• facebook
  • whatsapp
  • telegram

రసాయనశాస్త్రంలో కొన్ని మూలకాలు - ప్రాముఖ్యత

* అత్యధిక అయనీకరణ శక్తి ఉన్న మూలకం - హీలియం (He) 

* అత్యధిక లోహ స్వభావం ఉన్న మూలకం - సీసియం (Cs)

* అత్యధిక అలోహ స్వభావం కలిగిన మూలకం - ఫ్లోరిన్‌  (F)

* అత్యధిక రుణవిద్యుదాత్మకత గల మూలకం - ఫ్లోరిన్‌ (F)

* అత్యధిక ఎలక్ట్రాన్‌ ఎఫినిటీ ఉన్న మూలకం - క్లోరిన్‌ (Cl)

* వాతావరణంలో అత్యధికంగా ఉండే మూలకం - నైట్రోజన్‌ (N)

* వాతావరణంలో అత్యధికంగా లభించే మూలకాల్లో రెండోది - ఆక్సిజన్‌ (O)

* మానవ శరీరంలో అత్యధికంగా లభించే లోహం - కాల్షియం (Ca)

* భూమి పొరల్లో అత్యధికంగా లభించే మూలకం - ఆక్సిజన్‌ (O)

* భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహం - అల్యూమినియం (Al)

* భూమి పొరల్లో అత్యధికంగా లభించే లోహాల్లో రెండోది - ఇనుము (Fe)

* అత్యధిక ద్రవీభవన స్థానం కలిగిన లోహం - టంగ్‌స్టన్‌ (W)

* అత్యల్ప ద్రవీభవన ఉష్ణోగ్రత ఉన్న లోహం - పాదరసం (Hg) 

* అత్యధిక కాటనేషన్‌ సామర్థ్యం కలిగిన మూలకం - కార్బన్‌ (C)

* ప్రకృతిలో లభించే అతి తేలికైన లోహం - లిథియం (Li)

* వాతావరణంలో విరివిగా లభించే జడ వాయువు - ఆర్గాన్‌ (Ar)

* విశ్వంలో అత్యధికంగా లభించే మూలకం - హైడ్రోజన్‌ (H)

* తక్కువ పరమాణు వ్యాసార్ధం కలిగిన మూలకం - హీలియం (He)

* అత్యధిక పరమాణు వ్యాసార్ధం ఉన్న మూలకం - ఫ్రాన్షియం (Fr)

* అధిక ద్రవీభవన, బాష్పీభవన ఉష్ణోగ్రతలు ఉన్న అలోహం - కార్బన్‌ - డైమండ్‌ (C)

* ఫ్లోరిన్‌ తర్వాత అధిక రుణవిద్యుదాత్మకత కలిగిన మూలకం - ఆక్సిజన్‌ (O)

* అత్యధిక విద్యుత్‌ వాహకతను ప్రదర్శించే లోహం - వెండి (Ag)

* మానవుడు అతి విరివిగా ఉపయోగించే లోహం - ఇనుము (Fe)

* మంచి విద్యుత్‌ వాహకంగా పనిచేసే అలోహం - కార్బన్‌ - గ్రాఫైట్‌ (C) 

* నీటిలో నిల్వ చేసే మూలకం - ఫాస్ఫరస్‌ (P)

* కిరోసిన్‌లో నిల్వ చేసే మూలకాలు - సోడియం (Na), పొటాషియం (K)

* భూమిపై అతి అరుదుగా లభించే మూలకం - ఆస్టాటిన్‌ (At)

* ద్రవ స్థితిలోని అలోహం - బ్రోమిన్‌

* అధిక వక్రీభవన గుణకం ఉన్న మూలకం - డైమండ్‌ - కార్బన్‌ (C)

* అత్యధిక సాంద్రత కలిగిన మూలకం - ఆస్మియం (Os)

* అత్యల్ప సాంద్రత కలిగిన మూలకం - హైడ్రోజన్‌  (H)

* అత్యధిక సమ్మేళనాలను ఏర్పరిచే మూలకం - కార్బన్‌ (C)

* ద్రవస్థితిలోని లోహం - పాదరసం (Hg)

* ప్రకృతిలో దొరికే భారయుత మూలకం - యురేనియం (U)

* క్లోరోఫిల్‌లోని కేంద్రక లోహ ఆయాన్‌ - మెగ్నీషియం  (Mg)

* హీమోగ్లోబిన్‌లోని కేంద్రక లోహ అయాన్‌ - ఇనుము (Fe)

* జీవ పదార్థాల్లో ప్రధాన మూలకం - కార్బన్‌

* మూలకాల రారాజు - కార్బన్

* విటమిన్‌ B12 లోని కేంద్రక లోహ అయాన్‌ - కోబాల్ట్‌ (Co)

* సూర్యుడి వాతావరణంలో కనుక్కున్న జడవాయువు మూలకం - హీలియం (He)

* మానవ శరీరంలో అత్యధికంగా లభించే మూలకం - ఆక్సిజన్‌ (O)


ముఖ్యమైన కర్బన పదార్థాలు - వాటి రసాయన నామాలు


1) పొడిమంచు - ఘనకార్బన్‌ డైఆక్సైడ్‌ - CO2


2) మార్ష్‌వాయువు - మీథేన్‌ - CH4 


3) సహజ వాయువు - మీథేన్‌ - CH4


4) వెనిగర్‌ - ఎసిటిక్‌ ఆమ్లం - CH3COOH


5) గమాక్సిన్‌ - బెంజీన్‌ హెక్సాక్లోరైడ్‌ - C6H6Cl6


6) బాష్ప వాయువు - క్లోరోపిక్రిన్‌ - CCl3NO2 


7) ఫ్రియాన్‌ - డైక్లోరోడైఫ్లోరోమీథేన్‌ - CCl2F2


8) ఉడ్‌ ఆల్కహాల్‌ - మిథైల్‌ ఆల్కహాల్‌ - CH3OH 


9) అబ్సల్యూట్‌ ఆల్కహాల్‌ - ఇథైల్‌ ఆల్కహాల్‌   - C2H5OH


10) బ్లడ్‌ షుగర్‌ - గ్లూకోజ్‌ - C6H12O6


11) టేబుల్‌ షుగర్‌ - సుక్రోజ్‌ - C12H22O11


12) గ్రేప్‌ షుగర్‌ - గ్లూకోజ్‌ - C6H12O6


13) పండ్ల చక్కెర (ఫ్రూట్‌ షుగర్‌) - ఫ్రక్టోజ్‌   - C6H12O6


14) కేన్‌ షుగర్‌/ రెడ్‌ షుగర్‌ - సుక్రోజ్‌ - C12H22O11


15) మిల్క్‌ షుగర్‌ - లాక్టోజ్‌ - C12H22O11


16) మాల్ట్‌ షుగర్‌ - మాల్టోజ్‌ - C12H22O11


17) ఎసిటోన్‌ - 2ప్రొపనోన్‌ - C3H6O


18) క్లోరోఫాం - ట్రైక్లోరోమీథేన్‌ - CHCl3

కొన్ని ముఖ్యమైన మిశ్రమాలు

కార్బోజెన్‌: 90% ఆక్సిజన్‌ + 10% కార్బన్‌ డైఆక్సైడ్‌

గన్‌పౌడర్‌: పొటాషియం నైట్రేట్‌ (KNO3) + చార్‌కోల్‌ (C) + సల్ఫర్‌ (S)

లిథోపోన్‌: బేరియంసల్ఫేట్‌ + జింక్‌ సల్ఫైడ్‌

అమ్మోనాల్‌: అమ్మోనియం నైట్రేట్‌ (NH4NO3) + పొడి అల్యూమినియం (Al)

అమ్మోటాల్‌: అమ్మోనియం నైట్రేట్‌ (NH4NO3) + ట్రైనైట్రోటోలిన్‌

ఆక్వారీజియా లేదా ద్రవరాజం: 


3 భాగాల గాఢ హైడ్రోక్లోరిక్‌ ఆమ్లం (HCl) + 1 భాగం గాఢ నైట్రిక్‌ ఆమ్లం (HNO3)

హిమీకరణ మిశ్రమం (ఫ్రీజింగ్‌ మిశ్రమం):

లవణం + మంచు

నైట్రోలియం: కాల్షియం సయనమైడ్‌ (CaCN2) + గ్రాఫైట్‌ (C)

సోడాలైమ్‌: సోడియం హైడ్రాక్సైడ్‌ (NaOH) + కాల్షియం ఆక్సైడ్‌ (CaO)

జ్వలన మిశ్రమం లేదా థర్మైట్‌ మిశ్రమం: 

3 భాగాల లోహ ఆక్సైడ్‌ + 1 భాగం పొడి అల్యూమినియం 

గలన మిశ్రమం: 

సోడియం కార్బొనేట్‌ (Na2CO3) + పొటాషియం కార్బొనేట్‌ (K2CO3)

టింక్చర్‌ ఆఫ్‌ అయోడిన్‌ = అయోడిన్‌ (I2) + పొటాషియం అయోడైడ్‌ (KI) + ఇథైల్‌ ఆల్కహాల్‌ (C2H5OH)

నైట్రేషన్‌ మిశ్రమం: గాఢ సల్ఫ్యూరిక్‌ ఆమ్లం (H2SO4) + గాఢ నైట్రిక్‌ ఆమ్లం (HNO3)

పవర్‌ ఆల్కహాల్‌: 80% పెట్రోల్‌ + 20% ఇథైల్‌ ఆల్కహాల్‌

రెక్టిఫైడ్‌ స్పిరిట్‌: 96% ఇథైల్‌ ఆల్కహాల్‌ + 4% నీరు

సూపర్‌ ఫాస్ఫేట్‌ ఆఫ్‌ లైమ్‌: కాల్షియం డైహైడ్రోజన్‌ ఫాస్ఫేట్‌ + జిప్సం

వాటర్‌ గ్యాస్‌: కార్బన్‌మోనాక్సైడ్‌ (CO) + హైడ్రోజన్‌ (H2)

ప్రొడ్యూసర్‌ గ్యాస్‌: కార్బన్‌మోనాక్సైడ్‌ + హైడ్రోజన్‌ వాయువు (H2) + నైట్రోజన్‌ వాయువు (N2) + కార్బన్‌ డైఆక్సైడ్‌ (CO2)

సెమీవాటర్‌ గ్యాస్‌: వాటర్‌ గ్యాస్‌ + ప్రొడ్యూసర్‌ గ్యాస్‌

LPG గ్యాస్‌: బ్యూటేన్‌ + ప్రొపేన్‌

Posted Date : 22-09-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌