1. ఆంధ్రప్రదేశ్‌లో మండల పరిషత్ వ్యవస్థ ఎప్పుడు ప్రారంభమైంది?
జ: 1986
2. కిందివారిలో మండల పరిషత్ సమావేశంలో పాల్గొనే అధికారం ఉండి ఓటుహక్కు లేనివారిని గుర్తించండి.
ఎ) ప్రజలు ప్రత్యక్షంగా ఎన్నుకున్న సభ్యులు బి) కోఆప్ట్ సభ్యులు
సి) మండలానికి చెందిన రాజ్యసభ సభ్యులు డి) మండల పరిధిలోని సర్పంచ్‌లు
జ: డి (మండల పరిధిలోని సర్పంచ్‌లు)
3. ప్రస్తుతం మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక-
జ: పరోక్ష ఎన్నిక
4. ఆంధ్రప్రదేశ్‌లోని మొత్తం మండలాల సంఖ్య -
జ: 1104
5. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లోని మండలాల సంఖ్య (ఉమ్మడి ఆంధ్రప్రదేశ్)
జ: 1125
6. మండల పరిషత్ అధ్యక్షుడిని ఎలా ఎన్నుకుంటారు?
జ: మండల పరిషత్ సభ్యులందరూ కలిసి
7. మండల ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు?
జ: ఎండీవో (మండల అభివృద్ధి అధికారి)
8. గ్రామ పంచాయతీల పనితీరును పర్యవేక్షించే మండలస్థాయి అధికారి-
జ: మండల అభివృద్ధి అధికారి
9. మండల పరిషత్ పరిధిలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి?
జ: 20 - 30
10. మండల ప్రాదేశిక నియోజక వర్గంలో సహజంగా ఎంతమంది ఓటర్లు ఉంటారు?
జ: 3000 - 4000
11. మండల పరిషత్‌కు నియమించే కో - ఆప్ట్ సభ్యుడు ఏ వర్గానికి చెందినవాడై ఉంటాడు?
జ: అల్పసంఖ్యాక వర్గాలు
12. మండల పరిషత్ ఎన్నికల్లో పోటీ చేయడానికి కనీస వయసు-
జ: 21 ఏళ్లు
13. కిందివారిలో మండల పరిషత్‌కు శాశ్వత ఆహ్వానితులను గుర్తించండి.
ఎ) ఎంపీటీసీ సభ్యులు బి) కోఆప్ట్ సభ్యులు సి) జిల్లా కలెక్టరు డి) ఏదీకాదు
జ: సి (జిల్లా కలెక్టరు)