• facebook
  • whatsapp
  • telegram

రసాయన శాస్త్రం - మౌలిక అంశాలు -2

1. దంతాలపై ఎనామిల్‌ నిర్మాణానికి  ఉపయోగపడే ఖనిజ లవణం ఏది?

1) సోడియం   2) ఫ్లోరిన్‌    3) కాల్షియం    4) సల్ఫర్‌


2. పండ్లు త్వరగా పక్వానికి వచ్చేందుకు ఉపయోగపడేది?

1) సైటోకైనిన్లు  2) ఇథిలీన్‌   3) ఈస్ట్రోజెన్‌   4) మలాథియాన్‌


3. ఆధునిక రసాయనశాస్త్ర పితామహుడిగా ఎవరిని పేర్కొంటారు?

1) లెవోయిజర్‌    2) లూయిస్‌ పాశ్చర్‌   3) వోలర్‌   4) పాస్కల్‌


4. వర్షపు నీటిచుక్క గోళాకారంలో ఉండటానికి కారణం?

1) నీటి స్నిగ్ధత   2) నీటి తలతన్యత    3)  వాతావరణ పీడనం    4) నీటి ఉష్ణోగ్రత


5. పీవీసీ ప్లాస్టిక్‌ను కింది ఏ మోనోమర్ల నుంచి తయారుచేస్తారు?

1) ఇథిలీన్‌   2) ఐసోప్రిన్‌   3) వినైల్‌ క్లోరైడ్‌     4) పైవన్నీ


6. కిందివాటిలో ఆమ్ల వర్షాలకు కారణమయ్యే కాలుష్య కారకాలు ఏవి?

1) CO, CO2    2) CO2 , N2O      3) SO2 , NO2      4) O2 , N2


7. వెల్డింగ్‌ పనుల్లో ఉపయోగించే కర్బన వాయువు ఏది?

1) మీథేన్‌   2) ఈథేన్‌   3) ఎల్‌పీజీ   4) ఎసిటిలీన్‌


8. ఆభరణాల తయారీలో బంగారంతో పాటు ఏ లోహాన్ని కలుపుతారు?

1) సోడియం   2) రాగి     3) మెగ్నీషియం    4) జింక్‌


9. సాధారణ ఉప్పు (సోడియం క్లోరైడ్‌)లో ఉన్న రసాయన బంధం ఏది?

1) హైడ్రోజన్‌ బంధం    2)  అయానిక బంధం

3) సమయోజనీయ బంధం    4) సమన్వయ సమయోజనీయ బంధం


10. బాయిల్‌ నియమం ప్రకారం కిందివాటిలో సరైంది?

i) స్థిర ఉష్ణోగ్రత వద్ద వాయు పీడనం తగ్గితే ఘనపరిమాణం పెరుగుతుంది.

ii) స్థిర ఉష్ణోగ్రత వద్ద వాయు పీడనం తగ్గితే ఘనపరిమాణం తగ్గుతుంది.

1) i మాత్రమే   2) ii మాత్రమే     3) i, ii       4) ఏదీకాదు


11. ఛార్లెస్‌ నియమం ప్రకారం కిందివాటిలో సరైంది?

i) స్థిర పీడనం వద్ద వాయు ఘనపరిమాణం పరమ ఉష్ణోగ్రతకు విలోమానుపాతంలో ఉంటుంది.

ii) స్థిర పీడనం వద్ద వాయు ఘనపరిమాణం పరమ ఉష్ణోగ్రతకు అనులోమానుపాతంలో ఉంటుంది.

1) i మాత్రమే    2) ii మాత్రమే   3) i, ii    4) ఏదీకాదు


12. కిందివాటిలో  O2 అణువు ఏర్పడటానికి కారణమయ్యే బంధం?

1) అయానిక బంధం    2) సమయోజనీయ బంధం 

3) లోహ బంధం     4) సమన్వయ సమయోజనీయ బంధం


13. కిందివాటిలో ఆల్కలాయిడ్‌కు ఉదాహరణ ఏది?

1)  క్వినైన్‌   2) కెఫిన్‌    3) నికోటిన్‌    4) పైవన్నీ


14. కింది అంశాలను జతపరచండి.

   జాబితా- I         జాబితా  - II

a) 1 నానోమీటర్‌     i)  1000 సెం.మీ.3

b) 1 లీటర్‌     ii) 108 సెకన్లు

c) 1 షేక్‌     iii) 109 మీటర్‌

1) a - iii, b - i, c - ii     2) a - ii, b - i, c - iii

3) a - iii, b - ii, c - ‘i     4) a - ii, b - iii, c - i


15. 136C లోని న్యూట్రాన్ల సంఖ్య?

1) 6    2) 13    3) 7    4) 8


16. పాజిట్రాన్‌ ఆవేశానికి సంబంధించి కిందివాటిలో సరైంది?

i) ఎలక్ట్రాన్‌ ఆవేశానికి మూడు రెట్లు ఉంటుంది.

ii) ఎలక్ట్రాన్‌ ఆవేశానికి సమానం

iii) ధనావేశం

1)  iii మాత్రమే   2) i, ii    3) i, iii     4) ii, iii


17. కిందివాటిలో మూలకం కానిది ఏది?

1) గాలి  2) ఇత్తడి  3) రాగి  4) 1, 2


18. కిందివానిలో మిశ్రమం ఏది?

1) గాలి   2) సముద్ర జలం     3) 1, 2    4) ఇనుము


19. కింది ఏ మూలకానికి పరమాణు సంఖ్య, ద్రవ్యరాశి సంఖ్య సమానం?

1) కార్బన్‌    2) నైట్రోజన్‌    3) హైడ్రోజన్‌    4) ఆక్సిజన్‌


20. కింది ఏ నమూనాను గ్రహ మండల నమూనా అంటారు?

1) థామ్సన్‌ పరమాణు నమూనా 

2) బోర్‌ పరమాణు నమూనా 

3) రూథర్‌ఫర్డ్‌ పరమాణు నమూనా 

4) ఏదీకాదు


21. d - ఆర్బిటాల్‌ ఆకారం ఏమిటి?

1) స్తూపాకారం   2) గోళాకారం    3) డంబెల్‌      4) డబుల్‌ డంబెల్‌


22. పరమాణు సంఖ్యను ఏ అక్షరంతో  సూచిస్తారు?

  1) A    2) X     3) Z   4) M


23. కిందివాటిలో బలమైన ఆక్సీకరణి ఏదీ?

1) లిథియం   2) ఫ్లోరిన్‌   3) సోడియం     4) పొటాషియం


24. క్రియాజనకాల గాఢత పెరిగేకొద్దీ రసాయన చర్య వేగం.....

1) పెరుగుతుంది    2) తగ్గుతుంది   3) మారదు      4) కచ్చితంగా చెప్పలేం


25. కిందివాటిలో సరైంది?

i) ఉష్ణోగ్రత పెరిగితే రసాయన చర్యా వేగం పెరుగుతుంది.

ii) ఉత్ప్రేరకం రసాయన చర్యలో పాల్గొనకుండా చర్యా వేగాన్ని పెంచుతుంది.

1) i మాత్రమే   2) ii మాత్రమే    3) i, ii     4) ఏదీకాదు


26. వజ్రంలోని కార్బన్‌ పరమాణువుల మధ్య ఉన్న రసాయన బంధం ఏది?

1) అయానిక బంధం  2) హైడ్రోజన్‌ బంధం

3) సమయోజనీయ బంధం   4) లోహ బంధం


27. కింది అంశాలను జతపరచండి.

లోహం       ధాతువు

a) కోరండమ్‌     i) కాల్షియం

b) లైమ్‌స్టోన్‌      ii) సీసం

c) గెలీనా       iii) అల్యూమినియం

1) a - iii, b - ii, c - i     2) a - ii, b - i, c - iii

3) a - iii, b - i, c - ii     4) a - i, b - iii, c - ii


28. హార్న్‌సిల్వర్‌ ధాతువు రసాయన ఫార్ములా ఏమిటి?

1) NaCl    2) AgCl    3) AgNO3      4) NaNO3


29. కిందివాటిలో యురేనియం ధాతువు ఏది?

1) సెరుసైట్‌    2) బాక్సైట్‌     3) జింకైట్‌   4) పిచ్‌బ్లెండ్‌


సమాధానాలు

1-2  2-2  3-1  4-2  5-3  6-3  7-4  8-2  9-2  10-1  11-2  12-2  13-4  14-1  15-3  16-4  17-4  18-3  19-3  20-3  21-4  22-3  23-2  24-1  25-3  26-3  27-3  28-2  29-4


మరికొన్ని..


1. కింది ఏ పరీక్ష ద్వారా నైట్రేట్‌ అయాన్‌ను గుర్తిస్తారు.

1) బ్రౌన్‌ వలయ పరీక్ష    2) టోలెన్స్‌ పరీక్ష    

3) షిఫ్స్‌ పరీక్ష    4) సోడియం నైట్రోప్రూసైడ్‌ పరీక్ష


2. కింది ఏ వాయువు ఆకుపచ్చ రంగును ప్రదర్శిస్తుంది?

1) ఆక్సిజన్‌    2) నైట్రోజన్‌    3)  క్లోరిన్‌   4) అయోడిన్‌


3. విమానాల టైర్లలో కింది ఏ వాయువును నింపుతారు?

1) క్లోరిన్‌   2) హీలియం  3) ఫ్లోరిన్‌    4) గ్జినాన్‌


4. కిందివాటిలో హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ ఉపయోగం ఏమిటి?

1) బ్లీచింగ్‌ ఏజెంట్‌      2) యాంటీసెప్టిక్‌

3) 1, 2        4) మితకారి


5. కిందివాటిలో తెరిచిన పుస్తకం ఆకృతిని కలిగిన అణువు ఏది?

1) అమ్మోనియా   2) హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌

3) కార్బన్‌ డైఆక్సైడ్‌      4) నీరు


6. ద్రావణాల pH విలువను లెక్కించడానికి ఉపయోగించే సమీకరణం?



7. ఆమ్లాలు, క్షారాలతో చర్య జరిపి కింది వేటిని ఇస్తాయి?

1) నీరు     2) లవణం    3) 1, 2      4)పెరాక్సైడ్‌


8. కిందివాటిలో ఆమ్ల విరోధిగా దేన్ని ఉపయోగిస్తారు?

1) సోడియం హైడ్రాక్సైడ్‌    2) పొటాషియం హైడ్రాక్సైడ్‌ 

3) మెగ్నీషియం హైడ్రాక్సైడ్‌      4) మెగ్నీషియం ఆక్సాలేట్‌


9. డిటర్జెంట్‌ జల ద్రావణం ఏ స్వభావాన్ని కలిగి ఉంటుంది?

1) ఆమ్ల     2) క్షార    3) తటస్థ   4) ద్విస్వభావం


10. కిందివాటిలో సరైంది?

i) క్రోమోఫోర్‌ రంజనానికి రంగును కలిగిస్తుంది.

ii) ఆక్సోక్రోమ్‌ రంజనం రంగు తీవ్రతని పెంచుతుంది.

1) i మాత్రమే    2) ii మాత్రమే    3) i, ii      4) ఏదీకాదు


11. సబ్బు తయారీలో ఏర్పడే ఉత్పాదితం ఏది?

1) గ్లిజరాల్‌   2) క్లోరోఫాం    3) మీథేన్‌     4)  ప్రొపేన్‌


12. పిండి పదార్థ పరీక్షలో ఉపయోగించే రసాయనం ఏమిటి?

1) ఫ్లోరిన్‌   2) అయోడిన్‌    3) బ్రోమిన్‌    4) పొటాషియం


13. అయోడిన్‌ కలిగిన అమైనో ఆమ్లం ఏది?

1) గ్లైసిన్‌    2) ల్యూసిన్‌    3) థైరాక్సిన్‌    4) హిస్టడిన్‌


14. ఆల్డిహైడ్‌ను కింది దేనితో వేడి చేసినప్పుడు సిల్వర్‌ మిర్రర్‌ను ఏర్పరుస్తుంది?

1)బెనడిక్ట్‌ ద్రావణం   2)టోలెన్స్‌ ద్రావణం

3)ఫెయిలింగ్‌ ద్రావణం  4) బ్రైన్‌ ద్రావణం


15. కిందివాటిలో అత్యంత సరళమైన అమైనో ఆమ్లం ఏది?

1) గ్లైసిన్‌   2) హిస్టడిన్‌   3) వాలిన్‌   4) ఫినైల్‌ ఎలనిన్‌


16. కొవ్వుల్లో ఏ ప్రమేయ సమూహం ఉంటుంది?

1) ఎమైడ్‌     2) ఎస్టర్‌     3) ఆల్డిహైడ్‌     4) కీటోన్‌


సమాధానాలు

1 - 1   2 - 3   3 - 2   4 - 3   5 - 2   6 - 2   7 - 3   8 - 3  9 - 2   10 - 3 11 - 1 12 - 2 13 - 3 14 - 2 15 - 1 16 - 2

Posted Date : 18-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌