• facebook
  • whatsapp
  • telegram

ఛార్టర్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌

ఛార్టర్డ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్స్‌' (సీమా) నిర్వహిస్తున్న కోర్సులు పూర్తిచేసినవారికి 173 దేశాల్లో ఉద్యోగావకాశాలు లభిస్తున్నాయని ఆ సంస్థ భారతదేశ ముఖ్యప్రతినిధి ఆరతి పోర్వాల్‌ పేర్కొన్నారు.


'ప్రపంచవ్యాప్తంగా ఉన్న బహుళజాతి సంస్థల వ్యాపార కార్యకలాపాలను సమర్థంగా పర్యవేక్షించే నిపుణులను తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో 'సీమా' 1919లో బ్రిటన్‌లో ఏర్పడింది. ఆర్థిక, అకౌంటింగ్‌, మేనేజ్‌మెంట్‌ రంగాల్లోని నైపుణ్యాలన్నీ సమకూరేలా కోర్సులను రూపొందించి పరీక్షలు నిర్వహిస్తున్నాం. పారిశ్రామిక, వ్యాపార సంస్థల అవసరాలకు అనుగుణంగా ప్రతి నాలుగు సంవత్సరాలకూ సిలబస్‌ను నవీకరిస్తున్నాం. ఫలితంగా సీమా కోర్సులు పూర్తిచేసిన సుమారు 2.03 లక్షల మంది ప్రపంచవ్యాప్తంగా 173 దేశాల్లో వ్యాపార సంస్థల్లో ఉన్నత స్థానాల్లో ఉన్నారు.

*¤ భారతదేశంలో సీమా గతంలో పెద్దగా దృష్టి సారించలేదు. ఫలితంగా ఇక్కడి నుంచి ఇప్పటివరకు 4,500 మంది మాత్రమే కోర్సులు పూర్తిచేశారు.

* దేశంలో ప్రతిభావంతులైన విద్యార్థులున్నవారున్నారన్న ఉద్దేశంతో ఐదేళ్ల కిందట ముంబయిలో కార్యాలయం ప్రారంభించి పెద్దసంఖ్యలో నిపుణుల్ని తయారుచేయడానికి ప్రణాళికలు అమలు చేస్తున్నాం.

*¤ కేవలం డిగ్రీ పూర్తి చేసి బహుళజాతి సంస్థల్లో సంపాదించడం కష్టం. ఈ నేపథ్యంలో డిగ్రీతో పాటే సీమా కోర్సులను పూర్తిచేసేలా దేశంలోని వివిధ విశ్వవిద్యాలయాలతో ఒప్పందాలు కుదుర్చుకుంటున్నాం. ఫలితంగా ఆయా కోర్సులు చేయాలనుకున్నవారికి ప్రణాళికాబద్ధ శిక్షణ కళాశాల స్థాయి నుంచే అందే ఏర్పాట్లు చేశాం. గీతం విశ్వవిద్యాలయంతో ఒప్పదం కుదుర్చుకున్నాం. విద్యార్థులకు శిక్షణ, నియామకాల కోసం దేశంలోని 50 సంస్థలతోనూ, ప్రపంచవ్యాప్తంగా 500 సంస్థలతోనూ సీమాకు ఒప్పందాలున్నాయి.

*¤ ప్రపంచవ్యాప్తంగా ప్రతిష్ఠాత్మకమైన సుమారు 4,500 సంస్థల్లో సీమా కోర్సులు పూర్తిచేసినవారు విధులు నిర్వర్తిస్తున్నారు. రెండో లెవల్‌ పూర్తి చేసినవారు సంవత్సరానికి సగటున కనీసం రూ.9 లక్షల ఆదాయం, అన్ని లెవల్స్‌ పూర్తిచేసినవారు రూ.23.35 లక్షలు పొందుతున్నారు. ప్రపంచవ్యాప్త గుర్తింపు ఉన్న ఆయా కోర్సులు పూర్తిచేయడం వల్ల అంతర్జాతీయంగా ఏ దేశంలో ఉన్న అవకాశాలనైనా చేజిక్కించుకోవచ్చు.

*¤ సీమా కోర్సులు పూర్తిచేసినవారికి ప్రధానంగా ఐరోపా, ఆఫ్రికా, మధ్యప్రాచ్యం, దక్షిణ ప్రాచ్యం, ఆసియా దేశాలు, ఆస్ట్రేలియాల్లో బాగా గిరాకీ ఉంది.

*¤ ఇంటర్‌/ తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులైన వారందరూ సీమా పరీక్ష రాయడానికి అర్హులే. ఒక్కో లెవల్‌ పూర్తిచేసినవెంటనే ఒక్కో అర్హత ధ్రువపత్రం అందజేస్తాం. ప్రతి లెవల్‌ పూర్తిచేసినవారికీ ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి. నాలుగు లెవల్స్‌ పూర్తిచేసి, మూడు సంవత్సరాల ఉద్యోగానుభవం పొందినవారందరికీ సంస్థలో సభ్యత్వం ఇస్తాం. వారిని అసోసియేట్‌ ఛార్టర్డ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెంట్‌ (ఎ.సి.ఎం.ఎ.)గా పిలుస్తారు.

* భారతదేశంలో ప్రతిష్ఠాత్మకంగా నిర్వహించే సి.ఎ., ఐ.సి.డబ్ల్యు.ఎ.ఐ., ఎం.బి.ఎ. (ఫైనాన్స్‌), ఎం.కాం., పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినవారు సీమా మూడో లెవల్‌ వరకు పరీక్షలు రాయాల్సిన అవసరం లేకుండా మినహాయింపులున్నాయి. వారు 'గేట్‌వే అసెస్‌మెంట్‌' పేరిట నిర్వహించే ఒక పరీక్ష రాసి నేరుగా నాలుగో లెవల్‌ పరీక్షలకు హాజరుకావచ్చు.

*¤ సీమాకు సంబంధించిన సమగ్ర వివరాలు www.cimaglobal.com/india లో ఉంచాం. ఎలాంటి సందేహాలున్నా india@cimaglobal.com కు మెయిల్‌ చేసి నివృత్తి చేసుకోవచ్చు.

Posted Date: 02-12-2020


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌