• facebook
  • whatsapp
  • telegram

వృక్షరాజ్య వర్గీకరణ

1. కిందివాటిలో సరైన వాక్యాలేవి?

i) మొక్కల పెరుగుదల, అభివృద్ధిని నియంత్రించే అంతర్గత కారకాలే ఫైటోహార్మోన్‌లు

ii) ఫైటోహార్మోన్‌లు మొక్కల్లో చాలా తక్కువ గాఢతలో ఉంటాయి.

iii) ఆక్సిన్‌లు, జిబ్బరెల్లిన్‌లు, సైటోకైనిన్‌లు మొదలైనవి ఫైటోహార్మోన్‌లకు కొన్ని ఉదాహరణలు.

iv) సుమారు అన్ని భాగాల్లో ఈ ఫైటోహార్మోన్‌లు ఉత్పత్తవుతాయి.

జ‌: i, ii, iii, iv 

2. కిందివాటిలో ఆక్సిన్‌ విధి కానిది?

1) కాలస్‌ ఏర్పాటును ప్రేరేపిస్తుంది

2) కణ విభజనను కలిగిస్తుంది

3) సుప్తావస్థను కలిగిస్తుంది

4) అగ్రాధిక్యతకు కారకం అవుతుంది

జ‌: సుప్తావస్థను కలిగిస్తుంది

3. మొక్కలు పడిపోకుండా ఉండటానికి కింది ఏ ఫైటోహార్మోన్‌ ఒక ప్రధాన కారణం?

జ‌: ఆక్సిన్‌     

  

4. కిందివాటిలో సహజ ఆక్సిన్‌ ఏది?

1) ఇండోల్‌  3  ఎసిటిక్‌ ఆమ్లం

2) నాఫ్తలీన్‌ ఎసిటిక్‌ ఆమ్లం

3) 2, 4  డైక్లోరో ఫినాక్సీ ఎసిటిక్‌ ఆమ్లం

4) 2, 4, 5  ట్రై క్లోరో ఫినాక్సీ ఎసిటిక్‌ ఆమ్లం

జ‌: ఇండోల్‌  3  ఎసిటిక్‌ ఆమ్లం

5. ఇండోల్‌  3 ఎసిటిక్‌ ఆమ్లం (IAA) ఉత్పత్తి కావడానికి అవసరమైన పదార్థం?

జ‌: ట్రిప్టోఫాన్‌

6. వేరుబుడిపెల ఏర్పాటును ప్రేరేపించే ఆక్సిన్‌ ఏది?

జ‌: IAA      

7. కిందివాటిలో ఆక్సిన్‌ రవాణా ఏ విధానం ద్వారా జరుగుతుంది?

1) వృత్తాకార మార్గంలో  2) ధ్రువాల వైపు పయనం    

3) ఎపోప్లాస్ట్‌ మార్గంలో   4) అవభాసిని మార్గంలో    

జ‌: ధ్రువాల వైపు పయనం     

8. వియత్నాంతో జరిగిన యుద్ధంలో అమెరికా ఉపయోగించిన ఏ ఫైటోహార్మోన్‌ మిశ్రమాన్ని ఏజెంట్‌ ఆరెంజ్‌ అని పిలుస్తారు?

జ‌: 2, 4 - D; 2, 4, 5 -  T

9. వేర్ల ఉత్పత్తిని ప్రేరేపించే ఫైటోహార్మోన్‌గా విరివిగా ఉపయోగించే వృక్షవృద్ధి నియంత్రకం ఏది?

జ‌: NAA         

10. కిందివాటిలో వాయురూప ఫైటోహార్మోన్‌ ఏది?

1) నాఫ్తలీన్‌ ఎసిటిక్‌ ఆమ్లం    2) ఇండైల్‌ బ్యుటైరిక్‌ ఆమ్లం    

3) ఇండోల్‌ ఎసిటిక్‌ ఆమ్లం     4) ఎథిలీన్‌

జ‌: ఎథిలీన్‌

11. కిందివాటిలో మొక్కల వృద్ధి నిరోధకం కానిది ఏది?

1) డార్మిన్‌      2) అబ్‌సైసిక్‌ ఆమ్లం   

3) ఎథిలీన్‌     4) ఇండోల్‌ ఎసిటిక్‌ ఆమ్లం  

జ‌: ఇండోల్‌ ఎసిటిక్‌ ఆమ్లం

12. కిందివాటిలో ఏ ఫైటోహార్మోన్‌ ఫలాల పక్వస్థితికి కారణంగా పేర్కొనవచ్చు?

1) IAA       2) ఎథిలీన్‌     3) సైటోకైనిన్‌లు   4) అబ్‌సైసిక్‌ ఆమ్లం

జ‌: ఎథిలీన్‌

13. కింది ఏ ఫైటోహార్మోన్‌  RNA, ప్రోటీన్‌ల తయారీకి సహకరిస్తుంది?

1) జిబ్బరెల్లిన్‌లు    2) ఆక్సిన్‌లు   

3) సైటోకైనిన్‌లు    4) బ్రాసినోస్టెరాయిడ్‌లు  

జ‌: సైటోకైనిన్‌లు

14. విత్తన సుప్తావస్థను నిరోధించే ఫైటో హార్మోన్‌ ఏది?

జ‌: జిబ్బరెల్లిన్‌లు

15. కిందివాటిలో పత్రాల్లో ఉత్పత్తి అయ్యి, పుష్పించడాన్ని ప్రేరేపించే హార్మోన్‌ ఏది?

1) ఫ్లోరిజెన్స్‌       2) టర్మెరిన్‌    

3) జిబ్బరెల్లిన్‌     4) టెర్పినాయిడ్‌లు

జ‌: ఫ్లోరిజెన్స్‌

16. కిందివాటిలో ఫైటోహార్మోన్‌ కానిది ఏది?

1) కార్టికోస్టెరాయిడ్‌లు    2) బ్రాసినోస్టెరాయిడ్‌లు

3) పోలీ ఎమైన్‌లు    4) సాలిసిలిక్‌ ఆమ్లం

జ‌: కార్టికోస్టెరాయిడ్‌లు  

17. ఆక్సిన్‌లను మొదటిసారిగా ఏ మొక్కలో కనుక్కున్నారు?

జ‌: ఓట్స్‌       

18. బోల్టింగ్‌ అంటే ఏమిటి?

జ‌: పుష్పించడానికి ముందు జరిగే కణుపు మధ్యమాల పెరుగుదల 

19. కిందివాటిలో మొదట గుర్తించిన, సహజ ఉనికిని ప్రదర్శించే సైటోకైనిన్‌ ఏది?

1) నియోజాంథిన్‌   2) జియాటిన్‌      3) జాంథిన్‌   

4) ఐసో పెరిటినైల్‌ గ్వానిన్‌ సల్ఫేట్‌

జ‌: జియాటిన్‌

20. పత్ర జీర్ణత జరగకుండా చూసే ఫైటోహార్మోన్‌ ఏది?

జ‌:  సైటోకైనిన్‌  

21. కిందివాటిలో మొక్కలకు సంబంధించి ప్రతిబల హార్మోన్‌ లేదా స్ట్రెస్‌ హార్మోన్‌ అని పేరొందిన ఫైటోహార్మోన్‌ ఏది?

1) బ్రాసినోస్టెరాయిడ్‌         2) అబ్‌సైసిక్‌ ఆమ్లం  

3) సైటోకైనిన్‌లు         4) ఇండోల్‌ ఎసిటిక్‌ ఆమ్లం

జ‌: అబ్‌సైసిక్‌ ఆమ్లం

22. కింది ఏ వృద్ధి నియంత్రక లోపం వల్ల మొక్కల్లో వామనత్వం గమనించవచ్చు?

1) ఎథిలీన్‌           2) అబ్‌సైసిక్‌ ఆమ్లం   

3) బ్రాసినోస్టెరాయిడ్‌     4) జిబ్బరెల్లిన్‌

జ‌: బ్రాసినోస్టెరాయిడ్‌

23. ఫైటోట్రాన్‌ అంటే ఏమిటి?

జ‌: నియంత్రిత వాతావరణ పరిస్థితుల్లో మొక్కలు పెంచే ప్రదేశం

24. వ్యవసాయ రంగంలో ఫైటోహార్మోన్‌లను ఏ విధంగా ఉపయోగిస్తారు?

i) అనిషేక ఫలాలను ఉత్పత్తి చేయడానికి 

ii) అంటుకట్టినప్పుడు ఉపయోగించడం వల్ల మంచి ఫలితాలు వస్తాయి.

iii) ఫలాలు త్వరగా పక్వస్థితి పొందేలా చేయడానికి

జ‌: i, ii, iii

25. కిందివాటిలో ఫైటోహార్మోన్‌లను ఉత్పత్తి చేయలేని కణజాలాలు ఏవి?

i) దారువు         ii) మృదు కణజాలం   

iii) పోషక కణజాలం  

iv) దృఢ కణజాలం లేదా స్ల్కీరెన్‌ఖైమా

జ‌: i, iv       

26. ఫైటోహార్మోన్‌లు సాధారణంగా ...... సమ్మేళనాలు?

జ‌: అరోమాటిక్‌ సమ్మేళనాలు

27. కిందివాటిలో ఏ సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ఫైటోహార్మోన్‌లను గుర్తించడం, వేరుచేయడం వీలుపడుతుంది?

1) గ్రేస్‌ క్రొమటోగ్రఫీ        2) ఆటోరేడియోగ్రఫీ   

4) ఆల్ట్రా ఫ్రేక్షనేషన్‌       4) అంశిక స్వేదనం

జ‌: గ్రేస్‌ క్రొమటోగ్రఫీ 

28. కిందివాటిలో దేనివల్ల లెగ్యూమ్‌ మొక్కల్లో విత్తనాలు సుప్తావస్థను ప్రదర్శిస్తాయి?

1) అపరిపక్వంగా, అసంపూర్ణంగా అభివృద్ధి చెందిన పిండం వల్ల 

2) చాలా దృఢమైన కణ కవచం వల్ల

3) సైటోకైనిన్‌ అనే హార్మోన్‌ లోపించడం వల్ల

4) విత్తనాల అంకురచ్ఛదంలో జిబ్బరెల్లిన్‌ ఆమ్లం ఉండటం వల్ల

జ‌: చాలా దృఢమైన కణ కవచం వల్ల

29. కిందివాటిలో వృద్ధి నిరోధకం కానిదాన్ని గుర్తించండి.

1) అబ్‌సైసిక్‌ ఆమ్లం       2) డార్మిన్‌   

3) ఇథైలీన్‌     4) ఇండోల్‌  3  ఎసిటిక్‌ ఆమ్లం

జ‌: ఇండోల్‌  3  ఎసిటిక్‌ ఆమ్లం

30. కిందివాటిని జతపరచండి.

 జాబితా - ఎ      జాబితా - బి
1) ఇండోల్‌ ఎసిటిక్‌ ఆమ్లం  a) బోల్టింగ్‌
ii) అబ్‌సైసిక్‌ ఆమ్లం    b) పత్రరంధ్రాలు మూసుకోవడం
iii) ఎథిలీన్‌ c) గుల్మనాశకం
iv) జిబ్బరెల్లిక్‌ ఆమ్లం d) ఫలాల పక్వం

జ‌: i-c, ii-b, iii-d, iv-a

31. చెరకు మొక్కల్లో చక్కెర స్థాయిని అధికంగా ఉత్పత్తి చేయడానికి కింది ఏ ఫైటోహార్మోన్‌ను బాహ్యంగా ఉపయోగిస్తారు?

జ‌: జిబ్బరెల్లిన్‌  

32. మొక్కల్లో మొగ్గల సుప్తావస్థను ప్రేరేపించే వృద్ధి నియంత్రకం ఏది?

జ‌: ABA      

33. రిఫ్రిజరేటర్‌లో నిల్వచేసిన ఫలాల్లో రుచి, తాజాదనం అలాగే ఉండటానికి కారణం?

జ‌: శ్వాసక్రియ రేటు బాగా తక్కువగా ఉండటం

34. జిబ్బరెల్లిన్‌లకు వ్యతిరేకంగా శరీరధర్మక్రియలను చూపే ఫైటోహార్మోన్‌ ఏది?

జ‌: అబ్‌సైసిక్‌ ఆమ్లం  

35. సంశ్లేషిత వృద్ధి నియంత్రకాలైన  IAA, IBA, NAA లాంటివి ప్రయోగించడం వల్ల కిందివాటిలో ఏ ప్రయోజనాలు సాధించవచ్చు?

 జ‌: లేతదశలో ఫలాలు రాలడాన్ని నియంత్రించడం ద్వారా ఫలసాయాన్ని పెంచవచ్చు. అనిషేక ఫలాలను ఉత్పత్తి చేయొచ్చు.

36. కిందివాటిలో సైటోకైనిన్‌లను సహజంగా ఉత్పత్తి చేసే కణజాలం ఏది?

1) జీర్ణత్వం చెందుతున్న హరిత కణజాలం 

2) వేగంగా విభజన చెందుతున్న జీవకణాలు 

3) ఆహారాన్ని నిల్వ చేసే మృదుకణజాలం 

4) విభేదనం చూపే కణజాల వ్యవస్థ

జ‌: వేగంగా విభజన చెందుతున్న జీవకణాలు

37. కిందివాటిలో బలహీన ఆమ్లత్వాన్ని ప్రదర్శించే ఫైటోహార్మోన్‌లు ఏవి?

i) ఆక్సిన్‌లు       ii) జిబ్బరెల్లిన్‌లు        iii)  సైటోకైనిన్‌లు  

జ‌: i, ii         

38. కిందివాటిలో క్షారత్వాన్ని  ప్రదర్శించే ఫైటోహార్మోన్‌లు ఏవి?

జ‌:  సైటోకైనిన్‌లు     

39. బ్రాసినోస్టెరాయిడ్‌లు కిందివాటిలో దేన్ని పెంచడానికి సహాయపడతాయి?

జ‌: కణవిభజన    

40. పుష్పించడానికి సహకరించే హార్మోన్‌లు ఏవి?

జ‌: వెర్నలిన్, ఫ్లోరిజన్‌ 

41. పాలీఅమైన్‌ అనే ఫైటోహార్మోన్‌లు వేటిని కలిగి ఉంటాయి?

జ‌: రెండు లేదా ఎక్కువ ఎమైన్‌ సమూహాలు

42. కిందివాటిలో పాలీఎమైన్‌లకు ఉదాహరణ కానిది?

జ‌:  లిథర్జిన్‌ 

మొక్కల కణజాల శాస్త్రం

1. ఒకేదాని నుంచి ఉత్పత్తి అయ్యి, ఒకే రకానికి చెంది, సాధారణంగా ఒకే సామాన్య విధిని నిర్వర్తించే కణాల సమూహాన్ని ఏమంటారు?

జ‌: కణజాలం       

2. మొక్కల్లో కణజాలాలు ఏ వర్గాలుగా విభజితమయ్యాయి?

జ‌: విభాజ్య కణజాలం, శాశ్వత కణజాలం

3. మొక్కల్లో పెరుగుదల చురుకుగా విభజన చెందే ప్రత్యేక ప్రదేశాలకు మాత్రమే పరిమితమవుతుంది. ఇలాంటి ప్రదేశాలను ఏమంటారు?

జ‌: మెరిస్టెమ్స్‌      

4. వేరు, ప్రకాండం కొనల్లో ఉండే ప్రాథమిక కణజాలాన్ని ఉత్పత్తి చేసే విభాజ్య కణాల్ని ఏమంటారు?

జ‌:  అగ్ర విభాజ్య కణజాలం

5. దారుయుత అక్షాలను ఉత్పత్తిచేసే, అనేక మొక్కల వేర్లు, ప్రకాండాల పరిపక్వ ప్రదేశాల్లో ఉండే విభాజ్య కణజాలాన్ని ఏమంటారు?

జ‌: ద్వితీయ విభాజ్య కణజాలం

6. ప్రాథమిక, ద్వితీయ విభాజ్య కణజాలాల్లోని కణాలు విభజన చెందాక వాటి నుంచి ఏర్పడే కొత్త కణాలు నిర్మాణాత్మకంగా, క్రియాత్మకంగా ఉండి, విభజన శక్తిని కోల్పోతాయి. ఇలాంటి కణాలను ఏమంటారు?

జ‌: శాశ్వత కణజాలాలు     

7. కిందివాటిలో సరైన వాక్యాలేవి?

i. శాశ్వత కణజాలాల్లోని కణాలు సాధారణంగా విభజన చెందవు.

ii. నిర్మాణంలోనూ, విధిలోనూ ఒకే రకంగా ఉండే శాశ్వత కణజాలాల్లోని కణాలను సరళ కణజాలాలు అంటారు.

iii. అనేక భిన్న రకాల కణాలను కలిగి ఉండే శాశ్వత కణజాలాలను సంక్లిష్ట కణజాలాలు అంటారు.

జ‌: i, ii, iii

8. కిందివాటిలో సరళ కణజాలాలు ఏవి?

i. మృదు కణజాలం (సీరంఖైమా)

ii. స్థూల కోణ కణజాలం (కోలెన్‌ఖైమా)

iii. దృఢ కణజాలం (స్ల్కీరెంఖైమా)

జ‌: i, ii, iii

9. మొక్కల దేహం అధికభాగం ఏ కణజాలంతో నిర్మితమై ఉంటుంది?

జ‌: మృదు కణజాలం   

10. కిందివాటిలో మృదు కణజాలానికి సంబంధించి సరైన వాక్యాలు ఏవి?

i. వీటి కణ కవచాలు పలుచగా ఉండి, సెల్యులోజ్‌తో నిర్మితమై ఉంటాయి.

ii. ఈ కణజాలంలో కణాలు దగ్గరగా పేర్చినట్లు ఉండొచ్చు. కొన్నిసార్లు చిన్న కణాంతర అవకాశాలను కలిగి ఉండొచ్చు.

iii. మృదు కణజాలంలోని కణాలు సాధారణంగా సమవ్యాసంలో ఉంటాయి.

జ‌:  i, ii, iii

11. మొక్కల్లో మృదు కణజాలం కిరణజన్య సంయోగక్రియను నిర్వర్తించడాన్ని ఏమంటారు?

జ‌: క్లోరెంఖైమా   

12. స్థూలకోణ కణజాలానికి సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలేవి?

i. ఇది ద్విదళ బీజ మొక్కల బాహ్య చర్మం దిగువన పొరలుగా ఉంటుంది.

ii. ఇది సజాతీయ పొరగా లేదా చిన్న చిన్న భాగాలుగా విస్తరించి ఉంటుంది.

iii. ఈ కణాల మూలాలు సెల్యులోజ్, హెమీసెల్యులోజ్, పెక్టిన్‌లతో అవక్షేపితమై ఉంటాయి.

iv. ఈ కణాలు లేత కాండం, పత్రవృంతం లాంటి పెరుగుదలను ప్రదర్శిస్తాయి. 

జ‌: i, ii, iii, iv

13. కిందివాటిలో నిర్జీవ కణజాలం ఏది?

1) దృఢ కణజాలం   2) మృదు కణజాలం

3) కోలెన్‌ఖైమా         4) క్లోరెంఖైమా

జ‌: దృఢ కణజాలం

14. కిందివాటిలో దృఢ కణజాలానికి సంబంధించి సరైన వాక్యాలేవి?

i. దృఢ కణజాలాలు పొడవైన, సన్నటి కణాలను కలిగి ఉంటాయి.

ii. వీటి కణ కవచాలు లిగ్నిన్‌ పూరితమై మందంగా ఉంటాయి.

iii. ఇవి సాధారణంగా నట్స్, ఫల కవచాల్లో, జామ లాంటి ఫలాల గుజ్జులో కనిపిస్తాయి.

iv. దృఢ కణజాలం మొక్కల భాగాలకు యాంత్రిక ఆధారాన్ని కలిగిస్తుంది.

జ‌:  i, ii, iii, iv

15. దృఢ కణజాల కణాలు ఎలా ఉంటాయి?

జ‌: నారలు, దృఢ కణాలు 

16. ఒకటి కంటే ఎక్కువ రకాలైన కణాలతో తయారయ్యే శాశ్వత కణజాలాలు?

జ‌: సంక్లిష్ట కణజాలాలు

17. కిందివాటిలో సంక్లిష్ట కణజాలాలు ఏవి?

i. దారువు                 ii. పోషక కణజాలం

iii. స్రావక కణజాలం      iv. బిదుర కణజాలం

జ‌: i, ii           

18. వేరు నుంచి కాండానికి, పత్రాలకు నీటిని, ఖనిజాలను సరఫరా చేసే కణజాలం?

జ‌:  దారువు

19. దారువు ఎన్ని రకాల మూలకాలతో తయారవుతుంది?

జ‌: 4

20. దారువుకు సంబంధించి కిందివాటిలో సరైన వాక్యాలేవి?

i. దారుకణాలు పొడవుగా, గొట్టంలా ఉంటాయి.

ii. దారుకణాలు నిర్జీవమైనవి.

iii. దారుకణాల కణకవచం లిగ్నిన్‌తో నిర్మితమై ఉంటుంది.

iv. పుష్పించే మొక్కల్లో దారుకణాలు, దారునాళాలు నీటిని ప్రసరింపజేసే ప్రధాన మూలకాలు.

జ‌: i, ii, iii, iv

21. దారునాళాలు ఏ మొక్కల్లో విశేషంగా కనిపిస్తాయి?

జ‌:  ఏంజియోస్పెర్మ్‌లు

22. కిందివాటిలో దారు మూలకాలను గుర్తించండి.

i. దారుకణాలు (ట్రాకీడులు)

ii. దారునాళాలు (వెసల్స్‌)

iii. దారునాడులు (జైలమ్‌ ఫైబర్‌లు)

iv. దారు మృదు కణజాలం (జైలమ్‌ పేరంఖైమా)

జ‌: i, ii, iii, iv

23. ముందుగా ఏర్పడే ప్రాథమిక దారు మూలకాలు ఏవి?

జ‌: ప్రథమ దారువు  

24. అంతర ప్రథమదారుక స్థితిని వేటి అంతర్నిర్మాణంలో గమనించవచ్చు?

జ‌:  కాండం       

25. అంతప్రథమ దారుకస్థితి అంటే?

జ‌: ప్రథమ దారువు కేంద్రం వైపు, అంత్యదారువు వెలుపలి వైపు అమరి ఉండటం.

26. వేరు అంతర్నిర్మాణంలో ప్రథమ దారువు సాధారణంగా ఎక్కడ అమరి ఉంటుంది?

జ‌: పరిధివైపు లేదా బాహ్యంగా

27. ఏ కణజాలం పత్రాల నుంచి మొక్క ఇతర భాగాలకు ఆహార పదార్థాలను రవాణా చేస్తుంది?

జ‌: పోషక కణజాలం 

28. ఆవృత బీజాల్లోని పోషక కణజాలంలో ఉండే ప్రధాన మూలకాలు?

i. చాలనీనాళ మూలకాలు               ii. సహ కణాలు

iii. పోషక కణజాల మృదు కణజాలం  iv. పోషక కణజాల నారలు

జ‌: i, ii, iii, iv     

29. జూట్స్, ఫ్లాక్స్, హెంప్‌ లాంటి మొక్కల్లో వాణిజ్యపరంగా ఉపయోగపడే నారలు?

జ‌: బాస్ట్‌ ఫైబర్స్‌ 

30. పోషక కణజాల నారలు లోపించే లెప్టోమ్‌ కణజాలం ఏది?

జ‌:  ప్రాథమిక పోషక కణజాలం  

31. నిర్మాణం, స్థానాల రీత్యా కణజాల వ్యవస్థలు ఎన్ని రకాలుగా వ్యవస్థితమై ఉన్నాయి?

జ‌: 3  

32. కిందివాటిలో మొక్కల్లో కనిపించే కణజాల వ్యవస్థలను గుర్తించండి.

i. బాహ్యచర్మ కణజాల వ్యవస్థ

ii. సంధాయక లేదా మౌలిక కణజాల వ్యవస్థ

iii. నాళికా లేదా ప్రసరణ కణజాల వ్యవస్థ

జ‌: i, ii, iii     

33. బాహ్యచర్మ కణజాల వ్యవస్థ మొక్కల్లో వేటిని కలిగి ఉంటుంది?

i. బాహ్యచర్మ కణాలు   ii. పత్ర రంధ్రాలు

iii. బాహ్యచర్మ ఉపాంగాలు  iv. దారు కణజాలం

జ‌:  i, ii, iii      

34. అవభాసినిని కలిగి ఉండే కణజాల వ్యవస్థ?

జ‌: బాహ్యచర్మ కణజాల వ్యవస్థ 

35. కిందివాటిలో అవభాసిని లోపించే భాగం?

1) కాండం      2) పత్రం      

3) వేరు       4) ఎడారి మొక్క వాయుగత భాగం

జ‌:  వేరు 

Posted Date : 31-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌