• facebook
  • whatsapp
  • telegram

బయోఫర్టిలైజర్స్‌

1. చిక్కుడు జాతి మొక్కల వేరు బుడిపెల్లో సహజీవనం చేస్తూ నత్రజనిని స్థాపించే బ్యాక్టీరియా?
జ: రైజోబియమ్‌
 

2. నేలలో ఫాస్ఫరస్‌ ఏ రూపంలో ఎక్కువగా ఉంటుంది?
జ: రాక్‌ ఫాస్ఫేట్‌
 

3. కింది ఏ సూక్ష్మ జీవులను జీవ ఎరువులుగా వాడుతున్నారు? 
1) బ్యాక్టీరియా      2) నీలి ఆకుపచ్చ శైవలాలు      3) శిలీంద్రాలు      4) అన్నీ
జ: 4 (అన్నీ)
 

4. నేలలో కరగని స్థితిలో ఉన్న ఫాస్ఫరస్‌ను కరిగించి మొక్కకు అందించే బ్యాక్టీరియా?
జ: బాసిల్లస్‌ మెగా థీరియం, బాసిల్లస్‌ సబ్‌టిలిస్‌
 

5. రైజోబియమ్‌ బ్యాక్టీరియాలో ఉండే నిఫ్‌ జన్యువులు ఏవిధంగా ఉపయోగపడుతున్నాయి?
జ: నత్రజని స్థాపనకు
 

6. రసాయనిక ఎరువైన యూరియాను చల్లడం వల్ల మొక్కకు లభించేది?
జ: నత్రజని
 

7. అజొల్లా అనే ఫెర్న్‌ మొక్కలో సహజీవనం చేస్తూ నత్రజని స్థాపన చేసే నీలి ఆకుపచ్చ శైవలం
జ: అనబీనా
 

8. శిలీంద్రం, ఉన్నత శ్రేణి మొక్కల సహజీవనాన్ని ఏమంటారు?
జ: మైకోరైజా
 

9. రసాయనిక ఎరువుల్లో నత్రజని ఎరువులకు ఉదాహరణ
1) యూరియా      2) అమ్మోనియం సల్ఫేట్‌      3) కాల్షియం అమ్మోనియం సల్ఫేట్‌      4) అన్నీ
జ: 4 (అన్నీ)
 

10. వరి పొలాల్లో జీవ ఎరువుగా వాడే నీలి ఆకుపచ్చ శైవలాల వల్ల మొక్కకు ఎక్కువగా లభించేది
జ: నత్రజని
 

రచయిత: డాక్టర్‌ బి. నరేష్‌

Posted Date : 31-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌