• facebook
  • whatsapp
  • telegram

ABROAD EDUCATION: ఎగిరిపోతాం.. ఏ దేశానికైనా!

* తెలంగాణ వాసుల్లో ప్రవాసానికి పెరుగుతున్న ఆదరణ

* విద్య, ఉద్యోగాల కోసం భారీగా విదేశాలకు పయనం

* గతంలో గల్ఫ్‌కే.. ఇప్పుడు అన్ని దేశాలకూ 

తెలంగాణ నుంచి విదేశాలకు వెళ్లే వారి సంఖ్య ఏటికేడు పెరుగుతోంది. గతంలో ఉపాధి కోసం గల్ఫ్‌ దేశాలకే ఎక్కువ మంది వెళ్లేవారు. ఇప్పుడు విద్య, ఉద్యోగ, ఉపాధి కోసం ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాలకు తెలంగాణ వాసులు తరలిపోతున్నారు. ముఖ్యంగా యువత విదేశీ వర్సిటీల్లో ఉన్నత విద్య కోసం రెక్కలు కట్టుకుని ఎగిరిపోతోంది. రాష్ట్రం నుంచి 1970 ప్రాంతంలోనే గల్ఫ్‌ దేశాలకు వలసలు మొదలయ్యాయి. 1980 నుంచి వైద్య, ఇతర వృత్తి నిపుణులు అమెరికా సహా వివిధ దేశాలకు వెళ్లడం అధికమైంది. 1990 తర్వాత ఐటీ రంగం పురోగమనంతో యువత ఉన్నత విద్య కోసం ఎక్కువగా అమెరికా బాట పట్టింది. అప్పట్నుంచి ఎమ్మెస్, ఎంబీఏ, ఎంబీబీఎస్‌ చదివేందుకు రష్యా, ఇంగ్లండ్, జర్మనీ, ఫ్రాన్స్‌ వంటి దేశాలకు వెళ్లే విద్యారుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. ‘‘ప్రస్తుతం ఏటా తెలంగాణ నుంచి సరాసరిన 60 వేల మంది విద్యారులు విదేశాలకు పయనమవుతున్నారు. అందులో ఎక్కువ మంది అమెరికాను ఎంచుకుంటున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, ఈబీసీల కోసం తెలంగాణ ప్రభుత్వం విదేశీ విద్యానిధి పథకాలను అమలు చేస్తోంది. దీని ద్వారా ఏటా వెయ్యి మందికి రూ.20 లక్షల సాయం అందిస్తోంది. ఈ పథకం అమల్లోకి వచ్చాక మధ్య తరగతి నుంచి విదేశాలకు వెళ్లి చదువుకునే వారి సంఖ్య బాగా పెరిగింది’’ అని ప్రవాసీ తెలంగాణ సంఘాలు పేర్కొంటున్నాయి. అలా వెళ్లిన వారిలో 80% మంది ఉద్యోగాలు పొంది అక్కడే సిరపడుతున్నారని తెలిపాయి. ఇదే కాదు ఇటీవల ఐటీ సంసల్లో ఉద్యోగాలు చేసే తెలంగాణ వాసుల సంఖ్యా గణనీయంగా పెరిగింది. ప్రస్తుతం తెలంగాణ నుంచి అన్ని దేశాల్లో కలిపి 1.80 లక్షల మంది ఐటీ ఉద్యోగాలు చేస్తున్నారు. ఆ తర్వాత వైద్యరంగంలో 90 వేల మంది వైద్యులు, ఫార్మాసిస్టులు, నర్సులుగా విదేశాల్లో సిరపడ్డారు. గల్ఫ్‌లో ఎక్కువ మంది సాధారణ అర్హతల (బ్లూకాలర్‌)తో ఉద్యోగాలు చేస్తున్నారు. ఈ క్రమంలో సానికంగా తెలంగాణ ప్రవాసులు సంఘాలను ఏర్పాటుచేసి వివిధ సేవా, సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగస్వాములవుతున్నారు.

కరోనా వచ్చినా...

రెండేళ్ల క్రితం వచ్చిన కరోనా ప్రపంచాన్ని అతలాకులతం చేసింది. భారత్‌తో పాటు అమెరికా, బ్రిటన్‌ ఇతర దేశాలు తల్లడిల్లిపోయాయి. ఇది విమాన ప్రయాణాలు, చదువులపై ప్రభావం చూపింది. ఈ కారణంగా ఉపాధి అవకాశాలు కోల్పోయి గల్ఫ్‌ దేశాల నుంచి దాదాపు లక్ష మంది స్వగ్రామాలకు తిరిగివచ్చారు. కొత్తగా అక్కడికి వెళ్లే వారి సంఖ్య గణనీయంగా తగ్గింది. ఈ పరిసితుల్లోనూ రాష్ట్రం నుంచి ఇతర విదేశాలకు వెళ్లే వారి సంఖ్య తగ్గలేదు. ఇంకా పెరిగింది. 2020లో 49 వేల మంది ఇక్కణ్నుంచి కొత్తగా విదేశాలకు వెళ్లగా, 2021లో ఆ సంఖ్య 51 వేలకు పెరిగింది. ఈ రెండేళ్లలో మరో 80 వేల మంది విద్యారులు చదువుల కోసం వెళ్లారు.

రాజకీయంగానూ పాగా..పెట్టుబడుల ఆకర్షణలో భూమిక

విదేశాల్లో సిరపడిన తెలంగాణ వాసులు ఆయా దేశాల రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు. సానికంగా జరిగే ఎన్నికల్లోనూ పాల్గొంటున్నారు.  ఇటీవలే ఆస్ట్రేలియా దేశం సిడ్నీలోని స్ట్రాట్‌ పీడ్స్‌ సిటీ కౌన్సిల్‌ సభ్యురాలిగా రంగారెడ్డి జిల్లాకు చెందిన పట్లోల్ల సంధ్యారెడ్డి ఎన్నికయ్యారు. న్యూసౌత్‌వేల్స్‌లోని బ్లాక్‌టౌన్‌ సిటీ కౌన్సిల్‌ సభ్యునిగా సికింద్రాబాద్‌ వాసి చెట్టిపల్లి లివింగ్‌స్టన్‌ ఎన్నికయ్యారు. తెలంగాణలో పెట్టుబడులు పెట్టేలా, పరిశ్రమలు సాపించేలా వివిధ దేశాలకు చెందిన పారిశ్రామిక వేత్తలను ప్రోత్సహించడంలోనూ ప్రవాసీయులు కీలక భూమికి పోషిస్తున్నారు. కరోనా సమయంలో భారీ వితరణ చేశారు. విదేశాల్లో రాష్ట్ర వాసులు పెద్ద సంఖ్యలో ఉండటంతో..వారి సంక్షేమం, చేయూత కోసం ప్రత్యేక విధానాన్ని(ఎన్‌ఆర్‌ఐ పాలసీ) రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తోంది.
 

Read Latest job news, Career news, Education news and Telugu news

Follow us on Facebook, Twitter, Koo, Share chatGoogle News Subscribe our Youtube Channel.

Posted Date : 09-01-2022


గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

తాజా కథనాలు

మరిన్ని
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌

 
విద్యా ఉద్యోగ సమాచారం