• facebook
  • whatsapp
  • telegram

దత్తాంశ వినియోగం

1. తేజ తన తరగతికి చెందిన పరీక్షలో గణితం మినహా మిగిలిన సబ్జెక్టుల్లో సాధించిన మార్కులు వరుసగా 11, 21, 25, 23, 14. అతడి సగటు మార్కులు 19. అయితే ఆ విద్యార్థి గణితంలో సాధించిన మార్కులు ఎన్ని?

1) 22       2) 19          3) 20           4) 18

సాధన: తేజ సాధించిన సగటు మార్కులు = 19

గణితం మినహా మిగిలిన సబ్జెక్టుల్లో సాధించిన మార్కులు 

    = 11, 21, 25, 23, 14

గణితంలో వచ్చిన మార్కులు = x అనుకోండి.

సమాధానం: 3

2. ఒక దత్తాంశంలోని 9 రాశుల అంకమధ్యమం 29, ఆ దత్తాంశానికి x  అనే ఒక రాశిని కలిపాక వచ్చే ఫలిత రాశుల అంకమధ్యమం 30. అయితే x విలువ ఎంత?

1) 38      2) 40      3) 41      4) 39

సాధన: 

సమాధానం: 4

3. ఒక తరగతిలోని 50 మంది విద్యార్థులు గణిత పరీక్షలో సాధించిన మార్కులు కింది పట్టికలో ఉన్నాయి.

విద్యార్థుల సగటు మార్కులు ఎన్ని?

1) 26         2) 28          3) 24           4) 25

సాధన: 

సమాధానం: 2

4. ఒక పోటీ పరీక్షకు హాజరైన 100 మంది విద్యార్థుల మార్కులు కింది పట్టికలో నమోదు చేశారు.

ఈ దత్తాంశ మధ్యగతం(median) ఎంత?

1) 12.619     2) 11.619 

3) 13.619     4) 14.619

సాధన:

సమాధానం: 1

5. ఒక దత్తాంశ అంకగణిత సగటు 61, మధ్యగతం 60, అయితే బాహుళకం ఎంత?

1) 59      2) 58      3) 57      4) 56 

సాధన: 

సమాధానం: 2

6. ఇచ్చిన పట్టికలో 45 మంది విద్యార్థుల బరువులను కిలో గ్రాముల్లో  పేర్కొన్నారు. 

అయితే దత్తాంశ మధ్యగతం (Median) ఎంత? (కి.గ్రా.ల్లో)

1) 28       2) 30       3) 32       4) 33

సాధన:

సమాధానం: 3 

7. ఇచ్చిన దత్తాంశ బాహుళకం ఎంత? 

1) 17.14        2) 16.14 

3 15.14        4) 18.14

సాధన:

సమాధానం: 1


8. 

దత్తాంశం సగటు ఎంత?

1) 5.45     2) 5.85 

3) 6.45     4) 6.85 

సాధన: 

సమాధానం: 4


9. 

పై దత్తాంశం బాహుళకం ఎంత?

1) 17       2) 13         3) 12         4) 14

సాధన: పట్టికలో 13 సంఖ్య ఎక్కువగా 17 సార్లు పునరావృతం అయ్యింది.

కాబట్టి, దత్తాంశ బాహుళకం (z) = 13

సమాధానం: 2

10. 1, 5, 2, 3, 5, 5, 6, 8, 10, 10 అనేవి ఒక దత్తాంశానికి చెందిన రాశులు. అయితే కిందివాటిలో ఏది సత్యం?

1) సగటు = బాహుళకం = మధ్యగతం 

2) సగటు = బాహుళకం

3) బాహుళకం = మధ్యగతం 

4) సగటు = 6

సాధన: 

సమాధానం: 3

మాదిరి సమస్యలు 

I. ఒక కంపెనీ 2017 నుంచి 2021 వరకు ఉత్పత్తి చేసిన విద్యుత్‌ పరికరాల గురించి కింది కమ్మీరేఖాచిత్రంలో ఇచ్చారు. దాన్ని అనుసరించి ఇచ్చిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

i. కంపెనీ 2017, 2021లో ఉత్పత్తి చేసిన మొత్తం విద్యుత్‌ పరికరాల సంఖ్య 2019, 2020లో ఉత్పత్తి చేసిన మొత్తం విద్యుత్‌ పరికరాల సంఖ్య కంటే ఎంత ఎక్కువ? 

1) 1050       2) 1150 

3) 1250       4) 1350 

ii. కంపెనీ 2019, 2020లలో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ పరికరాల నిష్పత్తి....

1) 27 : 35        2) 38 : 27 

3) 27 : 38          4) 29 : 38

iii. విద్యుత్‌ పరికరాల ఉత్పత్తి 2017లో కంటే 2018లో ఎంత శాతం పెరిగింది? 

1) 10.76%       2) 11.48% 

3) 11.96%        4) 12.86% 

iv. కంపెనీ అయిదేళ్లలో ఉత్పత్తి చేసిన సగటు విద్యుత్‌ పరికరాల సంఖ్య.... 

1) 21,150       2) 20,150 

3) 19,150       4) 20,750 

సాధన:

i. 2017, 2021లో కంపెనీ ఉత్పత్తి చేసిన మొత్తం విద్యుత్‌ పరికరాల సంఖ్య
= 12050 + 34600 = 46650

2019, 2020లో ఉత్పత్తి చేసిన మొత్తం విద్యుత్‌ పరికరాల సంఖ్య
= 18900 + 26600 = 45500
భేదం = 46650 -  45500 = 1150 

సమాధానం: 2

ii. కంపెనీ 2019లో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ పరికరాల సంఖ్య = 18900
కంపెనీ 2020లో ఉత్పత్తి చేసిన విద్యుత్‌ పరికరాల సంఖ్య = 26600
నిష్పత్తి = 18900 : 26600 
          = 27 : 38

సమాధానం: 3

iii. 2017లో విద్యుత్‌ పరికరాల ఉత్పత్తి
= 12050
2018లో విద్యుత్‌ పరికరాల ఉత్పత్తి
= 13600
పెరుగుదల = 13600  12050 
               = 1550

సమాధానం: 4

iv. అయిదేళ్లలో ఉత్పత్తి చేసిన సగటు విద్యుత్‌ పరికరాలు  ఉత్పత్తి చేసిన మొత్తం విద్యుత్‌ 

సమాధానం: 1


II. ఇచ్చిన ‘పై చిత్రం’ (pie-chart)లో ఒక పాఠశాల ఏడాదిలో వివిధ క్రీడలకు కేటాయించిన ఖర్చును తెలుపుతుంది. దాని ఆధారంగా ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

i. ఫుట్‌బాల్‌ క్రీడకు రూ.18000 కేటాయిస్తే, హాకీపై ఫుట్‌బాల్‌ కంటే ఎంత ఎక్కువ సొమ్ము ఖర్చు చేశారు?

1) రూ.20,000     2) రూ.28,000 

3) రూ.22,000     4) రూ.24,000

II. ఫుట్‌బాల్‌కు కేటాయించిన సొమ్ము  రూ.18000 అయితే క్రికెట్‌కు కేటాయించిన సొమ్ము ఎంత?

1) రూ.42,000             2) రూ.48,000 

3) రూ.56,000             4) రూ.64,000

iii. ఫుట్‌బాల్‌కు కేటాయించిన సొమ్ము  రూ.18000 అయితే అన్ని ఆటలకు కేటాయించిన సొమ్ము ఎంత?

1) రూ.1,28,000             2) రూ.1,44,000 

3) రూ.1,52,000             4) రూ.1,60,000

సాధన: 

i. హాకీపై ఫుట్‌బాల్‌ కంటే ఎక్కువ కేటాయించిన సొమ్ము 

సమాధానం: 3


ii. క్రికెట్‌పై కేటాయించిన సొమ్ము 

సమాధానం: 4


iii. మొత్తం క్రీడలపై కేటాయించిన సొమ్ము 

సమాధానం: 2


III. A, B, C, D, ని  అనే ప్రముఖ బొమ్మల తయారీ కంపెనీలు 2017 నుంచి 2021 వరకు ఉత్పత్తి చేసిన బొమ్మల సంఖ్య (వేలల్లో)ను కింది పట్టికలో ఇచ్చారు. దాన్ని ఆధారంగా అడిగిన ప్రశ్నలకు సమాధానాలు రాయండి.

i. 2017 నుంచి 2019 వరకు కంపెనీ దీ ఉత్పత్తి చేసిన బొమ్మల సంఖ్యలో పెరుగుదల శాతం ఎంత?

1) 11.11%            2) 15.15% 

3) 19.19%           4) 22.22%

ii. కంపెనీ తి, 2017 నుంచి 2019 వరకు చేసిన బొమ్మల ఉత్పత్తిలో పెరుగుదల (లేదా) తగ్గుదల శాతం ఎంత?

1) పెరుగుదల 10% 

2) తగ్గుదల 10%

3) పెరుగుదల 8% 

4) తగ్గుదల 8%

iii. 2020లో అన్ని కంపెనీలు ఉత్పత్తి చేసిన బొమ్మల సంఖ్య .... (వేలల్లో)

1) 575        2) 625       3) 650         4) 675

సాధన: 


i. 2017లో కంపెనీ దీ ఉత్పత్తి చేసిన బొమ్మల సంఖ్య = 90 (వేలల్లో)

2019లో కంపెనీ దీ ఉత్పత్తి చేసిన బొమ్మల సంఖ్య = 110 (వేలల్లో)

సమాధానం: 4

ii. 2017లో కంపెనీ తి బొమ్మల ఉత్పత్తి (వేలల్లో) = 200

2019లో కంపెనీ తి బొమ్మల ఉత్పత్తి (వేలల్లో) = 180

బొమ్మల ఉత్పత్తిలో తగ్గుదల 

= 200 - 180 = 20 (వేలల్లో)

సమాధానం: 2


iii. 2020లో అన్ని కంపెనీలు ఉత్పత్తి చేసిన బొమ్మల సంఖ్య (వేలల్లో)

= 195 + 160 + 120 + 125 + 75

= 675

సమాధానం: 4


 

రచయిత

సీహెచ్‌. రాధాకృష్ణ

Posted Date : 02-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌