1. కింది వాటిలో ఒక నిమటోడ్ జీవి వల్ల వచ్చే వ్యాధి?
జ: ఫైలేరియాసిస్
2. పిన్ వార్మ్ వల్ల కలిగే వ్యాధి ఏది?
జ: ఎంటరోబియాసిస్
3. టేప్ వార్మ్ మానవ దేహంలో ఎక్కడ నివసిస్తుంది?
జ: చిన్నపేగు
4. ఎలిఫెంటియాసిస్కు మరో పేరు?
జ: ఫైలేరియాసిస్
5. నాళంలో నాళం అని ఏ జీవులను పిలుస్తారు?
జ: నిమటోడా
మాదిరి ప్రశ్నలు
6. పంచకిరణ వ్యాసార్ధ సౌష్ఠవం కలిగిన జీవులు ఏవి?
జ: ఇకైనోడర్మ్లు
7. సముద్ర దోసకాయల్లో శ్వాసావయవాలు?
జ: అవస్కర శ్వాసవృక్షాలు
8. ముళ్ల చర్మం కలిగిన జంతువులు అని వేటికి పేరు?
జ: ఇకైనోడర్మ్లు
9. చేపల గురించిన అధ్యయనాన్ని ఏమంటారు?
జ: ఇక్తియాలజీ
10. ప్రోటో కార్డేటా అంటే....
i) యూరోకార్డేటా ii) సెఫలోకార్డేటా iii) వర్టిబ్రేటా iv) సూడోకార్డేటా
జ: i, ii
11. దవడలు కలిగిన మొట్టమొదటి సకశేరుకాలు ఏవి?
జ: చేపలు
12. చేపల్లో శ్వాసావయవాలు.....
జ: మొప్పలు
13. ‘సిరా హృదయం’ కలిగిన జీవులు ఏవి?
జ: చేపలు
14. మృదులాస్థి చేపలు.....
జ: కాండ్రిక్తిస్
15. సరీసృపాలు, పక్షులను కలిపి ఏమంటారు?
జ: సారాప్సిడా
16. ఉభయచర జీవుల్లో వర్ణక కణాలు సంకోచ వ్యాకోచాల వల్ల రంగులను మార్చే గుణాన్ని ప్రదర్శించడాన్ని ఏమంటారు?
జ: మెటాక్రోసిస్
17. హైబర్నేషన్లో ఉన్న కప్ప దేనితో శ్వాసిస్తుంది?
జ: చర్మం
18. ప్రీన్ గ్రంథి లేదా యూరోపైజియల్ గ్రంథిని ప్రదర్శించే జీవులు
జ: పక్షులు