Post your question

 

    Asked By: ఎ. అరవింద్‌

    Ans:

    ఏ సబ్జెక్టులో డిగ్రీ పూర్తి చేసినవారికైనా పూర్వ విద్యార్హతలతో సంబంధం లేకుండా సమస్యా పరిష్కార సామర్థ్యం, కోడింగ్, ప్రోగ్రామింగ్, అనలిటికల్‌ నైపుణ్యాలు ఉంటే సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉద్యోగాలు లభించే అవకాశాలు ఎక్కువ. మీరు డిగ్రీ చేయడానికి తీసుకున్న ఎక్కువ సమయం పెద్ద సమస్య కాదు. డిగ్రీ పూర్తి చేశాక ఏ రంగంలో స్వయం ఉపాధి పొందుతున్నారో చెప్పలేదు. డిగ్రీలో వచ్చిన మార్కులను కాకుండా మీకున్న నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకొనే కంపెనీలు చాలా ఉన్నాయి. కంప్యూటర్‌ సైన్స్‌లో డిగ్రీ  చేయడం అనేది మీకో అదనపు అర్హత అవుతుంది. ముందుగా మీరు డిగ్రీలో చదివిన కంప్యూటర్‌ కోర్సులను మరొకసారి పూర్తిగా చదివి విషయ పరిజ్ఞానాన్ని మెరుగుపరచుకోండి. సాఫ్ట్‌వేర్‌లో ఉద్యోగం చెయ్యాలనుకుంటున్న రంగానికి సంబంధించి ప్రస్తుతం మార్కెట్‌లో డిమాండ్‌ ఉన్న కోర్సులను నేర్చుకోండి. కొన్ని లైవ్‌ ప్రాజెక్టుల్లో పనిచేసి మీ బయోడేటాను మెరుగుపర్చుకోండి. సాఫ్ట్‌వేర్‌ రంగంలో మెరుగైన ఉద్యోగాలు పొందాలంటే సీ‡, సీ‡ ప్లస్‌ ప్లస్, జావా, ఆర్‌ ప్రోగ్రామింగ్, పైతాన్, వెబ్‌ డెవలప్‌మెంట్, బిగ్‌ డేటా, మెషిన్‌ లర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటలిజెన్స్, బ్లాక్‌చైన్‌ టెక్నాలజీ, సైబర్‌ సెక్యూరిటీ, క్లౌడ్‌ కంప్యూటింగ్‌ లాంటి వాటిలో మీకు నచ్చిన కోర్సుల్ని చేసి సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం సంపాదించే ప్రయత్నం చేయండి. - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌ 

    Asked By: Lingala

    Ans:

    సిలబస్‌ ప్రకారం తెలుగు అకాడమీ ప్రచురించిన పుస్తకాలు (ఇంగ్లిష్‌/ తెలుగు మీడియం) చదవండి.

    Asked By: జార్జి ముల్లార్‌

    Ans:

    ఇంటర్‌ చదివిన తరువాత మీకున్న చాలా అవకాశాల్లో డిగ్రీ, ఇంజినీరింగ్‌ అనేవి రెండు ముఖ్యమైన మార్గాలు. ఇప్పుడు మీరు తీసుకోబోయే నిర్ణయం మీ భావి జీవితాన్ని ఎంతో ప్రభావితం చేస్తుంది. ఇలాంటి కెరియర్‌ నిర్ణయం తీసుకోవడానికి ముందు మీ జీవితాశయం ఏమిటి? మీకు ఏ రంగంపై ఆసక్తి ఉంది? గతంలో మీరు రాసిన వార్షిక పరీక్షల్లో ఎన్ని మార్కులు పొందారు? మీ బలాలూ బలహీనతలూ ఏమిటి? మీ ముందున్న అవకాశాలూ, సవాళ్లు ఏమిటి? చదువుకు అయ్యే ఖర్చుకు ఎంత కాలం మీ కుటుంబ సహకారం ఉంటుంది?- ఇలాంటి విషయాలపై అవగాహన పొందాక ఏ కోర్సు చదవాలో నిర్ణయించుకోండి.
    ప్రతి కోర్సుకూ చాలా ఉద్యోగావకాశాలు ఉంటాయి. ఇంజినీరింగ్‌ చదివినవారికి ఉద్యోగం రాకపోవచ్చు; సాధారణ డిగ్రీ చదివినవారు ఐఏఎస్‌ కూడా అవ్వొచ్చు. ఏ కోర్సు చదివినా దాన్ని ఇష్టంతో, ప్రణాళికాబద్ధంగా చదివి, ఆ రంగంలో అత్యున్నత స్థాయికి వెళ్ళడానికి కావలసిన విషయ పరిజ్ఞానం, నైపుణ్యాలను అలవర్చుకోవాలి. అప్పుడే అద్భుతమైన భవిష్యత్తు సొంతమవుతుంది. మీకు పరిశోధన రంగంపై ఆసక్తి ఉంటే డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీలతో పాటు విదేశాల్లో పోస్ట్‌ డాక్టోరల్‌ పరిశోధన చేసి, దేశం గర్వించే శాస్త్రవేత్త అవ్వొచ్చు. అలాకాకుండా డిగ్రీ తరువాత కానీ, పీజీ తరువాత కానీ పోటీ పరీక్షలు రాసి మంచి ఉద్యోగం పొందవచ్చు. ఇంజినీరింగ్‌ విషయానికొస్తే ప్రవేశ పరీక్షలో మంచి ప్రతిభను కనపర్చి, ప్రముఖ విద్యాసంస్థలో ఈ కోర్సుని బాగా చదివితే మంచి వేతనంతో ఉద్యోగం సాధించవచ్చు. ఇంజినీరింగ్‌ రంగంలో పరిశోధనపై ఆసక్తి ఉంటే ఎంటెక్, పీహెచ్‌డీ చేసి, శాస్త్ర, సాంకేతిక రంగాల్లో శాస్త్రవేత్తగా స్థిరపడవచ్చు. డిగ్రీ అర్హత ఉన్న చాలా ప్రభుత్వ ఉద్యోగాలకు సాధారణ డిగ్రీతో పాటు ఇంజినీరింగ్‌ డిగ్రీ పొందినవారు కూడా అర్హులే. ఈ విషయాలన్నింటినీ దృష్టిలో పెట్టుకొని సరైన నిర్ణయం తీసుకోండి.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: jagadeeswara rao

    Ans:

    You need to write LAWCET to get admission into any Law course. As per your target Constitution related subjects specialization in Law course will be good.

    Asked By: జి. అరుణ్‌కుమార్‌

    Ans:

    మీరు బీఏ (హెచ్‌ఈపీ)లో చదివిన హిస్టరీ, ఎకనమిక్స్, పొలిటికల్‌ సైన్స్‌ల్లో మీకు బాగా నచ్చిన సబ్జెక్టులో ఎంఏ చేయవచ్చు. ఎకనమిక్స్‌ కోర్సులో విశిష్ట స్పెషలైజేషన్‌గా ఉన్న ఫైనాన్సియల్‌ ఎకనమిక్స్‌లోనూ ఎంఏ చేసే అవకాశం ఉంది. కొన్ని విశ్వవిద్యాలయాల్లో ఆంత్రపాలజీ, సోషియాలజీ, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషల్‌ వర్క్, సైకాలజీ, ఎడ్యుకేషన్, ఫిలాసఫీ లాంటి సబ్జెక్టుల్లో పీజీ చదవొచ్చు. డిగ్రీలో మీరు చదివిన ఇంగ్లిష్, తెలుగు/ హిందీ/ సంస్కృతంలో పీజీ చేయవచ్చు. భాషాశాస్త్రంపై ఆసక్తి ఉంటే లింగ్విస్టిక్స్‌లో పీజీ చదవొచ్చు. విభిన్న భాషా సాహిత్యాలపై తులనాత్మక అధ్యయనం చేయాలనుకొంటే కంపారిటివ్‌ లిటరేచర్‌లో ఎంఏ చేయొచ్చు.
    న్యాయశాస్త్రం మీద ఆసక్తి ఉన్నట్లయితే ఎల్‌ఎల్‌బీ/ బీఎల్‌ అవకాశమూ ఉంది. జర్నలిజం రంగంపై అభిరుచి ఉంటే అందులో పీజీ చేసి మీడియా రంగంలో ఉద్యోగం పొందవచ్చు. ఎంబీఏ కోర్సు చేసి, ఉద్యోగంలో త్వరగా స్థిరపడొచ్చు. డిగ్రీలో మీరు హిస్టరీ చదివారు కాబట్టి, టూరిజంలో పీజీ చదివే అవకాశాల గురించి ఆలోచించండి. పాఠశాలల్లో బోధన చేయాలనివుంటే బీఈడీ/ డీఈడీ చేసి ఉపాధ్యాయ వృత్తిలో స్థిరపడవచ్చు. వ్యాయామ విద్యపై ఆసక్తి ఉంటే బీపీఈడీ గురించి ఆలోచించవచ్చు. గ్రామీణాభివృద్ధి రంగంలో రూరల్‌ డెవలప్‌మెంట్‌ లో పీజీ చేయొచ్చు. మీరు ఇంటర్‌లో మేథమేటిక్స్‌ చదివివుంటే ఎంసీఏ కోర్సులో చేరే వీలుంది.
    - ప్రొ. బెల్లంకొండ రాజశేఖర్, కెరియర్‌ కౌన్సెలర్‌

    Asked By: Gamingi

    Ans:

    Till this date, no official announcement on Group 4 examination date.

    Asked By: Bandla

    Ans:

    సిలబస్ ప్రకారం ముందుగా ఆరో తరగతి నుంచి పీజీ వరకు ఉన్న తెలుగు అకాడమీ పాఠ్యపుస్తకాలు, పోటీ పరీక్షల కోసం తెలుగు అకాడమీ ప్రచురించిన జనరల్ స్టడీస్ పుస్తకాలు చదవచ్చు.  పాలిటీకి లక్ష్మీకాంత్ బుక్ తెలుగు మీడియంలో లభిస్తోంది. ఆధునిక భారత దేశ చరిత్ర - బిపిన్ చంద్ర, మధ్యయుగ చరిత్ర - కృష్ణారెడ్డి,  అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ పుస్తకాలు, జాగ్రఫీ-తెలుగు అకాడమీ, భారతీయ సమాజం - తెలుగు అకాడమీ పుస్తకాలు ఉపయోగకరం.

    ఎథిక్స్ అండ్ ఆప్టిట్యూడ్ కోసం మేజర్ పబ్లికేషన్ పుస్తకాలు, యోజన మ్యాగజీన్ లు, ప్రముఖ తెలుగు దినపత్రికలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తాజా బడ్జెట్ లు, సర్వేలు - ఇవన్నీ తెలుగు మీడియంలో లభిస్తున్నాయి.

    కావాల్సిన పుస్తకాలు సేకరించుకున్న తర్వాత సిలబస్ ప్రకారం అధ్యాయాలను చూసుకొని చదువుకోవాలి.

    ఈనాడు-ప్రతిభ వెబ్ సైట్ లో రెగ్యులర్ గా కరెంట్ అఫైర్స్ తెలుగు మీడియంలో అందుబాటులో ఉంటాయి. వాటినీ వినియోగించుకోవచ్చు. ఇంకా అనేక రకాల గైడెన్స్ ఆర్టికల్స్ కూడా రెగ్యులర్ గా అప్ డేట్ అవుతుంటాయి. వాటినీ రిఫరెన్స్ కి ఉపయోగించుకోవచ్చు.

     

    https://pratibha.eenadu.net/jobs/article/specialstories/upsc/civil-services-exam/telugu-medium/comprehensive-strategy-for-civils-prelims/2-1-1-1-22040000499

    https://pratibha.eenadu.net/jobs/index/upsc/civil-services-exam/telugu-medium/2-1-1-1

    https://pratibha.eenadu.net/jobs/article/specialstories/upsc/civil-services-exam/telugu-medium/education/2-1-1-1-22040000506