• facebook
  • whatsapp
  • telegram

రాష్ట్ర కార్యనిర్వాహక వర్గం

1. గవర్నర్‌కు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) రాష్ట్ర కార్యనిర్వాహక వర్గానికి అధిపతిగా వ్యవహరిస్తారు.

బి) రాష్ట్రానికి ప్రథమ పౌరుడిగా ఉంటారు.

సి) రాష్ట్రంలో రాజ్యాంగ అధిపతిగా వ్యవహరిస్తారు.

డి) రాష్ట్రంలో నామమాత్రపు కార్యనిర్వహణాధికారాలను కలిగి ఉంటారు.

1) ఎ, బి, సి      2) ఎ, బి, డి       3) ఎ, సి, డి        4) పైవన్నీ

జ: పైవన్నీ


2. గవర్నర్‌కు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) గవర్నర్‌ జీతభత్యాలను పార్లమెంట్‌ నిర్ణయిస్తుంది. 

బి) గవర్నర్‌ జీతభత్యాలను కేంద్ర సంఘటిత నిధి నుంచి చెల్లిస్తారు. 

సి) గవర్నర్‌ పదవీకాలం నిర్దిష్టంగా అయిదేళ్లు.

డి) గవర్నర్‌ వేతనం నెలకు రూ.3,50,000.

1) ఎ, బి, సి       2) ఎ, బి, డి       3) ఎ, డి      4) పైవన్నీ

జ: ఎ, డి


3. కింది అంశాల్లో సరైనవి ఏవి?

ఎ) గవర్నర్‌ను రాష్ట్రపతి నియమిస్తారు.

బి) గవర్నర్‌ తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పిస్తారు.

సి) గవర్నర్‌ నివాసాన్ని ‘రాజ్‌భవన్‌’ అంటారు.

డి) గవర్నర్‌ను అభిశంసన తీర్మానం ద్వారా పార్లమెంట్‌ తొలగిస్తుంది.

1) ఎ, బి, సి       2) ఎ, సి, డి       3) ఎ, బి, డి       4) పైవన్నీ

జ: ఎ, బి, సి


4. ఒక వ్యక్తి ఒకేసారి ఒకటి కంటే ఎక్కువ రాష్ట్రాలకు గవర్నర్‌గా వ్యవహరించొచ్చు. దీన్ని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్ణయించారు?

1) 1వ రాజ్యాంగ సవరణ చట్టం, 1951     

2) 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956

3) 11వ రాజ్యాంగ సవరణ చట్టం, 1960    

4) 42వ రాజ్యాంగ సవరణ చట్టం, 1976

జ: 7వ రాజ్యాంగ సవరణ చట్టం, 1956


5. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 157 ప్రకారం గవర్నర్‌ పదవిని చేపట్టేందుకు ఉండాల్సిన అర్హతలు కిందివాటిలో ఏవి?

ఎ) భారతీయ పౌరుడై ఉండాలి

బి) 35 ఏళ్లు నిండి ఉండాలి

సి) రాజకీయ పరిజ్ఞానం ఉండాలి

1) ఎ, బి         2) ఎ, సి        3) బి, సి        4) పైవన్నీ

జ: ఎ, బి


6. గవర్నర్‌ పదవిలో ఉన్నప్పుడు మరణించినా లేదా రాజీనామా చేసిన సందర్భంలో రాష్ట్రపతి తాత్కాలిక గవర్నర్‌గా ఎవరిని నియమిస్తారు?

1) అటార్నీ జనరల్‌        2) అడ్వకేట్‌ జనరల్‌ 

3) రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి      4) లోక్‌ అదాలత్‌ ఛైర్మన్‌

జ: రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి​​​​​​​


7. రాష్ట్ర గవర్నర్‌ నియమించే పదవులకు సంబంధించి కిందివాటిలో సరికానిది ఏది? 

1) రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ఛైర్మన్, సభ్యులు   2) రాష్ట్ర ఆర్థిక సంఘం ఛైర్మన్, సభ్యులు    

3) అటార్నీ జనరల్‌                 4) అడ్వకేట్‌ జనరల్‌

జ: అటార్నీ జనరల్‌​​​​​​​


8. కింది ఏ రాష్ట్రాలకు చెందిన మంత్రిమండలిలో ‘గిరిజన సంక్షేమ మంత్రిత్వశాఖ’ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని సంబంధిత రాష్ట్ర గవర్నర్‌ ఆదేశించగలరు?

1) ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా    2) ఒడిశా, బిహార్, మేఘాలయ, త్రిపుర

3) మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, మణిపుర్, త్రిపుర     4) మేఘాలయ, ఝార్ఖండ్, త్రిపుర, నాగాలాండ్‌

జ: ఛత్తీస్‌గఢ్‌, మధ్యప్రదేశ్, ఝార్ఖండ్, ఒడిశా​​​​​​​


9. గవర్నర్‌కు సంబంధించి కిందివాటిలో సరైంది?

ఎ) రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారు.

బి) రాష్ట్రపతి విశ్వాసం ఉన్నంతవరకు గవర్నర్‌ పదవీకాలం ఉంటుంది.

సి) రాజ్యాంగాన్ని సంరక్షిస్తానని గవర్నర్‌ ప్రమాణ స్వీకారం చేస్తారు.

డి) రాష్ట్ర శాసనసభలో అంతర్భాగంగా కొనసాగుతారు.

1) ఎ, బి, సి      2) ఎ, సి, డి          3) ఎ, బి, డి      4) పైవన్నీ

జ: పైవన్నీ​​​​​​​


10. గవర్నర్‌ కింది ఏ ఆర్టికల్‌ ప్రకారం ముఖ్యమంత్రి, మంత్రిమండలి సభ్యులను నియమిస్తారు?

1) ఆర్టికల్‌ 164(1)    2) ఆర్టికల్‌ 166(1)     3) ఆర్టికల్‌ 167(1)      4) ఆర్టికల్‌ 168(2)

జ: ఆర్టికల్‌ 164(1)​​​​​​​


11. గవర్నర్‌ న్యాయ/ క్షమాభిక్ష అధికారాల గురించి రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌లో పేర్కొన్నారు?

1) ఆర్టికల్‌ 159       2) ఆర్టికల్‌ 160       3) ఆర్టికల్‌ 161       4) ఆర్టికల్‌ 162

జ: ఆర్టికల్‌ 161​​​​​​​


12. గవర్నర్‌ న్యాయాధికారాలకు సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?  

ఎ) సైనిక న్యాయస్థానాలు విధించిన శిక్షలకు క్షమాభిక్ష ప్రసాదిస్తారు.

బి) మరణశిక్షలను క్షమాభిక్ష ద్వారా రద్దుచేయలేరు.

సి) హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిని సంప్రదించి, జిల్లాస్థాయి న్యాయమూర్తులను నియమిస్తారు.

డి) రాష్ట్ర మంత్రిమండలి సిఫార్సుల మేరకే గవర్నర్‌ క్షమాభిక్ష అధికారాలను ఉపయోగించాలి.

1) ఎ, బి, సి          2) ఎ, సి, డి          3) బి, సి, డి          4) పైవన్నీ

జ: బి, సి, డి​​​​​​​


13. 1984లో ఆంధ్రప్రదేశ్‌లో ఎన్‌.టి.రామారావు ప్రభుత్వాన్ని రద్దుచేసి, నాదెండ్ల భాస్కరరావుని ముఖ్యమంత్రిగా నియమించిన అప్పటి గవర్నర్‌ ఎవరు?

1) ఠాకూర్‌ రాం లాల్‌      2) భికాజీ నారాయణ్‌     3) శంకర్‌దయాళ్‌శర్మ     4) కె.కృష్ణకాంత్‌

జ: ఠాకూర్‌ రాం లాల్‌​​​​​​​


14. ముఖ్యమంత్రి నాయకత్వంలోని రాష్ట్రమంత్రిమండలి ఎవరికి సమష్టి బాధ్యత వహిస్తుంది?

1) గవర్నర్‌      2) రాష్ట్రపతి      3) శాసనసభ      4) హైకోర్టు

జ: శాసనసభ​​​​​​​


15. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 164(1) (A) ప్రకారం రాష్ట్రమంత్రిమండలి సభ్యుల సంఖ్యను ఎలా నిర్ణయించారు? (91వ రాజ్యాంగ సవరణ చట్టం 2003 ద్వారా  ఈ నిర్ణయం తీసుకున్నారు.)

1) విధానసభ సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు.

2) విధానసభ సభ్యుల సంఖ్యలో 6% మించకూడదు.

3) విధానసభ సభ్యుల సంఖ్యలో 1/3 వ వంతు మించకూడదు.

4) విధానసభ సభ్యుల సంఖ్యలో 10% మించకూడదు.

జ: విధానసభ సభ్యుల సంఖ్యలో 15% మించకూడదు.​​​​​​​


16. కిందివాటిలో సరైనవి ఏవి? 

ఎ) మనదేశంలో తొలి మహిళా ముఖ్యమంత్రి - సుచేత కృపలానీ

బి) మనదేశంలో తొలి దళిత ముఖ్యమంత్రి - దామోదరం సంజీవయ్య

సి) మనదేశంలో తొలి దళిత మహిళా ముఖ్యమంత్రి - మాయావతి

డి) పదవిలో ఉండగా మరణించిన తొలి ముఖ్యమంత్రి - వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డి

1) ఎ, బి, సి        2) ఎ, సి, డి        3) ఎ, బి, డి         4) పైవన్నీ 

జ: ఎ, బి, సి​​​​​​​


17. ముఖ్యమంత్రికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) రాష్ట్ర కేబినెట్‌కు అధ్యక్షత వహిస్తారు.

బి) రాష్ట్ర ప్రభుత్వ అధినేతగా వ్యవహరిస్తారు.

సి) ముఖ్యమంత్రి మరణించినా లేదా రాజీనామా చేసినా మంత్రిమండలి రద్దవుతుంది.

1) ఎ, బి            2)  ఎ, సి          3) బి, సి           4) పైవన్నీ 

జ: పైవన్నీ​​​​​​​


18. రాష్ట్ర శాసనసభ సమావేశాలు లేనప్పుడు, ముఖ్యమంత్రి నేతృత్వంలోని రాష్ట్రమంత్రిమండలి సిఫార్సుల మేరకు రాజ్యాంగంలోని ఏ ఆర్టికల్‌ ప్రకారం గవర్నర్‌ ‘ఆర్డినెన్స్‌’ జారీ చేస్తారు?

1) ఆర్టికల్‌ 213      2) ఆర్టికల్‌ 216      3) ఆర్టికల్‌ 123      4) ఆర్టికల్‌ 201

జ: ఆర్టికల్‌ 213 ​​​​​​​


19. 91వ రాజ్యాంగ సవరణ చట్టం, 2003 ప్రకారం రాష్ట్రమంత్రిమండలి సభ్యుల సంఖ్య ఎంతకంటే తక్కువ ఉండకూడదు?

1) 12      2) 14       3) 15      4) 21

జ: 12


20. రాష్ట్ర శాసనసభలో సభ్యత్వంలేని వ్యక్తిని ముఖ్యమంత్రిగా/ మంత్రిగా నియమిస్తే ఎంతకాలంలోగా శాసనసభకు ఎన్నిక కాకపోతే ఆ వ్యక్తి పదవిని కోల్పోతారు?

1) 21 రోజులు      2) 45 రోజులు          3) 3 నెలలు       4) 6 నెలలు

జ: 6 నెలలు​​​​​​​


21. హైదరాబాద్‌ రాష్ట్రానికి తొలి, చివరి ముఖ్యమంత్రిగా ఎవరు వ్యవహరించారు?

1) దామోదరం సంజీవయ్య       2) బూర్గుల రామకృష్ణారావు 

3) భవనం వెంకట్రావు      4) కాసు బ్రహ్మానందరెడ్డి

జ: బూర్గుల రామకృష్ణారావు ​​​​​​​


22. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 267(2) ప్రకారం ‘రాష్ట్ర అసంఘటిత నిధి’ ఎవరి నియంత్రణలో ఉంటుంది?

1) రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా        2) ముఖ్యమంత్రి   

 3) గవర్నర్‌               4) కంప్ట్రోలర్‌ అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ 

జ: గవర్నర్‌​​​​​​​


23. గవర్నర్‌ వ్యవస్థపై సర్కారియా కమిషన్‌ చేసిన సిఫార్సుల్లో కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) రాజకీయాల్లో క్రియాశీలకంగా ఉన్న వారిని గవర్నర్‌గా నియమించకూడదు.

బి) గవర్నర్‌గా పనిచేసిన వారు క్రియాశీలక రాజకీయాల్లో కొనసాగకూడదు.

సి) ఒక వ్యక్తిని తన సొంత రాష్ట్రానికి గవర్నర్‌గా నియమించకూడదు.

డి) ఒక వ్యక్తిని ఏ రాష్ట్రానికి గవర్నర్‌గా నియమిస్తున్నారో ఆ రాష్ట్ర ముఖ్యమంత్రికి ముందస్తు సమాచారం ఇవ్వాలి.

1) ఎ, బి, డి         2) ఎ, సి, డి      3) ఎ, బి, సి        4) పైవన్నీ

జ: పైవన్నీ​​

Posted Date : 28-08-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌