• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక బోధనాపద్ధతులు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. డాల్టన్ పద్ధతికి ఉన్న పేర్లలో చేరనిది-
జ: ప్రకల్పనా పద్ధతి

 

2. మాంటిస్సోరి పద్ధతిని దేని ఆధారంగా రూపొందించారు?
జ: శిశువుల మనస్తత్వం

 

3. 6వ తరగతి తెలుగు వాచకంలో 'అల్లూరి సీతారామరాజు పాఠాన్ని బోధించేటప్పుడు ప్రాజెక్టు పనిగా ఇవ్వదగిన అంశమేది?
జ: అల్లూరి సీతారామరాజుపై ఉన్న వివిధ బుర్రకథల సేకరణ

 

4. 'నియోజన పద్ధతి'ని ఇలా కూడా పిలుస్తారు-
జ: డాల్టన్ పద్ధతి

 

5. వైయక్తిక, సామూహిక, పూర్తి తరగతి పనిని అభివృద్ధి పరచడం అనేది-
జ: APPEP

 

6. మిస్ గల్ - అనే ఆంగ్ల వనిత కనిపెట్టిన పద్ధతి?
జ: ఉద్యమ పద్ధతి

 

7. 'స్వేచ్ఛాయుత వాతావరణంలో, ఉద్యానవనంలో పెరిగే మొక్కలు ఎలాంటివో విద్యాలయాలనే తోటలో పెరిగే బాలబాలికలూ అలాంటి వారే' అని భావించిన విద్యావేత్త-
జ: ఫ్రోబెల్

 

8. వైద్యురాలు, పర్యవేక్షకురాలు - ఇద్దరూ పాఠశాల నిర్వహణలో తోడ్పడే బోధనా పద్ధతి?
జ: మాంటిస్సోరి పద్ధతి

 

9. డాల్టన్ పద్ధతిని మొదట అమలు చేసిందెవరు?
జ: మిస్ హెలెన్ పార్క్ హర్ట్స్

 

10. ఉద్యమ పద్ధతి ఏ దశకు అనుకూలం?
జ: మాధ్యమిక దశ

 

11. ఏ పద్ధతిలో గురువు కేంద్రంగా ఉండి తీర్పరిగా వ్యవహరిస్తారు?
జ: కిండర్‌గార్టెన్

 

12. 'సమష్టి పద్ధతి'లో జరిగే నేటి విద్యావిధానం నిరుపయోగమైందిగా భావించడం వల్ల ఏర్పడిన పద్ధతి-
జ: డాల్టన్ పద్ధతి

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌