• facebook
  • whatsapp
  • telegram

ఉపాధికి... ఫుట్‌వేర్‌ కోర్సులు

తప్పనిసరి వస్తువుల జాబితాలోకి చేరిపోయిన పాదరక్షలు విభిన్న రకాల్లో, రూపాల్లో లభ్యమవుతున్నాయి. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరినీ ఆకర్షిస్తున్నాయి. దేశంలో ఎన్నో సంస్థలు పాదరక్షల తయారీలో నిమగ్నమయ్యాయి. అయితే వీటిని ఎవరు తయారు చేస్తారో ఆలోచించారా... పాదరక్షల డిజైన్, రూపకల్పనకు ప్రత్యేకంగా కొన్ని శిక్షణ సంస్థలు దేశంలో వెలిశాయి. వాటిలో చెన్నైలోని సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఒకటి. తాజాగా ఈ సంస్థ వివిధ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తోంది!

సూక్ష్మ, చిన్న, మధ్యతరహా ఎంటర్‌ప్రైజ్‌ (ఎంఎస్‌ఎంఈ) మంత్రిత్వ శాఖకు చెందిన సెంట్రల్‌ ఫుట్‌వేర్‌ ట్రైనింగ్‌ ఇన్‌స్టిట్యూట్‌లో పదోతరగతి, ఇంటర్, డిప్లొమా, డిగ్రీ అర్హతలతో ఫుట్‌వేర్‌కు సంబంధించి ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. ఆకర్షణీయ ఆకృతులు, సరికొత్త మార్పులతో మరింత సౌకర్యంగా పాదరక్షలు ఎలా తయారుచేయాలో పుట్‌వేర్‌ సంస్థలు నేర్పుతాయి. ఇక్కడ కోర్సులు పూర్తిచేసినవారికి పాదరక్షలు తయారుచేసే కంపెనీలు, రిటైల్‌ విక్రయశాలలు క్యాంపస్‌ ప్లేస్‌మెంట్ల ద్వారా ఉద్యోగాలిస్తున్నాయి. కోర్సు బట్టి రూ.పదివేల నుంచి రూ.పాతికవేల వరకు వేతనంగా చెల్లిస్తున్నాయి. స్వల్పకాలిక (షార్ట్‌టర్మ్‌) కోర్సులు కూడా ఇక్కడ అందుబాటులో ఉన్నాయి. వసతి సౌకర్యం కూడా కల్పిస్తున్నారు.

పదో తరగతి అర్హతతో..

కోర్సు: సర్టిఫికెట్‌ ఇన్‌ ఫుట్‌వేర్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ టెక్నాలజీ

వ్యవధి: ఏడాది

ఫీజు: రూ.72,000

ఇంటర్‌ అర్హతతో...

కోర్సు: డిప్లొమా ఇన్‌ ఫుట్‌వేర్‌ మాన్యుఫ్యాక్చర్‌ అండ్‌ డిజైన్‌

వ్యవధి: రెండేళ్లు

ఫీజు: రూ.1,56,000

కోర్సు: సర్టిఫికెట్‌ కోర్స్‌ ఇన్‌ ఫుట్‌వేర్‌ డిజైన్‌ అండ్‌ ప్రొడక్ట్‌ డెవలప్‌మెంట్‌

వ్యవధి: ఏడాది

ఫీజు: రూ.1,22,000

డిప్లొమా అర్హతతో..

కోర్సు: పోస్టు డిప్లొమా ఇన్‌ ఫుట్‌వేర్‌ టెక్నాలజీ 

వ్యవధి: 12 నెలలు

ఫీజు: రూ.1,20,000

డిగ్రీ అర్హతతో...

కోర్సు: పోస్టు గ్రాడ్యుయేట్‌ డిప్లొమా ఇన్‌ ఫుట్‌వేర్‌ టెక్నాలజీ

వ్యవధి: 18 నెలలు

ఫీజు: 1,45,000

పై కోర్సులకు ఎస్సీ, ఎస్టీలకు ట్యూషన్‌ ఫీజు నామమాత్రంగా ఉంటుంది.   

దరఖాస్తులకు చివరి తేదీ: అక్టోబరు 1

వెబ్‌సైట్‌: https://www.cftichennai.in/
 

Posted Date: 07-09-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌