• facebook
  • whatsapp
  • telegram

రసాయనశాస్త్రం - మౌలిక అంశాలు

1. కింది వాటిలో దేనిలో వెండి ఉండదు?

1) జర్మన్‌ సిల్వర్‌    2) హార్న్‌ సిల్వర్‌    3) రూబీ సిల్వర్‌    4) పైవేవీ కావు


2. నైట్రోజన్‌ను కనుక్కున్న శాస్త్రవేత్త ఎవరు?

1) నీల్స్‌బోర్‌    2)డేనియల్‌ రూథర్‌ఫర్డ్‌    3) ఫ్రెడరిక్‌ వోలర్‌     4)జె.జె.థామ్సన్‌


3. కింది ఏ ఉష్ణోగ్రత వద్ద నీటి సాంద్రత అత్యధికంగా ఉంటుంది?

1) 0°C      2) 4°C   3) −4°C   4) 100°C


        

4. కింది వాటిని జతపరచండి.

  జాబితా - A        జాబితా -B

A. విద్యుత్‌ బల్బులోఫిలమెంట్‌    i) సిలికాన్‌

B. ఇ.సి.చిప్‌        ii) రాగి, జింక్‌

C. ఇత్తడి             iii) టంగ్‌స్టన్‌

1) A-iii, B-ii, C-i     2) A-ii, B-i, Ciii

3) A-iii, B-i, C-ii     4) A-i, B-iii, C-ii


5. బయోగ్యాస్‌లోని ముఖ్యమైన పదార్థం ఏది?

1)ఈథేన్‌    2) మీథేన్‌     3) ప్రొపేన్‌    4) హెక్సేన్‌


6. సాధారణ రబ్బర్‌ ఏ మోనోమర్‌ నుంచి తయారైన పాలిమర్‌?

1)వినైల్‌ క్లోరైడ్‌    2) ఐసోప్రిన్‌      3)ఇథలిన్‌    4) మీథేన్‌


7. కింది వాటిలో కృత్రిమ పోగులు ఏవి?

1) రేయాన్‌    2) పాలిస్టర్‌     3) నైలాన్‌    4) పైవన్నీ


8. మెండలీవ్‌ ఆవర్తన పట్టిక దేనిపై ఆధారపడి ఉంటుంది?

1) పరమాణు సంఖ్య    2) ఎలక్ట్రాన్ల సంఖ్య    3) పరమాణు భారం   4) 1, 3


9. కింది వాటిలో వేటిలో ధ్వని తరంగాలు ప్రయాణించలేవు?

1) శూన్యం      2) ఇత్తడి  3) గాలి      4) నీరు


10. కింది వాటిలో సరికాని జత?

1)భారజలం - డ్యుటీరియం ఆక్సైడ్      2) కాస్టిక్‌ సోడా - సోడియం హైడ్రాక్సైడ్‌

3)సున్నపురాయి - కాల్షియం సల్ఫేట్     4) లాఫింగ్‌ గ్యాస్‌ - నైట్రస్‌ ఆక్సైడ్‌


11. కింది వాటిని జతపరచండి.

  జాబితా - A           జాబితా - B

A)  అత్యంత చల్లబరచిన ద్రవం   i) గ్లూకోజ్‌

B) కర్బన సమ్మేళనం        ii) హైడ్రోజన్‌

C)  తేలికైన మూలకం   iii)  గాజు

1) A-ii, B-i, C-iii      2) A-i, B-ii, C-iii

3) A-iii, B-ii, C-i      4) A-iii, B-i, C-ii


12. కింది వాటిని జతపరచండి

 జాబితా - A       జాబితా - B

A) ఆల్కహాల్‌ తయారుచేసే పద్ధతి           i) హరితగృహ     వాయువులు

B) ఇనుము తుప్పు పట్టడం     ii)  కిణ్వప్రక్రియ

C) భూగోళం వేడెక్కడం  iii) ఆక్సీకరణ

1) A-ii, B-i, C-iii       2) A-i, B-iii, C-ii

3) A-ii, B-iii, C-i       4) A-iii, B-ii, C-i


13. విద్యుత్‌ వాహకత పరంగా రెండో  అత్యుత్తమ లోహం ఏది?

1)బంగారం     2) వెండి    3) జింక్‌      4) రాగి


14. శూన్యంలో కాంతి వేగం ఎంత?

1) 3 × 108 m/sec     2) 3 × 1010 cm/sec    3) 1, 2    4) 6 × 1023 cm/sec


15. డెసిబెల్‌ దేని కొలమానం?

1)కాంతి తీవ్రత    2) ధ్వని తీవ్రత    3)ధ్వని పౌనఃపున్యం     4) కాంతి పౌనఃపున్యం


16. సాధారణ ఉష్ణోగ్రత దగ్గర ద్రవరూపంలో ఉండే లోహం ఏది?

1) హీలియం    2) పాదరసం    3) బ్రోమిన్‌    4) క్లోరిన్‌


17. కింది వాటిలో విద్యుదయస్కాంత   తరంగాలు కానివేవి?

1) X-  కిరణాలు    2) ఆల్ఫా-కిరణాలు     3) బీటా-కిరణాలు    4)  2, 3


18. కింది వాటిలో ఆక్సిజన్‌ వాయువు లక్షణం.....

1) రంగు ఉండదు    2) వాసన ఉండదు     3) రుచి ఉండదు   4) పైవన్నీ


19. కింది వాటిలో ఫెర్రో అయస్కాంత పదార్థాలు...

1) ఇనుము     2) నికెల్‌    3) కోబాల్ట్‌     4) పైవన్నీ


20. అల్యూమినియం ఏ రకమైన అయస్కాంత పదార్థం?

1) ఫెర్రో    2) డయా    3) పారా    4)  యాంటీ -ఫెర్రో


21. అతివాహకత్వం అనే ధర్మాన్ని ప్రతిపాదించిన శాస్త్రవేత్త ఎవరు?

1) కామర్లింగ్‌ ఓన్స్‌   2) ఓల్టా    3) థామస్‌ ఆల్వా ఎడిసన్‌    4) జాన్‌ డాల్టన్‌


22. ట్రాన్సిస్టర్లలో ఉపయోగించే మూలకం..... 

1) నైట్రోజన్‌    2) రేడియం    3) సిలికాన్‌   4) బేరియం


23. కాస్మిక్‌ సంవత్సరం దేని ప్రమాణం?

1) ద్రవ్యరాశి    2) కాలం    3) దూరం    4) శక్తి


24. కింది వాటిలో సరైంది?

i) అణురియాక్టర్‌లో కాడ్మియాన్ని నియంత్రకంగా ఉపయోగిస్తారు.

ii) అణురియాక్టర్‌లోని న్యూట్రాన్‌ల వేగాన్ని తగ్గించడానికి గ్రాఫైట్‌ను ఉపయోగిస్తారు

1) i మాత్రమే   2) ii మాత్రమే   

3)  i, ii       4) పైవేవీ కావు


25. ప్రోటాన్, ఎలక్ట్రాన్‌ల ఆవేశాల నిష్పత్తి ఎంత?

1) 1 : 2     2)  2 : 1    3) 1 : 3    4) 1 : 1


26. కింది వాటిలో అత్యంత శక్తిమంతమైన  కిరణాలు ఏవి?

1) రేడియో తరంగాలు    2) కాస్మిక్‌ కిరణాలు

3) ఎక్స్‌-కిరణాలు     4) మైక్రోతరంగాలు


27. భారతదేశంలో నిర్మించిన తొలి అణు పరిశోధన రియాక్టర్‌ ఏది?

1)  అప్సర    2) తారాపూర్‌   3)  కల్పక్కం    4) నరోరా


28. నీటి ప్రవాహ రేటును కింది ఏ ప్రమాణాలతో నిర్ణయిస్తారు?

1) కిలోవాట్‌   2)  క్యూసెక్‌    3) పోయిజ్‌    4) నాట్‌


29. ‘ఓమ్‌’ ఏ భౌతికరాశి ప్రమాణం?

1) ప్రవాహ విద్యుత్‌  2) విద్యుత్‌ నిరోధం

3)  కాంతి తీవ్రత    4) స్నిగ్ధత


30. కింది వాటిని జతపరచండి.

 భౌతికరాశి         కొలిచే పరికరం

A.  అతిశీతల ఉష్ణోగ్రత       i) హైడ్రోమీటర్‌

B. ద్రవాల సాపేక్షసాంద్రత       ii) బాంబ్‌ కెలోరి  మీటర

C. పదార్థపు కెలోరిఫిక్‌విలువ    iii) క్రయోమీటర్‌

1) A-iii, B-ii, C-i      2) A-ii, B-i, C-iii

3) A-iii, B-i, C-ii      4) A-i, B-iii, C-ii


31. రామ్‌సర్‌ కన్వెన్షన్‌ దేనికి సంబంధించింది?

1)ఓజోన్‌పొర క్షీణత        2)మానవుడి ఆరోగ్యం   

3)పర్యావరణంలోని చిత్తడినేలల పరిరక్షణ       4) జంతువుల సంరక్షణ


32. వరల్డ్‌వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (WWF) దేనికి సంబంధించింది?

1)  భూగోళ సగటు ఉష్ణోగ్రత     2)  వన్యప్రాణుల సంరక్షణ

3)  ఓజోన్‌పొర క్షీణత        4)కాలుష్య రహిత ఇంధనాలు


సమాధానాలు


1 -1  2 - 2  3 - 2  4 - 3  5 - 2   6 - 2  7 - 4  8 - 3  9 - 1  10 - 3  11 - 4  12 - 3  13 - 4  14 - 3  15 - 2  16 - 2  17 - 4  18 - 4  19 - 4 20 - 3  21 - 1  22 - 3  23-2

24 -3  25 - 4  26 - 3  27 - 1  28 - 2  29- 2  30 - 3  31 - 3  32- 2 


మరికొన్ని..


1. కింది వాటిని జతపరచండి.

 జాబితా - A          జాబితా - B

A. చిప్కో ఉద్యమం      i) మేధాపాట్కర్‌

B. నర్మదా బచావో  ఆందోళన్‌     ii)  సుగతకుమారి

C. సైలెంట్‌ వ్యాలీ  ఉద్యమం    iii) సుందర్‌లాల్‌ బహుగుణ

1) A-ii, B-i, C-iii      2) A-iii, B- i, C-ii

3) A-i, B-iii, C-ii      4) A-iii, B-ii, C-i


2. భారతదేశంలో మొదటి పర్యావరణ ఉద్యమం ఏది?

1) సైలెంట్‌ వ్యాలీ ఉద్యమం    2)బిష్ణోయ్‌ ఉద్యమం

3) అప్పికో ఉద్యమం    4) నవ్‌ధాన్య ఉద్యమం


3. గ్రీన్‌పీస్‌ ఇంటర్నేషనల్‌ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది?

1) లండన్‌     2) ఆమ్‌స్టర్‌డామ్‌  3)మైసూర్‌      4) చైనా


4. ఇండియన్‌ ఇంక్‌ (Indian Ink) లో ఉన్న మూలకం ఏది?

1) బ్రోమిన్‌   2) కాపర్‌  3) కార్బన్‌   4)జింక్‌


5. బ్రౌన్‌క్లౌడ్‌ (Brown Cloud) అంటే ఏమిటి?

1) కాలుష్య పదార్థాలతో ఏర్పడిన పొర

2) అధిక వర్షాన్ని కురిపించే మేఘం

3) అత్యల్ప వర్షాన్ని కురిపించే మేఘం

4) బ్రోమిన్‌ అనే రసాయనాన్ని కలిగిన మేఘం


6. కింది వాటిని జతపరచండి

   జాబితా - A            జాబితా - B

A. ప్రపంచ జీవవైవిధ్య  దినోత్సవం    i) సెప్టెంబరు 16

B. ప్రపంచ ఓజోన్‌   దినోత్సవం     ii)  జూన్‌ 5 

C. ప్రపంచ పర్యావరణ దినోత్సవం   iii) మే 2 

1)A- ii, B-i, C-iii       2) A- iii, B - i, C- ii

3)  A- i, B- iii, C-ii       4)  A- iii, B- ii, C-i


7. పాల pH -  విలువ......

1)  8.0 - 8.4     2) 6.5 - 6.7    3)  4.5 - 4.7    4) 9.2 - 9.4


8. కింది వాటిలో సరైన వాక్యం ఏది?

i) సబ్బులోని కొవ్వు పదార్థ శాతం ఎంత ఎక్కువ ఉంటే సబ్బు నాణ్యత అంత ఎక్కువ

ii) మొదటి ప్రపంచ యుద్ధంలో ఉపయోగించిన యుద్ధవాయువు మస్టర్డ్‌ వాయువు

1)  i మాత్రమే   2)   ii మాత్రమే    3) i, ii         4) పైవేవీకాదు


సమాధానాలు

1 - 2  2 - 2  3 - 2  4 - 3  5 - 1  6 - 2  7 - 2  8 - 3 

Posted Date : 13-01-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌