• facebook
  • whatsapp
  • telegram

న్యాయవిద్యలో ప్రవేశానికి.. ఎల్‌శాట్‌   

న్యాయవిద్యా కోర్సులపై ఆసక్తి ఉన్నవారికి లా స్కూల్‌ అడ్మిషన్‌ టెస్ట్‌ (లాశాట్‌) అవకాశం కల్పిస్తోంది. ప్రవేశపరీక్ష ద్వారా అర్హత సాధించినవారికి డిగ్రీ, ఇంటిగ్రేటెడ్‌ డిగ్రీ, మాస్టర్‌ కోర్సుల్లోకి ప్రవేశం పొందొచ్చు. దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే మొదలైంది. ఆన్‌లైన్‌ పరీక్షను  పలు దఫాల్లో నిర్వహించనున్నారు.

లా స్కూల్‌ అడ్మిషన్‌ కౌన్సిల్‌ (ఎల్‌ఎస్‌ఏసీ) ఎల్‌శాట్ను నిర్వహిస్తుంది. ఆన్‌లైన్‌ పరీక్ష. దీనిద్వారా గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ లా కోర్సుల్లో ప్రవేశం కల్పిస్తారు. ఏడాదికోసారి దీన్ని నిర్వహిస్తారు. ఈ స్కోరు ద్వారా దేశవ్యాప్తంగా 85కు పైగా లా కళాశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. పరీక్షలో భాగంగా అభ్యర్థి వెర్బల్, లాజికల్, క్రిటికల్‌ థింకింగ్‌ నైపుణ్యాలను పరిశీలిస్తారు. 

బీఏ ఎల్‌ఎల్‌బీ 

బీబీఏ ఎల్‌ఎల్‌బీ 

బీకాం ఎల్‌ఎల్‌బీ 

బీఎస్‌సీ ఎల్‌ఎల్‌బీ 

ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలను కల్పిస్తారు. డిగ్రీ కోర్సుల కాలవ్యవధి ఏడాది. ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు అయిదేళ్లు.

ఇంటిగ్రేటెడ్‌ కోర్సులకు ఇంటర్మీడియట్‌ లేదా తత్సమాన విద్యను పూర్తిచేసినవారు అర్హులు. ఎల్‌ఎల్‌బీ కోర్సుకు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి ఏదైనా డిగ్రీ పూర్తిచేసి ఉండాలి. మాస్టర్‌ కోర్సులకు డిగ్రీ స్థాయిలో గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం/ సంస్థ నుంచి ఎల్‌ఎల్‌బీ పట్టా పొంది ఉండాలి.

పరీక్ష విధానం

ఆన్‌లైన్‌లో నిర్వహిస్తారు. పరీక్ష కాలవ్యవధి 2.20 గంటలు. ప్రశ్నలన్నీ బహుళైచ్ఛిక విధానంలో ఉంటాయి. ఒక్కో ప్రశ్నకు 5 ఆప్షన్లుంటాయి. మొత్తం ప్రశ్నలు 92. పరీక్షలో భాగంగా నాలుగు సెక్షన్లు ఉంటాయి. మొత్తం మూడు అంశాలు- అనలిటికల్‌ రీజనింగ్, రీడింగ్‌ కాంప్రహెన్షన్, లాజికల్‌ రీజనింగ్‌ల నుంచి ప్రశ్నలుంటాయి. ఒక్కో సెక్షన్‌కు 35 నిమిషాల సమయం కేటాయించారు. స్కోరును 420-480 స్కేల్‌ మధ్య నిర్ణయిస్తారు. ఫలితాలను పర్సంటైల్‌ రూపంలో వెల్లడిస్తారు. రుణాత్మక మార్కులేమీ లేవు.

ప్రత్యేకంగా పరీక్ష కేంద్రాలంటూ ఏమీలేవు. అభ్యర్థులు తమకు నచ్చిన ప్రదేశం నుంచి పరీక్షను రాయొచ్చు. పరీక్షను పలు దఫాల్లో నిర్వహించనున్నారు. ఆ తేదీలను త్వరలోనే వెల్లడిస్తారు. 

దరఖాస్తు ఎలా? 

ఆసక్తి ఉన్నవారు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. అందులో భాగంగా అభ్యర్థి ముందుగా వెబ్‌సైట్‌లో తన వివరాలతో రిజిస్టర్‌ చేసుకోవాల్సి ఉంటుంది. తరువాత వివరాలతో దరఖాస్తు ఫారాన్ని నింపి, అవసరమైన పత్రాలను సమర్పించాల్సి ఉంటుంది.

దరఖాస్తు ఫీజు: జనవరి 15, 2021లోగా నమోదు చేసుకున్నవారికి రూ.3499; ఆపై చేసుకునేవారికి రూ.3799.

దరఖాస్తు చేసుకోవడానికి చివరితేదీ: ఏప్రిల్‌ 20, 2021

ప్రవేశపరీక్ష: మే 10, 2021 నుంచి మొదలవుతుంది.

వెబ్‌సైట్‌: https://www.discoverlaw.in/

Posted Date: 15-01-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌