• facebook
  • whatsapp
  • telegram

ఏ పేపర్లో ఏవి ముఖ్యం? 

సీఎంఏ ఇంటర్‌ సన్నద్ధత

ఉద్యోగావకాశాల పరంగా సీఏ తరువాత కార్పొరేట్‌ ప్రపంచంలో ఎక్కువగా వినిపించే పేరు సీఎంఏ కోర్సు. సీఎంఏ ఇంటర్, సీఎంఏ ఫైనల్‌ పరీక్షల తేదీలు వెలువడ్డాయి. ఏటా జూన్, డిసెంబరుల్లో నిర్వహించే పరీక్షలను ఈ ఏడాది జనవరిలో నిర్వహించనున్నారు. ఈ పరీక్షలకు తగిన ప్రణాళికను పాటించటం తప్పనిసరి!

ఇటీవలి కాలంలో ప్రభుత్వరంగంలో సీఎంఏలకు (ఐసీడబ్ల్యూఏ) ఉద్యోగావకాశాలు విస్తృతంగా పెరిగాయి. సీఏతోపాటు సీఎంఏ కోర్సుకీ ఆదరణ పెరిగింది. ఇతర డిగ్రీ, ప్రొఫెషనల్‌ కోర్సులు చేసినవారూ దీనివైపు మొగ్గు చూపుతున్నారు. సీఎంఏలో ఉత్తీర్ణతా శాతం తక్కువేమీ కాదు. ఏటా జూన్, డిసెంబరుల్లో నిర్వహించే పరీక్షలను 2021 జనవరి 3 నుంచి జనవరి 10 వరకు నిర్వహించనున్నట్లు ఐసీఎంఏఐ ప్రకటించింది. సీఎంఏ ఇంటర్‌ పరీక్షలకు తక్కువ సమయం ఉన్నందున ప్రణాళికతో ముందుకుసాగడం తప్పనిసరి.  

పేపర్‌-5: ఫైనాన్షియల్‌ అకౌంటింగ్‌ (100 మార్కులు)

స్టడీ మెటీరియల్, స్కానర్‌లోని అన్ని లెక్కలూ సాధన చేస్తే మంచిది. కొన్ని సందర్భాల్లో అలాంటివి లేదా అదే రకమైన ప్రశ్నలు వచ్చే అవకాశముంది. 

పార్ట్‌నర్‌షిప్‌ అకౌంట్స్, ఫైనల్‌ అకౌంట్స్, నాన్‌ ట్రేడింగ్‌ కన్సర్న్స్, అకౌంటింగ్‌ ఫర్‌ స్పెషల్‌ ట్రాన్సాక్షన్స్‌ చాప్టర్ల నుంచి ఎక్కువ మార్కులకు ప్రశ్నలు వచ్చే అవకాశముంది. వీటిపై దృష్టిపెట్టాలి.

పరీక్ష రాసే విధానానికి మార్కులు ఇస్తారు. కాబట్టి, నిర్దేశిత సమయంలో వీలైనంత క్లుప్తంగా సమాధానాలు రాయాలి. పరీక్షలో తుది జవాబుకే కాకుండా దశలకూ మార్కులుంటాయి.

పేపర్‌-6: లాస్‌ అండ్‌ ఎథిక్స్‌ (100 మార్కులు)

యాక్ట్‌ నిబంధనలను క్షుణ్ణంగా చదవాలి. నిబంధనలను ఎప్పటికప్పుడు చూడకుండా రాస్తుంటే ఎక్కువ గుర్తుంటాయి. 

పరీక్షలో నిబంధనలు, ఉదాహరణలు, లాండ్‌ మార్క్‌ కేస్‌లనూ మిళితం చేస్తుండాలి. 

సెక్షన్‌ నంబర్లు కచ్చితత్వంతో రాయాలి. 

కార్పొరేట్‌ లాకి సంబంధించి ఫాస్ట్‌ట్రాక్‌ బుక్‌ తయారు చేసుకుంటే పునశ్చరణకు తోడ్పడుతుంది. 

కంపెనీ యాక్ట్‌ 2013కి సంబంధించిన నిబంధనలను జాగ్రత్తగా చదవాలి. ఆరు నెలల ముందు (మే 31, 2020) వరకు చేసిన సవరణలు పరీక్షలో వస్తాయి. 

ఎథిక్స్‌ 10 మార్కులకు ఉంటుంది. వర్క్‌బుక్, స్టడీమెటీరియల్‌పై దృష్టిపెట్టాలి.

పేపర్‌-7: డైరెక్ట్‌ టాక్సేషన్‌ (100 మార్కులు)

డైరెక్ట్‌ టాక్సేషన్‌కు సంబంధించి ప్రతి అంశంపై లోతైన అవగాహన అవసరం. 

హెడ్స్‌ ఆఫ్‌ ఇన్‌కమ్, అసెస్‌మెంట్‌ ఆఫ్‌ డిఫరెంట్‌ పర్సన్స్‌పై దృష్టిపెడితే మార్కులు సాధించవచ్చు. 

పరీక్షల్లో ప్రతి ప్రశ్ననూ చిన్న ప్రశ్నలుగా విభజిస్తారు. చిన్న అంశాలనూ చూసుకోవాలి. 

డిసెంబరు 2020 పరీక్షలకు ఫైనాన్స్‌ యాక్ట్‌ 2019 వర్తిస్తుంది. మే 31, 2020 వరకు విడుదల చేసిన నోటిఫికేషన్లు, సర్క్యులర్లకూ వర్తిస్తాయి.

పేపర్‌-8: కాస్ట్‌ అకౌంటింగ్‌ (100 మార్కులు)

కాస్ట్‌ అకౌంటింగ్‌ స్టాండర్డ్స్, ఎలిమెంట్స్‌ ఆఫ్‌ కాస్ట్‌కు ప్రాధాన్యమివ్వాలి. వీటిపై ప్రశ్నలను ఆశించవచ్చు.

పేపర్‌-9: ఆపరేషన్స్‌- స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌ (100 మార్కులు)

ఆపరేషన్‌ మేనేజ్‌మెంట్‌లో.. థియరీ, ప్రాబ్లమ్స్‌కు సమప్రాధాన్యం ఇవ్వాలి. పబ్లిక్‌ పరీక్షల్లోని మోడల్స్‌ సాధన చేయాలి. పరీక్షలో ప్రత్యామ్నాయ సమాధానాలు, వర్కింగ్‌ నోట్స్‌ ముఖ్యం. 

స్ట్రాటజిక్‌ మేనేజ్‌మెంట్‌లో.. నేరుగా ప్రశ్నలుండవు. తికమకగా అడుగుతారు. అన్ని చాప్టర్లూ ప్రధానమే. స్టడీమెటీరియల్‌కు ప్రాముఖ్యం ఎక్కువ. మాక్‌ టెస్ట్‌ పేపర్స్, రివిజన్‌ టెస్ట్‌ పేపర్స్‌ చూసుకోవాలి.

పేపర్‌-10: కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ (100 మార్కులు)

స్టడీ మెటీరియల్‌లోని ఉదాహరణలకు ప్రాధాన్యమివ్వాలి. 

సీఎంఏ ఇంటర్‌ లోని ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్, కాస్ట్‌ అండ్‌ మేనేజ్‌మెంట్‌ అకౌంటెన్సీతో పోలిస్తే కొంచెం సులువు. ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌లో 25% వరకూ థియరీ ప్రశ్నలు అడిగే వీలుంది. 

కాస్ట్‌ అకౌంట్‌ రికార్డ్స్, కాస్ట్‌ ఆడిట్‌ అంశాలను చూసుకోవాలి. వర్క్‌బుక్‌ కాన్సెప్టులకు ప్రాధాన్యమివ్వాలి. 

పేపర్‌-11: ఇన్‌డైరెక్ట్‌ టాక్సేషన్‌ (100 మార్కులు)

కాన్సెప్టులు, విధానాలు అర్థం చేసుకోవాలి. స్టడీ మెటీరియల్‌ తోడ్పడుతుంది. )

సమస్యాపూరిత ప్రశ్నలకు సూచించిన/ వర్తించే చట్టం ప్రకారం సమాధానమివ్వాలి. 

డిసెంబరు 2020 పరీక్షలకు ఫైనాన్స్‌ యాక్ట్‌ 2019 వర్తిస్తుంది. మే 31, 2020 వరకు విడుదల చేసిన నోటిఫికేషన్లు, సర్క్యులర్లు వర్తిస్తాయి. 

జీఎస్‌టీ, కస్టమ్‌ డ్యూటీస్‌లోని ప్రాబ్లమ్స్‌పై దృష్టిపెట్టాలి.

పేపర్‌-12: కంపెనీ అకౌంట్స్‌- ఆడిట్‌ (100 మార్కులు)

షెడ్యూల్‌ 3 (ప్రిపరేషన్‌ ఆఫ్‌ ఫైనాన్షియల్‌ స్టేట్‌మెంట్స్, క్యాష్‌ ఫ్లో స్టేట్‌మెంట్స్, ఫార్మాట్‌ ఆఫ్‌ బాలెన్స్‌షీట్, ప్రాఫిట్‌ అండ్‌ లాస్‌ అకౌంట్‌) చూసుకోవాలి.

ప్రాబ్లమ్స్‌ను ఎక్కువ సాధన చేయాలి. ఇది థియరీ సబ్జెక్టు. ప్రశ్నలను ముందుగానే ఊహించవచ్చు. స్కానర్‌లో ఉండే ప్రశ్నలను నేరుగా అడిగే వీలుంది. నిబంధనలు, వర్తించే చట్టాలు, అకౌంటింగ్‌ స్టాండర్డ్స్, స్టాండర్డ్స్‌ ఆన్‌ ఆడిటింగ్, విధానాలు, ప్రక్రియలపై దృష్టిపెట్టాలి. 

మే 31, 2020 వరకు కంపెనీ రూల్స్, 2014లో వచ్చిన ప్రతి సవరణా ఈ పరీక్షకు వర్తిస్తుంది.

సందేహాలుంటే..

సీఎంఏ ఇన్‌స్టిట్యూట్‌ మెటీరియల్‌ ప్రశ్నలు, వర్క్‌బుక్, గత 3 పరీక్షల మాక్‌ టెస్ట్‌ పేపర్స్, రివిజన్‌ టెస్ట్‌ పేపర్స్‌ కనీసం ఒక్కసారైనా చదవాలి.

వర్క్‌బుక్‌లోని కాన్సెప్టులకు ప్రాధాన్యమివ్వాలి. 

పాత విధానం ప్రకారం గ్రూప్‌-1 పరీక్షలు పూర్తయ్యాక గ్రూప్‌-2 పరీక్షలు రాసేవారు. కానీ నూతన విధానం ప్రకారం గ్రూప్‌-1లో మొదటి పరీక్ష రాశాక గ్రూప్‌-2లో మొదటిపరీక్ష రాయాల్సి ఉంటుంది. ప్రతి పేపర్‌కూ ఇదే పద్ధతి కొనసాగుతుంది. 

సందేహాలను exam.helpdesk@icmai.in కు మెయిల్‌ చేయొచ్చు.

Posted Date: 12-03-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌