• facebook
  • whatsapp
  • telegram

పట్టణ స్వపరిపాలనా సంస్థలు

* క్రీస్తుపూర్వం 4వ శతాబ్దంలో భారతదేశం వచ్చిన మెగస్తనీస్ (గ్రీసు) ఇక్కడి పట్టణ స్థానిక ప్రభుత్వం గురించి తన గ్రంథమైన ఇండికాలో ప్రస్తావించాడు.
* పట్టణాల పరిపాలనా వ్యవహారాలను పర్యవేక్షించడానికి అయిదుగురు అధికారులు ఉండేవారని ఆయన పేర్కొన్నాడు.
* మొగలుల కాలంలో పట్టణ వ్యవహారాలు చూసే అధికారుల్లో కొత్వాల్ ఒకరు.
* అబుల్ ఫజల్ రచించిన అయిన్ - ఇ - అక్బరీ గ్రంథంలో కొత్వాల్ విధులను ఉదహరించారు.
* బ్రిటిష్ కాలంలో భారతదేశంలో మొదటిసారిగా (1687, డిసెంబరు 30న) మద్రాస్ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇవి 1688, సెప్టెంబరు 29 నుంచి అమలయ్యాయి.
* భారతదేశ స్థానిక ప్రభుత్వాల నిర్మాణ, నిర్వహణలో రిప్పన్ తీర్మానాన్ని మాగ్నాకార్టా (Magnacarta)గా వర్ణించారు. ఈ తీర్మానం 1882లో చేశారు.
* పట్టణ స్థానిక ప్రభుత్వాలకు ఆర్థిక అధికారాలను అధికంగా కల్పించడం, ఆ సంస్థల నిర్వహణలో అధికారుల సంఖ్యను మూడో వంతుకు తగ్గించడం లాంటి పురోగాత్మక చర్యలు రిప్పన్ తీర్మానంలో ప్రస్తావించారు.
* 1907లో అధికారాల వికేంద్రీకరణపై ఉద్దేశించిన రాయల్ కమిషన్ స్థానిక ప్రభుత్వాల నిర్మాణ, నిర్వహణలో అనేక మార్పులకు శ్రీకారం చుట్టింది.
* పట్టణ స్థానిక ప్రభుత్వాల నిర్మాణ, నిర్వహణల్లో అధికారుల సంఖ్య, వారి పెత్తనాలను బాగా తగ్గించడం, ఓటు హక్కు పరిమితిని తొలగించి విస్తృతపరచడం, ఆర్థిక వనరులను అధిక మొత్తాల్లో మంజూరు చేయడం లాంటివి రాయల్ కమిషన్ సూచనల్లో ముఖ్యమైనవి.
* భారత ప్రభుత్వ చట్టం 1919 భారతదేశంలో ప్రావెన్సీల్లో (రాష్ట్ర స్థాయి) ద్వంద్వ(Dyarchy) పాలనను ప్రవేశపెట్టింది.
* ఆదేశసూత్రాల్లోని 40వ రాజ్యాంగ నిబంధన స్థానిక స్వపరిపాలన సంస్థల గురించి తెలుపుతుంది.
* భారతదేశంలో పట్టణ స్థానిక ప్రభుత్వాలను పటిష్టపరచడంలో ముఖ్యమైంది - 74వ రాజ్యాంగ సవరణ చట్టం. ఇది 1993 జూన్ 1వ తేదీన అమల్లోకి వచ్చింది.
* భారతదేశంలో ప్రస్తుత పట్టణ స్థానిక ప్రభుత్వాలు 8 రకాలు ఉన్నాయి.
 

అవి:

1) నగరపాలక సంస్థలు
2) పురపాలక సంఘాలు
3) నోటిఫైడ్ ఏరియా కమిటీలు
4) టౌన్ ఏరియా కమిటీలు
5) కంటోన్మెంట్ బోర్డులు
6) టౌన్‌షిప్‌లు
7) పోర్ట్ ట్రస్ట్‌లు
8) స్పెషల్ పర్పస్ ఏజెన్సీలు
 

నగరపాలక సంస్థ
* రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసే ప్రత్యేక చట్టం ద్వారా నగరపాలక సంస్థలు ఏర్పడతాయి.
* మన దేశంలో మొదటి నగరపాలక సంస్థను 1688లో మద్రాస్‌లో ఏర్పాటు చేశారు.
నిర్మాణం: ప్రతి నగరపాలక సంస్థలో నాలుగు ప్రధాన అంగాలు ఉంటాయి. అవి:
ఎ) నగరపాలక మండలి
బి) మేయర్
సి) కమిషనర్
డి) స్థాయీ సంఘాలు
 

నగరపాలక మండలి:
 

* నగరపాలక సంస్థ చర్చా సంబంధమైన అంగమే నగరపాలక మండలి.
* నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్ల ద్వారా ఎన్నికైన ప్రతినిధులు దీనిలో సభ్యులుగా ఉంటారు.
* వీరిని కార్పొరేటర్లు అంటారు.
* కార్పొరేటర్ పదవికి పోటీ చేయడానికి కనీస వయసు 21 సంవత్సరాలు.
* వీరి పదవీకాలం అయిదేళ్లు.
* నగరపాలక సంస్థ కమిషనర్, ఆ ప్రాంత శాసన సభ, పార్లమెంట్ సభ్యులు పదవిరీత్యా దీనిలో సభ్యులుగా ఉంటారు.
* దీని సమావేశాలకు మేయర్ అధ్యక్షత వహిస్తాడు.
 

మేయర్:

* నగర పాలక సంస్థ ప్రథమ పౌరుడే మేయర్. అతడే రాజకీయ అధిపతి.
* నగరపాలక సంస్థ పరిధిలోని ఓటర్లు మేయర్‌ను ఎన్నుకుంటారు.
* మేయర్ పదవీకాలం 5 సంవత్సరాలు.
* కార్పొరేటర్లు తమలో ఒకరిని ఉపమేయర్‌గా ఎన్నుకుంటారు.
 

గమనిక: ప్రస్తుతం మన రాష్ట్రంలో మేయర్ ఎన్నిక పరోక్ష ఎన్నిక. (కార్పొరేటర్లే మేయర్‌ను ఎన్నుకుంటారు)
 

స్థాయీ సంఘాలు:

* స్థాయీ సంఘాలు కార్పొరేషన్‌కు కళ్లు, చెవుల్లాంటివి.
* కార్పొరేషన్ తొలి సమావేశంలో కార్పొరేటర్లు తమలో కొందరిని వివిధ స్థాయి సంఘాలకు సభ్యులుగా ఎన్నుకుంటారు.
* వీరి పదవీ కాలం రెండేళ్లు.
* కమిషనర్ సిద్ధం చేసిన బడ్జెట్‌ను ఈ స్థాయీ సంఘాలు పరిశీలిస్తాయి
 

కమిషనర్:

* అనుభవం ఉన్న ఐఏఎస్ అధికారిని రాష్ట్ర ప్రభుత్వం కమిషనర్‌గా నియమిస్తుంది.
* కమిషనర్ రాష్ట్ర ప్రభుత్వ ప్రతినిధి.
* కమిషనర్ కార్పొరేషన్ ముఖ్య కార్యనిర్వహణాధికారి
* నగరపాలక సంస్థకు సంబంధించిన సిబ్బంది, ఆస్తులు, కార్యక్రమాలపై పాలనా పరమైన నియంత్రణాధికారం కమిషనర్ ఉంటుంది.
 

మున్సిపల్ కార్పొరేషన్ విధులు:
తప్పక నిర్వహించాల్సినవి:
 

* రోడ్ల నిర్మాణం, నిర్వహణ
* విద్యుత్ దీపాల నిర్మాణం, నిర్వహణ
* మురుగు కాల్వల నిర్మాణం నిర్వహణ
* తాగునీటి సరఫరా
* ప్రజారోగ్యం, పారిశుద్ధ్యం, అంటువ్యాధుల నివారణ
* జనన మరణాల నమోదు
* విద్యాలయాల ఏర్పాటు, నిర్వహణ
* స్మశాన వాటికల నిర్వహణ
* మార్కెట్లు, కబేళాల నిర్వహణ
 

వివేచనాత్మక విధులు

* గ్రంథాలయాలు, ప్రదర్శనాలయాలు, కళానిలయాల ఏర్పాటు, నిర్వహణ
* స్త్రీ శిశు సంక్షేమ కేంద్రాలు, ప్రసూతి కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ.
* వివాహాల రిజిస్ట్రేషన్.
* ఔషధ పరీక్షా కేంద్రాల ఏర్పాటు
 

కార్పొరేషన్ ఆర్థిక వనరులు:
      (a) పన్నులు
      (b) అప్పులు
      (c) గ్రాంట్లు
      (d) మార్కెట్లు, ఆస్తుల నుంచి వచ్చే ఆదాయం

కార్పొరేషన్ విధించే పన్నులు

* ఇంటిపన్ను, ఖాళీస్థలాలపై పన్ను
* నీటి, డ్రైనేజీ పన్ను
ఆస్తుల బదిలీపై పన్ను
* వినోద పన్ను, ఆక్ట్రాయ్
* వృత్తిపన్ను

Posted Date : 04-03-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌