• facebook
  • whatsapp
  • telegram

ఉపరాష్ట్రపతి

1. ఉపరాష్ట్రపతి పదవి గురించి రాజ్యాంగంలో ఎక్కడ వివరించారు?

జ‌:  5వ భాగం, ఆర్టికల్స్‌ 63 నుంచి 70


2. అమెరికాను స్ఫూర్తిగా తీసుకుని, ఉపరాష్ట్రపతి పదవిని ఏర్పాటు చేయాలని రాజ్యాంగ పరిషత్‌లో ఎవరు ప్రతిపాదించారు?

జ‌:  హెచ్‌.వి.కామత్‌


3. ‘ఉపరాష్ట్రపతి’ పదవికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ఉపరాష్ట్రపతిని ఎన్నుకునే ‘ఎలక్టోరల్‌ కాలేజ్‌’లో పార్లమెంట్‌ ఉభయ సభల మొత్తం సభ్యులు ఓటర్లుగా ఉంటారు.

బి) దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాలకు ఛాన్సలర్‌గా వ్యవహరిస్తారు.

సి) పార్లమెంట్‌ ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక  నిర్వహిస్తుంది.

డి) రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో జీతభత్యాలు పొందుతారు.

జ‌:  ఎ, బి, డి 


4. కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) ఆర్టికల్‌ 63 - భారతదేశానికి ఒక ఉపరాష్ట్రపతి ఉంటారు.

బి) ఆర్టికల్‌ 64 - పదవీరీత్యా ఉపరాష్ట్రపతి రాజ్యసభకు ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు.

సి) ఆర్టికల్‌ 65 - రాష్ట్రపతి పదవికి ఖాళీ ఏర్పడినప్పుడు ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తారు.

డి) ఆర్టికల్‌ 66 - ఉపరాష్ట్రపతిని రాజ్యసభ తొలగిస్తుంది.

జ‌:  ఎ, బి, సి     


5. ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేసే అభ్యర్థికి ఉండాల్సిన అర్హతలకు సంబంధించి కిందివాటిలో సరికానిది?

1) 35 సంవత్సరాలు నిండిన భారతీయ పౌరుడై ఉండాలి.

2) రాజ్యసభకు ఎన్నికవ్వడానికి అవసరమైన అర్హతలు ఉండాలి

3) నామినేషన్‌ పత్రంతోపాటు రూ.15,000 ధరావతుగా చెల్లించాలి.

4) కనీస విద్యార్హతలను కలిగి ఉండాలి.

జ‌: కనీస విద్యార్హతలను కలిగి ఉండాలి.


6. ఉపరాష్ట్రపతి పదవికి రహస్య ఓటింగ్‌ విధానం ద్వారా ఎన్నిక జరపాలని ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా నిర్దేశించారు?

జ‌:  11వ రాజ్యాంగ సవరణ చట్టం, 1961


7. ఉపరాష్ట్రపతి పదవికి పోటీచేసే అభ్యర్థి నామినేషన్‌ పత్రాన్ని ఎలక్టోరల్‌ కాలేజ్‌లోని ఎంతమంది సభ్యులు ప్రతిపాదించి, ఎంతమంది సభ్యులు బలపరచాలి?

జ‌:  20 మంది సభ్యులు ప్రతిపాదించి, 20 మంది సభ్యులు బలపరచాలి.


8. ఉపరాష్ట్రపతి రాజ్యసభ ఛైర్మన్‌ హోదాలో భారత సంఘటిత నిధి నుంచి నెలకు ఎంత వేతనం పొందుతారు?

జ‌: రూ.4,00,000  


9. ఉపరాష్ట్రపతి పదవికి సంబంధించి కిందివాటిలో సరైనవి ఏవి?

ఎ) పదవీకాలం అయిదేళ్లు

బి) రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించాలి.

సి) రాజ్యాంగం ప్రకారం ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిసార్లయినా పోటీచేయొచ్చు.

డి) సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో ప్రమాణ స్వీకారం చేయాలి.

జ‌:  ఎ, బి, సి     


10. రాజ్యసభలో ఏదైనా తీర్మానంపై ఓటింగ్‌ జరిగినప్పుడు అనుకూలంగా, వ్యతిరేకంగా సమానమైన ఓట్లు వస్తే, సభాధ్యక్షుడు వినియోగించే ఓటును ఏమంటారు?

జ‌:   కాస్టింగ్‌ ఓటు   


11. భారత ఉపరాష్ట్రపతి పదవిని ‘వేల్స్‌ యువరాజు’తో పోల్చింది ఎవరు?

జ‌: డా.బి.ఆర్‌.అంబేడ్కర్‌


12. కింది వారిలో ఉపరాష్ట్రపతి పదవిని రెండుసార్లు నిర్వహించింది ఎవరు?

1) డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, హమీద్‌ అన్సారీ

2) డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, కె.కృష్ణకాంత్‌

3) డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, కె.ఆర్‌.నారాయణన్‌

4) బైరాన్‌సింగ్‌ షెకావత్, హమీద్‌ అన్సారీ

జ‌:  డా.సర్వేపల్లి రాధాకృష్ణన్, హమీద్‌ అన్సారీ


13. ఏకగ్రీవంగా ఎన్నికైన ఉపరాష్ట్రపతులకు సంబంధించి కిందివారిలో సరికానిది?

1) సర్వేపల్లి రాధాకృష్ణన్‌ 

2) శంకర్‌ దయాళ్‌ శర్మ

3) హమీద్‌ అన్సారీ 

4) మహ్మద్‌ హిదయతుల్లా

జ‌:  హమీద్‌ అన్సారీ 


14. కె.ఆర్‌.నారాయణన్‌ ఉపరాష్ట్రపతిగా పనిచేసిన కాలం? (ఈయన మనదేశ తొలి దళిత ఉపరాష్ట్రపతి.)

జ‌: 1992- 97


15. కింది అంశాల్లో సరైనవి ఏవి?

ఎ) ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే సందర్భంలో రాజ్యసభ సమావేశాలకు అధ్యక్షత వహించకూడదు.

బి) ఉపరాష్ట్రపతి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సమక్షంలో తాత్కాలిక రాష్ట్రపతిగా ప్రమాణ స్వీకారం చేస్తారు.

సి) ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరించే సమయంలో రాష్ట్రపతి పొందే జీతభత్యాలు పొందుతారు.

డి) ఉపరాష్ట్రపతి తాత్కాలిక రాష్ట్రపతిగా వ్యవహరిస్తూ పదవికి రాజీనామా చేయాలనుకుంటే తన రాజీనామా పత్రాన్ని ప్రధానమంత్రికి సమర్పించాలి.

జ‌: ఎ, బి, సి     


16. వివిధ ఉపరాష్ట్రపతుల ఎన్నికల్లో వారి ప్రత్యర్థులకు సంబంధించి సరికాని జవాబును గుర్తించండి.

1) కె.ఆర్‌.నారాయణన్‌ - కాకా జోగిందర్‌సింగ్‌

2) కె.కృష్ణకాంత్‌ - సుర్జీత్‌సింగ్‌ బర్నాలా

3) భైరాన్‌సింగ్‌ షెకావత్‌ - నజ్మా హెప్తుల్లా

4) హమీద్‌ అన్సారీ - జస్వంత్‌ సింగ్‌

జ‌: భైరాన్‌సింగ్‌ షెకావత్‌ - నజ్మా హెప్తుల్లా


17. ఉపరాష్ట్రపతి పదవిని నిర్వహించి, రాష్ట్రపతి పదవికి పోటీచేసి, ఓడిపోయిన ఏకైక వ్యక్తి ఎవరు?

జ‌:  భైరాన్‌సింగ్‌ షెకావత్‌


18. కిందివారిలో ఉపరాష్ట్రపతులకు నిర్వహించిన ఎన్నిల్లో గెలిచి, వారికి ప్రత్యర్థులుగా నిలబడిన వారికి సంబంధించి సరికాని జత ఏది?

1) జాకీర్‌ హుస్సేన్‌ - సామంత్‌సింగ్‌

2) వి.వి.గిరి - ప్రొఫెసర్‌ హబీబ్ 

3) గోపాల్‌ స్వరూప్‌ పాఠక్‌ - హెచ్‌.వి.కామత్‌

4) బి.డి.జెట్టి - కె.టి.షా

జ‌:  బి.డి.జెట్టి - కె.టి.షా


19. భారతదేశానికి 15వ ఉపరాష్ట్రపతిగా ఎం.వెంకయ్యనాయుడు ఎప్పుడు పదవీ బాధ్యతలు చేపట్టారు?

జ‌:  2017, ఆగస్టు 11


20. ఉపరాష్ట్రపతి ఎన్నికలో ఎం.వెంకయ్యనాయుడు ప్రత్యర్థి ఎవరు?

జ‌:  గోపాలకృష్ణ గాంధీ 


21. ఎం.వెంకయ్యనాయుడు ఉపరాష్ట్రపతి కాకముందు ఏ పదవిలో ఉన్నారు?

ఎ) కర్ణాటక నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

బి) రాజస్థాన్‌ నుంచి రాజ్యసభకు ప్రాతినిధ్యం వహించారు.

సి) కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖా మంత్రిగా ఉన్నారు.

డి) కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖా మంత్రిగా వ్యవహరించారు.

జ‌:  ఎ, బి, సి     


22. రాజ్యసభ సభ్యుడిగా కొనసాగుతూ అదే సభకు ఛైర్మన్‌గా (ఉపరాష్ట్రపతి) ఎన్నికైన తొలి వ్యక్తి ఎవరు?

జ‌:   ఎం.వెంకయ్యనాయుడు 


గత పరీక్షల్లో అడిగిన ప్రశ్నలు


1. ఉపరాష్ట్రపతిని తొలగించే అభిశంసనను మొదట ఎక్కడ ప్రవేశపెట్టాలి? (డివిజనల్‌ అకౌంట్స్‌ ఆఫీసర్‌ 2011, టౌన్‌ ప్లానింగ్‌ ఆఫీసర్స్‌ 2020)

జ‌:   రాజ్యసభ     


2. ఉపరాష్ట్రపతి ఎక్స్‌అఫీషియో ఛైర్మన్‌గా ఉండే వ్యవస్థ? (వాటర్‌ వర్క్స్‌ మేనేజర్‌ 2009)

జ‌:   రాజ్యసభ  


3. పదవిలో ఉండగా మరణించిన మొదటి ఉపరాష్ట్రపతి? (జూనియర్‌ లెక్చరర్స్‌ 2007)

జ‌:  కె.కృష్ణకాంత్‌


4. భారత ఉపరాష్ట్రపతిని ఎన్నుకునేది ఎవరు?  (ఏపీపీఎస్సీ గ్రూప్‌-I 1987)

జ‌:  పార్లమెంట్‌ ఉభయ సభలకు చెందిన సభ్యులు

5. కింది వారిలో రెండుసార్లు ఉపరాష్ట్రపతిగా పనిచేసినవారు? (ఏపీపీఎస్సీ గ్రూప్‌-II 2002)

జ‌:  ఎస్‌.రాధాకృష్ణన్‌


6. కింది వారిలో ఏ ఇద్దరు ఉపరాష్ట్రపతులు తాత్కాలిక రాష్ట్రపతులుగా వ్యవహరించారు? (టీఎస్‌ సబ్‌ఇన్‌స్పెక్టర్స్‌ 2019)

1) కె.ఆర్‌.నారాయణన్, కృష్ణకాంత్‌               2) వి.వి.గిరి, బి.డి.జెట్టి

3) బి.డి.జెట్టి, ఆర్‌.వెంకట్రామన్‌                  4) ఎస్‌.రాధాకృష్ణన్, వి.వి.గిరి

జ‌:  వి.వి.గిరి, బి.డి.జెట్టి


7. ఆర్టికల్‌ 67 ప్రకారం ఉపరాష్ట్రపతిని తొలగించేందుకు స్పష్టత కావాలని మొదట ఎవరు కోరాలి?  (ఏపీపీఎస్సీ గ్రూప్‌-II 2018)

జ‌:  రాజ్యసభ


8. కిందివారిలో రాజ్యసభకు ఛైర్మన్‌గా ఎవరు వ్యవహరిస్తారు? (సబ్‌ఇన్‌స్పెక్టర్స్, కమ్యూనికేషన్స్‌ 2013)

1) రాజ్యసభ సభ్యులు ఎన్నుకున్న వ్యక్తి       2) లోక్‌సభ స్పీకర్‌     

3) ఉపరాష్ట్రపతి                     4) రాజ్యసభలో అత్యధిక సభ్యులు ఉన్న పార్టీ నాయకుడు

జ‌:  ఉపరాష్ట్రపతి   


9. కింది ఏ సందర్భంలో ఉపరాష్ట్రపతికి, రాష్ట్రపతిగా వ్యవహరించే అవకాశం ఉండదు?  (ఏపీ, సబ్‌ఇన్‌స్పెక్టర్స్‌ 2016)

1) రాష్ట్రపతిని మహాభియోగ తీర్మానం ద్వారా తొలగించిన కారణంగా ఖాళీ ఏర్పడినప్పుడు

2) రాష్ట్రపతి మరణంతో ఖాళీ ఏర్పడినప్పుడు

3) రాష్ట్రపతి పదవీకాలం పూర్తయిన కారణంగా ఖాళీ ఏర్పడినప్పుడు

4) రాష్ట్రపతి రాజీనామా కారణంగా ఖాళీ ఏర్పడినప్పుడు

జ‌:  రాష్ట్రపతి పదవీకాలం పూర్తయిన కారణంగా ఖాళీ ఏర్పడినప్పుడు


10. భారత ఉపరాష్ట్రపతికి సంబంధించి కిందివాటిలో సరైంది? (ఏపీపీఎస్సీ, గ్రూప్‌-I, 1983)

1) రాష్ట్రపతి నామినేట్‌ చేస్తారు            2) ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఎన్నుకుంటుంది

3) ప్రధానమంత్రి నియమిస్తారు           4) ఏదీకాదు

జ‌:  ఎలక్టోరల్‌ కాలేజ్‌ ఎన్నుకుంటుంది

Posted Date : 06-05-2022

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌