• facebook
  • whatsapp
  • telegram

గ్రామ పంచాయతీలు

1. గ్రామసభలో సభ్యులుగా ఎవరుంటారు?
: గ్రామంలోని ఓటర్లందరూ

 

2. గ్రామసభకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
జ: సర్పంచ్

 

3. ఒక గ్రామ పంచాయతీలో ఉండే కనీస వార్డుల సంఖ్య?
జ: 5

 

4. ఒక గ్రామ పంచాయతీలో ఉండే గరిష్ఠ వార్డుల సంఖ్య?
జ: 21

 

5. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయడానికి కనీస వయసు ఎంత ఉండాలి?
జ: 21 సంవత్సరాలు

 

6. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శ్రీలేఖ అనే అమ్మాయి ఓటు హక్కును వినియోగించుకుంది. ఆమె వయసు ఎంత?
జ: 18

 

7. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్త్రీలకు ఎంత శాతం సీట్లు కేటాయిస్తూ పార్లమెంటు చట్టం చేసింది?
జ: 1/3వ వంతు

 

8. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించిన ప్రధాని ఎవరు?
జ: పి.వి. నరసింహారావు

 

9. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం ఏది?
జ: బిహార్

 

10. సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి?
జ: 5 సంవత్సరాలు

 

11. తెలంగాణలో సర్పంచ్‌ను ఏ విధంగా ఎన్నుకుంటారు?
జ: ప్రత్యక్షం

 

12. కిందివాటిలో సర్పంచ్‌కు సంబంధించి సరైన అంశం?
ఎ) గ్రామానికి ప్రథమ పౌరుడు                 బి) గ్రామసభకు అధ్యక్షుడు
సి) గ్రామ పంచాయతీకి అధ్యక్షుడు           డి) అన్నీ
జ:  డి) అన్నీ

 

13. కిందివాటిలో ఉపసర్పంచ్‌కు సంబంధించి సరైన అంశం?
ఎ) పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు బి) వార్డు సభ్యులు ఎన్నుకుంటారు సి) సర్పంచ్ లేనప్పుడు ఆ బాధ్యతలు నిర్వహిస్తారు డి) పైవన్నీ
జ: డి(పైవన్నీ)

 

14. కిందివాటిలో గ్రామ పంచాయతీ విధి?
ఎ) తాగునీటి సదుపాయం బి) గ్రామీణ రహదారుల నిర్వహణ సి) వీధి దీపాలను ఏర్పాటు చేయడం డి) అన్నీ
జ: డి) అన్నీ

 

15. గ్రామ పంచాయతీ సమావేశాలు నెలలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు?
జ: 1

 

16. కిందివాటిలో గ్రామ పంచాయతీ ఆదాయ మార్గాలు
ఎ) ఇంటిపన్ను బి) భూమి శిస్తు సి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు డి) పైవన్నీ
: డి) పైవన్నీ

 

17. భారత రాజ్యాంగంలో గ్రామ పంచాయతీల ఏర్పాటును నిర్దేశిస్తున్న ఆర్టికల్?
జ: 40

 

18. ప్రాచీన భారతదేశంలో గ్రామీణ పాలనను అభివృద్ధి చేసిన రాజవంశం?
జ: చోళులు

 

19. గ్రామ పంచాయతీ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు ఎవరు?
జ: ఎంపీటీసీ

 

20. చోళుల గ్రామీణ పాలన గురించి వివరించే శాసనం?
జ: ఉత్తరమెరూర్

 

21. ఒక మండల పరిషత్ పరిధిలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి?
జ: 20

 

22. మండల పరిషత్‌కు మైనార్టీ వర్గానికి చెందిన ఎంతమందిని కో- ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేస్తారు?
జ: 1

 

23. మండల పరిషత్‌లో కనీస ఎంపీటీసీల సంఖ్య?
జ: 7

 

24. మండల పరిషత్‌లో గరిష్ఠ ఎంపీటీసీల సంఖ్య ఎంత?
జ: 23

 

25. మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక విధానం?
జ: పరోక్షం

 

26. జిల్లా పరిషత్‌కు మైనార్టీ వర్గాలకు చెందిన ఎంతమందిని కో- ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేస్తారు?
: 2

 

27. జిల్లా పరిషత్‌లో ఉండే స్థాయి సంఘాల సంఖ్య ఎంత?
జ: 7
 

28. తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ గ్రామమైన 'హజిపల్లి' ఏ జిల్లాలో ఉంది?
జ: మహబూబ్‌నగర్

 

29. కింది వాటిలో హజిపల్లి గ్రామ పంచాయతీలో చేపట్టిన కార్యక్రమం?
ఎ) అంతర్భూభాగ మురికి కాలువల నిర్మాణం        బి) ప్రతి ఇంటికీ మరుగుదొడ్ల నిర్మాణం
సి) గ్రామంలో రక్షిత మంచినీటి సౌకర్యం కల్పన       డి) పైవన్నీ
జ: డి) పైవన్నీ

 

30. హజిపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా రూపొందించిన సర్పంచ్ ఎవరు?
జ: జంగమ్మ

 

31. హజిపల్లి గ్రామానికి 2008లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు?
జ: శుభ్రం

 

32. హజిపల్లి గ్రామానికి 2008 డిసెంబరులో భారత ప్రభుత్వం ఏ అవార్డును ప్రకటించింది?
జ: నిర్మల్ పురస్కారం

 

33. 'నిర్మల్' పురస్కారాన్ని ఏ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది?
జ: 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం

 

34. తెలంగాణ రాష్ట్రంలోని 'గంగదేవిపల్లి' గ్రామ పంచాయతీ గ్రామసభను విజయవంతంగా నిర్వహిస్తుంది. ఇది ఏ జిల్లాలో ఉంది?
జ: వరంగల్

 

35. ఆదర్శ గ్రామపంచాయతీగా పేరొందిన 'రామచంద్రాపురం' ఏ జిల్లాలో ఉంది?
జ: కరీంనగర్

 

36. ఆదర్శ గ్రామపంచాయతీగా పేరొందిన 'అంకాపూర్' ఏ జిల్లాలో ఉంది?
జ: నిజామాబాద్

 

37. 'హివరెబజార్' అనే ఆదర్శ గ్రామ పంచాయతీ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: మహారాష్ట్ర

 

38. వరంగల్ జిల్లాలో 'గంగదేవిపల్లి' గ్రామ పంచాయతీలో గ్రామసభ ద్వారా ఏర్పాటైన కమిటీలు ఎన్ని?
జ: 18

 

39. కిందివాటిలో గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ సాధించిన విజయాన్ని గుర్తించండి.
ఎ) సంపూర్ణ మద్యపాన నిషేధం         బి) సంపూర్ణ అక్షరాస్యత సాధన, పాఠశాలలో 100 శాతం పిల్లల నమోదు 
సి) అన్ని కుటుంబాలు బ్యాంకు పాసు పుస్తకాలు కలిగి ఉండటం డి) పైవన్నీ
జ: డి) పైవన్నీ

 

40. కింది వాటిలో గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన కీలకమైన కమిటీ ఏది?
     ఎ) మంచినీటి కమిటీ                 బి) పారిశుద్ధ్య కమిటీ
     సి) ఉత్తర ప్రత్యుత్తరాల కమిటీ      డి) అన్నీ
జ: డి) పైవన్నీ

 

41.  హజిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు నిర్మల్ పురస్కారం అందించిన భారత రాష్ట్రపతి ఎవరు?
: ప్రతిభా పాటిల్

 

42.  'గ్రామ స్వరాజ్యం ద్వారానే రామరాజ్యం సాధ్యమవుతుందని' ఎవరు పేర్కొన్నారు?
జ: గాంధీజీ

 

43. మండల పరిషత్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం ఎలా విభజిస్తారు?
జ: MPTC

 

44. మండల పరిషత్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు?
జ: MPDO

 

45. జిల్లా పరిషత్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు?
జ: CEO

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌