• facebook
  • whatsapp
  • telegram

దూర‌విద్య‌లో యూజీ, పీజీ, డిప్లొమా కోర్సులు

అంబేడ్క‌ర్ ఓపెన్ యూనివ‌ర్సిటీ ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

తెలుగు రాష్ట్రాల్లో దూరవిద్యకు చిరునామా డాక్టర్‌ బి.ఆర్‌.అంబేడ్కర్‌ సార్వత్రిక విశ్వవిద్యాలయం. కోరుకున్న కోర్సులు లభించటం, అభ్యసన కేంద్రాలు సమీపంలో ఉండటం, మెటీరియల్‌ నాణ్యత, తక్కువ ఫీజు... తదితర కారణాలతో ఈ సంస్థ అందరికీ దగ్గరైంది. తెలుగు మీడియంలో పీజీ కోర్సులు అందించడం ఈ విశ్వవిద్యాలయం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. తాజాగా 2022-2023 విద్యా సంవత్సరానికి యూజీ, పీజీ, పీజీ డిప్లొమా, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ప్రవేశానికి ఈ విశ్వవిద్యాలయం నుంచి ప్రకటన వెలువడింది!  

ఇవీ కోర్సులు...

ఎంఏ: ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ, జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్, ఇంగ్లిష్, హిందీ, తెలుగు, ఉర్దూ. వీటిలో ఎకనామిక్స్, హిస్టరీ, పొలిటికల్‌ సైన్స్, పబ్లిక్‌ అడ్మినిస్ట్రేషన్, సోషియాలజీ కోర్సులను తెలుగు మాధ్యమంలోనే అందిస్తున్నారు. స్టడీ మెటీరియల్‌ కూడా తెలుగులోనే ఉంటుంది. అయితే పరీక్షలు మాత్రం తెలుగు/ఇంగ్లిష్‌లో రాసుకోవచ్చు. జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌ ఆంగ్ల మాధ్యమంలోనే లభిస్తుంది. లాంగ్వేజీ కోర్సులు సంబంధిత భాషలో ఉంటాయి. జర్నలిజం అండ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌కు మొదటి ఏడాది రూ.7800. రెండో సంవత్సరానికి రూ.7500. మిగతా అన్ని కోర్సుల ఫీజు మొదటి ఏడాదికి రూ.5300. రెండో ఏడాదికి రూ.5000. ఈ కోర్సుల వ్యవధి రెండేళ్లు. 

అర్హత: ఏదైనా యూజీ డిగ్రీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు.  

ఎమ్మెస్సీ: మ్యాథ్స్, అప్లైడ్‌ మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ, ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్, సైకాలజీ. వ్యవధి రెండేళ్లు. ఆంగ్ల మాధ్యమంలో అందిస్తున్నారు. కెమిస్ట్రీకి మొదటి సంవత్సరం రూ.18,300. రెండో ఏట రూ.18,000. మ్యాథ్స్‌కి రెండేళ్లూ వరుసగా రూ.7800, 7500. మిగిలినవాటికి మొదటి ఏడాదికి రూ.15,300. రెండో సంవత్సరానికి రూ.15,000.

అర్హత: సంబంధిత సబ్జెక్టులను బ్యాచిలర్‌ డిగ్రీలో చదివుండాలి. సైకాలజీకి మాత్రం ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. డిగ్రీలో సైన్స్‌ గ్రూపులవారు ఎన్విరాన్‌మెంటల్‌ సైన్స్‌ కోర్సులో చేరవచ్చు. 

ఎంబీఏ: రెండేళ్ల వ్యవధితో అందిస్తున్నారు. ఈ కోర్సులో ప్రవేశానికి ఏపీ లేదా తెలంగాణ ఐసెట్‌లో అర్హత సాధించడం తప్పనిసరి. డిగ్రీలో 50 శాతం మార్కులు ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 45 శాతం చాలు. కోర్సు ఫీజు మొదటి ఏడాదికి రూ.15300. రెండో సంవత్సరానికి రూ.15000.

ఎంఎల్‌ఐఎస్సీ: ఈ కోర్సుకు 40 శాతం మార్కులతో బీఎల్‌ఐఎస్సీ ఉత్తీర్ణులు దరఖాస్తు చేసుకోవచ్చు. కోర్సు వ్యవధి ఏడాది. ట్యూషన్‌ ఫీజు రూ.10,300.

బీఎల్‌ఐఎస్సీ: గ్రాడ్యుయేషన్‌లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, బీసీలైతే 45 శాతం. కోర్సు వ్యవధి ఏడాది. ఫీజు రూ.5300.

ఎంకాం: బీకాం, బీబీఏ, బీబీఎం, బీఏ (కామర్స్‌) వీటిలో ఏదైనా కోర్సు చదివినవారు చేరవచ్చు. ఫీజు రెండేళ్లకు వరుసగా రూ.7800, రూ.7500.

పీజీ డిప్లొమా: మార్కెటింగ్‌ మేనేజ్‌మెంట్, బిజినెస్‌ ఫైనాన్స్, ఎన్విరాన్‌మెంటల్‌ స్టడీస్, రైటింగ్‌ ఫర్‌ మాస్‌ మీడియా ఇన్‌ తెలుగు, హ్యూమన్‌ రైట్స్, ఉమెన్‌ స్టడీస్, కల్చర్‌ అండ్‌ హెరిటేజ్‌ టూరిజం. ఒక్కో కోర్సు వ్యవధి ఏడాది. 

అర్హత: ఏదైనా బ్యాచిలర్‌ డిగ్రీ ఉత్తీర్ణత.

సర్టిఫికెట్‌: ఫుడ్‌ అండ్‌ న్యూట్రిషన్, లిటరసీ అండ్‌ కమ్యూనిటీ డెవలప్‌మెంట్, ఎన్జీవోస్‌ మేనేజ్‌మెంట్, ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌. కోర్సుల వ్యవధి ఆరు నెలలు. కోర్సును బట్టి వీటిని పదోతరగతి, ఇంటర్, ఎలాంటి విద్యార్హతలు లేకుండా అందిస్తున్నారు. 

యూజీలో...

బీఏ, బీఎస్సీ కోర్సులను తెలుగు, ఆంగ్లం, ఉర్దూ మాధ్యమాల్లో ఈ విశ్వవిద్యాలయం అందిస్తోంది. బీకాం తెలుగు, ఆంగ్లం మాధ]్యమాల్లో అందుబాటులో ఉంది. కోర్సుల వ్యవధి మూడేళ్లు. యూజీ కోర్సులకు ట్యూషన్‌ ఫీజు మొదటి ఏడాది రూ.2700, తర్వాత రెండేళ్లు ఏడాదికి రూ.2500 చొప్పున చెల్లించాలి. అలాగే సైన్స్‌ కోర్సుల్లో చేరినవారు ల్యాబ్‌ ఫీజు చెల్లించాలి. యూజీ కోర్సులను చాయిస్‌ బేస్డ్‌ క్రెడిట్‌ సిస్టం (సీబీసీఎస్‌) విధానంలో నిర్వహిస్తున్నారు. ఏడాదికి రెండు సెమిస్టర్లు చొప్పున ఉంటాయి. విభాగాలవారీ యూజీలో అందుబాటులో ఉన్న సబ్జెక్టుల వివరాలు...

కళలు (ఆర్ట్స్‌): తెలుగు సాహిత్యం, ఆంగ్ల సాహిత్యం, హిందీ సాహిత్యం, ఉర్దూ సాహిత్యం.

సోషల్‌ సైన్సెస్‌ (సామాజిక శాస్త్రాలు): అర్థశాస్త్రం, చరిత్ర, రాజనీతిశాస్త్రం, మనోవిజ్ఞానశాస్త్రం, ప్రభుత్వ పాలనశాస్త్రం, సమాజశాస్త్రం, జర్నలిజం.

విజ్ఞానశాస్త్రాలు (సైన్స్‌): వృక్షశాస్త్రం, జంతుశాస్త్రం, రసాయనశాస్త్రం, భౌతికశాస్త్రం, గణితశాస్త్రం, గణాంకశాస్త్రం, భూగర్భశాస్త్రం.

వాణిజ్యశాస్త్రం: కామర్స్‌. 

అర్హత: యూజీ కోర్సులకు ఇంటర్‌ పూర్తిచేసుకున్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు. డిప్లొమా, రెండేళ్ల ఒకేషనల్‌/ ఐటీఐ కోర్సులు చదివినవారూ అర్హులే. ఓపెన్‌ స్కూల్‌ ద్వారా ఇంటర్‌ చదివినవారికీ అవకాశం ఉంటుంది.  

ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: జులై 31.

వెబ్‌సైట్‌: http://www.braou.ac.in/
 

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ సైబ‌ర్ సంర‌క్ష‌ణ కొలువులు

‣ కుదురుగా కూర్చుంటున్నారా?

‣ చదువుకునే వారికి చక్కటిచోటు ముంబయి

‣ ఈ డిప్లొమాలు ప్రత్యేకం

Posted Date: 10-07-2022


 

ఇంటర్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌