• facebook
  • whatsapp
  • telegram

అనలిటికల్‌ పజిల్స్‌

 ఏపీపీఎస్సీ నిర్వహించే వివిధ పోటీ పరీక్షల్లో రీజనింగ్‌ విభాగానికి సంబంధించి అనలిటికల్‌ పజిల్స్‌ అనే అంశం నుంచి ప్రశ్నలు వస్తాయి. అభ్యర్థులు ఇచ్చిన సమాచారాన్ని జాగ్రత్తగా విశ్లేషించి, సమస్యలోని నియమాలకు అనుగుణంగా, సంక్షిప్తంగా క్రోడీకరించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాబట్టాలి.
                                                                   

మాదిరి ప్రశ్నలు
 

1. A, B, C, D, F అనే అయిదు పట్టణాలు అందమైన పూలతోటలు, ఆభరణాలు, విద్యాసంస్థలు, శిల్ప కళాఖండాలు, సుగంధ ద్రవ్యాలకు పేరుగాంచాయి. కానీ అదే క్రమంలో కాదు.

I. A, C లు విద్యాసంస్థలు, పూలతోటలకు ప్రసిద్ధి చెందినవి కావు.

II. B, E లు ఆభరణాలు, శిల్ప కళాఖండాలకు ప్రసిద్ధి చెందినవి కావు.

III. A సుగంధ ద్రవ్యాలు, ఆభరణాలకు ప్రసిద్ధి చెందనిది.

IV. D, E లు పూలతోటలు, ఆభరణాలకు ప్రసిద్ధి చెందినవి కావు.

V. D విద్యా సంస్థలకు ప్రసిద్ధి చెందనిది.


1. కిందివాటిలో అందమైన పూలతోటలకు ప్రసిద్ధి చెందిన పట్టణం?

ఎ) A     బి) C         సి) D        డి) D


2. కిందివాటిలో శిల్ప కళాఖండాలకు ప్రసిద్ధి చెందిన పట్టణం?

ఎ) A     బి) C         సి) E         డి) B


3. పట్టణం C దేనికి పేరుగాంచింది?

ఎ) ఆభరణాలు        బి) విద్యాసంస్థలు          సి) శిల్ప కళాఖండాలు        డి) సుగంధ ద్రవ్యాలు


వివరణ: పై దత్తాంశాన్ని క్రోడీకరించగా

పై పట్టిక ఆధారంగా

సమాధానాలు: 1-డి, 2-ఎ, 3-ఎ.
 

2. A, B, C, D, E, F, G అనేవి రెండు నదులు, మూడు కాలువలు, రెండు లోయల పేర్లు.

I. B, G, D లు కాలువలు కావు.

II. C కాలువను, A లోయను సూచిస్తాయి.

III. B, F, G లు లోయలు కావు.

1. కిందివాటిలో నదులు ఏవి?

ఎ) A, D        బి) B, D        సి) B, G          డి) A, G

2. కిందివాటిలో కాలువలు?

ఎ) A, C, E         బి) C, E, F          సి) A, C, F         డి) E, F, G

3. కిందివాటిలో లోయలు ఏవి?

ఎ) A, D          బి) D, E           సి) D, G        డి) A, B

వివరణ: పై దత్తాంశాన్ని క్రోడీకరించగా

 

పై పట్టిక నుంచి

సమాధానాలు: 1-సి, 2-బి, 3-ఎ.
 

3. A, B, C, D, E, F, G లు మిత్రులు. వారు ఆర్థికవేత్త, టెర్మినల్‌ ఆపరేటర్, వ్యవసాయాధికారి, ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారి, క్లర్క్, ఫారెక్స్‌ అధికారి, రిసెర్చ్‌ అనలిస్ట్‌గా L, M, N, O, P, Q, R, Sఅనే బ్యాంకుల్లో పని చేస్తున్నారు. కానీ పై క్రమంలో కాదు. C అనే వ్యక్తి N బ్యాంకులో పని చేస్తున్నాడు కానీ అతడు రిసెర్చ్‌ అనలిస్ట్, క్లర్క్‌ కాదు. E అనే వ్యక్తి R బ్యాంకులో ఇన్‌కమ్‌ట్యాక్స్‌ అధికారిగా పనిచేస్తున్నాడు. A అనే వ్యక్తి ఫారెక్స్‌ అధికారిగా పనిచేస్తున్నాడు కానీ L, Q బ్యాంకుల్లో కాదు. వ్యవసాయాధికారి బ్యాంకు Mలో, టెర్మినల్‌ ఆపరేటర్‌ బ్యాంకు L లో పనిచేస్తున్నారు. F అనే వ్యక్తి Q బ్యాంకులో పని చేస్తున్నాడు. G అనే వ్యక్తి P బ్యాంకులో రిసెర్చ్‌ అనలిస్ట్‌. D వ్యవసాయాధికారి కాదు.
1. కిందివారిలో వ్యవసాయాధికారి?
ఎ) C     బి) B        సి) F         డి) D
2. D అనే వ్యక్తి ఏ బ్యాంకులో పనిచేస్తున్నాడు?
ఎ) Q        బి) L          సి) N        డి) S
3. C వృత్తి ఏమిటి?
ఎ) టెర్మినల్‌ ఆపరేటర్‌          బి) వ్యవసాయాధికారి       సి) ఆర్థికవేత్త         డి) నిర్ధారించలేం
4. కిందివారిలో క్లర్క్‌గా పనిచేస్తున్నవారు?
ఎ) C        బి) B           సి) F       డి) D
5. కిందివాటిలో సరైంది. (వ్యక్తి - వృత్తి - బ్యాంకు)
ఎ) A - ఫారెక్స్‌ అధికారి - M     బి) D - క్లర్క్‌ - L      సి) F - వ్యవసాయాధికారి - Q          డి) ఏదీకాదు
వివరణ:
దత్తాంశాన్ని క్రోడీకరించగా

 

పై పట్టిక నుంచి
సమాధానాలు: 1-బి, 2-బి, 3-సి, 4-సి, 5-డి.

 

4. A, B, C, D లు నలుగురు మిత్రులు.
I. A, B లు ఫుట్‌బాల్, క్రికెట్‌ ఆడతారు.
II. B, C లు క్రికెట్, హాకీ ఆడతారు.
III. A, D లు బాస్కెట్‌బాల్, ఫుట్‌బాల్‌ ఆడతారు.
IV. C, D లు హాకీ, బాస్కెట్‌బాల్‌ ఆడతారు.
1. కిందివారిలో హాకీ ఆడనివారు?
ఎ) D      బి) C        సి) B           డి) A
2. కిందివారిలో ఫుట్‌బాల్, బాస్కెట్‌బాల్, హాకీ ఆడేవారు?
ఎ) D         బి) C         సి) B          డి) A
వివరణ: పై దత్తాంశాన్ని క్రోడీకరించగా

సమాధానాలు: 1-డి, 2-ఎ.
 

5. A, B, C, D, E õª P, Q, R, S, T అనే అయిదు పట్టణాలకు చెందినవారు కానీ ఇదే క్రమంలో కాదు. ఒక్కో వ్యక్తి ఒక్కో పట్టణానికి చెందినవారు.
I. B, C లు Q పట్టణానికి చెందినవారు కాదు.
II. B, E లు P, Q పట్టణాలకు చెందినవారు కాదు.
III. A, C లు R, S, T పట్టణాలకు చెందినవారు కాదు.
IV. D, E లు Q, T పట్టణాలకు చెందినవారు కాదు.
1. కిందివాటిలో సరైంది?
ఎ) P పట్టణానికి చెందిన వ్యక్తి C          బి) R పట్టణానికి చెందిన వ్యక్తి D
సి) Q పట్టణానికి చెందిన వ్యక్తి A         డి) S పట్టణానికి చెందిన వ్యక్తి B
వివరణ: పై దత్తాంశాన్ని క్రోడీకరించగా

సమాధానం: 1-డి.
 

6. A, B, C లు నలుపు, నీలం, ఆరెంజ్‌ కలర్‌ షర్టులను వేసుకుంటారు కానీ ఈ క్రమంలో కాదు. వారు ఆకుపచ్చ, పసుపు, ఆరెంజ్‌ కలర్‌ ప్యాంట్‌లను వేసుకుంటారు కానీ ఈ క్రమంలో కాదు. ఏ ఒక్క వ్యక్తి ఒకే రంగున్న ప్యాంట్, షర్టులను ధరించరు.
I. A నలుపు రంగు షర్టు వేసుకోడు III. C ఆరెంజ్‌ రంగు షర్టు వేసుకోడు
II. B నీలం రంగు షర్టు వేసుకోడు IV. B ఆరెంజ్‌ రంగు ప్యాంట్‌ వేసుకుంటాడు
1. C ఏ రంగు గల ప్యాంట్, షర్టు వేసుకుంటాడు?
ఎ) ఆరెంజ్, నలుపు    బి) ఆకుపచ్చ, నీలం     సి) పసుపు, నీలం     డి) పసుపు, నలుపు
వివరణ: పై దత్తాంశాన్ని క్రోడీకరించగా

సమాధానం: 1-సి.
 

7. రాజ్, సుందర్, తరుణ్, వరుణ్‌లు రేఖ, సునీత, తార, ఉమలను వివాహం చేసుకుని రాంపూర్, సాంచీ, తిరుపతి, ఉదంపూర్‌లలో నివసిస్తున్నారు.
I. యువకులు, వారి భార్యలు, వారు నివసిస్తున్న పట్టణాల పేర్లలోని మొదటి అక్షరాలు వేరుగా ఉంటాయి.
II. రాజ్‌ భార్య సునీత కాదు.
III. సుందర్‌ రాంపూర్, ఉదంపూర్‌లలో నివసించడు. అతడు రేఖ భర్త కాదు.
IV. వరుణ్, తార సాంచీలో నివసించరు.
1. తరుణ్‌ భార్య, వారు నివసిస్తున్న పట్టణం?
ఎ) సునీత, తిరుపతి    బి) తార, సాంచీ     సి) ఉమ, రాంపూర్‌     డి) రేఖ, సాంచీ
2. కిందివారిలో సరైన భార్యాభర్తల జంట?
ఎ) వరుణ్‌ - సునీత    బి) రాజ్‌ - తార     సి) సుందర్‌ - ఉమ     డి) అన్నీ
వివరణ:
పై దత్తాంశాన్ని క్రోడీకరించగా

పై పట్టిక నుంచి

సమాధానాలు: 1-డి, 2-డి.

Posted Date : 06-10-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌