• facebook
  • whatsapp
  • telegram

సమగ్ర శిక్షణకు... ఎంఎస్‌ఐటీ!

రాష్ట్రంలోని ఐటీ సంబంధిత పీజీ కోర్సుల్లో ఎంఎస్‌ఐటీది విభిన్న తరహా. బహుళ విశ్వవిద్యాలయాలు ఉమ్మడిగా అందించే ఈ ప్రోగ్రాం 2001లో ప్రారంభమై 13 సంవత్సరాలుగా కొనసాగుతోంది. ఇటీవలే ప్రకటన వెలువడింది. ఈ ప్రోగ్రాం ప్రత్యేకత, ఇతర విశేషాలు ఇవిగో...!

ప్రదాయిక విధానాలకు భిన్నంగా 'ప్రయోగాత్మకంగా నేర్చుకోవడం లాభదాయకం' ఆధారంగా రూపొందించిన ప్రోగ్రాం ఎంఎస్‌ఐటీ (మాస్టర్‌ ఆఫ్‌ సైన్స్‌ ఇన్‌ ఇన్ఫర్మేషన్‌ టెక్నాలజీ).

దీని ద్వారా విద్యార్థులు ఉద్యోగాలకు అవసరమైన నైపుణ్యాలను నేర్చుకోవడమే కాక, వాటిని ఎలా అమలుచేయాలో కూడా అర్థం చేసుకోగలుగుతారు.

విద్యార్థులు స్వయంగా నేర్చుకునేలా ఈ కోర్సును రూపొందించారు. ఫలితంగా వారు ఉద్యోగంలో చేరినపుడు ఈ పద్ధతి సహాయపడుతుంది. ఎంఎస్‌ఐటీ ద్వారా కొత్త సాంకేతికతల ప్రాథమిక అంశాలను తక్కువ సమయంలో నేర్చుకోగలుగుతారు. ఐటీ కోర్సులతోపాటుగా భావవ్యక్తీకరణ నైపుణ్యాలపైనా దృష్టిసారించడం ఈ కోర్సు ప్రత్యేకత.

ఎంఎస్‌ఐటీని 'కన్సార్టియమ్‌ ఆఫ్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ ఆఫ్‌ హయ్యర్‌ లెర్నింగ్‌ (సీఐహెచ్‌ఎల్‌)' అమెరికాలోని కార్నెగీ మెల్లన్‌ విశ్వవిద్యాలయం (సీఎంయూ)తో కలిసి అందిస్తోంది. ఈ కన్సార్టియంలో ఐఐఐటీ-హెచ్‌, జేఎన్‌టీయూ- హైదరాబాద్‌ కాలేజ్‌ ఆఫ్‌ ఇంజినీరింగ్‌, జేఎన్‌టీయూ- కాకినాడ, జేఎన్‌టీయూ- అనంతపురంలు ఉన్నాయి.

ప్రోగ్రాం లక్ష్యం: ఇంజినీరింగు/ ఎంసీఏ పూర్తయిన తరువాత విద్యార్థులు కొలువుల్లో చేరడానికి మరిన్ని అదనపు కోర్సులను ఆశ్రయిస్తున్నారు. కొందరు విదేశాల బాట పడుతున్నారు. అయినా సఫలమయ్యేవారు కొందరే! చాలామందికి ఉద్యోగ నియామక సంస్థల పట్ల అవగాహన లేకపోవడం, అవి ఆశిస్తున్న స్థాయిలో విద్యార్థుల నైపుణ్యాలు లేకపోవడం దీనికి కారణం. రేపటి ఉద్యోగార్థులకు కావలసిన అంశాల్లో శిక్షణ ఇచ్చి తగిన కొలువులు సంపాదించుకునేలా చేయాలనే ఉద్దేశంతో ఈ ఎంఎస్‌ఐటీని రూపొందించారు.

అర్హత: బీటెక్‌/ బీఈ (అన్ని బ్రాంచీలు)/ దీనికి సమానమైన డిగ్రీ/ కంప్యూర్‌సైన్స్‌, మాథమేటిక్స్‌/ స్టాటిస్టిక్స్‌లో పీజీ చేసినవారు/ ఎంసీఏ చేసిన వారు ఈ కోర్సు చేయటానికి అర్హులు.

కోర్సు కాలవ్యవధి: 2 సంవత్సరాలు

ఏమేం స్పెషలైజేషన్లు?:

*¤ కంప్యూటర్‌ నెట్‌వర్క్స్‌

*¤ ఈ-బిజినెస్‌ టెక్నాలజీస్‌

ఇన్ఫర్మేషన్‌ సెక్యూరిటీ

సాఫ్ట్‌వేర్‌ ఇంజినీరింగ్‌

డేటా ఎనలిటిక్స్‌ & డేటా విజువలైజేషన్‌

ప్రిపరేటరీ కోర్సు ఫీజు: రూ. 20,000, వార్షిక ఫీజు: రూ. 1,35,000. ప్రిపరేటరీ కోర్సు పూర్తయి ప్రవేశం లభించిన విద్యార్థులు సీఐహెచ్‌ఎల్‌ వారు సూచించిన మేరకు లాప్‌టాప్‌ ఖరీదు చేయాల్సి ఉంటుంది.

ఇలా చేరొచ్చు: ఈ కోర్సులో చేరాలనుకున్న అభ్యర్థులు గ్రాడ్యుయేట్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (గ్యాట్‌) ప్రవేశపరీక్షకు హాజరు కావాల్సి ఉంటుంది. గ్యాట్‌ కంప్యూటర్‌ ఆధారిత పరీక్ష. రెండున్నర గంటలపాటు సాగే ఈ పరీక్షలో 100 ప్రశ్నలుంటాయి.

   వీటిలో 43 ప్రశ్నలు క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ (మాథమేటికల్‌)పై ఉంటాయి. ఈ విభాగంలో అరిథ్‌మెటిక్‌, ఎలిమెంట్రీ ఆల్జీబ్రా, జామెట్రీ, ఇన్‌ఈక్వాలిటీస్‌, గ్రాఫ్స్‌ (డేటా ఇంటర్‌ప్రిటేషన్‌), సెట్స్‌, రిలేషన్స్‌ మొదలైనవి. 29 ప్రశ్నలు ఎనలిటికల్‌/ లాజికల్‌ రీజనింగ్‌పైన ఉంటాయి. 28 ప్రశ్నలు వెర్బల్‌ (ప్రొఫిషియన్సీ ఇన్‌ ఇంగ్లిష్‌)పై ఉంటాయి. వీటిలో వాక్యపూరణం, అనాలజీ, రీడింగ్‌ కాంప్రహెన్షన్‌, యాంటనిమ్స్‌ మొదలైనవి ఉంటాయి.

పరీక్ష స్వరూపం

సెక్షన్‌ 1:

వెర్బల్‌ ఎబిలిటీ: ఇందులో 28 ప్రశ్నలుంటాయి. అభ్యర్థి ఆంగ్ల భాషాసామర్థ్యాన్ని ఇందులో పరీక్షిస్తారు. దీనిలో

సెంటెన్స్‌ కంప్లీషన్‌

* అనాలజీస్‌

*¤ రీడింగ్‌ కాంప్రహెన్షన్‌

యాంటనిమ్స్‌

సెక్షన్‌ 2:

క్వాంటిటేటివ్‌ ఎబిలిటీ: ఈ విభాగంలో 43 ప్రశ్నలుంటాయి. ఇందులో నంబర్స్‌, నంబర్స్‌ క్రంచింగ్‌ నుంచి ప్రశ్నలడుగుతారు.

1. Discrete comparison:

Statistics

Time and work

Ratio proportion and variations

Time, speed, distance

2. Data analysis:

*¤ Data interpretation

3. Quantitative comparison:

*Geometry

Profit, loss, discount

Number system

4. Sets

5. Relations:

* Progressions

* Linear equations

6. Functions:

¤  Miscellaneous

¤  Probability

¤  Percentages

సెక్షన్‌ 3:

   ఎనలిటికల్‌ అండ్‌ లాజికల్‌ ఎబిలిటీ: ఈ విభాగంలో మొత్తం 28 ప్రశ్నలుంటాయి. ఇందులో ఎనలిటికల్‌ లాజికల్‌ సామర్థ్యాలను ఉపయోగించి సమస్యలను పరిష్కరించాలి.

1. Analytical Ability:

¤Linear sequence or arrangements

Circular arrangements

¤  Calendars

¤  Ascending/ descending order arrangements

¤  Series

¤  Cubes

2. Logical Reasoning

   గ్యాట్‌లో ఉత్తీర్ణులైనవారు లిసనింగ్‌ కాంప్రహెన్షన్‌ దశకు చేరుతారు. ఇందులోనూ ఉత్తీర్ణులైనవారికి కౌన్సెలింగ్‌ నిర్వహించి ప్రిపరేటరీ కోర్సులోకి అనుమతిస్తారు. అనంతరం నిర్వహించిన పరీక్షలో ఉత్తీర్ణులైనవారిని ఎమ్‌ఎస్‌ఐటీ కోర్సులోకి అనుమతిస్తారు.  

Posted Date: 13-01-2022


 

కోర్సులు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌