• facebook
  • whatsapp
  • telegram

మూలకాలు - ప్రత్యేకతలు

మూలకాలు

ప్రత్యేకత

 యురేనియం

-

ప్రకృతిలో లభించే వాటిలో అతి భారయుతమైంది.

 హైడ్రోజన్

-

ప్రకృతిలో లభించే వాటిలో అతి తేలికైంది.

 కార్బన్ డైమండ్

-

ప్రకృతిలో లభించే వాటిలో అతి కఠినమైంది.

 కార్బన్

-

మూలకాలన్నింటిలో అత్యధిక కాటనేషన్ సామర్థ్యం ఉన్నది.

 ఆక్సిజన్

-

మూలకాలన్నిటిలో భూమి పొరల్లో అత్యధికంగా లభించేది.

 క్లోరిన్

-

మూలకాలన్నిటిలో అత్యధిక ధనవిద్యుదాత్మకత కలది.

 ఫ్లోరిన్

-

మూలకాలన్నిటిలో అత్యధిక రుణవిద్యుదాత్మకత కలది.

 హీలియం

-

మూలకాలన్నిటిలో అత్యధిక అయనీకరణ శక్తి కలది.

 ఫ్లోరిన్

-

మూలకాలన్నిటిలో అత్యధిక అలోహ స్వభావం కలది.

 సీజియం

-

మూలకాలన్నిటిలో అత్యధిక లోహ స్వభావం కలది.

 కాల్షియం

-

మానవ శరీరంలో అత్యధికంగా ఉండే లోహం.

 ఆస్మియా

-

అత్యధిక సాంద్రత ఉండే లోహం.

 లిథియం

-

ప్రకృతిలో లభించే అతి తేలికైన లోహం.

 సిల్వర్

-

అత్యధిక విద్యుత్ వాహకత గల లోహం.

 రేడియం

-

అత్యధిక రేడియోధార్మికత గల లోహం.

 అల్యూమినియం

-

భూమి పొరల్లో అత్యధికంగా ఉండే లోహం.

 టంగ్‌స్టన్

-

అత్యధిక ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం.

 పాదరసం

-

అత్యల్ప ద్రవీభవన ఉష్ణోగ్రత గల లోహం.

 నైట్రోజన్

-

గాలిలో అత్యధికంగా ఉండే వాయువు.

 మాంగనీస్

-

మానవ శరీరంలో అతి తక్కువగా ఉండే లోహం.

 ఇనుము

-

మానవుడు ఎక్కువగా ఉపయోగించే లోహం.

 బంగారం

-

రేకులుగా సాగే గుణం ఎక్కువగా ఉంటుంది.

 వెండి

-

అత్యధిక విద్యుత్, ఉష్ణవాహకత ఉన్న లోహం.

 మాంగనీస్

-

స్త్రీపురుషుల్లో ప్రత్యుత్పత్తికి తప్పనిసరైన లోహం.

 నికెల్

-

నూనెల హైడ్రోజనీకరణలో ఉత్ప్రేరకంగా వాడే లోహం.

 జిర్కోనియం

-

వేడి చేసినప్పుడు సంకోచిస్తుంది.

 టైటానియం

-

ఉక్కులో సగం బరువు, గ‌ట్టిద‌నంలో స‌మానంగా ఉంటుంది.

 హీలియం

-

అన్నింటికంటే తేలికైన జడ వాయువు.


 

బొగ్గు రకాల్లో ఉన్న కార్బన్ శాతం

బొగ్గురకం

కార్బన్ శాతం

ఆంత్రసైట్

90

బిట్యుమినస్

80

లిగ్నైట్

70

పీట్

60

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్లో వచ్చే ప్రకటనలు అనేక దేశాల నుండి, వ్యాపారస్తులు లేదా వ్యక్తుల నుండి వివిధ పద్ధతులలో సేకరించబడతాయి. ఆయా ప్రకటనకర్తల ఉత్పత్తులు లేదా సేవల గురించి ఈనాడు యాజమాన్యానికీ, ఉద్యోగస్తులకూ ఎటువంటి అవగాహనా ఉండదు. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సు సాంకేతికతతో పంపబడతాయి. ఏ ప్రకటనని అయినా పాఠకులు తగినంత జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి తగిన విచారణ చేసి, తగిన జాగ్రత్తలు తీసుకొని కొనుగోలు చేయాలి. ఉత్పత్తులు / సేవలపై ఈనాడు యాజమాన్యానికి ఎటువంటి నియంత్రణ ఉండదు. కనుక ఉత్పత్తులు లేదా సేవల నాణ్యత లేదా లోపాల విషయంలో ఈనాడు యాజమాన్యం ఎటువంటి బాధ్యత వహించదు. ఈ విషయంలో ఎటువంటి ఉత్తర ప్రత్యుత్తరాలకీ తావు లేదు. ఫిర్యాదులు తీసుకోబడవు.