• facebook
  • whatsapp
  • telegram

జీవన సాంకేతిక బయోటెక్నాలజీ

మాదిరి ప్రశ్నలు


1. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ఫెర్మెంటేషన్‌/ కిణ్వన ప్రక్రియ - లూయిస్‌ పాశ్చర్‌  బి) డీఎన్‌ఏ డబుల్‌ హెలికల్‌ మోడల్‌ - వాట్సన్, క్రిక్‌ 

సి) జెనెటిక్‌ ట్రిప్లెట్‌ కోడ్‌ - హరి గోబింద్‌ ఖొరానా 

1) ఎ, బి    2) బి, సి   3) ఎ, సి   4) పైవన్నీ


2. జీవసాంకేతిక పరిజ్ఞానశాస్త్రం కింది వేటితో సంయుక్తంగా పనిచేస్తుంది?

1)  బయో కెమిస్ట్రీ      2) సెల్‌ బయాలజీ 

3) మాలిక్యులర్‌ బయాలజీ    4) పైవాటన్నింటితో


3. మానవుడిలో ఒక తరం నుంచి మరో తరానికి లక్షణాలను తీసుకుపోయే కణాలను ఏమంటారు? (ఇవి అనువంశికతకు ఆధారం) 

1) క్యారియర్లు    2) కణాంగాలు  3) జన్యువులు    4) కణజాల వర్ధనం చేసిన కణాలు 


4. జీవుల్లో వంశపారంపర్యంగా అనువంశిక లక్షణాలు ఒక తరం నుంచి మరో తరానికి జన్యువుల ద్వారా మార్పిడి అవుతాయి. దీన్ని ఏ శాస్త్రవేత్త ధ్రువీకరించారు? (ఈయన బఠానీ మొక్కపై పరిశోధనలు చేసి ఈ విషయాన్ని కనుక్కున్నారు.)

1)  గ్రెగర్‌ జాన్‌ మెండల్‌      2)  జీన్‌ బాప్టిస్ట్‌ లామార్క్‌     3) చార్లెస్‌ డార్విన్‌       4)  టి.హెచ్‌.మోర్గాన్‌ 


5. జీవ పరిణామక్రమంలో ఉత్పరివర్తనాలు (మ్యుటేషన్స్‌) అత్యంత కీలకపాత్ర పోషిస్తాయని కనుక్కున్న శాస్త్రవేత్త? 

1) జాన్‌ మెండల్‌  2) హ్యూగో డివ్రీస్‌    3) బీడేల్, టాటమ్‌      4)  వాట్సన్, క్రిక్‌


6. మెండెలియన్‌ కారకాలకు ‘జన్యువు’(gene)అని పేరుపెట్టిన శాస్త్రవేత్త?

1) విలియం జాన్సెన్‌      2)  రాబర్ట్‌ డబ్ల్యూ. హొలే

3)  హెర్మన్‌ జోసెఫ్‌ ముల్లర్‌      4) వాట్సన్‌ 


7. జన్యుశాస్త్ర పితామహుడు (ఫాదర్‌ ఆఫ్‌ జెనెటిక్స్‌) అని ఎవరిని పిలుస్తారు? 

1) గ్రెగర్‌ జాన్‌ మెండల్‌      2)వాట్సన్‌     3)క్రిక్‌          4) అలెగ్జాండర్‌ 


8. అనువంశికతను వంశపారంపర్యంగా సంక్రమింపజేసే జన్యువులు వేటిపై ఉంటాయి? 

1) ప్లాస్మాపొర         2) కణ ద్రవ్యం    3) మైటోకాండ్రియా    4) క్రోమోజోమ్స్‌ 


9. జీవుల్లో ప్రోటీన్‌ సంశ్లేషణను చేపట్టే జన్యుపదార్థం?

1) డీఎన్‌ఏ    2) ఆర్‌ఎన్‌ఏ  3) 1, 2     4) ఏదీకాదు


10. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏల మధ్య వ్యత్యాసానికి సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ) డీఎన్‌ఏ రెండు వరుసలు కలిగిన డబుల్‌ స్టాండర్డ్‌ నిర్మాణం. ఆర్‌ఎన్‌ఏ ఒకే వరస కలిగిన సింగిల్‌ స్టాండర్డ్‌  నిర్మాణం.

బి) డీఎన్‌ఏ డీఆక్సీరైబోజ్‌ చక్కెరను కలిగి ఉంటుంది. ఆర్‌ఎన్‌ఏ ఆక్సీరైబోజ్‌ చక్కెరను కలిగి ఉంటుంది. 

సి) డీఎన్‌ఏలో అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, థైమిన్‌ ఉంటాయి. ఆర్‌ఎన్‌ఏలో అడెనిన్, గ్వానిన్, సైటోసిన్, యురాసిల్‌ ఉంటాయి.

1) ఎ, బి      2) ఎ, సి      3) బి, సి      4) పైవన్నీ


11. మానవుడిలో రక్తం గడ్డ కట్టకుండా వంశపారంపర్యంగా సంక్రమించే వ్యాధి ఏది? 

1) హిమోఫీలియా     2) ఫినాయిల్‌ కీటోన్యూరియా     3)తలసేమియా   4) ఎనీమియా 


12. ప్రపంచ హిమోఫీలియా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు?

1) ఏప్రిల్‌ 16      2)  ఏప్రిల్‌ 17   3) ఏప్రిల్‌ 18    4)  ఏప్రిల్‌ 19


13. కిందివాటిలో బయోటెక్నాలజీ ఉత్పత్తులను గుర్తించండి.

1) వ్యాక్సిన్లు    2) యాంటీబయాటిక్స్‌    3) 1, 2   4) బ్యాక్టీరియా 


14. కింది ఏ భారత సంతతి శాస్త్రవేత్త ప్రయోగశాలలో కృత్రిమ జన్యువును మొదటిసారి ఈస్ట్‌ ఆర్‌ఎన్‌ఏ నుంచి తయారు చేశారు?

1) హర్‌ గోబింద్‌ ఖొరానా   2) వెంకట్‌ రామన్‌  

3) నోరి దత్తాత్రేయుడు   4)  శ్రీనివాస రామానుజన్‌ 


15. మానవుడిలో ఎన్ని జతల క్రోమోజోమ్‌లు ఉన్నాయి?

1) 46     2) 23    3)22   4) 44 


16. అనువంశికతకు ఎంతో కీలకమైన డీఎన్‌ఏ సంశ్లేషణ పద్ధతిని ఏమంటారు?

1)  ప్రతిరూపం(Replication)    2)లిప్యంతరీకరణ (Transcription)

3) Reverse Transcription       4)  ప్రోటీన్‌ సంశ్లేషణ (Protein Synthesis)


17. డీఎన్‌ఏ, ఆర్‌ఎన్‌ఏలను ఉపయోగించి ప్రోటీన్లను తయారు చేసే పద్ధతిని ఏమంటారు? 

1) ప్రోటీన్‌ సింథసిస్‌      3) డీఎన్‌ఏ రిప్లికేషన్‌    3)  డీఎన్‌ఏ పాలిమరైజేషన్‌      4) లిపిడ్‌ సింథసిస్‌


సమాధానాలు


1-4  2-4  3-3  4-1  5-2  6-1  71  8-4  9-2

 10-4  11-1  12-2  13-3  14-1  15-2  16-1  17-1


 

Posted Date : 01-06-2023

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌