• facebook
  • whatsapp
  • telegram

మేటి ఆర్ట్స్‌ బాటలు

ఇంటర్‌లో ఆర్ట్స్‌ గ్రూపు చదివిన విద్యార్థులు ఎంచుకునేందుకు ఎన్నెన్నో వృత్తివిద్యా కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిని వ్యక్తిగత అభిరుచులకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఈ బాటలో కొనసాగినవారి భవిత ఉజ్వలంగా ఉంటుందని ఇప్పటికే ఎందరో నిరూపించారు. ఆ వృత్తివిద్యా కోర్సుల్లో కొన్ని ప్రధానమైనవి స్థూలంగా ...

ఆంత్రప్రెన్యూర్‌షిప్‌

ఈ రోజుల్లో అందరూ ఉద్యోగం చేయాలనే కోరుకోరు. కొందరు స్వయంగా వ్యాపారాన్ని చేయాలనుకుంటారు. అయితే ఏం చేయాలన్నా ఆ బిజినెస్‌ను ప్రారంభించేముందు అందులోని కష్టనష్టాలు ఏమిటి, వ్యాపారాన్ని సమర్థంగా నిర్వహించడం ఎలా అని తెలుసుకోవాలనుకుంటారు.  అటువంటి ఔత్సాహికులకు ఈ కోర్సు ఎంతగానో ఉపకరిస్తుంది. అటువంటి ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ కోర్సును అందించే ఇన్‌స్టిట్యూట్లలో కొన్ని...

* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ పబ్లిక్‌ ఎంటర్‌ప్రైజ్‌, హైదరాబాద్‌

¤* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌, గౌహతి

*¤ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ & మేనేజ్‌మెంట్‌ ప్రాసెస్‌ ఇంటర్నేషనల్‌, ఢిల్లీ

¤* సింబయోసిస్‌ యూనివర్సిటీ, పూణే

* ది ఇందిరాగాంధీ నేషనల్‌ ఓపెన్‌ యూనివర్సిటీ, ఢిల్లీ

* అమితి బిజినెస్‌ స్కూల్‌, నోయిడా

* ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ డెవలప్‌మెంట్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, గాంధీనగర్‌

¤* శేషాద్రిపురం ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌మెంట్‌ స్టడీస్‌, బెంగళూర్‌

¤* కళ్యాణ్‌ మహావిద్యాలయ, దుర్గ్‌

¤* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఆంత్రప్రెన్యూర్‌షిప్‌ & మేనేజ్‌మెంట్‌

ఫ్యాషన్‌ డిజైనింగ్‌

ఇటీవలి కాలంలో ఫ్యాషన్‌ డిజైనింగ్‌ కోర్సు ఎందరినో ఆకట్టుకుంటోంది. దీన్ని ఎంపిక చేసుకున్నవారికి ఉజ్వల భవిత ఉంటుందని ఎందరో ఫ్యాషన్‌ డిజైనర్లు నిరూపిస్తున్నారు. ఈ వృత్తివిద్యా కోర్సును ఎంపిక చేసుకునేవారికి ముఖ్యంగా గార్మెంట్‌ రంగంలో మంచి అవకాశాలుంటాయి. సృజనాత్మకత ఉన్నవారు ఈ కోర్సులో రాణిస్తారు.వివిధ సంస్థలు ఈ శిక్షణను డిప్లొమా కోర్సులనీ, గ్రాడ్యుయేట్‌ లెవెల్‌ కోర్సులనీ, పోస్టుగ్రాడ్యుయేట్‌ కోర్సులనీ- ఇలా వివిధ స్థాయుల్లో ఇస్తున్నాయి. ఆయా కోర్సులను పూర్తిచేసినవారు గార్మెంట్‌ డిజైన్‌ టెక్నాలజీని, మాన్యుఫాక్చరింగ్‌ పరిజ్ఞానాన్ని పొంది ఫ్యాషన్‌ డిజైనర్లుగా అవతరించి ఉన్నత స్థానంలో నిలుస్తారు. ఈ ఫ్యాషన్‌ డిజైనింగ్‌ శిక్షణను మనదేశంలో ఇచ్చే కొన్ని సంస్థలు...

*¤ నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎన్‌ఐడీ)

¤* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఎఫ్‌టీ)

¤* పెరల్‌ అకాడమీ ఆఫ్‌ ఫ్యాషన్‌ (పీఏఎల్‌)

¤* సింబయోసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌ (ఎస్‌ఐడీ)

¤* నార్త్‌రన్‌ ఇండియా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ (ఎన్‌ఐఐఎఫ్‌టీ)

¤* ఎస్‌ఎన్‌డీటీ ప్రేమ్‌లీల విఠల్‌దాస్‌ పాలిటెక్నిక్‌

ఆడియో విజువల్‌ మీడియా

ఆడియో విజువల్‌ మీడియా కోర్సులు నేడు ఎంతగానో ప్రాచుర్యం పొందుతున్నాయి. జర్నలిజం, ఫిల్మ్‌మేకింగ్‌, మీడియా ప్రమోషన్‌, బ్రాండ్‌ ప్రమోషన్‌, ఫొటోగ్రఫీ, మీడియా సర్వీస్‌- ప్లానింగ్‌ ఇలాంటివే. ఈ కోర్సులను పూర్తిచేసినవారికి ఎలక్ట్రానిక్‌ మీడియా రంగంలో, సినిమా రంగంలో ఆడియో విజువల్‌ నిపుణులుగా అవకాశాలుంటాయి. ఈ కోర్సులను అందించే సంస్థల్లో కొన్ని...¤

* డా. అంబేద్కర్‌ మరఠ్వాడా యూనివర్సిటీ, ఔరంగాబాద్‌

* ఫిల్మ్‌& టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా, పూణే

¤* ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, దెంకనాల్‌

¤¤ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, న్యూఢిల్లీ

¤*¤ మాస్‌ కమ్యూనికేషన్‌ రీసెర్చ్‌ సెంటర్‌, జామియా మిల్లా ఇస్లామియా, న్యూఢిల్లీ

¤¤* ఎంఎస్‌ యూనివర్సిటీ, వడోదర

¤¤* నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డిజైన్‌, అహ్మదాబాద్‌

¤¤రవీంద్రభారతి యూనివర్సిటీ, కోల్‌కత

¤¤* రూపం నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఎలక్ట్రానిక్‌ కమ్యూనికేషన్‌, జైపూర్‌

¤¤* సత్యజిత్‌ రే ఫిల్మ్‌ & టెలివిజన్‌ ఇన్‌స్టిట్యూట్‌, కోల్‌కత

¤*¤ సింబయోసిస్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ మాస్‌ కమ్యూనికేషన్‌, పూణే

¤*¤ యూనివర్సిటీ ఆఫ్‌ మైసూర్‌, మైసూర్‌

¤*¤ యూనివర్సిటీ ఆఫ్‌ రాజస్థాన్‌, జైపూర్‌

విదేశీ భాషలు

బహుళజాతి సంస్థల్లో కొన్ని తమ వ్యాపార కార్యకలాపాలను ఒక్క మనదేశంలోనే గాకుండా విదేశాల్లో కూడా నిర్వహిస్తూ ఉంటాయి. అందువల్ల ఆయా దేశాల్లో తమ సంస్థ ప్రతినిధులుగా ఆ దేశ భాష వచ్చినవారికే ప్రాధాన్యమిస్తాయి. అటువంటి ప్రతినిధులకు ఆయాదేశ భాషల్లో శిక్షణను ఇచ్చేందుకు ఫారెన్‌ లాంగ్వేజ్‌ కోర్సులు ఎంతగానో ఉపకరిస్తాయి.ఆసక్తిగలవారికి ఆయా ఇన్‌స్టిట్యూట్లు స్పానిష్‌, ఫ్రెంచ్‌, జపనీస్‌ వంటి భాషా కోర్సులను అందిస్తుంటాయి. అటువంటి కోర్సులను అందించే సంస్థల్లో కొన్ని..

¤*¤ ఈఎఫ్‌ఎల్‌యూ (సెంట్రల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇంగ్లిష్‌ & ఫారెన్‌ లాంగ్వేజెస్‌), హైదరాబాద్‌

¤*¤ స్కూల్‌ ఆఫ్‌ లాంగ్వేజెస్‌, జవహర్‌లాల్‌ నెహ్రూ యూనివర్సిటీ, న్యూఢిల్లీ

¤*¤ యూనివర్సిటీ ఆఫ్‌ ఢిల్లీ, న్యూఢిల్లీ

¤*¤ భారతీయ విద్యాభవన్‌, జవహర్లాల్‌ నెహ్రూ అకాడమీ ఆఫ్‌ లాంగ్వేజెస్‌, న్యూఢిల్లీ

¤*¤ జపనీస్‌ ఇన్‌ఫర్మేషన్‌ & కల్చరల్‌ సెంటర్‌, న్యూఢిల్లీ

¤*¤ రామకృష్ణ మిషన్‌, కోల్‌కత

¤*¤ అలియన్స్‌ ఫ్రాంచైజ్‌ (భారత్‌లో 15 నగరాల్లో ఉన్నాయి).

¤*¤ రాజస్థాన్‌ యూనివర్సిటీ, జైపూర్‌

¤*¤ ముంబై, కోల్‌కత, న్యూఢిల్లీ, చెన్నైల్లోని మ్యాక్స్‌ములర్‌ భవన్‌

¤*¤ పూణే యూనివర్సిటీ, పూణే

¤*¤ ఇండో ఇటాలియన్‌ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌, ముంబై

¤*¤ బనారస్‌ హిందూ యూనివర్సిటీ, వారణాసి

ఇవెంట్‌ మేనేజ్‌మెంట్‌

సంపన్నులు తమ ఇంట పుట్టినరోజు, నిశ్చితార్థం, వివాహ మహోత్సవం, వార్షికోత్సవం వంటి ఏ శుభకార్యం జరుపుకోవాలన్నా- కార్పొరేట్‌ సంస్థలవారు తమ సంస్థ వార్షికోత్సవం, ఉత్పత్తి ఆరంభం, విజయోత్సవం... ఇలా ఏది జరుపుకోవాలన్నా ఇవెంట్‌ మేనేజ్‌మెంట్‌ సంస్థలపై ఆధారపడుతున్నారు.ఖర్చు కాస్త ఎక్కువైనప్పటికీ కార్యక్రమం ప్రారంభం నుంచి ముగింపు వరకూ అన్నీ వారే దగ్గరుండి ఏ అపశ్రుతీ, ఆటంకం లేకుండా విజయవంతంగా నిర్వహించేందుకు బాధ్యత వహిస్తారు. సమయం కూడా సద్వినియోగం అవుతుంది. ఇవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వారికి దేశవిదేశాల కంపెనీల నుంచి అవకాశాలు వస్తుంటాయి. తద్వారా ఆదాయంతో పాటు గౌరవం, గుర్తింపు కూడా లభిస్తాయి. అందువల్లనే ఇవెంట్‌ మేనేజ్‌మెంట్‌ వారికి అంతటి ప్రాధాన్యం. దీంతో యువత ఇవెంట్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులపై ఆకర్షితులవుతోంది.

ఈ కోర్సులను మనదేశంలో అందించే ఇన్‌స్టిట్యూట్లలో కొన్ని...

¤*¤ అమితి ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఇవెంట్‌ మేనేజ్‌మెంట్‌

¤¤* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టూరిజం & ఫ్యూచర్‌ మేనేజ్‌మెంట్‌ ట్రెండ్స్‌ (ఐటీఎఫ్‌టీ)

¤¤* ది ఇంటర్‌నేషనల్‌ సెంటర్‌ ఫర్‌ ఇవెంట్‌ మార్కెటింగ్‌ & మేనేజ్‌మెంట్‌ (ఐసీఈఎం)

హోటల్‌ మేనేజ్‌మెంట్‌

ఆతిథ్య రంగంలో ఎదగాలనుకునేవారికి ఈ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు ఎంతగానో దోహదపడుతుంది. ప్రముఖ హోటళ్లలో ఇపుడు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సు చేసినవారినే అధికంగా నియమించుకుంటున్నారు. అంతేకాదు, ఆ కోర్సు చేసినవారికి బహుళజాతి కంపెనీల్లో, ట్రావెల్‌ & టూరిజం రంగంలో ఎన్నో ఉద్యోగావకాశాలతోపాటు స్వయం ఉపాధి అవకాశాలు కూడా ఉన్నాయి.ఈ కోర్సును అందించే సంస్థల్లో కొన్ని...

¤*¤ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, కాటరింగ్‌ టెక్నాలజీ & అప్త్లెడ్‌ న్యూట్రిషన్‌, హైదరాబాద్‌

¤*¤ వెల్‌కం గ్రూప్‌ గ్రాడ్యుయేట్‌ స్కూల్‌ ఆఫ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌, మణిపాల్‌

¤*¤ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, క్యాటరింగ్‌ టెక్నాలజీ &అప్త్లెడ్‌ న్యూట్రిషన్‌, చెన్నై

¤*¤ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ & కాటరింగ్‌ టెక్నాలజీ, కోవలం

¤¤* ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, కాటరింగ్‌ టెక్నాలజీ & అప్త్లెడ్‌ న్యూట్రిషన్‌, అహ్మదాబాద్‌

¤*¤ డా.అంబేద్కర్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాటరింగ్‌ & న్యూట్రిషన్‌, చండీఘర్‌

¤*¤ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌, కాటరింగ్‌ టెక్నాలజీ & అప్త్లెడ్‌ న్యూట్రిషన్‌, మీరట్‌

¤*¤ ఇంటర్నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ (ఐఐహెచ్‌ఎం), కలకత్తా

- పి.వి.ఆర్.కె. మూర్తి, చైర్మన్, శ్రీ గాయత్రి విద్యాసంస్థలు.

Posted Date: 21-03-2022


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌