• facebook
  • whatsapp
  • telegram

ఈ బ్యాక్ ఎండ్‌ టెక్నాల‌జీకి భ‌లే డిమాండ్‌

నోడ్‌. జేఎస్‌ నిపుణుల‌కు పెరుగుతున్న గిరాకీ

ఏ అప్లికేషన్‌ నడవాలన్నా బ్యాక్‌ ఎండ్‌ అనేది చాలా ముఖ్యం. బ్యాక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌లో ఉన్న టెక్నాలజీల్లో అత్యంత ప్రాచుర్యం పొందినవాటిలో నోడ్‌.జేఎస్‌ ఒకటి. ఐటీ పరిశ్రమలోని చాలా కంపెనీల్లో దీనికి చాలా డిమాండ్‌ ఉంది. నోడ్‌.జేఎస్‌లో నైపుణ్యం ఉన్నవారికి ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి!  

స్విగ్గి, జొమాటో లాంటి ఆప్స్‌ను మనం తరచూ వాడుతుంటాం. అందులో ఆహారం ఆర్డర్‌ చెయ్యగానే ఆ రెస్టారెంట్‌కి దగ్గరలో ఉన్న డెలివరీ ఎగ్జిక్యూటివ్‌కి రిక్వెస్ట్‌ వెళ్తుంది. రెస్టారెంట్‌ ఆర్డర్‌ను అంగీకరించగానే- ఎగ్జిక్యూటివ్‌ మన ఆర్డర్‌ పిక్‌ చేసుకోగానే ఆ వివరాలు మనకు ఓ నోటిఫికేషన్‌లో వస్తాయి కదా? మనం ఆర్డర్‌ చేసినప్పటి నుంచి కోరింది వచ్చేవరకూ అన్నీ ఆటోమేటిక్‌గా జరిగిపోతున్నాయని గమనించవచ్చు. అలా ఎలా జరుగుతున్నాయి? ఇందుకోసం ఒక సాఫ్ట్‌వేర్‌ డెవలప్‌ చేస్తారు. ఆ సాఫ్ట్‌వేర్‌ సర్వర్‌లో రన్‌ అవుతుంది. సర్వర్‌ అంటే ఒక కంప్యూటర్‌ లాగా మనం అనుకోవచ్చు. ఇలాంటి సాఫ్ట్‌వేర్‌ని రూపొందించడాన్ని బ్యాక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌ అంటారు. అలా సాఫ్ట్‌వేర్‌ని డెవలప్‌ చేసేవారిని బ్యాక్‌ ఎండ్‌ సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌ అంటారు. 

ఫ్లిప్‌కార్ట్‌ బిగ్‌ బిలియన్‌ డే సేల్, అమెజాన్‌ గ్రేట్‌ ఇండియన్‌ ఫెస్టివల్‌ సేల్‌ లాంటివి మనకు తెలిసినవే. అలాంటి రోజుల్లో అమెజాన్‌లో, ఫ్లిప్‌కార్ట్‌లో కొన్ని లక్షలమంది వినియోగదారులు వివిధ రకాల వస్తువులు కొంటూ ఉంటారు. ఇలా లక్షల్లో వస్తున్న అభ్యర్థనలను హ్యాండిల్‌ చేసేలా బ్యాక్‌ ఎండ్‌ సాఫ్ట్‌వేర్‌ని నిర్మించడం, ఆ సర్వర్‌ని తయారు చేసుకోవడం, ఇంకా సర్వర్ల సంఖ్య పెంచుకోవడం లాంటివి కూడా సాధారణంగా బ్యాక్‌ ఎండ్‌ డెవలపర్లే చూసుకుంటారు. 

నోడ్‌.జేఎస్‌ గురించి మరిన్ని వివరాలు తెలుసుకునేముందు జావా స్క్రిప్ట్‌ గురించి క్లుప్తంగా చూద్దాం. 

జావా స్క్రిప్ట్‌   

ఈ జావా స్క్రిప్ట్‌ని సాధారణంగా ఫ్రంట్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌లో ఉపయోగిస్తారు. ఉదాహరణకు ప్రయాణానికి ‘రెడ్‌బస్‌’, సినిమాల కోసం ‘బుక్‌ మై షో’ లాంటి వెబ్‌సైట్‌లలో సీట్లు సెలెక్ట్‌ చేస్తూ దానితో ఇంటరాక్ట్‌ అవుతుంటాం కదా. ఇవన్నీ సాధ్యపడడానికి జావా స్క్రిప్ట్‌ ఉపయోగించే కోడ్‌ రాస్తారు. సాధారణంగా ఈ వెబ్‌సైట్‌లను గూగుల్‌ క్రోమ్, సఫారీ, మొజిల్లా ఫైర్‌ఫాక్స్‌ లాంటి బ్రౌజర్‌లను వాడి ఓపెన్‌ చేస్తాం. అంటే జావా స్క్రిప్ట్‌ అనేది బ్రౌజర్‌లో పనిచేస్తుంది. దీనినే బ్రౌజర్‌ ఎన్విరాన్మెంట్‌ అని అంటారు.  కానీ బ్రౌజర్‌లో పనిచేసే ఇదే జావా స్క్రిప్ట్‌ లాంగ్వేజ్‌ని బ్యాక్‌ ఎండ్‌ డెవలప్‌మెంట్‌లో ఉపయోగించాలంటే? ఇది సాధ్యం చేసేదే నోడ్‌.జేఎస్‌. ఇదో జావా స్క్రిప్ట్‌ ఎన్విరాన్మెంట్‌. అంటే జావా స్క్రిప్ట్‌ వాడి రాసిన కోడ్‌ని రన్‌ అయ్యేలా చేస్తుంది. 

భారీ వేతనాలు 

పే స్కేల్‌ అనే సంస్థ వెల్లడించిన వివరాల ప్రకారం- నోడ్‌.జేఎస్‌లో నైపుణ్యం ఉన్న వారికి సగటు వార్షిక వేతనం రూ. 6,60,000. అమెరికాలో నోడ్‌.జేఎస్‌ డెవలపర్ల సగటు వార్షిక వేతనం అక్షరాలా రూ.76 లక్షలు. స్టాక్‌ ఓవర్‌ ఫ్లో సర్వే ప్రకారం లైబ్రరీస్, ఫ్రేంవర్క్స్‌ కేటగిరీలో వరుసగా రెండోసారి ఈ నోడ్‌.జేఎస్‌ అగ్రస్థానంలో ఉంది. 

ఎందుకు ఉపయోగిస్తారు?

ప్రధానంగా దీన్ని బ్యాక్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌లో ఉపయోగిస్తారు. నోడ్‌.జేఎస్‌ని సాఫ్ట్‌వేర్‌ డెవలపర్స్‌ స్కేలబుల్‌ బ్యాక్‌ ఎండ్‌ వెబ్‌ అప్లికేషన్‌ తయారీకి ఉపయోగిస్తారు. స్కేలబుల్‌ అంటే ఏదైనా వెబ్‌సైట్‌ని ఒకేసారి లక్షల మంది వినియోగించినా కూడా ఆ సర్వర్‌ క్రాష్‌ అవ్వకుండా అందరి రిక్వెస్ట్‌లనూ ప్రాసెస్‌ చేసి అప్లికేషన్‌ బాగా పనిచేయడం అని అర్థం.

ఇవీ ప్రత్యేకతలు

1. క్రాస్‌ ప్లాట్‌ఫారం: నోడ్‌.జేఎస్‌ని ఉపయోగించడానికి ఒక కారణం ఏమిటంటేే- అది క్రాస్‌ ప్లాట్‌ఫాÄరం. అంటే ఈ సాఫ్ట్‌వేర్‌ని వివిధ రకాల ఆపరేటింగ్‌ సిస్టమ్స్‌లో ఉపయోగించవచ్చు. ఉదాహరణకు దీన్ని విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో, ఆపిల్‌ లాప్‌టాప్‌లో ఉండే మాక్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో, ఇంకా లినక్స్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో కూడా ఉపయోగించవచ్చు. 

2. ఓపెన్‌ సోర్స్‌: ఇది ఓపెన్‌సోర్స్‌ సాఫ్ట్‌వేర్‌. ఎటువంటి కాపీరైట్‌ లేకుండా ఇది అందరికీ అందుబాటులో ఉంటుంది. అందువల్ల దీన్ని ఎవరైనా ఉపయోగించవచ్చు. అంతే కాదు- ఎవరైనా దీన్ని మరింత అభివృద్ధి చేయడంలో పాలుపంచుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా మూడు వేలమంది డెవలపర్ల కృషి వల్ల నోడ్‌.జేఎస్‌ నిరంతరం అభివృద్ధి చెందుతోంది. 

3. ప్రముఖ కంపెనీల్లో: నెట్‌ఫ్లిక్స్, ఉబర్, నాసా, మైక్రోసాఫ్ట్, లింక్డ్‌ ఇన్, ట్విటర్‌ లాంటి ప్రముఖ కంపెనీలతో పాటు ప్రపంచవ్యాప్తంగా మరెన్నో కంపెనీలు నోడ్‌.జేఎస్‌ను ఉపయోగిస్తున్నాయి. 

4. తక్కువ సమయంలో: ఇది ఇంత ప్రాచుర్యం పొందడానికి ఇంకో కారణం- దీనిలో జావా స్క్రిప్ట్‌ని ప్రధానంగా ఉపయోగించటం. జావా స్క్రిప్ట్‌ని ప్రస్తుతం సాఫ్ట్‌వేర్‌ పరిశ్రమలోనే చాలా ఎక్కువమంది వాడుతున్నారు. అప్లికేషన్‌ కూడా చాలా వేగంగా తయారు చేయవచ్చు. అందుకే చాలా కంపెనీల్లో దీని డిమాండ్‌ చాలా అధికం. జావా స్క్రిప్ట్‌ని చాలా తక్కువ సమయంలో సులువుగా నేర్చుకోవచ్చు. దీనివల్ల మనం నోడ్‌.జేఎస్‌నీ చాలా తేలిగ్గా నేర్చుకోవచ్చు .

5. పెద్ద డెవలపర్‌ కమ్యూనిటీ: ఈ నోడ్‌.జేఎస్‌కి ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద కమ్యూనిటీ ఉంది. దీన్ని ఉపయోగిస్తున్నవారి సంఖ్య చాలా ఎక్కువ అన్నమాట. అంతే కాకుండా నోడ్‌ జేఎస్‌లో నిపుణులు స్టాక్‌ ఓవర్‌ ఫ్లో లాంటి సైట్లలో సందేహాలను పరిష్కరిస్తున్నారు. ఒకవేళ మనకు ఏదైనా సాంకేతిక సమస్య వచ్చినా, ఏదైనా అర్థం కాకపోయినా కమ్యూనిటీలో చాలా త్వరగా పరిష్కారం దొరుకుతుంది. 

6. పది లక్షల లైబ్రరీలు: డెవలపర్ల పనిని సులభం చేయడానికి నోడ్‌.జేఎస్‌లో ఎన్‌పీఎం (నోడ్‌ ప్యాకేజీ మేనేజర్‌) అనే ఎకో సిస్టమ్‌ ఉంటుంది. ఈ ఎన్‌పీఎం రిజిస్ట్రీలో పది లక్షలకు పైగా ఓపెన్‌ సోర్స్‌ ప్యాకేజీలు, లైబ్రరీలు ఎవరైనా ఉపయోగించుకునేలా అందుబాటులో ఉంటాయి. దీంతో ప్రతి చిన్న కోడ్‌నూ మొదటి నుంచి రాయాల్సిన అవసరం లేకుండా ఇందులో ఉన్న రెడీమేడ్‌ సొల్యూషన్స్, టూల్స్, లైబ్రరీస్‌  డెవలప్‌మెంట్‌ను సులభం చేస్తాయి. 

ఎలా నేర్చుకోవాలి? 

నోడ్‌.జేఎస్‌లో నైపుణ్యం పొందాలంటే ముందు జావా స్క్రిప్ట్‌లో నైపుణ్యం ఉండడం చాలా ముఖ్యం. అదనంగా హెచ్‌టీఎంఎల్, సీఎస్‌ఎస్‌ గురించి పని పరిజ్ఞానం ఉంటే మంచిది. నోడ్‌.జేఎస్‌లో నైపుణ్యం ఉన్నవారికి కంపెనీలు లక్షల్లో వేతనాలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాయి. అంత డిమాండ్‌ ఉన్న దీన్ని నేర్చుకుంటే చక్కటి అవకాశాలు సొంతమవుతాయి. 4.5 నెలల శిక్షణతోనే సంవత్సరానికి 4.5 నుంచి 9 లక్షల రూపాయల వార్షిక వేతనంతో ఉద్యోగం తెచ్చుకోవచ్చు. యుడెమి, కోర్స్‌ ఎరా లాంటి వేదికల్లో కూడా నోడ్‌.జేఎస్‌ని నేర్చుకోవచ్చు. నెక్స్‌ట్‌ వేవ్‌ వారి సీసీబీపీ టెక్‌ 4.0 ఇంటెన్సివ్‌ ప్రోగ్రాంలో నోడ్‌.జేఎస్‌తో పాటు లీనిళివి స్టాక్‌లోని మాంగో దీతీ, ఎక్స్‌ప్రెస్‌ రిళీ, రియాక్ట్‌ రిళీ లాంటి వాటిల్లోనూ నైపుణ్యం పొందవచ్చు. 

వెబ్‌సైట్‌: ccbp.in/intensive
 

Posted Date: 24-05-2021


 

కోర్సులు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌