• facebook
  • whatsapp
  • telegram

రసాయనశాస్త్రం - మౌలికాంశాలు - 3  

1. బంగారం రసాయనిక సంకేతం?

   1) Bh     2) Au      3) Ag   4) Pt


2. తాగునీటిలో నైట్రేట్‌ అయాన్‌ ఎక్కువగా ఉంటే కలిగే వ్యాధి?

1) అనీమియా      2) ఫ్లోరోసిస్‌   

3) మినమాటా      4) మిథేమోగ్లోబినేమియా


3. 92 ఎలక్ట్రాన్‌లను కలిగిన అతి భారమైన సహజ మూలకం ఏది?

1) రేడియం     2) యురేనియం     3) కాల్షియం      4) బెరీలియం


4. వెజిటబుల్‌ నూనెల నుంచి వనస్పతి (డాల్డా)ని తయారుచేసే పద్ధతిలో ఉపయోగించే వాయువు ఏది?

1) ఆక్సిజన్‌      2) నైట్రోజన్‌    3) హైడ్రోజన్‌      4) ఫ్లోరిన్‌


5. కిందివాటిలో రసాయన శక్తిని విద్యుత్‌ శక్తిగా మార్చేది ఏది?

1) ఎలక్ట్రిక్‌ హీటర్‌     2) బ్యాటరీ    3) డైనమో     4) అణుబాంబు


6. కింది ద్రవాల్లో అత్యధిక సాంద్రత దేనికి ఉంది?

1) పాదరసం   2) నీరు  3) ఆల్కహాల్‌   4) కిరోసిన్‌


7. ఇనుము, క్రోమియం, నికెల్, కార్బన్‌లను  కలిగిన మిశ్రమ లోహాం?

1) ఇత్తడి    2) కంచు   3) మాగ్నాలియం  4) స్టెయిన్‌లెస్‌ స్టీల్‌


8. కిందివాటిలో దేన్ని అణురియాక్టర్‌లో ఇంధనంగా వాడతారు?

1) కార్బన్‌     2) పెట్రోల్‌   3) యురేనియం      4) లెడ్‌


9. తెల్ల స్పిరిట్‌ అని దేన్ని అంటారు?

1)శుభ్రపరిచిన ఇథనాల్‌     2) సంపూర్ణ ఇథైల్‌ ఆల్కహాల్‌

3) ప్లాటినం   4) పెట్రోలియం హైడ్రోకార్బన్‌ల మిశ్రమం


10. ఓజోన్‌ వాయువు ఏ రంగులో ఉంటుంది?

1) ఎరుపు   2) పసుపు    3) నీలం       4) ఆకుపచ్చ


11. కిందివాటిలో కిరణజన్యసంయోగక్రియకి అవసరమైనవి ఏవి?

1) నీరు, సూర్యరశ్మి     2)నీరు, కార్బన్‌ డైఆక్సైడ్‌

3)సూర్యరశ్మి, కార్బన్‌ డైఆక్సైడ్‌   4)నీరు, కార్బన్‌ డైఆక్సైడ్, సూర్యరశ్మి


12. కిందివాటిలో మెత్తటి మూలకం ఏది?

1) కాల్షియం   2)సోడియం   3) వెండి      4) అల్యూమినియం


13. కింది అంశాలను జతపరచండి.

హైడ్రోకార్బన్‌లు    సాధారణ ఫార్ములా

a) ఆల్కేన్‌       i) CnH2n

b) ఆల్కీన్‌       ii) CnH2n-2

c) ఆల్కైన్‌      iii) CnH2n+2

1) a-iii, b-i, c-ii       2) a-ii, b-i, c-iii

3) a-iii, b-ii, c-i      4) a-i, b-iii, c-ii


14. కింది అంశాలను జతపరచండి.

 జాబితా  - I         జాబితా  - II

a) పరమాణు  స్థిరత్వం      i)   క్యూరీ దంపతులు

b) రేడియం       ii) మైకేల్‌ ఫారడే

c) విద్యుత్‌ విశ్లేషణ      iii)  నీల్స్‌బోర్‌

1) a-iii, b-ii, c-i     2) a-ii, b-i, c-iii

3) a-iii, b-i, c-ii    4) a-i, b-iii, c-ii


15. ‘బనానా ఆయిల్‌’ని దేని నుంచి తయారుచేస్తారు?

1) ఆపిల్‌    2) అరటి పండు   3) పెట్రోలియం      4) నీరు


16. కింది ఏ రకం గాజుతో గ్లాసు బ్లోయింగ్‌ చేస్తారు?

1) గట్టి గాజు     2) పైరెక్స్‌ గాజు     3) సోడా గాజు    4) ఏదీకాదు


17.H3PO4 ఏ ఆమ్లం రసాయన ఫార్ములా?

1)ఫాస్ఫారిక్‌ ఆమ్లం     2) నైట్రిక్‌ ఆమ్లం 

3) హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం    4) కార్బోనిక్‌ ఆమ్లం


18. హేబర్‌ పద్ధతిలో అమ్మోనియా తయారీలో ఉపయోగించే వాయువు?

1) హైడ్రోజన్‌      2) నైట్రోజన్‌ 

3) హైడ్రోజన్, నైట్రోజన్‌      4) హైడ్రోజన్, ఆక్సిజన్‌


19. కిందివాటిలో సరైన స్థిరత్వ క్రమం ఏది?

1) HI > HBr > HCl > HF

2) HF > HCl > HBr > HI

3) HF > HBr > HI > HCl

4) HI > HCl > HBr > HF


20. కిందివాటిలో భారజలం రసాయన ఫార్ములా ఏమిటి?

  1) H2O     2) D2O   3) N2O   4) H2O2

21. శాశ్వత అయస్కాంతాలను తయారుచేసేందుకు ఉపయోగించే ఆల్‌నికో (AlNiCo) వేటి మిశ్రమం?

1) అల్యూమినియం     2) నికెల్‌    3) కోబాల్ట్‌         4) పైవన్నీ


22. కింది ఏ పదార్థం అయస్కాంతంతో వికర్షణ చెందుతుంది?

1) ఫెర్రో అయస్కాంత పదార్థం  

2) డయా అయస్కాంత పదార్థం

3) పారా అయస్కాంత పదార్థం 

4) పైవన్నీ


23. ఒక వస్తువు ఉపరితల వైశాల్యం పెరిగితే ఉష్ణాన్ని కోల్పోయే రేటు ఏమవుతుంది?

1) పెరుగుతుంది   2) తగ్గుతుంది   3) స్థిరంగా ఉంటుంది   4) కచ్చితంగా చెప్పలేం


24. నీటిపై కిరోసిన్‌ చల్లితే తలతన్యతలో ఎలాంటి మార్పు వస్తుంది?

1) పెరుగుతుంది    2) తగ్గుతుంది   3) స్థిరంగా ఉండదు    4)చెప్పలేం


25. నీటిలోని ఉప్పును వేరుచేసే పద్ధతి ఏది?

1) తేర్చుట  2) వడపోత    3) ఇగర్చడం    4) 1, 3


26. కింది ఏ నియమం ప్రకారం, ఏ రెండు ఎలక్ట్రాన్‌ల నాలుగు క్వాంటం సంఖ్యలు సమానం కావు?

1) హుండ్‌ నియమం     2) ఆఫ్‌బౌ నియమం 

3) పౌలీవర్జన నియమం   4) చార్లెస్‌ నియమం


27. కిందివాటిలో శూన్య ద్రవ్యరాశి ఉన్న కణం ఏది?

1) న్యూట్రాన్‌    2) ప్రోటాన్‌     3) 1, 2      4) న్యూట్రినో


                          

28.  అనేది ​​​​ఏ రకానికి చెందిన చర్య?

1) రసాయన సంయోగం   2) రసాయన వియోగం  

3) రసాయన ద్వంద్వ వియోగం   4) రసాయన స్థానభ్రంశం


29. కిందివాటిలో సరైంది ఏది?

i)  భౌతిక మార్పుల్లో భౌతిక ధర్మాల్లో మాత్రమే మార్పు జరుగుతుంది.

ii) రసాయన మార్పుల్లో పదార్థాల సంఘటనంలో మార్పు జరుగుతుంది.

1) i మాత్రమే      2) ii మాత్రమే   3) i, ii       4) ఏదీకాదు


30. కిందివాటిలో సంయోజనీయ పదార్థాలు ఏవి?

1) సోడియం క్లోరైడ్‌ (సాధారణ ఉప్పు)       2) నీరు    

3) మీథేన్‌   4) 2, 3


31. కిందివాటిలో ఇనుము ధాతువు ఏది?

1) హెమటైట్‌    2) మాగ్నటైట్‌    3) 1, 2    4) మాగ్నాలియం


32. కిందివానిలో s-బ్లాక్‌ మూలకం కానిది?

1) కాల్షియం     2) లిథియం   3)  పొటాషియం   4)టైటానియం


33. d-బ్లాక్‌ మూలకాల సాధారణ ఆక్సీకరణ స్థితి ఎంత?

1)  +1     2)  +2     3) +3     4) - 2


34. రేడియోధార్మికతని ప్రదర్శించే క్షార లోహం ఏది?

1) సీసియం   2)ఫ్రాన్షియం  3) బేరియం      4) యురేనియం


35. అరటిపండు బంధం కలిగిన అణువు ఏది?

1)అమ్మోనియా      2)  డైబోరేన్‌ 

3)  అల్యూమినియం క్లోరైడ్‌      4) బోరాన్‌ క్లోరైడ్‌


సమాధానాలు

1-2  2-4  3-2  4-3  5-2  6-1  7-4  8-3  9-4  10-3  11-4  12-2  13-1  14-3  15-3  16-2  17-1  18-3  19-2  20-2  21-4  22-2  23-1  24-2  25-3  26-3  27-4  28-1  29-3  30-4  31-3  32-4  33-2  34-2  35-2


మరికొన్ని..


1. కింది అంశాలను జతపరచండి.

జాబితా - I       జాబితా - II

a) క్వార్ట్జ్‌     i) కార్బన్‌ డైఆక్సైడ్‌

b) డ్రై ఐస్‌    ii) అల్యూమినియం ఆక్సైడ్‌

c)  కోరండమ్‌  iii) సిలికాన్‌ డైఆక్సైడ్‌

1) a-iii, b-ii, c-i   2) a-ii, b-iii, c-i      

3) a-iii, b-i, c-ii      4) a-i, b-iii, c-ii


2. చేతిలో ఉంచినప్పుడు ద్రవీభవనం చెందే ఘన లోహం ఏది?

1) బ్రోమిన్‌   2) పాదరసం    3) గాలియం    4) సోడియం


3. మంటలను ఆర్పే పైరిన్‌  (Pyrene)  రసాయన నామం?

1) క్లోరోఫాం      2) కార్బన్‌టెట్రాక్లోరైడ్‌ 

3) కార్బన్‌ డైక్లోరైడ్‌     4)కార్బన్‌ మోనాక్సైడ్‌


4. షుగర్‌ ఆఫ్‌ లెడ్‌ (Sugar of lead) అనే విష పదార్థ రసాయన ఫార్ములా, రసాయన నామం ఏమిటి?

1) Pb(CH3COO)2, లెడ్‌ ఎసిటేట్‌    2) PbO,లెడ్‌ ఆక్సైడ్‌

3) Pb(NO3)2 ,, లెడ్‌ నైట్రేట్‌    4) PbCl2, లెడ్‌ క్లోరైడ్‌


5. కిందివాటిలో సరైంది?

i) కర్పూరం ఆవిరిగా మారే ప్రక్రియను ఉత్పతనం అంటారు.

ii) వాయు స్థితిలోని పదార్థం ఘన స్థితికి మారడాన్ని నిక్షేపణం అంటారు.

1)  i మాత్రమే    2) ii మాత్రమే    3)  i, ii      4) ఏదీకాదు


6. విశ్వంలో హైడ్రోజన్‌ తర్వాత అత్యధికంగా లభించే మూలకం ఏది?

1)  ఆక్సిజన్‌   2) నైట్రోజన్‌     3) హీలియం  4) కాల్షియం


7. స్ట్రేంజర్‌ గ్యాస్‌ (Stranger gas)  అని ఏ జడవాయువును పిలుస్తారు?

1) హీలియం     2)  నియాన్‌     3) గ్జినాన్‌      4) క్రిప్టాన్‌


8. నీటిలో హైడ్రోజన్, ఆక్సిజన్‌ ఘన పరిమాణాత్మక నిష్పత్తి ఎంత?

1) 1 : 1     2) 2 : 1    3) 1 : 2     4) 1 : 3


9. సల్ఫర్‌ ట్రైఆక్సైడ్‌ + నీరు 

1) నైట్రిక్‌ ఆమ్లం   2) సల్ఫ్యూరిక్‌ ఆమ్లం

3)  ఫాస్ఫారిక్‌ ఆమ్లం   4) కార్బోనిక్‌ ఆమ్లం


10. కిందివాటిలో కార్బోహైడ్రేట్‌ కానిది ఏది?

1) సుక్రోజ్‌   2) ఫ్రక్టోజ్‌   3) లాక్టోజ్‌    4) గ్లైసిన్‌


సమాధానాలు


1-3  2-3  3-2  4-1  5-3  6-3  7-3  8-2  9-2  10-4

Posted Date : 18-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌