• facebook
  • whatsapp
  • telegram

ఫార్మా విద్యలో రారాజు నైపర్!

 మాస్ట‌ర్ డిగ్రీ, పీహెచ్‌డీ ప్ర‌వేశాల‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల‌

జూన్ 5, 2021న నైప‌ర్‌జేఈఈ ప్ర‌వేశ ప‌రీక్ష‌

మన ‌ఆధునిక సాంకేతిక జీవితంలో వైద్య‌, ఫార్మా రంగాలు చెర‌గ‌ని ముద్ర వేసుకున్నాయి. క‌రోనా వైర‌స్ కార‌ణంగా ప్ర‌పంచానికి ఈ రెండు రంగాల అవ‌స‌రం ఎంత ఉంద‌నేది ప్ర‌స్తుతం క‌ళ్ల ముందే చూస్తున్నాం. ఇవి లేకపోతే భ‌విష్య‌త్తులో మాన‌వ మ‌న‌గ‌డ లేనేలేదు అనే ప‌రిస్థితి స్ప‌ష్టంగా అర్థ‌మైంది. దీంతో వైద్య‌, ఫార్మా రంగాల‌కు డిమాండ్ విప‌రీతంగా పెరిగింది. క‌రోనా వ్యాక్సిన్ త‌యారీకి అన్ని దేశాలు ఏక‌తాటిపైకి వ‌చ్చిన‌ప్ప‌టికీ చివ‌ర‌కు మ‌న దేశంలోని కంపెనీలే అందులో ప్ర‌ముఖ‌‌పాత్ర పోషించి విజ‌య‌వంతం కావ‌డం గ‌మ‌నార్హం. అందుకు ఇక్క‌డి ఉన్న‌త విద్య‌, ప‌రిశోధ‌న‌లు, ఫార్మాక‌స్యూటిక‌ల్ సైన్సెస్ అండ్ మేనేజ్‌మెంట్ అభివృద్ధి అనే చెప్ప‌వ‌చ్చు. ఇవ‌న్నీ మ‌న వ‌ద్ద‌నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటిక‌ల్ ఎడ్యుకేష‌న్ అండ్ రిసెర్చ్‌(నైప‌ర్‌)లోనే అందుబాటులో ఉన్నాయి. అహ్మ‌దాబాద్‌(గుజ‌రాత్‌), గువాహ‌టి(అస్సాం), హ‌జీపూర్‌(బిహార్‌), హైద‌రాబాద్(తెలంగాణ‌)‌, కోల్‌క‌తా(ప‌శ్చిమ‌బంగ‌),రాయ్‌బ‌రేలీ(ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌), ఎస్ఏఎస్ న‌గ‌ర్‌(పంజాబ్‌) ప్రాంతాల్లో నైప‌ర్‌లు విస్త‌రించి ఉన్నాయి. ప్ర‌స్తుతం వీటిలో 2021-22 విద్యాసంవ‌త్స‌రానికి మాస్ట‌ర్స్ డిగ్రీ, పీహెచ్‌డీ ప్ర‌వేశాలకు ప్ర‌క‌ట‌న వెలువ‌డింది. నైప‌ర్‌జాయింట్ ఎంట్ర‌న్స్ ఎగ్జామ్ ద్వారా సీట్ల‌ను భ‌ర్తీ చేయ‌నున్నారు. హైద‌రాబాద్‌లోని ఇన్‌స్టిట్యూట్ ఆధ్వ‌ర్యంలో ఈ ప‌రీక్ష నిర్వ‌హిస్తున్నారు. దేశంలోని అన్ని నైపర్‌ ప్రాంగణాల్లో అన్ని కోర్సులూ అందుబాటులో లేవు. నైపర్‌ మొహాలీలో అత్యధికంగా 16 రకాల పీజీ కోర్సుల్లో 260 సీట్లు ఉన్నాయి. హైదరాబాద్‌ నైపర్‌లో 10 పీజీ కోర్సులు, 171 సీట్లు ఉన్నాయి. హాజీపూర్‌ నైపర్‌లో కేవలం 5 పీజీ కోర్సులు, 70 సీట్లు ఉన్నాయి.

మాస్ట‌ర్స్ డిగ్రీ చేసేందుకు కోర్సులు, అందుబాటులో ఉన్న సీట్లు
 

కోర్సు విభాగం ఎస్ఏఎస్ న‌గ‌ర్‌  హైద‌రాబాద్‌ అహ్మ‌దాబాద్ గువాహ‌టి

హ‌జీపూర్‌‌

కోల్‌క‌తా రాయ్‌బ‌రేలీ
ఎంఎస్(ఫార్మ‌సీ) బ‌యోటెక్నాల‌జీ 37   15 10 17   11
  మెడిక‌ల్ కెమిస్ట్రీ 26 17 22 12   19 25
  మెడిక‌ల్ డివైజెస్     15     06  
  నాచ్యుర‌ల్ ప్రొడ‌క్ట్స్ 14 11 12     09  
  ఫార్మాస్యుటిక‌ల్ అనాల‌సిస్ 09 20 22 25 10    
  ఫార్మ‌కాల‌జీ & టాక్సికాల‌జీ 20 17 22 18 17 19 17
  ఫార్మాస్యుటిక్స్ 22 22 22 10 10 19 22
  రెగ్యులెట‌రీ టాక్సికాల‌జీ 09 13         12
  ఫార్మాకోఇన్ఫ‌ర్మాటిక్స్ 19 09       07  
  రెగ్యులెట‌రీ అఫైర్స్   09          
  ట్రెడిష‌న‌ల్ మెడిసిన్‌ 05            
                 
ఎంబీఏ(ఫార్మ‌సీ) ఫార్మాస్యుటిక‌ల్ మేనేజ్‌మెంట్ 46 38 25        
                 
ఎంఫార్మ‌సీ ఫార్మాస్యుటిక‌ల్ టెక్నాల‌జీ (ఫార్ములేష‌న్స్‌) 07     12      
  క్లినిక‌ల్ రిసెర్చ్‌ 09            
   ఫార్మ‌సీ ప్రాక్టీస్ 09     12 16    
                 
ఎంటెక్   మెడిక‌ల్ డివైజెస్ 10 11   16      
                 
ఎంటెక్(ఫార్మ‌సీ) ఫార్మాస్యుటిక‌ల్ టెక్నాల‌జీ
(ప్రాసెస్ కెమిస్ట్రీ)

 
  15          
  ఫార్మాస్యుటిక‌ల్ టెక్నాల‌జీ(బ‌యోటెక్నాల‌జీ) 11            
మొత్తం   270 182 155 125 70 79 87

పీహెచ్‌డీ చేసేందుకు అందుబాటులో ఉన్న విభాగాలు, సీట్లు
 

విభాగం హైద‌రాబాద్‌ ఎస్ఏఎస్ న‌గ‌ర్ అహ్మ‌దాబాద్ గువాహ‌టి హ‌జీపూర్ కోల్‌క‌తా రాయ్‌బ‌రేలీ
బ‌యోటెక్నాల‌జీ - 04 04 03 04 - 02
మెడిక‌ల్ కెమిస్ట్రీ 04 06 05 03 - 04 07
మెడిక‌ల్ డివైజెస్ 02 - 03 02 - - -
నాచ్యుర‌ల్ ప్రొడ‌క్ట్స్ 02 06 03 - - 02 -
ఫార్మ‌స్యుటిక‌ల్ అనాల‌సిస్ 05 - 05 04 02 - -
ఫార్మ‌కాల‌జీ & టాక్సికాల‌జీ 06 05 05 03 04 03 05
ఫార్మ‌స్యుటిక్స్ 08 07 05 04 01 02 04
‌ప్రాసెస్ కెమిస్ట్రీ 03 - - - - - -
రెగ్యులెట‌రీ అఫైర్స్ 02 - - - - - -
ఫార్మ‌స్యుటిక‌ల్ మేనేజ్‌మెంట్ 01 04 - - - - -
ఫార్మ‌కోఇన్ఫ‌ర్మాటిక్స్‌ 02 06 - - - 01 -
‌ఫార్మ‌సీ ప్రాక్టీస్‌ - 03 - 03 04 - -
‌ఫార్మ‌స్యుటిక‌ల్ టెక్నాల‌జీ (ప్రాసెస్ కెమిస్ట్రీ) - 04 - - - - -
ఫార్మ‌స్యుటిక‌ల్ టెక్నాల‌జీ (‌ఫార్ములేష‌న్స్‌) - - - 03 - - -
మొత్తం 35   30 25 15 12 18

అర్హ‌త

నైప‌ర్‌లో మాస్ట‌ర్ డిగ్రీలో చేరాలంటే త‌ప్ప‌క బీఫార్మ‌సీతోపాటు సంబంధిత స్పెష‌లైజేష‌న్ల‌లో 60% మార్కుల‌తో ఉత్తీర్ణులై ఉండాలి. ఎస్సీ, ఎస్టీ అభ్య‌ర్థుల‌కైతే 55%, పీడ‌బ్ల్యూబీడీల‌కు 50% మార్కులుంటే చాలు. చివ‌రి సంవ‌త్స‌రం చ‌దివే విద్యార్థులూ అర్హులే. అలాగే ద‌ర‌ఖాస్తుదారులంద‌రూ జీప్యాట్/ గేట్‌/ నెట్ ప్ర‌వేశ ప‌రీక్ష‌ల్లో అర్హ‌త సాధించాల్సి ఉంటుంది. మాస్ట‌ర్ ఆఫ్ సైన్స్ (ఫార్మ‌సీ)లో మెడిక‌ల్ కెమిస్ట్రీ, నాచ్యుర‌ల్ ప్రొడ‌క్స్‌, ఫార్మాస్యుటిక‌ల్ అనాల‌సిస్, బ‌యోటెక్నాల‌జీ చేయాలంటే బీఫార్మ‌సీ/ ఎంఎస్సీ(ఆర్గానిక్ కెమిస్ట్రీ/అన‌లైటిక‌ల్ కెమిస్ట్రీ/ బ‌యోలాజిక‌ల్ సైన్సెస్‌) ఉత్తీర్ణ‌త సాధించాలి. ట్రెడిష‌న‌ల్ మెడిసిన్‌కు బీఏఎంఎస్‌, ఎంఎస్సీ(బాట‌నీ) చేసి ఉండాలి. ఫార్మ‌కాల‌జీ & టాక్సికాల‌జీకి బీవీఎస్/ ఎంబీబీఎస్ చేయాలి. రెగ్యులేట‌రీ టాక్సికాల‌జీకి బీవీఎస్సీ/ ఎంఎస్సీ(ఫార్మ‌కాల‌జీ/ టాక్సికాల‌జీ/ లైఫ్ సైన్సెస్/ బ‌యోకెమిస్ట్రీ/ మెడిక‌ల్ బ‌యోటెక్నాల‌జీ/ జువాల‌జీ), ఎంబీబీఎస్ చేసిన వారు అర్హులు. ఫార్మాకోఇన్ఫ‌ర్మాటిక్స్‌కు బీటెక్‌(బ‌యోఇన్ఫ‌ర్మాటిక్‌)/ ఎంఎస్సీ(ఆర్గానిక్/ ఫిజిక‌ల్/ ఫార్మాస్యుటిక‌ల్ కెమిస్ట్రీ/ బ‌యోకెమిస్ట్రీ/ బ‌యోటెక్నాల‌జీ/ మాలిక్యుల‌ర్ బ‌యోల‌జీ/ బ‌యోఇన్ఫ‌ర్మాటిక్స్/ మైక్రోబ‌యాల‌జీ) అవ‌స‌రం. మెడిక‌ల్ డివైజెస్‌కు ఎంఎస్సీ (లైఫ్ సైన్స్/ బ‌యోకెమిస్ట్రీ/ బ‌యోటెక్నాల‌జీ/ బ‌యోమెడిక‌ల్ సైన్సెస్/ బ‌యోఫిజిక్స్), బీటెక్/ బీఈ (ఎల‌క్ట్రానిక్స్/ బ‌యోఇంజినీరింగ్/ బ‌యోమెడిక‌ల్ ఇంజినీరింగ్/ బ‌యోటెక్నాల‌జీ/ కెమిక‌ల్ ఇంజినీరింగ్/ మెటీరియ‌ల్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్/ బ‌యోకెమిక‌ల్ ఇంజినీరింగ్‌), ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీవీఎస్సీలో అర్హులై ఉండాలి. 
రెగ్యులేట‌రీ అఫైర్స్‌కు బీటెక్/ బీఈ (బ‌యోటెక్నాల‌జీ, బ‌యోమెడిక‌ల్ ఇంజినీరింగ్‌/ కెమిక‌ల్ ఇంజినీరింగ్ లేదా స‌మాన కోర్సులు), ఎంబీబీఎస్‌, బీడీఎస్‌, బీవీఎస్సీ, ఎంస్సీ (బ‌యోటెక్నాల‌జీ/ మైక్రోబ‌యాల‌జీ/ ఫుడ్ సైన్స్/ లైఫ్ సైన్సెస్/ కెమిక‌ల్ సైన్సెస్/ ఫార్మ‌కాల‌జీ/ టాక్సికాల‌జీ).

మాస్ట‌ర్ ఆఫ్ ఫార్మ‌సీ (ఎంఫార్మ‌సీ) ప్రోగ్రామ్‌లో ఫార్మాస్యుటిక‌ల్ టెక్నాల‌జీ (ఫార్ములేష‌న్స్‌), ఫార్మ‌సీ ప్రాక్టీస్‌, క్లినిక‌ల్ రిసెర్చ్ ప్ర‌వేశాల‌కు బీఫార్మ‌సీ చేస్తే స‌రిపోతుంది. ఎంటెక్ (ఫార్మ‌సీ)లో ఫార్మాస్యుటిక‌ల్ టెక్నాల‌జీ (బ‌యోటెక్నాల‌జీ, ప్రాసెస్ కెమిస్ట్రీ), మెడిక‌ల్ డివైజెస్ చేయాలంటే బీఫార్మ‌సీ, ఎంఎస్సీ(లైఫ్ సైన్సెస్‌/ ఆర్గానిక్ కెమిస్ట్రీ/ కెమిక‌ల్ సైన్సెస్ బ‌యోకెమిస్ట్రీ బ‌యోటెక్నాల‌జీ బ‌యోమెడిక‌ల్ సైన్సెస్ బ‌యోఫిజిక్స్‌‌), బీటెక్‌/ బీఈ/ ఎంబీబీఎస్/ బీడీఎస్/ బీవీఎస్‌.

మాస్ట‌ర్ ఆఫ్ బిజినెస్ అడ్మినిస్ట్రేష‌న్ (ఫార్మ‌సీ)లో ఫార్మాస్యుటిక‌ల్ మేనేజ్‌మెంట్ చేయాలంటే బీఫార్మ‌సీ/ బీటెక్ (కెమిక‌ల్ ఇంజినీరింగ్ లేదా స‌మాన కోర్సులు), ఎంఎస్సీ (కెమిక‌ల్ లైఫ్/ సైన్సెస్‌) ఉత్తీర్ణ‌త సాధించాలి. 

పీహెచ్‌డీ చేసేందుకు సంబంధింత స్పెష‌లైజేష‌న్ల‌లో మాస్ట‌ర్స్ డిగ్రీ పూర్తి చేయాలి.

ప‌రీక్షా విధానం

అభ్య‌ర్థుల‌కు కంప్యూట‌ర్ బేస్డ్ టెస్ట్‌(సీబీటీ) నిర్వ‌హిస్తారు. ఎంబీఏతో పాటు మాస్ట‌ర్స్ ప్రోగ్రామ్ ద‌ర‌ఖాస్తు చేసుకున్న వారంద‌రికీ ఒక‌టే ప్ర‌శ్న‌ప‌త్రం ఉంటుంది. 200 మ‌ల్టిపుల్ చాయిస్ ప్ర‌శ్న‌లు ఇస్తారు. బీఫార్మ‌సీ, సంబంధిత పీజీ డిగ్రీ, జ‌న‌ర‌ల్ ఆప్టిట్యూడ్ నుంచి అడుగుతారు. త‌ప్పు స‌మాధానానికి 25% కోత విధిస్తారు. ప‌రీక్షా స‌మ‌యం రెండు గంటలు. 

తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు ; హైద‌రాబాద్‌, విజ‌య‌వాడ‌

ద‌ర‌ఖాస్తు ఎలా?

ఆస‌క్తితోపాటు అర్హ‌త క‌లిగిన విద్యార్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. మే 8, 2021 తేదీ వ‌ర‌కు అవ‌కాశం ఉంది. ప‌రీక్ష రుసుముగా ఎంఎస్‌(ఫార్మ‌సీ)/ ఎంఫార్మ‌సీ/ ఎంటెక్‌(ఫార్మ‌సీ)/ ఎంటెక్‌, ఎంబీఏ ప్రోగ్రాముల‌కు ఎస్సీ/ఎస్టీ అభ్య‌ర్థులు రూ.1500, ఇత‌రులు రూ.3000 చొప్పున‌చెల్లించాలి. అన్ని ప్రోగ్రాముల‌కైతే ఎస్సీ/ ఎస్టీలు రూ.2000, ఇత‌రులు 4000 చెల్లించాల్సి ఉంటుంది. హాల్ టికెట్లు మే 21 నుంచి డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు. ప్ర‌వేశ ప‌రీక్ష జూన్ 5, 2021న ఉంటుంది. జూన్ 12 లోపు ఫ‌లితాలు విడుద‌ల చేస్తారు. ఎంబీఏ(ఫార్మ‌సీ) ద‌రఖాస్తుదారులు రాత‌ప‌రీక్ష‌లో నెగ్గితే జులై 5, 6 తేదీల్లో ఆఫ్‌లైన్‌/ఆన్‌లైన్‌లో‌గ్రూపు డిస్క‌ష‌న్, ఇంట‌ర్వ్యూలు ఉంటాయి. మాస్ట‌ర్స్ ప్రోగ్రాముల ప్ర‌వేశాల‌కు జాయింట్ కౌన్సెలింగ్ జులై 7-9 తేదీల్లో ఉంటుంది. త‌ర‌గ‌తులు ఆగ‌స్టు 2, 2021 నుంచి ప్రారంభ‌మ‌వుతాయి.

ఉపకార వేతనం

ఎం.ఫార్మసీ, ఎం.ఎస్‌ (ఫార్మా)లో చేరిన ప్రతీ బీ-ఫార్మసీ విద్యార్థికీ నెలకు రూ.12,400 చొప్పున ఉపకార వేతనం రెండు సంవత్సరాలపాటు లభిస్తుంది.

గత సంవత్సర ఫలితాల సరళి

నైపర్‌-జేఈఈ 2020 పరీక్షకు హాజరైన వారిలో 2,388 మంది మౌఖిక పరీక్షకు ఎంపికయ్యారు. వీరిలో సుమారు మూడో వంతు మందిని ఎం.ఫార్మసీ, ఎంఎస్‌ (ఫార్మా), ఎంటెక్‌ (ఫార్మా)లలో చేర్చుకున్నారు. ఇక ఎంబీఏ (ఫార్మా) విషయానికొస్తే 5,111 మంది పరీక్షలు రాయగా వారిలో 744 మందిని జాయింట్‌ కౌన్సిలింగ్‌కు ఎంపిక చేసి వీరి నుంచి సుమారు 100 మందిని ఎంబీఏ (ఫార్మా)లో చేర్చుకున్నారు.

స్కోరు కోసం...

నైపర్‌- జేఈఈలో మంచి స్కోరు సాధించాలంటే పుస్తక పరిజ్ఞానంతోపాటు ప్రాక్టికల్‌ నాలెడ్జ్, అనలిటికల్‌ రీజనింగ్‌ నైపుణ్యాలు ముఖ్యం. ప్రతి పాఠ్యాంశాన్నీ క్షుణ్ణంగా అర్థం చేసుకున్నప్పుడే ఇది సాధ్యమవుతుంది.

 బీ-ఫార్మసీ విద్యార్థులకు కళాశాలల్లో సుమారు 20 రకాల సబ్జెక్టుల్లోని పాఠ్యాంశాలు బోధిస్తారు. వీటిలో ముఖ్యమైనవి ఫార్మాస్యూటిక్స్, ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్, కెమిస్ట్రీ, మెడిసినల్‌ కెమిస్ట్రీ, ఫార్మకాలజీ, నేచురల్‌ ప్రాడక్ట్స్, బయో టెక్నాలజీ, బయో కెమిస్ట్రీలతోపాటు కొన్ని జనరల్‌ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నలు కూడా ఉంటాయి. 

‣ నేచురల్‌ ప్రొడక్ట్స్‌కు సంబంధించి బయొలాజికల్‌ టాపిక్‌ల కంటే ఫైటో కెమిస్ట్రీపై శ్రద్ధ చూపాలి. 

‣ ఫార్మకాలజీ, టాక్సికాలజీలలో ఔషధాల వర్గీకరణ, ఫార్మకోకైనటిక్, ఫార్మకో డైనమిక్స్, క్లినికల్‌ ఫార్మసీ, పేథో ఫిజియాలజీ, డ్రగ్‌ ఇంటరాక్షన్లు, కీమోథెరపీ, జనరల్‌ ఫార్మకాలజీ, సెంట్రల్‌ నర్వస్‌సిస్టంపై దృష్టిపెట్టాలి.

‣ ఫార్మాస్యూటిక్స్‌కు సంబంధించి ట్యాబ్‌లెట్స్, క్యాప్స్యూల్స్, సిరప్స్, ఇంజెక్షన్లు, ఆయింట్‌మెంట్లతో సహా అన్ని రకాల ఔషధాల తయారీలో మెలకువలు, ఫార్ములేషన్‌ డెవలప్‌మెంటు విధానాలు తెలిసి ఉండాలి. 

‣ డ్రగ్‌ చట్టాలు, ఫిజికల్‌ ఫార్మసీ, హాస్పిటల్‌ - కమ్యూనిటీ ఫార్మసీ, డిస్పెన్సింగ్, పేషెంట్‌ కౌన్సెలింగ్‌లపై శ్రద్ధ చూపాలి.

‣ ఫార్మాస్యూటికల్‌ అనాలిసిస్‌ కొస్తే ఇండియన్‌ ఫార్మకోపియా (ఐ.పి.) లోని అన్ని ఔషధాల విశ్లేషణ పద్ధతులు, మోడరన్‌ అనలిటికల్‌ టెక్నిక్స్, గుడ్‌ లేబొరేటరీ ప్రాక్టీసెస్‌తోపాటు అన్ని రకాల క్రొమెటోగ్రఫీ విధానాలు (పేపర్, గ్యాస్, లిక్విడ్‌); హెచ్‌పీఎల్‌సీ; స్పెక్రోస్కోపీˆ, ఎల్‌సీఎంఎస్, జీసీఎంఎస్, ఐఆర్, ఐటీఎంఆర్, ఎలక్ట్రోఫోరిసిస్‌ మొదలైన అన్ని లేబొరేటరీ అనలిటికల్‌ ఎక్విప్‌మెంట్‌ ఆపరేట్‌ చేసే విధానం తెలిసి ఉండాలి. 

‣ బయో టెక్నాలజీలో యాంటీ బయోటిక్స్, విటమిన్లు, వ్యాక్సిన్లు, అమైనో యాసిడ్లు మొదలైన బయో ఔషధాల తయారీ, విశ్లేషణలను చదవాలి. ఎంజైమ్స్, జీనీ ఎక్స్‌ప్రెషన్, మ్యుటేషన్, రీకాంబినేషన్లు, బ్యాక్టీరియోఫేజ్, మోనోక్లోనల్‌ యాంటీబాడీస్, ఇన్సులిన్, జీన్‌థెరపీలపై అవగాహన పెంచుకోవాలి.

‣ కెమిస్ట్రీ, మెడిసినల్‌ కెమిస్ట్రీల్లో ఐయూపీయూసీ నామిన్‌క్లేచర్, ఈ అండ్‌ జడ్‌ ఐసోమిరిజమ్, హైబ్రిడైజేషన్, ఏరోమెటిసిటీ, కార్బోహైడ్రేట్‌ కెమిస్ట్రీ, ఎస్టర్‌ హైడ్రోలిసిస్, అమైనో యాసిడ్స్‌ కెమిస్ట్రీ, నిన్‌ హైడ్రిన్‌ టెస్ట్, థర్మో మెథడ్స్‌ ఆఫ్‌ అనాలిసిస్, వివిధ రోగాలకు వాడే ఔషధాలు, అవి పనిచేసే విధానం, బల్క్‌ డ్రగ్స్‌ తయారీ విధానాలను క్షుణ్ణంగా చదవాలి.

‣ ఆప్టిట్యూడ్‌ ప్రశ్నల విషయానికొస్తే సింపుల్‌ మ్యాథమేటిక్స్, లాజికల్‌ రీజనింగ్, డేటా అనాలిస్‌లతోపాటు ఇంగ్లిష్‌ భాషకు సంబంధించిన ప్రశ్నలూ వచ్చే అవకాశం ఉంది. పీసీ రే అవార్డు ఎవరికి వచ్చింది? వరల్డ్‌ డయాబెటిక్‌ డే ఎప్పుడు జరుపుతారు లాంటి ప్రశ్నలు కూడా అడగవచ్చు. అందువల్ల సైంటిఫిక్‌ జనరల్‌ నాలెడ్జ్‌ని పెంచుకోవడం మంచిది.

డా.ఎం.వెంక‌ట‌రెడ్డి

ఎక్స్ డైరెక్ట‌ర్‌, డ్ర‌గ్స్ కంట్రోల్ మెంబ‌ర్‌,

బోర్డ్ ఆఫ్ గ‌వ‌ర్న‌ర్స్ నైప‌ర్‌, గువ‌హ‌టి

వెబ్‌సైట్‌: http://www.niperhyd.ac.in

హైద‌రాబాద్ నైప‌ర్‌లో మూడు కొత్త కోర్సులు

Posted Date: 19-04-2021


 

ప్ర‌ఖ్యాత సంస్థ‌లు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌