• facebook
  • whatsapp
  • telegram

లోక్‌సభ

1. ‘లోక్‌సభ’కు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ. దీన్ని దిగువ సభ, ప్రజాప్రతినిధుల సభగా పేర్కొంటారు.

బి. దీని పదవీ కాలం నిర్దిష్టంగా అయిదేళ్లు.

సి. ఆర్టికల్‌ 81 - లోక్‌సభ నిర్మాణం గురించి తెలుపుతుంది.

డి. లోక్‌సభ సభ్యులను ఓటర్లు ప్రత్యక్షంగా రహస్య ఓటింగ్‌ ద్వారా ఎన్నుకుంటారు.

1) ఎ, బి        2) ఎ, సి, డి         3) బి, డి         4) బి

జ: 2


2. ఏ జనాభా లెక్కల ఆధారంగా ప్రస్తుత లోక్‌సభ సభ్యుల సంఖ్యను కొనసాగిస్తున్నారు?

1) 1971         2) 1991         3) 2001         4) 2011

జ: 1


3. లోక్‌సభ, రాష్ట్రాల శాసనసభ్యుల సంఖ్యలో 2026 వరకు మార్పులు చేయకూడదని అటల్‌ బిహారి వాజ్‌పేయీ ప్రభుత్వం ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించింది?

1) 81వ రాజ్యాంగ సవరణ చట్టం           2) 82వ రాజ్యాంగ సవరణ చట్టం

3) 83వ రాజ్యాంగ సవరణ చట్టం           4) 84వ రాజ్యాంగ సవరణ చట్టం

జ: 4


4. 87వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ద్వారా లోక్‌సభలో ఎస్సీ వర్గాల వారికి రిజర్వ్‌ చేసిన స్థానాల సంఖ్యను ఎలా నిర్ణయించారు?

1) 79 నుంచి 84కి పెంచారు        2) 76 నుంచి 82కి పెంచారు

3) 71 నుంచి 79కి పెంచారు        4) 73 నుంచి 81కి పెంచారు

జ​​​​​​​: 1


5. 87వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ద్వారా లోక్‌సభలో ఎస్టీ వర్గాల వారికి రిజర్వ్‌ చేసిన స్థానాలను ఎలా నిర్ణయించారు?

1) 39 నుంచి 41కి పెంచారు            2) 41 నుంచి 46కి పెంచారు

3) 41 నుంచి 47కి పెంచారు            4) 47 నుంచి 51కి పెంచారు

జ​​​​​​​: 3


6. వివిధ లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి  కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ. మొదటి లోక్‌సభ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య - 17.32 కోట్లు

బి. రెండో లోక్‌సభ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య - 20.1 కోట్లు

సి. పదహారో లోక్‌సభ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య - 81.57 కోట్లు

డి. పదిహేడో లోక్‌సభ ఎన్నికల నాటికి ఓటర్ల సంఖ్య - 90 కోట్లు

1) ఎ, సి, డి     2) ఎ, బి, సి         3) ఎ, బి, డి     4) పైవన్నీ

జ​​​​​​​: 1


7. 17వ లోక్‌సభ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు గెలిచిన స్థానాలకు సంబంధించి సరికానిది?

1) భారత జాతీయ కాంగ్రెస్‌ - 52         2) తృణమూల్‌ కాంగ్రెస్‌ - 22

3) శివసేన - 21                 4) వై.ఎస్‌.ఆర్‌. కాంగ్రెస్‌ పార్టీ - 22

జ​​​​​​​: 3


8. మొదటి లోక్‌సభ ఎన్నికలకు సంబంధించి కిందివాటిలో సరైన జవాబును గుర్తించండి.

ఎ. 21 సంవత్సరాలు నిండిన వారందరికీ ఓటు హక్కు కల్పించారు.

బి. 1951-52లో ఎన్నికలు జరిగాయి.

సి. నమోదైన మొత్తం పోలింగ్‌ - 46%

డి. ఎన్నికైన మహిళలు - 22

1) ఎ, సి         2) సి, డి         3) ఎ, డి        4) పైవన్నీ

జ​​​​​​​: 4


9. మొదటి లోక్‌సభ ఎన్నికల్లో వివిధ రాజకీయ పార్టీలు - గెలుపొందిన స్థానాలకు సంబంధించి సరికానిది ఏది?

1) భారత జాతీయ కాంగ్రెస్‌ - 364            2) జనసంఘ్‌ - 3

3) కమ్యూనిస్ట్‌ పార్టీ - 32           4) హిందూ మహాసభ - 4

జ​​​​​​​: 3


10. లోక్‌సభ సభ్యుడిగా పోటీ చేసేందుకు ఉండాల్సిన అర్హతల్లో సరికానిది ఏది?

1) భారతీయ పౌరుడై ఉండాలి     2) 25 సంవత్సరాలు ఉండాలి

3) దివాళాకోరై ఉండకూడదు      4) కనీస విద్యార్హతలు ఉండాలి

జ​​​​​​​: 4


11. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ. లోక్‌సభకు ఎన్నికైన సభ్యులు ‘ప్రొటెం స్పీకర్‌’ సమక్షంలో ప్రమాణస్వీకారం చేస్తారు.

బి. ప్రొటెం స్పీకర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.

సి. లోక్‌సభ సభ్యులు తమలో ఒకరిని స్పీకర్‌గా, మరొకరిని డిప్యూటీ స్పీకర్‌గా ఎన్నుకుంటారు.

డి. స్పీకర్‌ తన రాజీనామాను డిప్యూటీ స్పీకర్‌కు, డిప్యూటీ స్పీకర్‌ తన రాజీనామాను స్పీకర్‌కు సమర్పించాలి.

1) బి, డి        2) ఎ, సి         3) ఎ, బి        4) పైవన్నీ

జ​​​​​​​: 4


12. లోక్‌సభ స్పీకర్‌ అధికార హోదాలో 7వ స్థానంలో ఉండి, ఎవరితో సమాన గౌరవ హోదాను కలిగి ఉంటారు?

1) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి        2) జాతీయ అధికారభాషా సంఘం ఛైర్మన్‌

3) కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌          4) అటార్నీ జనరల్‌ ఆఫ్‌ ఇండియా

జ​​​​​​​: 1


13. లోక్‌సభ స్పీకర్‌ అధికార విధులకు సంబంధించి కిందివాటిలో సరైనవి?

ఎ. లోక్‌సభ సచివాలయానికి అధిపతిగా వ్యవహరిస్తారు.

బి. లోక్‌సభలో వాయిదా తీర్మానాలను ప్రవేశపెట్టడానికి అనుమతిస్తారు.

సి. లోక్‌సభను రద్దుచేయాలని రాష్ట్రపతికి సిఫార్సు చేస్తారు.

డి. లోక్‌సభ సమావేశాల నిర్వహణకు అవసరమైన ‘కోరం’ (quorum)ను ధ్రువీకరిస్తారు.

1) ఎ, బి, సి    2) ఎ, సి, డి      3) ఎ, బి, డి    4) పైవన్నీ

జ​​​​​​​: 3


14. లోక్‌సభలో తొలి ప్రధాన ప్రతిపక్షనాయకుడిగా గుర్తింపు పొందింది?

1) మొరార్జీదేశాయ్‌      2) కమలాపతి త్రిపాఠి    

3) వై.బి.చవాన్‌      4)  రాంమనోహర్‌ లోహియా

జ​​​​​​​: 3


15. 8వ లోక్‌సభలో 30 మంది సభ్యులు ఉన్న ఏ రాజకీయ పార్టీ అతిపెద్ద ప్రతిపక్ష పార్టీగా అవతరించింది?

1) కమ్యూనిస్ట్‌ పార్టీ          2) భారతీయ జనతాపార్టీ  

3) తెలుగుదేశం పార్టీ     4) రాష్ట్రీయ లోక్‌దళ్‌ పార్టీ

జ​​​​​​​: 3


16. లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నాయకుడికి సంబంధించి సరైన జవాబును గుర్తించండి.

ఎ. ప్రధాన ప్రతిపక్ష నాయకుడిని లోక్‌సభ స్పీకర్‌ ధ్రువీకరిస్తారు.

బి. కేంద్ర కేబినెట్‌ మంత్రి హోదా, సౌకర్యాలు పొందుతారు.

సి. లోక్‌సభలో 10% స్థానాలు పొందిన ప్రతిపక్ష పార్టీకి చెందిన నాయకుడిని ప్రధాన ప్రతిపక్ష పార్టీ నేతగా గుర్తిస్తారు.

1) ఎ, బి     2) ఎ, సి        3) బి, సి    4) పైవన్నీ

జ​​​​​​​: 4


17. లోక్‌సభలో వివిధ రాష్ట్రాలకు నిర్దేశించిన స్థానాలకు సంబంధించి సరికానిది?

1) ఉత్తర్‌ ప్రదేశ్‌ - 80       2) మహారాష్ట్ర - 48

3) పశ్చిమ్‌ బంగా - 42       4) కర్ణాటక - 33

జ​​​​​​​: 4


18. ఆంధ్రప్రదేశ్‌లో ఎస్సీ వర్గాల వారికి రిజర్వ్‌ చేసిన లోక్‌సభ స్థానానికి సంబంధించి సరికానిది?

1) అమలాపురం     2) బాపట్ల, తిరుపతి       3) చిత్తూరు         4) అరకు 

జ​​​​​​​: 4


19. తెలంగాణలో ఎస్సీ వర్గాల వారికి రిజర్వ్‌ చేసిన లోక్‌సభ స్థానానికి సంబంధించి సరికానిది? 

1) పెద్దపల్లి        2) మహబూబ్‌నగర్‌        3) నాగర్‌ కర్నూల్‌      4) వరంగల్‌ 

జ​​​​​​​: 2


20. లోక్‌సభ, రాష్ట్రాల శాసన సభల్లో ఎస్సీ, ఎస్టీ వర్గాలవారికి రిజర్వ్‌ చేసిన స్థానాలను 2030 వరకు కొనసాగించాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

1) 104వ రాజ్యాంగ సవరణ చట్టం         2) 112వ రాజ్యాంగ సవరణ చట్టం 

3) 125వ రాజ్యాంగ సవరణ చట్టం        4) 126వ రాజ్యాంగ సవరణ చట్టం 

జ​​​​​​​: 4


21. లోక్‌సభలో వివిధ రాష్ట్రాలకు కేటాయించిన స్థానాలకు సంబంధించి సరైన జవాబును గుర్తించండి?

a) తమిళనాడు      i) 29

b) మధ్యప్రదేశ్‌      ii) 39 

c) ఆంధ్రప్రదేశ్‌      iii) 25

d) తెలంగాణ      iv) 17 

1) a-ii, b-i, c-iii, d-iv        2) a-iii, b-i, c-iv, d-ii
3) a-iv, b-iii, c-i, d-ii       4) a-i, b-iv, c-ii, d-iii

జ​​​​​​​: 1

గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు


1. లోక్‌సభ స్పీకర్‌కు ‘కాస్టింగ్‌ ఓటు’ కల్పించిన రాజ్యాంగ అధికరణ ఏది? (టీఎస్, కానిస్టేబుల్స్‌ 2019)

1) 100      2) 101      3) 102     4) 103

జ​​​​​​​: 1


2. కింది అంశాలను జతపరచండి. (టీఎస్, కానిస్టేబుల్స్‌ 2019)    

    ప్రభుత్వం           లోక్‌సభ కాలం

a) నేషనల్‌ ఫ్రంట్‌          i) పదో

b) జనతా పార్టీ            ii) తొమ్మిదో

c) యునైటెడ్‌ ఫ్రంట్‌     iii) ఆరో

d) కాంగ్రెస్‌ పార్టీ          iv) పదకొండో

1) a-iii, b-i, c-ii, d-iv           2) a-ii, b-i, c-iv, d-iii
3) a-ii, b-iii, c-iv, d-i           4) a-i, b-iv, c-ii, d-iii

జ​​​​​​​: 3


3. కింది ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా లోక్‌సభలోని సీట్ల సంఖ్యను 525 నుంచి 545కు పెంచారు? (ఏపీ, కానిస్టేబుల్స్‌ 2018)

1) 31వ రాజ్యాంగ సవరణ చట్టం, 1973      2) 32వ రాజ్యాంగ సవరణ చట్టం, 1974 

3) 36వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975      4) 39వ రాజ్యాంగ సవరణ చట్టం, 1975 

జ​​​​​​​: 1


4. కింది ఏ సంవత్సరంలో లోక్‌సభకు నిర్వహించిన సాధారణ ఎన్నికల్లో 18 ఏళ్లు నిండిన భారత పౌరులు మొదటిసారిగా ఓటు హక్కు ఉపయోగించుకున్నారు?

    (ఏపీ, కానిస్టేబుల్స్‌ 2018) 

1) 1984        2) 1996        3) 1991        4) 1989 

జ​​​​​​​: 4


5. కింది వాటిలో సరికానిది?   (టీఎస్, కానిస్టేబుల్స్‌ 2016)

ఎ. ప్రతిపక్ష నాయకుడ్ని స్పీకర్‌ నియమిస్తారు.

బి. లోక్‌సభలో ఇద్దరు సభ్యులను స్పీకర్‌ నియమిస్తారు.

సి. స్పీకర్‌ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు. 

1) ఎ, బి     2) ఎ, సి        3) బి, సి     4) ఎ మాత్రమే

జ​​​​​​​: 3


6. కిందివారిలో లోక్‌సభ స్పీకర్‌గా వ్యవహరించిన వారిని గుర్తించండి. (టీఎస్, కానిస్టేబుల్స్‌ 2016)

ఎ. సోమనాథ్‌ చటర్జీ, రబీరే, మనోహర్‌జోషి

బి. పి.ఎ.సంగ్మా, మురళీమనోహర్‌ జోషి, ఆర్జున్‌సింగ్‌ 

సి. సుమిత్రామహాజన్, మీరాకుమార్, శివరాజ్‌పాటిల్‌ 

డి. బలరాం జాకర్, జైరాంరమేష్,  కె.ఎస్‌.హెగ్డే 

1) ఎ, సి        2) ఎ, డి        3) బి, సి        4) సి మాత్రమే

జ​​​​​​​: 1


7. ఒక బిల్లు ద్రవ్యబిల్లు అవునా? కాదా? అనే విషయంలో అంతిమ నిర్ణయం ఎవరిది? (ఏపీపీఎస్సీ, గ్రూప్‌ II 2016)

1) రాష్ట్రపతి      2) లోక్‌సభ స్పీకర్‌     3) ఆర్థికమంత్రి      4) అత్యున్నత న్యాయస్థానం  

జ​​​​​​​: 2


8. మొదటి లోక్‌సభ స్పీకర్‌ ఎవరు? (సబ్‌ ఇన్‌స్పెక్టర్స్, కమ్యూనికేషన్స్‌ 2013, పంచాయతీ సెక్రటరీస్‌ 2014)  

1) హుకుంసింగ్‌      2) జి.వి. మౌలాంకర్‌        3) కె.ఎం.మున్షీ       4)  యు.ఎన్‌.థెబార్‌ 

జ​​​​​​​: 2


9. పార్లమెంట్‌ పబ్లిక్‌ అకౌంట్స్‌ కమిటీకి ప్రతిపక్ష పార్టీకి చెందిన లోక్‌సభ సభ్యుడు అధ్యక్షత వహించడానికి కారణం? 

    (ఏపీపీఎస్సీ, గ్రూప్‌ II 2016)

1) ప్రభుత్వం రూపొందించిన నియమాలు      2) సంప్రదాయం   

3) పార్లమెంట్‌ పద్ధతి నియమాలు        4) రాష్ట్రపతి ఆదేశం

జ​​​​​​​: 2


10. లోక్‌సభ సమావేశాలను వాయిదావేసే అధికారం ఎవరికి ఉంది? (ఎంపీడీఓ 1990)

1) ప్రధానమంత్రి     2) రాష్ట్రపతి    3) స్పీకర్‌   4) రూల్స్‌  కమిటీ ఆఫ్‌ పార్లమెంట్‌

జ​​​​​​​: 3


11. లోక్‌సభలో ‘జీరో అవర్‌’ అత్యధికంగా ఉండే సమయం? (ట్రైబల్‌ వెల్ఫేర్‌ ఆఫీసర్స్, 2012)

1) 30 నిమిషాలు      2) 50 నిమిషాలు   3) 2 గంటలు   4) ప్రత్యేకంగా చెప్పలేం

జ​​​​​​​: 4

Posted Date : 19-07-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌