• facebook
  • whatsapp
  • telegram

చేసేద్దాం.. ‘తియ్యటి’ కోర్సులు

ప్ర‌వేశాల‌కు ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసిన ఎన్ఎస్ఐ

స్వీటు... ఆ పదం ఉచ్చరిస్తేనే అందరికీ నోరూరేస్తుంది. కారణం అందులోని తియ్యదనమే. ఇంతకీ తీపికి ఆ రుచి ఎలా వస్తుందో తెలుసా? గ్లూకోజ్‌, ప్ర‌క్టోజ్‌, లాక్టోజ్‌, చ‌క్కెర‌, బెల్లం అంటూ‌ రకరకాల సమాధానాలు ఉన్నాయి. వీటి గురించి అధ్యయనం చేయడానికీ ఒక సంస్థ ఉంది. అదే కాన్పూర్ (ఉత్తర్ ప్రదేశ్) లోని నేషనల్ షుగర్ ఇన్ స్టిట్యూట్ (ఎన్ ఎస్ ఐ). ఇది జాతీయ వినియోగ‌దారుల వ్య‌వ‌హారాలు, ఆహార‌, ప్ర‌జాపంపిణీ మంత్రిత్వ శాఖ కింద ప‌ని చేస్తోంది. కేంద్ర‌, రాష్ట్రాల‌కు చెందిన చ‌క్కెర, అనుబంధ సంస్థ‌ల‌కు స‌హాయ‌స‌హ‌కారాలు అంద‌జేస్తుంది. ఆసియాలోనే అతిపెద్దదైన ఈ ఇన్‌స్టిట్యూట్ కొన్ని రకాల కోర్సులను నిర్వహిస్తోంది. ప్ర‌స్తుతం 2021-22 విద్యాసంవ‌త్స‌రానికి ప్రకటన విడుదల చేసింది.  

కోర్సులు, అందుబాటులో ఉన్న సీట్లు

షుగ‌ర్ టెక్నాల‌జీ (ఏఎన్ఎస్ఐ-ఎస్‌టీ), షుగ‌ర్ ఇంజినీరింగ్(ఏఎన్ఎస్ఐ-ఎస్ఈ) విభాగాల్లో ‌పోస్టు గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సు ఆఫ్ అసోసియేట్‌షిప్ కోర్సులో వ‌రుస‌గా 66, 33 సీట్లు అందుబాటులో ఉన్నాయి. పీజీ డిప్లొమా కోర్సు చేసేందుకు ఇండ‌స్ట్రీయ‌ల్ ఫ‌ర్మేంటేష‌న్ అండ్ ఆల్క‌హాల్ టెక్నాల‌జీ (డీఐఎఫ్ఏటీ-39), షుగ‌ర్‌కేన్ ప్రొడ‌క్టివిటీ & మెచ్యురిటీ మేనేజ్‌మెంట్‌(డీఎస్‌పీఎంఎ-20) ఇండ‌స్ట్రీయ‌ల్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ & ప్రాసెస్ ఆటోమేష‌న్ (డీఐఐపీఏ-17), క్వాలిటీ కంట్రోల్ అండ్ ఇన్విరాన్‌మెంట‌ల్ సైన్స్(డీక్యూసీఈఎస్‌) విభాగాల్లో 22 సీట్లు కేటాయించారు. షుగ‌ర్ బాయిలింగ్ స‌ర్టిఫికెట్ కోర్సు(ఎస్‌బీసీసీ-63), షుగ‌ర్ ఇంజినీరింగ్ స‌ర్టిఫికెట్ కోర్సు (ఎస్ఈసీసీ-17), స‌ర్టిఫికెట్ కోర్సు ఇన్ క్వాలిటీ కంట్రోల్ (సీసీక్యూసీ-22) సీట్లూ ఉన్నాయి. ఎఫ్ఎన్ఎస్ఐ ఇన్ షుగ‌ర్ టెక్నాల‌జీ లేదా షుగ‌ర్ టెక్నాల‌జీ, ఎఫ్ఎన్ఎస్ఐ ఇన్ షుగ‌ర్ ఇంజినీరింగ్, ఎఫ్ఎన్ఎస్ఐ ఇన్ ఫ‌ర్మేంటేష‌న్ టెక్నాల‌జీ కోర్సుల్లో అవ‌స‌రాల‌ను బ‌ట్టి ప్ర‌వేశాలు క‌ల్పిస్తారు.

అర్హ‌తలు

ఏఎన్ఎస్ఐ(ఎస్‌టీ) కోర్సు చేయాలనుకునే అభ్య‌ర్థులు బీఎస్సీలో కెమిస్ట్రీ, ఫిజిక్స్‌, మ్యాథ‌మేటిక్స్ స‌బ్జెక్టుల‌తో ఉత్తీర్ణులై ఉండాలి. లేదా బ్యాచిల‌ర్ డిగ్రీలో కెమిక‌ల్ ఇంజినీరింగ్ అయినా పూర్తి చేయాలి. ఏఎన్ఎస్ఐ(ఎస్ఈ) కోర్సుకు బ్యాచిల‌ర్ డిగ్రీ/ ఏఎంఐఈల్లో మెకానిక‌ల్/ ప్రొడ‌క్ష‌న్/ ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రిక‌ల్ & ఎల‌క్ట్రానిక్స్ విభాగాల‌ను పూర్తి చేయాలి. డీఐఎఫ్ఏటీ కోర్సుకు బీఎస్సీలో కెమిస్ట్రీ/ అప్ల‌యిడ్ కెమిస్ట్రీ/ ఇండ‌స్ట్రీయ‌ల్ కెమిస్ట్రీ/ బ‌యోకెమిస్ట్రీ ఒక స‌బ్జెక్టుగా ఉండాలి. లేదా బీటెక్‌లో బ‌యోటెక్నాల‌జీ/ కెమిక‌ల్ ఇంజినీరింగ్ లేదా బ‌యో కెమిక‌ల్ ఇంజినీరింగ్ చ‌ద‌వాలి. బీఎస్సీ/ బీఎస్సీ అగ్రిక‌ల్చ‌ర్ చేసిన అభ్య‌ర్థులు డీఎస్‌పీఎంఎం కోర్సుకు అర్హులు. డీఐఐపీఏ కోర్సుకైతే బ్యాచిల‌ర్ డిగ్రీలో ఎల‌క్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేష‌న్/ ఎల‌క్ట్రానిక్స్ / ఇన్‌స్ట్రుమెంటేష‌న్/ ఎల‌క్ట్రిక‌ల్ & ఎల‌క్ట్రానిక్స్/ అప్ల‌యిడ్ ఎల‌క్ట్రానిక్స్ & ఇన్‌స్ట్రుమెంటేష‌న్/ ఎల‌క్ట్రానిక్స్ & క‌మ్యూనికేష‌న్ ఇన్‌స్ట్రుమెంటేష‌న్ & కంట్రోల్ పాసై ఉండాలి. డీక్యూసీఈఎస్ కోర్సుకు బీఎస్సీలో ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్ లేదా జువాల‌జీ, బోట‌నీ, ఎన్విరాన్‌మెంట‌ల్ సైన్స్‌, బ‌యోటెక్నాల‌జీ(బీఎస్సీ/ బీటెక్‌) చ‌ద‌వాలి. ఎస్‌బీసీసీకి మెట్రిక్యులేష‌న్/ ఉన్న‌త పాఠ‌శాల‌లో సైన్స్‌/ అగ్రిక‌ల్చ‌ర్ పూర్తి చేయ‌డంతో పాటు అనుభ‌వం ఉండాలి. ఎస్‌సీఈఈకి డిప్లొమా(మెకానిక‌ల్/ ప్రొడ‌క్ష‌న్/ ఎల‌క్ట్రిక‌ల్/ ఎల‌క్ట్రిక‌ల్ & ఎల‌క్ట్రానిక్స్) అవ‌స‌రం. సీసీక్యూసీకి 12వ త‌ర‌గ‌తిలో సైన్స్ (ఫిజిక్స్‌, కెమిస్ట్రీ, మ్యాథ‌మేటిక్స్‌)లో ఉత్తీర్ణులు కావాలి. ఎఫ్ఎన్ఎస్ఐ కోర్సుల‌కు ఏఎన్ఎస్ఐ (షుగ‌ర్ టెక్/ ఇంజినీరింగ్‌‌)/ ఏవీఎస్ఐ (షుగ‌ర్ టెక్/ ఇంజినీరింగ్‌‌), డీఐఎఫ్ఏటీ/ ఐఎఫ్ఏటీ అర్హ‌త సాధించాలి. ఏఎన్ఎస్ఐ(ఎస్‌టీ), ఏఎన్ఎస్ఐ(ఎస్ఈ), డీఐఎఫ్ఏటీ, డీఎస్‌పీఎంఎం, డీఐఐపీఏ, డీక్యూసీఈఎస్‌, ఎస్ఈసీసీ, సీసీక్యూసీ కోర్సుల‌కు ఫైన‌ల్ చ‌దువుతున్న విద్యార్థులూ ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. 

ఎంపిక విధానం

ఎఫ్ఎన్ఎస్ఐ మిన‌హా మిగ‌తా విభాగాల్లో చేరే అభ్య‌ర్థుల‌కు రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తారు. ఎఫ్ఎన్ఎస్ఐ విద్యార్థుల‌కు ప‌ర్స‌న‌ల్ ఇంట‌ర్వ్యూ ఉంటుంది. 

ద‌ర‌ఖాస్తు విధానం

ఆస‌క్తి క‌లిగిన అభ్య‌ర్థులు ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు  ప్రక్రియ ఏప్రిల్ 19, 2021న ప్రారంభమై జూన్ 4, 2021న ముగుస్తుంది. విదేశీ విద్యార్థులకు మాత్రం మే 14, 2021 తేదీ వ‌ర‌కే గ‌డువు ఉంది. ద‌ర‌ఖాస్తు ప్ర‌తుల‌ను, ప‌రీక్ష రుసుము డీడీ (జ‌న‌ర‌ల్‌, బీసీ అభ్య‌ర్థులు రూ.1500, ఎస్సీ ఎస్టీలైతే రూ.1000 చెల్లించాలి) జత చేసి హార్డ్‌కాపీల‌ను డైరెక్ట‌ర్‌, నేష‌న‌ల్ ఇన్‌స్టిట్యూట్‌, క‌ల్యాణ్‌పూర్‌, కాన్పూర్‌208017 చిరునామా పేరుతో రిజిస్ట‌ర్డ్/ స్పీడ్‌పోస్ట్ చేయాలి. రాత‌ప‌రీక్ష జూన్ 27, 2021న ఉంటుంది. 

ప‌రీక్షా కేంద్రాలు

పుణె, చెన్నై, దిల్లీ, కాన్పూర్‌, కోల్‌క‌తా, ప‌ట్నా, మీర‌ట్‌, గోర‌ఖ్‌పూర్‌.  

ఉద్యోగావ‌కాశాలు

షుగర్ టెక్నాలజీ, చక్కెర ఉత్పత్తి మొద‌లైన‌అంశాలపై ప్రత్యేకమైన కోర్సు చేయ‌డం వ‌ల్ల‌లాభదాయకమైన ఉద్యోగావ‌కాశాలు ఉన్నాయి. చక్కెర దిగుబడినిచ్చే మొక్కల(చెర‌కు) ప్రాసెసింగ్, ఉత్ప‌త్తి, నాణ్య‌త‌అంశాల‌గురించి పూర్తి స‌మాచారాన్ని షుగ‌ర్ ఇంజనీరింగ్‌, టెక్నాల‌జీ కోర్సుల్లో తెలుసుకోవ‌చ్చు. టెక్నాలజిస్ట్‌ల కోసం చక్కెర, పానీయాల ఉత్పత్తి కర్మాగారాలు, చక్కెర పరిశోధన ప్రయోగశాలలు భారీగానే నియామ‌కాలు చేప‌డుతున్నాయి. వీరు చ‌క్కెర మొలాసిస్‌, ఇత‌ర ఉప ఉత్ప‌త్తులను విశ్లేషించ‌డం; ప్రాథ‌మిక‌, ద్వితీయ ప్ర‌క్రియ ర‌సాయ‌నాల సామ‌ర్థ్యాన్ని ప‌రీక్షించ‌డం; త‌యారీ, ఉత్ప‌త్తి స‌మ‌యంలో ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌పై ప‌రిశోధించ‌డం; సాంకేతిక స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇవ్వ‌డంతో పాటు వాటిని ప‌రిష్క‌రించాల్సి ఉంటుంది. అంతేకాక‌అనేక ప్రభుత్వ‌, ప్రైవేటు సంస్థలైన‌ఇఫ్కో (ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్ కోఆపరేటివ్ లిమిటెడ్), నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కో-ఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీలూ ఆ జాబితాలో ఉన్నాయి. బోధన సిబ్బందిగా మార‌డం మరొక ఎంపిక. 

వెబ్‌సైట్: http://nsi.gov.in/

Posted Date: 25-03-2021


 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌