• facebook
  • whatsapp
  • telegram

బృంద బోధన

మాదిరి ప్ర‌శ్న‌లు 

1. 'ది టెక్నాలజీ ఆఫ్ టీచింగ్' అనే గ్రంథాన్ని రచించింది?
జ: స్కిన్నర్

 

2. 'పర్యవేక్షణాత్మక అధ్యయనం' ఉద్దేశం?
జ: విద్యార్థులకు ఇంటి దగ్గర చదివించేవారు లేని లోటు తీర్చడం

 

3. విషయ ఖండికల (చట్రాల) ద్వారా విషయాన్ని, భావనలను, నిర్వచనాలను గ్రహించే బోధన?
జ: కార్యక్రమయుత బోధన

 

4. సూక్ష్మ బోధనలో బోధన తర్వాత వచ్చే సోపానం?
జ: పునర్బలనం

 

5. కార్యక్రమయుత బోధనా విధానంలో- 'స్వీయ గమనంలో నేర్వనిస్తే వ్యక్తి బాగా నేర్చుకుంటాడు'- అనే ప్రమేయం మీద ఆధారపడిన సూత్రం?
జ: స్వీయగమన సూత్రం

 

6. ఫ్రాన్సిస్ చేస్, జె.ఎల్. ట్రంప్ అనే విద్యావేత్తలు వ్యాప్తిచేసిన భావన?
జ: బృంద బోధన

 

7. సూక్ష్మబోధన అంటే?
జ: ఒక బోధనా మెళకువ

 

8. పాఠశాల పనిగంటల తర్వాత అదనంగా కేటాయించిన సమయంలో ఉపాధ్యాయుడి సమక్షంలో ఆ రోజు చెప్పిన పాఠాలను అధ్యయనం చేయడం..?
జ: పర్యవేక్షణాత్మక అధ్యయనం

 

9. సూక్ష్మ బోధన అనే పారిభాషిక పదం ఎప్పుడు వాడుకలోకి వచ్చింది?
జ: 1963

 

10. పర్యవేక్షణాత్మక అధ్యయనానికి ఉన్న మరో పేరు?
జ: నియంత్రిత అధ్యయనం

 

11. గరిష్ఠస్థాయిలో విద్యార్థుల అభ్యసన సామర్థ్యాన్ని పెంపొందించడానికి తోడ్పడేది?
జ:  బృంద బోధన

 

12. వివిధ పూర్వసేవ, సేవాంతర్గత స్థాయి ఉపాధ్యాయుల వృత్తి వికాసానికి దోహదపడే బోధన?
జ:  సూక్ష్మ బోధన

 

13. పర్యవేక్షణాత్మక అధ్యయనంలో సత్ఫలితాలు సాధించడానికి ఏది ఉపకరిస్తుంది?
జ:  రొటేషన్ పద్ధతి

 

14. స్కిన్నర్ దృష్టిలో అభ్యసనం అంటే...
జ:  ప్రవర్తనల పరివర్తన

 

15. చిన్నమెట్లు, వాటిని వరసలో కూర్చడం అనేవి ఏ పద్ధతి బోధనలో ప్రధానాంశాలు?
జ:  కార్యక్రమయుత బోధన

 

16. కార్యక్రమయుత బోధన అంటే...
జ:  పాఠ్యాంశాన్ని చిన్నచిన్న విభాగాలుగా బోధించడం

 

17. 'బోధన, పునఃబోధన' అనేవి ఏ బోధనకు చెందినవి?
జ:  సూక్ష్మ బోధన

 

18. డ్వైట్ సూక్ష్మాంశబోధనను ఎక్కడ ప్రవేశపెట్టాడు?
జ:  స్టాన్‌ఫర్డ్ విశ్వవిద్యాలయం

 

19. ఏ పద్ధతి ద్వారా వ్యాకరణం, ఉపవాచకం, కథ, గద్యం, పద్యం మొదలైన భాషా ప్రక్రియలను బోధించవచ్చు?
జ:  కార్యక్రమయుత బోధన

 

20. అధ్యయనాంశాలను చిన్నచిన్న కృత్యాలుగా ఆకృతీకరించి, బోధనలో సత్ఫలితాలను సాధించిన శాస్త్రవేత్త?
జ:  గిల్బర్ట్

 

21. శాఖీయ కార్యక్రమం, రేఖీయ కార్యక్రమం అని రెండు విధాలుగా ఉన్న పద్ధతి ఏమిటి?
జ:  కార్యక్రమయుత బోధన

 

22. సూక్ష్మ బోధనలో ఒక నైపుణ్యాన్ని సాధించడానికి ఎన్నిసార్లు బోధించాల్సి ఉంటుంది?
జ:  4

 

23. పర్యవేక్షణాధ్యయనానికి ఏ పఠనం అవసరం?
జ:  మౌన పఠనం

 

24. 'సూక్ష్మ బోధన'ను సిద్ధాంతీకరించి, శిక్షణకు అనుకూలం చేసినవారు?
జ:  హోరాస్ అబర్టైన్

 

25. సెమినార్లు, గ్రూప్ వర్క్, వర్క్‌షాపు పద్ధతుల్లో భాగమే...
జ:  బృంద బోధన

 

26. సూక్ష్మ బోధనా కాలం ఎన్ని నిమిషాలు?
జ:  5

 

27. ఫీడ్ బ్యాక్, కంట్రోల్ అనే అంశాలకు ప్రాధాన్యం ఇచ్చి, కేంద్రీకృత అభ్యసన పద్ధతి ద్వారా విద్యార్థుల జ్ఞానాన్ని పెంచడానికి కృషి చేసింది?
జ:  గాగ్ని, గుడ్‌మన్, పార్క్

 

28. 'ఒక పాఠాన్ని ఒక ఉపాధ్యాయుడి కంటే ఎక్కువ మంది బోధిస్తే, ఆ విద్యార్థి సమగ్రంగా అర్థం చేసుకుంటాడు' - అని చెప్పే బోధన?
జ:  బృంద బోధన

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌