• facebook
  • whatsapp
  • telegram

సుప్రీంకోర్టు - అధికారాలు, విధులు

1. కింది వాటిలో భారత సుప్రీంకోర్టుకు సంబంధించి సరైనవి ఏవి?

i) రూపకర్త గణేశ్‌ బికాజీ డియోల్కర్‌

ii) ఇది న్యూదిల్లీలోని తిలక్‌రోడ్డులో ఉంది

iii) దీని తొలి ప్రధాన న్యాయమూర్తి హెచ్‌.జె.కానియా

iv) రెండో ప్రధాన న్యాయమూర్తి పతంజలి శాస్త్రి

1) i, ii, iii      2) i, iii, iv         3) i, ii, iv      4) పైవన్నీ

జ: పైవన్నీ  


2. న్యాయమూర్తులను నియమించే విషయంలో రాష్ట్రపతి తప్పనిసరిగా ‘కొలీజియం’ సలహాను పొందాలని సుప్రీంకోర్టు ఏ కేసు సందర్భంగా తీర్పు ఇచ్చింది?

1) ప్రకాష్‌కదం VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) నళినీ ముఖర్జీ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) రాకేష్‌ మోహన్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

జ: సుప్రీంకోర్టు అడ్వకేట్స్‌ ఆన్‌ రికార్డ్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు​​​​​​​   


3. 1998లో ఏ భారత రాష్ట్రపతి ఆర్టికల్‌ 143 ప్రకారం కొలీజియంపై సుప్రీంకోర్టు న్యాయ సలహాను పొందారు?

1) కె.ఆర్‌.నారాయణన్‌              2) ప్రతిభా పాటిల్‌ 

3) ఎ.పి.జె.అబ్దుల్‌ కలాం                 4) శంకర్‌దయాళ్‌శర్మ

జ: కె.ఆర్‌.నారాయణన్‌ 


4. 1999లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం ‘కొలీజియం’లో సభ్యులుగా ఎవరుంటారు?

1) ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు న్యాయమూర్తులు

2) ప్రధాన న్యాయమూర్తి, మరో ఆరుగురు న్యాయమూర్తులు

3) ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి, మరో ఏడుగురు న్యాయమూర్తులు

4) ప్రధాన న్యాయమూర్తి, రాష్ట్రపతి, కేంద్ర మంత్రిమండలి

జ: ప్రధాన న్యాయమూర్తి, మరో నలుగురు న్యాయమూర్తులు​​​​​​​  


5. నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా న్యాయమూర్తుల నియామకం కోసం ‘‘నేషనల్‌ జడ్జెస్‌ అపాయింట్‌మెంట్‌ కమిషన్‌’’ను ఏర్పాటు చేసింది?

1) 120వ రాజ్యాంగ సవరణ చట్టం       2) 121వ రాజ్యాంగ సవరణ చట్టం

3) 99వ రాజ్యాంగ సవరణ చట్టం         4) 124వ రాజ్యాంగ సవరణ చట్టం

జ: 99వ రాజ్యాంగ సవరణ చట్టం    


6. ‘‘నేషనల్‌ జడ్జెస్‌ అపాయింట్‌మెంట్‌ కమిషన్‌’’ (NJAC) ఏర్పాటు రాజ్యాంగ విరుద్ధమని, అది చెల్లుబాటు కాదని సుప్రీంకోర్టు ఎప్పుడు తీర్పు ఇచ్చింది?

1) అక్టోబరు 16, 2015        2) ఆగస్టు 22, 2016

3) జులై 18, 2015           4) మార్చి 26, 2016

జ: అక్టోబరు 16, 2015​​​​​​​    


7. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి. 

i) 1973లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎ.ఎన్‌.రే నియమితులయ్యారు

ii) 1977లో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా ఎం.హెచ్‌. బేగ్‌ నియమితులయ్యారు.

iii) సుప్రీంకోర్టుకు మొదటి దళిత ప్రధాన న్యాయమూర్తి కె.జి.బాలకృష్ణన్‌

iv) సుప్రీంకోర్టుకు మొదటి మహిళా ప్రధాన న్యాయమూర్తి మీరా సాహెబ్‌ ఫాతిమా బీబీ

1) i, ii, iii         2) i, iii, iv          3) i, ii, iv        4) పైవన్నీ 

జ: i, ii, iii    ​​​​​​​  


8. ‘‘కోర్టు ఆఫ్‌ రికార్డ్‌’’ (Court of Record) ను కింది వాటిలో ఏ విధంగా పేర్కొంటారు?

1) సంప్రదింపుల అధికార పరిధి (Consultative Jurisdiction)

2) అనుపూర్వికాలు (Precidents)

3) ఏర్పాటు, నిర్మాణం (Establishment & Composition)

4) పౌర సమాజం (Civil Society)

జ: అనుపూర్వికాలు (Precidents)​​​​​​​  


9. సుప్రీంకోర్టు ‘‘కోర్టు ఆఫ్‌ రికార్డ్‌’’కు సంబంధించి సరైంది ఏది?

i) సుప్రీంకోర్టు తాను ఇచ్చిన తీర్పుల సారాంశాన్ని రికార్డుల రూపంలో భద్రపరచడాన్ని ‘‘కోర్టు ఆఫ్‌ రికార్డ్‌’’ అంటారు.

ii) ‘‘కోర్టు ఆఫ్‌ రికార్డ్‌’’ దేశంలోని అన్ని న్యాయస్థానాలకు శిరోధార్యం లాంటిది.

iii) దీని అమలు సరిగా లేకపోతే కోర్టు ధిక్కరణలో భాగంగా నేరంగా పరిగణిస్తారు.

iv) ‘‘కోర్టు ఆఫ్‌ రికార్డ్‌’’ గురించి రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 135 తెలుపుతుంది.

1) i, ii, iv        2) i, iii, iv        3) i, ii, iii        4) పైవన్నీ

జ: i, ii, iii​​​​​​​   


10. ఏ కేసు సందర్భంగా 1951లో సుప్రీంకోర్టు తొలిసారిగా ‘‘న్యాయసమీక్షాధికారాన్ని’’ (Judicial Review) వినియోగించింది?

1) శంకరీ ప్రసాద్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) షంషేర్‌ సింగ్‌ VS స్టేట్‌ ఆఫ్‌ పంజాబ్‌ కేసు

3) రామేశ్వర్‌ ఠాగూర్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) రతన్‌సింగ్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

జ: శంకరీ ప్రసాద్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు​​​​​​​   


11. ఇందిరాగాంధీ ప్రభుత్వ కాలంలో ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా న్యాయస్థానాలకు గల ‘‘న్యాయసమీక్షాధికారం’’పై పరిమితులు విధించారు?

1) 35వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975

2) 36వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975

3) 39వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976

4) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976

జ: 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976​​​​​​​  


12. మొరార్జీ దేశాయ్‌ ప్రభుత్వం న్యాయస్థానాలకు గల న్యాయసమీక్షాధికారాన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా పునరుద్ధరించింది?

1) 52వ రాజ్యాంగ సవరణ చట్టం, 1985

2) 44వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

3) 43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977

4) 45వ రాజ్యాంగ సవరణ చట్టం, 1978

జ: 43వ రాజ్యాంగ సవరణ చట్టం, 1977​​​​​​​  


13. ఓబీసీ వర్గాల వారికి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో కల్పిస్తున్న రిజర్వేషన్లు సమంజసమేనని, సంక్షేమ స్వభావమూ రాజ్యాంగ మౌలిక రూపంలో అంతర్భాగమని ఏ కేసు సందర్భంగా సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది?

1) ఇందిరా సహానీ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

2) ఎ.కె.గోపాలన్‌ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

3) అనుపమ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు

4) చంపకం దొరై రాజన్‌ VS స్టేట్‌ ఆఫ్‌ తమిళనాడు కేసు

జ: ఇందిరా సహానీ VS యూనియన్‌ ఆఫ్‌ ఇండియా కేసు


14. సుప్రీంకోర్టు - ధర్మాసనాల (Supreme court Benches) కు సంబంధించి సరైంది ఏది?

i) సింగిల్‌ జడ్జి బెంచ్‌లో ఒక న్యాయమూర్తి మాత్రమే ఉంటారు

ii) డివిజన్‌ బెంజ్‌లో 2-3 న్యాయమూర్తులు ఉంటారు

iii) ఫుల్‌ బెంచ్‌లో 3-5 న్యాయమూర్తులు ఉంటారు

iv) రాజ్యాంగ ధర్మాసనం (Constitutional Bench) లో అయిదుగురు, అంతకంటే ఎక్కువ న్యాయమూర్తులు ఉంటారు.

1) i, ii iii      2) i, ii, iv        3) i, iii iv          4) పైవన్నీ

జ: పైవన్నీ​​​​​​​  


15. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి.

i) సుప్రీంకోర్టు న్యాయమూర్తుల జీతభత్యాలు భారత సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు.

ii) ఆర్టికల్‌ 121 ప్రకారం అభిశంసన తీర్మానం ఉన్నప్పుడు తప్ప మిగిలిన సందర్భాల్లో న్యాయమూర్తుల ప్రవర్తనపై పార్లమెంటులో చర్చించకూడదు.

iii) ఆర్టికల్‌ 124 ప్రకారం పదవీ విరమణ పొందిన సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దేశంలోని ఏ న్యాయస్థానంలోనూ న్యాయవాద వృత్తిని చేపట్టరాదు.

1) i ii మాత్రమే        2) i, iii మాత్రమే         3) ii, iii మాత్రమే      4) పైవన్నీ

జ: పైవన్నీ​​​​​​​  


16. ఆర్టికల్‌ 127 ప్రకారం సుప్రీంకోర్టులో నియమితమయ్యే ‘‘తాత్కాలిక న్యాయమూర్తుల’’ పదవీ కాలం ఎంత?

1) 2 సం.లు      2) 3 సం.లు        3) 4 సం.లు      4) 6 నెలలు

జ: 2 సం.లు

​​​​​​​ 
17. కింది అంశాల్లో సరైన వాటిని గుర్తించండి. 

i)  గోలక్‌నాథ్‌ కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - కోకా సుబ్బారావు

ii) కేశవానంద భారతి కేసు సమయంలో సుప్రీంకోర్టు న్యాయమూర్తి - ఎస్‌.ఎం.సిక్రీ

iii) ఎస్‌.ఆర్‌.బొమ్మై కేసు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - ఎం.ఎన్‌.వెంకటాచలయ్య

iv) అయోధ్య తీర్పు సమయంలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి - రంజన్‌ గొగోయ్‌

1) i, ii, iii     2) i, iii, iv           3) i, ii, iv     4) పైవన్నీ

జ: పైవన్నీ

  
18. సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును ‘‘పునఃసమీక్ష’’ చేయాలని కోరుతూ వేసే పిటిషన్‌ను ఏమంటారు?

1) ప్లీబార్గెయిన్‌       2) ఇంట్రావైర్స్‌      3) క్యూరేటివ్‌       4) రిడక్షన్‌ ఆఫ్‌ సెంటెన్స్‌

జ: క్యూరేటివ్‌​​​​​​​


19. సుప్రీంకోర్టు ధ్రువీకరించిన లేదా ప్రకటించిన అన్ని అంశాలను దేశంలోని దిగువ న్యాయస్థానాలు తప్పనిసరిగా పాటించాలని రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ నిర్దేశిస్తుంది?

1) ఆర్టికల్, 139      2) ఆర్టికల్, 140        3) ఆర్టికల్, 141      4) ఆర్టికల్, 142

జ:  ఆర్టికల్, 141 


20. మన దేశంలో ‘‘న్యాయశాఖ క్రియాశీలత’’కు కారణాన్ని గుర్తించండి.

1) శాసన, కార్యనిర్వాహక శాఖలు తమ విధుల నిర్వహణలో విఫలమయ్యాయని భావించడం.

2) ప్రజాప్రయోజన వ్యాజ్యం ద్వారా మూడో వ్యక్తి కోర్టును ఆశ్రయించే అవకాశం కల్పించడం

3) న్యాయస్థానాలు ‘‘స్వయం ప్రేరిత’’ (Suo-moto) కేసులను చేపట్టడం

4) పైవన్నీ

జ: పైవన్నీ​​​​​​​ 

Posted Date : 30-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌