్నీ

Posted Date : 27-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌