• facebook
  • whatsapp
  • telegram

చక్రవడ్డీ (Compound Interest)

చక్రవడ్డీలో అసలును స్థిరంగా ఉంచకుండా, వడ్డీని లెక్కిస్తారు. దీన్ని వడ్డీపై వడ్డీగా పేర్కొంటారు.

చక్రవడ్డీ ప్రకారం,

చక్రవడ్డీ (CI) = మొత్తం (A) - అసలు (P)

ఇక్కడ, శి = అసలు

R = ఏడాదికి అయ్యే వడ్డీరేటు

 n = వడ్డీ లెక్కించే పర్యాయాల సంఖ్య

* ఒక సంవత్సర కాలంలో సరళవడ్డీ, చక్రవడ్డీలు సమానం. 

మాదిరి ప్రశ్నలు

1. రూ.2000 పై 5% వడ్డీరేటు చొప్పున 2 సంవత్సరాల్లో చెల్లించాల్సిన చక్రవడ్డీ ఎంత?

1) రూ.205     2 రూ.210 

3) రూ.245     4) రూ.230

సాధన: 

సమాధానం: 1 

2. రూ.7500 పై 20% వడ్డీరేటు చొప్పున రెండున్నరేళ్ల సమయంలో అయ్యే చక్రవడ్డీ ఎంత?

1) రూ.4280      2) రూ.4180 

3) రూ.4380      4) రూ.4260

సాధన: 

సమాధానం: 3

3. రూ.6000 పై 10% వడ్డీరేటు చొప్పున ఒకటిన్నర సంవత్సరంలో అయ్యే చక్రవడ్డీ ఎంత?

1) రూ.930      2) రూ.945 

3) రూ.960      4) రూ.970

సాధన: 

సమాధానం: 1

4. ఒక వ్యక్తి రూ.10,000 పై 20% వడ్డీరేటు చొప్పున అర్ధ సంవత్సరానికి ఒకసారి లెక్కించాడు. అయితే ఒక సంవత్సర కాలంలో అయ్యే చక్రవడ్డీ ఎంత?

1) రూ.2000      2) రూ.2100 

3) రూ.2200      4) రూ.2300

సాధన: 

సమాధానం: 2

5. రూ.10,000 పై మొదటి ఏడాది 5%, రెండో సంవత్సరం 10% చొప్పున రెండేళ్ల తర్వాత అయ్యే చక్రవడ్డీ ఎంత?

1) రూ.1600      2) రూ.1500 

3) రూ.1575      4) రూ.1550

సాధన:

సమాధానం: 4

6. ఒక వ్యక్తి కొంత సొమ్మును చక్రవడ్డీ ప్రకారం 10% వడ్డీరేటుతో 2 సంవత్సరాలకు అప్పుగా తీసుకున్నాడు. అతడు చెల్లించిన మొత్తం రూ.2178. అయితే అసలు ఎంత?

1) రూ.1800      2) రూ.1600 

3) రూ.1700      4) రూ.1500

సాధన:  

సమాధానం: 1

7. రాజేష్‌ కొంత సొమ్మును చక్రవడ్డీ ప్రకారం 5% వడ్డీరేటు చొప్పున 3 సంవత్సరాల కాలానికి అప్పుగా తీసుకున్నాడు. అతడు చెల్లించిన మొత్తం రూ.9261. అయితే రాజేష్‌ అప్పుగా తీసుకున్న అసలు ఎంత?

1) రూ.7500      2) రూ.8500 

3) రూ.7600      4) రూ.8000

 సాధన: 

సమాధానం: 4

8. ఒక వ్యక్తి రూ.6000 పై 10% వడ్డీరేటు చొప్పున చక్రవడ్డీ వేస్తే, అది ఎంత కాలంలో రూ.7260 అవుతుంది?

1) 1 సం.     2) 2 సం. 

3) 3 సం.     4) 4 సం.

సాధన:

సమాధానం: 2

9. రవి రూ.6250 ని అప్పుగా తీసుకున్నాడు.  రెండేళ్లలో ఆ మొత్తం రూ.7840 అయ్యింది.  అయితే చక్రవడ్డీ రేటు ఎంత?

1) 10%  2) 14%  3) 15%  4) 12%

సాధన: 

సమాధానం: 4

గమనిక: రెండు వరుస సంవత్సరాలకు చక్రవడ్డీ ఇచ్చినప్పుడు,

* చక్రవడ్డీ ప్రకారం కొంత సొమ్ము మూడేళ్లలో రూ.800, నాలుగేళ్ల కాలంలో రూ.840 అయితే వడ్డీరేటు ఎంత?

1) 5%    2) 6%    3) 8%    4) 10%

సాధన: 

సమాధానం: 1

చక్రవడ్డీ, బారువడ్డీల మధ్య సంబంధం


* కొంత సొమ్ము (P) పై, R% వడ్డీరేటు చొప్పున రెండేళ్ల కాలంలో అయిన చక్రవడ్డీ, బారువడ్డీల మధ్య భేదం

* కొంత సొమ్ము (P) పై, R% వడ్డీరేటు చొప్పున  మూడేళ్ల కాలంలో అయిన చక్రవడ్డీ, బారువడ్డీల మధ్య భేదం

i రూ.18000 పై ఏడాదికి 15% వడ్డీరేటు చొప్పున 2 సం.లకు చక్రవడ్డీ,  బారువడ్డీల మధ్య వ్యత్యాసం ఎంత?

1) రూ.400      2) రూ.405  

3) రూ.450      4) రూ.505

సాధన:  

సమాధానం: 2

i కొంత సొమ్ముపై ఏడాదికి 5% వడ్డీరేటు  చొప్పున 2 సం.లకు అయ్యే చక్రవడ్డీ, సరళ వడ్డీల మధ్య వ్యత్యాసం రూ.50. అయితే ఆ సొమ్ము ఎంత

1) రూ.18000      2) రూ.25000   

3) రూ.24000      4) రూ.20000

సాధన: 

సమాధానం: 4

i రూ.10,000 పై 10% వడ్డీరేటు చొప్పున 3 సంవత్సరాల్లో అయ్యే చక్రవడ్డీ, బారువడ్డీల మధ్య భేదం ఎంత?

1) రూ.310       3) రూ.330 

3) రూ.350      4) రూ.380

సాధన:

సమాధానం: 1

అభ్యాస ప్రశ్నలు


1. ఒక సంవత్సర కాలంలో చక్రవడ్డీ రేటు ప్రకారం కొంత సొమ్ము మూడేళ్లలో రూ.12,000, 6 సంవత్సరాల్లో రూ.15,000 అవుతుంది. అయితే ఆ సొమ్ము ఎంత?

1్శ రూ.7000        2్శ రూ.8000   

3్శ రూ.8500        4్శ రూ.7500

2. కొంత సొమ్ముపై మొదటి సంవత్సరం 4%, రెండో ఏడాది 5% మూడో సంవత్సరం 6% వడ్డీరేటుతో మూడేళ్లకు రూ25,000 అయ్యింది. అయితే చక్రవడ్డీ ఎంత?

1్శ రూ.1490       2్శ రూ.3568   

3్శ రూ.3638       4్శ రూ.3938

3. కొంత సొమ్ము చక్రవడ్డీ రేటు ప్రకారం 8 సంవత్సరాల్లో రెండింతలు అవుతుంది. అదే చక్రవడ్డీ రేటుతో ఆ సొమ్ము 4 రెట్లు అయ్యేందుకు పట్టే సమయం ఎంత?

1్శ 12 సం.     2్శ 16 సం. 

3్శ 24 సం.     4్శ 32 సం.

4. అర్ధ సంవత్సరానికి చక్రవడ్డీ వేసే పద్ధతిలో సంవత్సరానికి 20% వడ్డీరేటు చొప్పున రూ.1000 కి మొత్తం రూ.1331 కావడానికి పట్టే కాలం?

5. కొంత సొమ్ముపై 8% వడ్డీరేటుతో ఒక సంవత్సరానికి వచ్చే చక్రవడ్డీ రూ.600. అయితే అదే మొత్తంపై అదే వడ్డీరేటుతో 2 సంవత్సరాల్లో వచ్చే చక్రవడ్డీ ఎంత?

1) రూ.1444     2) రూ.1296 

3) రూ.1348       4) రూ.1248

సమాధానాలు

1 - 1      2 - 4      3 - 2      4 - 4      5 - 4


 

Posted Date : 29-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌