• facebook
  • whatsapp
  • telegram

భూ అధ్యయ‌నంతో భ‌విత భ‌ద్రం!

విస్తృత ఉపాధి అవ‌కాశాలు అందిస్తున్న జియోలాజిక‌ల్ సైన్స్‌

మంచి చ‌దువు ... మంచి ఉద్యోగం అన‌గానే మ‌న‌కు ముందుగా గుర్తుకొచ్చేది ఇంజినీరింగ్‌, మెడిసిన్‌. గ‌త కొద్ది సంవ‌త్సరాలుగా అదేప‌నిగా అంద‌రూ ఆ కోర్సుల్లో చేరిపోతున్నారు. ప్రతీ ఏడాది ల‌క్షల సంఖ్యలో డిగ్రీ స‌ర్టిఫికేట్లతో బ‌య‌ట‌కు వ‌స్తున్నారు. దీంతో ఆయా రంగాల్లో విప‌రీతమైన పోటీ ఏర్పడింది. మంచి డిగ్రీతో సిద్ధమైన‌ప్పటికీ మంచి ఉద్యోగం మాత్రం దొర‌క‌ని ప‌రిస్థితి ఎదురైంది.

అందుకే అంద‌రూ ఇత‌ర రంగాల‌పై ఇప్పుడిప్పుడే దృష్టి సారిస్తున్నారు. విస్తృత ఉద్యోగ అవ‌కాశాలు క‌ల్పించే ఎన్నో కోర్సులు అందుబాటులో ఉన్నాయి. అలాంటివాటిలో మొద‌ట‌గా పేర్కొన‌ద‌గిన కోర్సు జియోలాజిక‌ల్ సైన్స్‌. ఈ కోర్సు పూర్తిచేసినవారు ఇటు ప్రభుత్వరంగాల్లోనూ, అటు ప్రైవేట్ రంగాల్లోనూ రాణించ‌వ‌చ్చు. ఖనిజ పరిశోధనకు, ఇంధన అన్వేషణకు, గనులు, నీటి నిల్వల సర్వేలకు అవసరమైన జియాలజిస్టులకు మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వసంస్థల్లో ఎన్నో ఉద్యోగావ‌కాశాలు అందుబాటులో ఉన్నాయి. ఉద్యోగం చేయడం ఇష్టం లేనివారు సొంతంగా జియాలజిస్టుగా కార్యాల‌యాన్ని ప్రారంభించ‌వ‌చ్చు. ఇన్ని విశిష్టత‌లు ఉన్న జియోలాజికల్‌సైన్స్ కోర్సు వివ‌రాల‌ను ప‌రీశీలిస్తే ...

భూమి గురించి అధ్యయనానికి సంబంధించిన శాస్తాన్ని 'భూఅధ్యయన శాస్త్రం లేదా 'భూవిజ్ఞాన శాస్త్రం అంటారు. గ్రీకు పదాలైన జియో(భూమి), లోగోస్ (శాస్త్రం) మీదుగా దీనికి ''జియాలజీ'' అనే పేరు వచ్చింది. ఇది గణిత, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల మిళితం. ఇందులో భూఉపరితలం పై జరుగుతున్న మార్పుల పరిశీలనకు భూగర్భశాస్త్ర భౌతిక అధ్యయనం; ఇంధనం, ఖనిజాలు, భూపర్యావరణం, అగ్నిపర్వతాలు, భూకంపాలు, శిలలు - శిలాజాలు, గనులు, భూరసాయనిక అధ్యయనం లాంటి ఎన్నో విభాగాలు ఉంటాయి. భూమి గురించి అధ్యయనానికి సంబంధించిన శాస్తాన్ని 'భూఅధ్యయన శాస్త్రం లేదా 'భూవిజ్ఞాన శాస్త్రం అంటారు. గ్రీకు పదాలైన జియో(భూమి), లోగోస్ (శాస్త్రం) మీదుగా దీనికి ''జియాలజీ'' అనే పేరు వచ్చింది. ఇది గణిత, భౌతిక, రసాయన, జీవశాస్త్రాల మిళితం. ఇందులో భూఉపరితలం పై జరుగుతున్న మార్పుల పరిశీలనకు భూగర్భశాస్త్ర భౌతిక అధ్యయనం; ఇంధనం, ఖనిజాలు, భూపర్యావరణం, అగ్నిపర్వతాలు, భూకంపాలు, శిలలు - శిలాజాలు, గనులు, భూరసాయనిక అధ్యయనం లాంటి ఎన్నో విభాగాలు ఉంటాయి.

విద్యావకాశాలు:

ప్రస్తుతం ఎన్నో విశ్వవిద్యాలయాలు, శిక్షణ సంస్థలు, జియోలాజికల్‌సైన్స్ విభాగంలో డిగ్రీ, పీజీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి. 50 శాతం మార్కులతో ఇంటర్మీడియట్ లేదా తత్సమాన విద్యార్హత ఉన్నవారు డిగ్రీలో బీఎస్సీ జనరల్ లేదా ఆనర్స్ కోర్సు చేయడానికి అర్హులు.

జియోలాజికల్‌సైన్స్ విభాగంలో 50 శాతం మార్కులతో డిగ్రీ పూర్తిచేసిన వారు పీజీ (మాస్టర్ డిగ్రీ) కోర్సు చేయవచ్చు.

మాస్టర్ డిగ్రీలో 55 శాతం మార్కులు సాధించిన వారే పీహెచ్‌డీ (డాక్టరేట్) చేయడానికి అర్హులు.

పై కోర్సులకు సంబంధించిన అడ్మిషన్ల ప్రక్రియ ఒక్కో విశ్వవిద్యాలయానికి ఒక్కో విధంగా ఉంటుంది.

ఉద్యోగావకాశాలు:

విద్యాబోధన, పరిశోధన, సంస్థాగత కార్యకలాపాలకు సంబంధించిన రంగాల్లో జియోలాజికల్‌ సైన్స్‌కు మంచి ఉద్యోగ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. జియోలజీలో 55 శాతం మార్కులతో డిగ్రీ, పీజీ పూర్తి చేసిన వారు విశ్వవిద్యాలయాలు/ కళాశాలల్లో అసిస్టెంట్ ప్రొఫెసర్‌, లెక్చరర్‌గా పనిచేసే అవకాశం ఉంది. అంతే కాకుండా తగిన అర్హతలు ఉన్నవారు జాతీయస్థాయి సంస్థల్లో ఉద్యోగం పొందే అవకాశం కూడా ఉంది.

జాతీయస్థాయి సంస్థలు:
 

హైదరాబాద్‌లోని నేషనల్ జియోఫిజికల్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ (NGRI), నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్ (NRSI) సంస్థలు.అహ్మదాబాద్‌లోని స్పేస్ అప్లికేషన్స్ సెంటర్ (SAC)

గోవాలోని నేషనల్ అంటార్కిటికా రీసెర్చ్ సెంటర్ (NARC)

డెహ్రాడూన్‌లోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రిమోట్‌సెన్సింగ్ (IIRS)

సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు (CGWB).

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా (GSI)

నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ (NMD)

ఆయిల్, నేచురల్ గ్యాస్ కార్పోరేషన్ లిమిటెడ్ (ONGC)

యురేనియం కార్పోరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (UCI)

ఇండియన్ బ్యూరో ఆఫ్ మైన్స్ (IBM)

అటామిక్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (AMDC)

భారత ప్రభుత్వ గనుల మంత్రిత్వశాఖ, జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో భూ అధ్యయ‌న‌ శాస్త్రవేత్తలు, ఇతర ప్రభుత్వ శాఖల్లోని ఖాళీల భర్తీ ప్రక్రియను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (UPSC) చేపడుతుంది. జాతీయస్థాయిలో మెరిట్ ప్రాతిపదికన రాతపరీక్ష, ఇంటర్వూల రూపంలో ఎంపిక ప్రక్రియ ఉంటుంది.

యూపీఎస్సీ నిర్వహించే ఈ పరీక్షకు జియోలాజికల్‌సైన్స్ విభాగంలో పీజీ చేసిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు.

సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు విభాగంలో ఖాళీల భర్తీకీ ఈ పరీక్షనే ప్రామాణికంగా తీసుకుంటారు.

ఓఎన్‌జీసీ సంస్థ ప్రత్యేకంగా పోటీ పరీక్ష నిర్వహిస్తుంది. ఎంపికైనవారికి శిక్షణనిచ్చి అనంతరం వారిని ఉద్యోగులుగా నియమించుకుంటుంది. ఈ పరీక్ష కోసం దరఖాస్తుచేసుకునే అభ్యర్థి 65 శాతం మార్కులతో జియోలజీలో ఎంఎస్సీ/ ఎంటెక్ విభాగాల్లో ఉత్తీర్ణులై ఉండాలి.

అటామిక్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కూడా అఖిలభారత పోటీపరీక్ష ద్వారా జియాలజీ విభాగంలో సైంటిఫిక్ ఆఫీసర్లను ఎంపిక చేస్తుంది. సంబంధిత విభాగంలో డిగ్రీ, పీజీ ప్రథమ శ్రేణిలో ఉత్తీర్ణులైన వారికి ప్రాధాన్యత ఉంటుంది.

జియోలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా, సెంట్రల్ గ్రౌండ్ వాటర్ బోర్డు సంస్థలు ఉద్యోగ గరిష్ఠ వయోపరిమితిని 32 ఏళ్లు, ఓఎన్‌జీసీ 30 ఏళ్లు, ఆటోమిక్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ జనరల్ కేటగిరీ అభ్యర్థులకు 28 ఏళ్లుగా నిర్ణయించాయి.

ఇవేగాక రాష్ట్ర ప్రభుత్వం దాని పరిధిలోని భూగర్భ జలవనరులు, గనుల శాఖలు, అంతరిక్ష సంబంధిత కేంద్రాలు, విపత్తు నియంత్రణ కేంద్రాలకు కావాల్సిన భూగర్భ పరిశోధకుల కోసం నియామకాలు చేపడుతుంది. ప్రైవేటు రంగంలోనూ ఖనిజ పరిశోధనకు, ఇంధన అన్వేషణకు, గనులు, నీటి నిల్వల సర్వేలకు అవసరమైన జియాలజిస్టులకు మంచి అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. ఎన్నో ప్రైవేటు సంస్థలు వాటికి కావాల్సిన జియోలాజికల్, జియోటెక్నికల్, హైడ్రోజియోలాజికల్ సర్వేలకు శిక్షణ పొందిన జియాలజిస్టులను కోరుకుంటున్నాయి. అనుభవం, విద్యార్హతలను బట్టి వారి వేతనాన్ని నిర్ణయిస్తారు.

ఉద్యోగం చేయడం ఇష్టం లేనివారు సొంతంగా భూగర్భ పరిశోధకులుగా, జీయస్ఐ, జీపీఎస్, జియోటెక్నికల్స్‌గా పనిచేస్తూ మంచి ఆదాయం పొందవచ్చు. ఈ రకంగా మరే ఇతర రంగాల్లో లేని విధంగా భూగర్భశాస్త్రంలో విస్తృత‌ స్థాయిలో ఉద్యోగాలు అందుబాటులో ఉన్నాయి.

జీత‌భత్యాలు:

పరిశోధన సంస్థలైన NGRI, SAC, NRSC, NIO లు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఇతర భత్యాలతో కలిపి 15,600 - 39,100 రూపాయల వ‌రకు జీతాన్ని తమ ఉద్యోగులకు ఇస్తున్నాయి. ఉద్యోగంలో గ్రేడును బట్టి జీతంలో పెరుగుదల ఉంటుంది.జియోలాజికల్‌సైన్స్ కోర్సును అందిస్తున్న విశ్వవిద్యాలయాలు/ ఇతర శిక్షణ సంస్థలు:

1) ఆంధ్రప్రదేశ్

హైద్రాబాద్‌లోని ఉస్మానియా యూనివర్సిటీ

అందిస్తున్న కోర్సులు: జియాలజీ విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.osmania.ac.in

విశాఖపట్నంలోని ఆంధ్రయూనివర్సిటీ

అందిస్తున్న కోర్సులు: జియాలజీ విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.andhrauniversity.info

2) కర్ణాటక

బెంగళూరు యూనివర్సిటీ, బెంగళూరు

వెబ్‌సైట్: www.bangaloreuniversity.net 

మైసూరు యూనివర్సిటీలు, మైసూరు

అందిస్తున్న కోర్సులు: జియాలజీ విభాగంలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ కోర్సులను అందిస్తున్నాయి.

వెబ్‌సైట్: www.uni-mysore.ac.in

3) తమిళనాడు

మద్రాస్ యూనివర్సిటీ, చెన్నై.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.unom.ac.in  

అన్నా యూనివర్సిటీ

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.annauniv.edu

అన్నామలై యూనివర్సిటీ, అన్నామలైనగర్.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.annamalaiuniversity.ac.in

భారతీదాసన్ యూనివర్సిటీ, తిరుచిరాపల్లి.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.bdu.ac.in

మనోన్మణియం సుందరనార్ యూనివర్సిటీ

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.msuniv.ac.in

4) కేరళ

కేరళ యూనివర్సిటీ, తిరువనంతపురం.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.kerlauniversity.edu

కొచ్చిన్ యూనివర్సిటీ ఆఫ్ సైన్స్ ఆండ్ టెక్నాలజీ, కొచ్చి

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.cusat.edu

మహాత్మాగాంధీ యూనివర్సిటీ, కొట్టాయం.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.mguniversity.edu 

5) మహారాష్ట్ర

ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ముంబై.

అందిస్తున్న కోర్సులు: ఎంఎస్సీలో అప్లైడ్‌ జియాలజి, ఎంటెక్ (ఎక్స్‌ప్లోరేష‌న్ జియోల‌జీ), పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.iitb.ac.in

శివాజీ యూనివర్సిటీ, కొల్హాపూర్.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.shivajiuniversity.com 

వెబ్‌సైట్: www.unishivaji.ac.in

పుణే యూనివర్సిటీ, పుణే.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.unipune.ernet.in

సంత్ గాడ్గేబాబా అమరావతి యూనివర్సిటీ, అమరావతి.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.amtuni.com

నాగపూర్ యూనివర్సిటీ, నాగపూర్.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.nagpuruniversity.org

డెక్కన్ కాలేజ్ పోస్ట్‌గ్రాడ్యుయేట్ అండ్ రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్, పుణే.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.deccancollege.edu

6) మధ్యప్రదేశ్

జివాజీ యూనివర్సిటి, గ్వాలియర్.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ (ఎర్త్‌సైన్స్), పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.jiwaji.edu

విక్రం యూనివర్సిటీ, ఉజ్జయిని.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, ఎంఫిల్, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.vikramuniversity.org

బర్కతుల్లా యూనివర్సిటీ, భోపాల్.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ(అప్లైడ్‌ జియాలజి), పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.bubhopal.nic.in

డాక్టర్ హరిసింగ్ గౌర్ యూనివర్సిటీ, సాగర్.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంటెక్(అప్లైడ్‌ జియాలజి), పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.dhsgsu.ac.in

అవదేశ్ ప్రతాప్ సింగ్ యూనివర్సిటీ, రేవా.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: http://apsurewa.ac.in/

7) గుజరాత్

ఎంఎస్ యూనివర్సిటీ ఆఫ్ బరోడా, వడోదరా.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.msubaroda.ac.in

8) హర్యానా

కురుక్షేత్ర యూనివర్సిటీ, కురుక్షేత్ర.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ (అప్లైడ్‌ జియాలజి), పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.kuk.edu.tripod.com

మహర్షి దయానంద్ యూనివర్సిటీ, రోహ్‌తక్. ( గవర్నమెంట్ పీజీ కాలేజ్, నార్నాల్)

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ(జియాలజి).

వెబ్‌సైట్: www.mdurohthk.org

9) ఛండీగఢ్‌

పంజాబ్ యూనివర్సిటీ, ఛండీగఢ్‌.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ (హానర్స్), ఎంఎస్సీ (హానర్స్), ఎంఎస్సీ (పెట్రోలియం జియాలజి), పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.puchd.ac.in

10) హిమాచల్‌ప్రదేశ్

హిమచల్ ప్రదేశ్ యూనివర్సిటీ, సిమ్లా.

అందిస్తున్న కోర్సులు: జియాలజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ.

వెబ్‌సైట్: www.hpuniv.nic.in

11) ఉత్తరాఖండ్

హెచ్.ఎన్.బీ యూనివర్సిటీ

అందిస్తున్న కోర్సులు: జియాజీలో బీఎస్సీ, ఎంఎస్సీ, పీహెచ్‌డీ

వెబ్‌సైట్: http://hnbgu.ac.in/

Posted Date: 20-12-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌