• facebook
  • whatsapp
  • telegram

ప్రావీణ్యం పెంచే వృత్తి విద్య 

వేగంగా ఉపాధి అవ‌కాశాలు

ప్రపంచవ్యాప్తంగా నైపుణ్య సేవలకు ప్రాధాన్యం పెరుగుతోంది. వృత్తిలో స్థిరపడడానికి, ఉద్యోగంలో రాణించడానికి ఇవి దారి చూపుతున్నాయి. చిన్న వయసులోనే ఏదైనా విభాగంలో ప్రావీణ్యం పెంచుకుని రాణించాలని ఆశించేవారు ఒకేషనల్‌ కోర్సుల దిశగా అడుగులు వేయవచ్చు. ఇందులో ప్రాక్టికల్‌ అప్రోచ్‌కు ప్రాధాన్యం ఎక్కువ. అందువల్ల కోర్సు పూర్తయిన వెంటనే ప్రత్యేక శిక్షణ లేకుండా నేరుగా సంబంధిత విభాగాల్లో బాధ్యతలు నిర్వర్తించవచ్చు. ఆసక్తి ఉంటే డిప్లొమా, ఇంజినీరింగ్‌ కోర్సుల్లో చేరవచ్చు లేదా ఒకేషనల్‌లోనే ఉన్నత విద్య బి.వోక్‌., ఎం.వోక్‌. కోర్సులు చదువుకోవచ్చు.

ఉపాధికి దారి చూపేవాటిలో ఒకేషనల్‌ కోర్సులూ ముఖ్యమైనవే. చదువు పూర్తయిన వెంటనే నిలదొక్కుకునేలా రూపొందించడమే ఇందుకు కారణం. ఏదైనా ఒక విభాగంలో ప్రత్యేక ప్రావీణ్యం ఆశించేవారు వీటిలో చేరవచ్చు. వివిధ సెక్టార్ల అవసరాలను తీర్చి, నైపుణ్యం ఉన్న మానవ వనరుల కొరతను పూడ్చడానికి ఒకేషనల్‌ చదువులను తీర్చిదిద్దారు. పనిచేస్తూ నేర్చుకోవడం ఈ కోర్సుల ప్రత్యేకత. ఈ చదువుల్లో దాదాపు 40 శాతం థియరీ, 60 శాతం ప్రాక్టికల్‌ అప్రోచ్‌ ఉంటుంది. అంటే తెలుసుకోవడం కంటే సంబంధిత పనిని చేయడం ద్వారా నేర్చుకోవడం, అనువర్తనం (అప్లికేషన్‌)కు ప్రాధాన్యమిస్తారు. అందువల్ల విద్యార్థులు నచ్చిన రంగానికి సంబంధించిన కోర్సులను ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ విధానంలో చదువుకోవచ్చు. 

రెండు తెలుగు రాష్ట్రాల్లోనూ రెండేళ్ల వ్యవధితో పలు విభాగాల్లో 20కు పైగా ఒకేషనల్‌ కోర్సులు అందిస్తున్నారు. ఆసక్తి, నైపుణ్యాలను అనుసరించి వీటిలో దేన్నైనా ఎంచుకోవచ్చు. కోర్సులో ఉన్నప్పుడే సంబంధిత పరిశ్రమలో ఇంటర్న్‌షిప్‌ పూర్తయ్యేలా చూస్తారు. దీంతో ఎలాంటి అదనపు శిక్షణ లేకుండా ఉద్యోగానికి సిద్ధం కావచ్చు. 

ఇవీ కోర్సులు

వీటిని అగ్రికల్చరల్, బిజినెస్‌ అండ్‌ కామర్స్, ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ, హోమ్‌ సైన్స్, హ్యుమానిటీస్, పారా మెడికల్‌ విభాగాల్లో అందిస్తున్నారు. 

అగ్రికల్చరల్‌: క్రాప్‌ ప్రొడక్షన్, లైవ్‌ స్టాక్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ డైరీ టెక్నాలజీ, ఫిషరీస్, సెరీకల్చర్‌.

బిజినెస్‌ అండ్‌ కామర్స్‌: అకౌంటింగ్‌ అండ్‌ ట్యాక్సేషన్, ఆఫీస్‌ అసిస్టెంట్‌షిప్, ఇన్సూరెన్స్‌ అండ్‌ మార్కెటింగ్, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌. 

ఇంజినీరింగ్‌ అండ్‌ టెక్నాలజీ: ఆటోమొబైల్‌ ఇంజినీరింగ్‌ టెక్నీషియన్, కన్‌స్ట్రక్షన్‌ టెక్నాలజీ, కంప్యూటర్‌ సైన్స్, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ కమ్యూనికేషన్‌ టెక్నీషియన్, ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్, మెకానికల్‌ టెక్నీషియన్‌.

హోమ్‌ సైన్స్‌ కోర్సులు: కమర్షియల్‌ గార్మెంట్స్‌ టెక్నాలజీ, ప్రిస్కూల్‌ టీచర్‌ ట్రైనింగ్‌. హ్యుమానిటీస్‌ అండ్‌ అదర్స్‌: కంప్యూటర్‌ గ్రాఫిక్స్‌ అండ్‌ యానిమేషన్, టూరిజం అండ్‌ ట్రావెల్‌ టెక్నిక్‌. 

పారా మెడికల్‌: ఫార్మా టెక్నాలజీ, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నీషియన్, ఫిజియోథెరపీ, మల్టీ పర్పస్‌ హెల్త్‌ వర్కర్‌.

ఉన్నత విద్య

ఇంటర్మీడియట్‌ ఒకేషనల్‌ కోర్సులు పూర్తిచేసుకున్నవారు డిగ్రీ కళాశాలలు అందిస్తోన్న బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ స్టడీస్‌(బిఓక్‌) కోర్సుల్లో చేరిపోవచ్చు. ఈ విభాగంలో ఉన్నత చదువులకు మాస్టర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌(ఎంఓక్‌) కోర్సులూ ఉన్నాయి. తాజాగా మన దేశంలోనూ ఒకేషనల్‌ చదువులకు ప్రాధాన్యం పెరుగుతోంది. వీటిలో చేరుతోన్న విద్యార్థుల సంఖ్యలో వృద్ధి కనిపిస్తోంది. డిగ్రీస్థాయిలో ఒకేషనల్‌ వద్దనుకున్నవారు బ్రిడ్జ్‌ కోర్సులు పూర్తిచేసుకుని డిప్లొమా, అగ్రికల్చర్, బీఎస్సీ విభాగాల్లోకి వెళ్లిపోవచ్చు. పాలిటెక్నిక్‌లో అయితే నేరుగా ద్వితీయ సంవత్సరం కోర్సులో చేరిపోవచ్చు.

యూజీలో...

మూడేళ్ల ఒకేషనల్‌ కోర్సుల్లో భాగంగా విద్యార్థులు ఆసక్తిని బట్టి ..బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్, బయో మెడికల్‌ సైన్సెస్, ఇండస్ట్రియల్‌ వేస్ట్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ అండ్‌ లాజిస్టిక్స్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ మేనేజ్‌మెంట్, రిటైల్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ ఐటీ, టూరిజం అండ్‌ హాస్పిటాలిటీ మేనేజ్‌మెంట్, టూరిజం అండ్‌ ట్రావెల్‌ మేనేజ్‌మెంట్, ఫ్యాషన్‌ డిజైనింగ్‌ అండ్‌ ఈవెంట్‌ మేనేజ్‌మెంట్, మోడర్న్‌ ఆఫీస్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్‌ అండ్‌ మేనేజ్‌మెంట్, మెడికల్‌ ల్యాబ్‌ టెక్నాలజీ, సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌మెంట్, ప్రింటింగ్‌ టెక్నాలజీ, బిజినెస్‌ ప్రాసెస్‌ అండ్‌ డేటా ఎనాలసిస్‌.. తదితర కోర్సులు ఎంచుకోవచ్చు. డిగ్రీ కళాశాలల పరిధిలోని పరిశ్రమలు, స్థానిక అవసరాలు దృష్టిలో పెట్టుకుని ప్రాంతాల వారీ అవసరమైన కోర్సులు అందిస్తున్నారు. అందువల్ల చదువు పూర్తయిన వెంటనే వాటిలో విధులు నిర్వర్తించుకోవచ్చు. యూజీలో అంశాలనే పీజీ స్థాయిలోనూ చదువుకోవచ్చు. 

జాతీయ స్థాయిలో...

నేషనల్‌ స్కిల్‌ డెవలప్‌మెంట్‌ అండ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ ఒకేషనల్‌ విద్యకు దిక్సూచిలా వ్యవహరిస్తోంది. యూజీసీతో కలిసి ఎన్‌ఎస్‌డీసీ దేశవ్యాప్తంగా కమ్యూనిటీ కాలేజీలు, డిగ్రీ కళాశాలల్లో ఒకేషనల్‌ కోర్సులు స్కిల్‌ బేస్డ్‌ విధానంలో అందిస్తోంది. కమ్యూనిటీ కళాశాలల్లో సర్టిఫికెట్, డిప్లొమా, అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా కోర్సులు ఉంటాయి. ఇందులో భాగంగా 6 నెలల సర్టిఫికెట్‌ కోర్సు పూర్తిచేసుకుంటే నేషనల్‌ స్కిల్‌ క్వాలిఫికేషన్‌ ఫ్రేమ్‌వర్క్‌ లెవెల్‌ 4 స్థాయి సొంతమవుతుంది. ఏడాది వ్యవధి ఉండే డిప్లొమా కోర్సులు పూర్తిచేసుకున్నవారికి లెవెల్‌ 5, రెండేళ్ల అడ్వాన్స్‌డ్‌ డిప్లొమా వారికి లెవెల్‌ 6, మూడేళ్ల బ్యాచిలర్‌ ఆఫ్‌ ఒకేషనల్‌ పూర్తిచేసుకుంటే లెవెల్‌ 7 స్థాయికి చేరుకుంటారు. దాదాపు డిగ్రీ కళాశాలలన్నీ ఏదో ఒక ఒకేషనల్‌ కోర్సును అందిస్తున్నాయి. 

ఓపెన్‌ స్కూలింగ్‌తో...

కాలేజీకి వెళ్లి ఒకేషనల్‌ కోర్సులు చదవడం వీలుకానివారు కేంద్ర మానవ వనరుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటైన స్వయంప్రతిపత్తి సంస్థ.. నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఓపెన్‌ స్కూలింగ్‌ అందించే ఒకేషనల్‌ ఎడ్యుకేషన్‌ ప్రొగ్రాముల్లో చేరవచ్చు. పదో తరగతి విద్యార్హతతో ఇక్కడ పలు ఒకేషనల్‌ కోర్సులు ఉన్నాయి. వీటిని సీనియర్‌ సెకెండరీ, డిప్లొమా, సర్టిఫికెట్‌ స్థాయుల్లో వివిధ విభాగాల్లో అందిస్తున్నారు.

సీనియర్‌ సెకెండరీ స్థాయిలో: ఆయుర్వేద అండ్‌ యోగా: ఆయుర్వేద అసిస్టెంట్, పంచకర్మ అసిస్టెంట్, యోగా అసిస్టెంట్‌; ఐటీ అండ్‌ ఐటీఈఎస్‌: వెబ్‌ డెవలప్‌మెంట్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసెంబ్లీ అండ్‌ మెయింటెనెన్స్, సీఆర్‌ఎం డొమెస్టిక్‌ వాయిస్‌; ప్లాంట్‌ ప్రొటెక్షన్, సాయిల్‌ అండ్‌ ఫర్టిలైజర్స్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులు ఉన్నాయి. 

సర్టిఫికెట్‌ లేదా డిప్లొమాలో: సెక్రటేరియల్‌ ప్రాక్టీస్, టైప్‌ రైటింగ్, స్టెనోగ్రఫీ, డెస్క్‌టాప్‌ పబ్లిషింగ్, వెబ్‌ డిజైనింగ్‌ అండ్‌ డెవలప్‌మెంట్, డేటా ఎంట్రీ ఆపరేషన్స్, ఐటీ ఎసెన్షియల్స్‌ పీసీ హార్డ్‌వేర్‌ అండ్‌ సాఫ్ట్‌వేర్, వెబ్‌ డెవలప్‌మెంట్, సీఆర్‌ఎం డొమెస్టిక్‌ వాయిస్, కంప్యూటర్‌ హార్డ్‌వేర్‌ అసెంబ్లీ అండ్‌ మెయింటెనెన్స్, కంప్యూటర్‌ అప్లికేషన్స్, హౌస్‌ వైరింగ్‌ అండ్‌ ఎలక్ట్రికల్‌ అప్ల్లయన్స్‌ రిపేరింగ్, మోటార్‌ అండ్‌ ట్రాన్స్‌ఫార్మర్‌ రివైండింగ్, టీవీ రిపేరింగ్, కన్‌స్ట్రక్షన్‌ సూపర్‌విజన్, ఎలక్ట్రికల్‌ టెక్నీషియన్, రేడియో అండ్‌ టీవీ టెక్నీషియన్, ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్షన్, ఫర్నిచర్‌ అండ్‌ క్యాబినెట్‌ మేకింగ్, ఎలక్ట్రోప్లేటింగ్, కేర్‌ ఎల్డర్లీ, కమ్యూనిటీ హెల్త్, హోమియోపతిక్‌ డిస్పెన్సింగ్, హౌస్‌ కీపింగ్, క్యాటరింగ్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ ప్రాసెసింగ్, హోటల్‌ ఫ్రంట్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్, ఫ్రూట్స్‌ అండ్‌ వెజిటబుల్స్‌ ప్రిజర్వేషన్, ఎర్లీ చైల్డ్‌హుడ్‌ కేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్, టాయ్‌ మేకింగ్‌ అండ్‌ జాయ్‌ ఫుల్‌ లెర్నింగ్, లైబ్రరీ సైన్స్, ఫుడ్‌ ప్రొడక్షన్‌ మేనేజ్‌మెంట్, ఫుడ్‌ అండ్‌ బేవరేజ్‌ ఆపరేషన్స్, హౌస్‌ కీపింగ్‌ అండ్‌ మెయింటెనెన్స్, ఫ్రంట్‌ ఆఫీస్‌ ఆపరేషన్స్, బ్యాకరీ అండ్‌ కన్ఫెక్షనరీ.

********************************************************

మరింత సమాచారం ... మీ కోసం!

‣ మెయిన్‌లో మెరిసేందుకు మ‌రో అవ‌కాశం!

‣ దేశ రాజ‌ధానిలో కానిస్టేబుల్ ఉద్యోగాలు

‣ విశ్వాసం ఉంటే విలువ త‌గ్గ‌దు!

‣ కొలువుల‌కు కొర‌త లేదు

‣ కాలేజీలో చేరేముందు కాస్త ప‌రిశీలించండి!

Posted Date: 15-07-2022


 

టెన్త్ తర్వాత

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌