విశ్వవిద్యాలయాలు, డిగ్రీ కాలేజీల్లో అధ్యాపకులు, అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల నియామకానికి నెట్/సెట్లో అర్హత తప్పనిసరి. సెట్ పరీక్ష ఎలా ఉంటుందో, ఎన్ని పేపర్లు ఉంటాయో అభ్యర్థులు తెలుసుకోవాలి.
సెట్లో 3 పేపర్లుంటాయి. అన్నీ బహుళైచ్ఛిక ప్రశ్నల (మల్టిపుల్ ఛాయిస్) రూపంలో ఉంటాయి. వీటిలో పేపర్-1 అందరికీ ఉమ్మడిగా ఉండగా 2, 3, పేపర్లు అభ్యర్థుల సబ్జెక్టులకు చెందినవి.
పేపర్-1: ఈ పేపర్లో 60 ప్రశ్నలుంటాయి. 50 ప్రశ్నలు మాత్రమే రాయాలి. గరిష్ఠ మార్కులు 100. వీటికి 75 నిమిషాల్లో సమాధానాలు గుర్తించాలి. ఇది అందరికీ ఉమ్మడిగా ఉండే పేపర్.
పేపర్-2: దీనిలో 50 ప్రశ్నల్ని 75 నిమిషాల్లో గుర్తించాలి. 100 మార్కులకు ఈ పేపర్ నిర్వహిస్తారు. దీనిలో ఆప్షనల్కు సంబంధించిన ప్రశ్నలు మాత్రమే ఉంటాయి.
పేపర్-3: 75 ప్రశ్నలకు 150 మార్కులు. వీటికి 150 ని॥ల్లో సమాధానాలు గుర్తించాలి.
* పేపర్ 2, 3లలో ఆప్షనల్కు సంబంధించిన ప్రశ్నలుంటాయి. పేపర్ 2 కన్నా 3లో ప్రశ్నల కాఠిన్యత స్థాయి ఎక్కువ.