• facebook
  • whatsapp
  • telegram

జంతురాజ్యం (ఏనిమేలియా)

1. కింది వాటిలో ఒక నిమటోడ్‌ జీవి వల్ల వచ్చే వ్యాధి? 

జ:  ఫైలేరియాసిస్‌

2. పిన్‌ వార్మ్‌ వల్ల కలిగే వ్యాధి ఏది?     

జ:  ఎంటరోబియాసిస్‌  

3. టేప్‌ వార్మ్‌ మానవ దేహంలో ఎక్కడ నివసిస్తుంది?

జ:  చిన్నపేగు      

4. ఎలిఫెంటియాసిస్‌కు మరో పేరు?    

జ: ఫైలేరియాసిస్‌

5. నాళంలో నాళం అని ఏ జీవులను పిలుస్తారు?

జ:  నిమటోడా

మాదిరి ప్రశ్నలు


6. పంచకిరణ వ్యాసార్ధ సౌష్ఠవం కలిగిన జీవులు ఏవి?

జ‌:  ఇకైనోడర్మ్‌లు     


7. సముద్ర దోసకాయల్లో శ్వాసావయవాలు?

జ‌: అవస్కర శ్వాసవృక్షాలు   


8. ముళ్ల చర్మం కలిగిన జంతువులు అని వేటికి పేరు? 

జ‌: ఇకైనోడర్మ్‌లు    


9. చేపల గురించిన అధ్యయనాన్ని ఏమంటారు?

జ‌: ఇక్తియాలజీ 


10. ప్రోటో కార్డేటా అంటే....

i) యూరోకార్డేటా    ii) సెఫలోకార్డేటా    iii) వర్టిబ్రేటా    iv) సూడోకార్డేటా 

జ‌:  i, ii


11. దవడలు కలిగిన మొట్టమొదటి సకశేరుకాలు ఏవి? 

జ‌: చేపలు     


12. చేపల్లో శ్వాసావయవాలు.....

జ‌: మొప్పలు    


13. ‘సిరా హృదయం’ కలిగిన జీవులు ఏవి?

జ‌: చేపలు     


14. మృదులాస్థి చేపలు.....

జ‌:  కాండ్రిక్తిస్‌ 


15. సరీసృపాలు, పక్షులను కలిపి ఏమంటారు?

జ‌: సారాప్సిడా 


16. ఉభయచర జీవుల్లో వర్ణక కణాలు సంకోచ వ్యాకోచాల వల్ల రంగులను మార్చే గుణాన్ని ప్రదర్శించడాన్ని ఏమంటారు? 

జ‌:  మెటాక్రోసిస్‌     


17. హైబర్నేషన్‌లో ఉన్న కప్ప దేనితో శ్వాసిస్తుంది? 

జ‌: చర్మం 


18. ప్రీన్‌ గ్రంథి లేదా యూరోపైజియల్‌ గ్రంథిని ప్రదర్శించే జీవులు 

జ‌:  పక్షులు     

Posted Date : 06-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌