• facebook
  • whatsapp
  • telegram

శిక్షణ - ఉపాధ్యాయ సాధికారత 

ఒక విషయానికి సంబంధించిన జ్ఞానం, వైఖరి, నైపుణ్యాలు, ప్రవర్తనల అభివృద్ధిని క్రమంగా పెంపొందించే విధానాన్ని 'శిక్షణ' అంటారు.
ఉపాధ్యాయ శిక్షణ: నియమబద్ధమైన ప్రణాళిక ద్వారా ఉపాధ్యాయుల్లో బోధన, మూల్యాంకన పద్ధతులు, శాస్త్ర సాంకేతిక విధానాలను అభివృద్ధి చేయడాన్ని 'ఉపాధ్యాయ శిక్షణ' అంటారు.
శిక్షణ రకాలు:
1) వృత్తిపూర్వక శిక్షణ
2) వృత్త్యంతర శిక్షణ

 

వృత్తి పూర్వక శిక్షణ: ఇది వృత్తిని చేపట్టడానికి ముందు వృత్తి పరమైన బాధ్యతలు, విధులు, సామాజిక అవగాహన, విషయ విశ్లేషణా శక్తి, నిర్వహణా సామర్థ్యాన్ని అందించే శిక్షణా విధానం. ఉదా: D.Ed, B.Ed.
డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ (డీయెడ్): వృత్తి పూర్వక శిక్షణలో భాగంగా ప్రాథమిక విద్యా బోధన నైపుణ్యాలను శిక్షణ ద్వారా అభివృద్ధి చేయడం. ఈ శిక్షణలో భాగమైన అంశాలు కిందివిధంగా ఉన్నాయి.
* విద్యాతత్వం, విద్యా మనోవిజ్ఞానం, ప్రాథమిక, పూర్వ ప్రాథమిక పాఠశాలల నిర్వహణ; కళావిద్య, పని-విద్య, ఆరోగ్య విద్య, బోధనా విధానం, బోధనోపకరణాలు, శాస్త్ర, సాంకేతిక వినియోగం, మూల్యాంకన పద్ధతులకు సంబంధించి శిక్షణ ద్వారా అవగాహన కల్పిస్తారు.
* విద్యార్థి మానసిక స్థితి, స్వభావాన్ని అర్థం చేసుకుని, శిక్షణ ద్వారా ఉపాధ్యాయ వృత్తికి కావాల్సిన ప్రవర్తన, వైఖరికి సంబంధించిన అనుకూల మార్పులను అభివృద్ధి చేస్తారు.
* శిక్షణలో భాగంగా ఛాత్రోపాధ్యాయుల్లో (ట్రెయినీ) బోధనా నైపుణ్యాలు, మూల్యాంకన పద్ధతులు, పరిశోధనల ద్వారా సమస్యా పరిష్కార నైపుణ్యాలను పెంపొందిస్తారు.

 

బోధన: నేర్చుకునేలా చేయడమే బోధన. ఇది ఒక పరిపూర్ణ వ్యక్తి చేసే ప్రక్రియ.
అభ్యసనం: నేర్చుకోవడం లేదా తెలుసుకోవడం అభ్యసనం. ప్రవర్తనలో మార్పు రావడం లేదా సామర్థ్యాలను పొందడం కూడా 'అభ్యసనమే'.
బోధనాభ్యసన ప్రక్రియ: నేర్చుకోవడానికి ఉపాధ్యాయుడు చేపట్టే కార్యక్రమాలు, కృత్యాలు, సన్నివేశాలు బోధనాభ్యసన ప్రక్రియ కిందకు వస్తాయి. ప్రాథమిక పాఠశాల బోధన, శిశు కేంద్రీకృత, సామర్థ్యాధారితమై ఉంటుంది. దీనికి అనువైన విధానం కృత్యాధార పద్ధతి.
బోధనాపద్ధతులు: 1) ఉపాధ్యాయ కేంద్రీకృత 
                           2) విద్యార్థి కేంద్రీకృత ప్రధానమైనవి.

 

వృత్త్యంతర శిక్షణ
వృత్తిలో ప్రవేశించిన తర్వాత ఉపాధ్యాయుల్లో పెంపొందించాల్సిన నైపుణ్యాలు, ఆధునిక బోధనాభ్యసన పద్ధతులు, మూల్యాంకన విధానాలు, శాస్త్ర-సాంకేతిక పరికరాల వినియోగాన్ని వివిధ కార్యక్రమాల ద్వారా అందజేసే విధానమే వృత్త్యంతర శిక్షణ. జాతీయ విద్యావిధానం వృత్త్యంతర శిక్షణకు అత్యంత ప్రాధాన్యమిస్తోంది.
*  వృత్తి సామర్థ్యాన్ని పెంచుకోవడానికి
*  జడత్వం, అలసత్వం, మరపు నుంచి పునఃప్రేరణ పొందడానికి
*  కొత్త ఒరవడుల ఆకలింపు, బోధనా నైపుణ్యాల అభివృద్ధికి
*  నూతన విద్యా సంవత్సరానికి సంబంధించిన లక్ష్య సాధనలో ఉత్తేజాన్నీ, ఉత్సాహాన్నీ నింపడానికి వృత్త్యంతర శిక్షణ అవసరం.

 

శిక్షణా పద్ధతులు: పునఃశ్చరణ తరగతులు, కార్యగోష్ఠులు, సెమినార్లు, అవగాహన తరగతులు మొదలైనవి.
సాధికారత: వృత్తి స్వీకరించిన తర్వాత విషయ పరిజ్ఞానం, బోధనా నైపుణ్యాలను నిరంతరం పెంపొందించుకోవాలి. అవసరమైన శక్తి సామర్థ్యాలు, ప్రతిభాపాటవాలను మెరుగు పరచుకోవడాన్ని 'సాధికారత' అంటారు. అంటే శక్తియుక్తులను బలోపేతం చేసుకోవడం.
ఉపాధ్యాయ సాధికారత: ఉపాధ్యాయుడు తాను కలిగి ఉన్న శక్తిసామర్థ్యాలు, ప్రతిభాపాటవాలను మెరుగుపరచుకోవడాన్నే ఉపాధ్యాయ సాధికారత అంటారు. ఇందుకోసం ఉపయోగపడే యంత్రాంగం:
DIET, SIET, SCERT, RIE, NCTE, NCERT.

 

శిక్షణా తరగతుల నిర్వహణ
మండలస్థాయి - MRC
రాష్ట్రస్థాయి - SCERT, SIET, SRC
జాతీయస్థాయి - NCERT, CIET, NCTE

 

ఉత్తమ ఉపాధ్యాయుడికి ఉండాల్సిన లక్షణాలు
*  నిత్య అభ్యాసకుడు, అన్వేషకుడిగా ఉండాలి.
*  ఆదర్శవంతంగా ఉండాలి.
*  అంకిత భావం, విద్యార్థుల పట్ల స్నేహభావంతో ఉండాలి.
*  బాలల హక్కులను పరిరక్షించాలి.
*  సమయపాలనను పాటించాలి.
*  ఉద్వేగాలను అదుపులో ఉంచుకోవాలి. ప్రజాస్వామ్యయుతంగా పనిచేయాలి.
*  స్ఫూర్తినిస్తూ, ప్రోత్సహిస్తూ విద్యార్థి సర్వతోముఖాభివృద్ధికి కృషి చేయాలి.
*  బోధనపట్ల అనూకూల వైఖరి ఉండాలి. బోధనోపకరణాల వినియోగం, తరగతి గది నిర్వహణ మెలకువలను తెలుసుకోవాలి.
*  సమాజంలోని అందరితో సత్సంబంధాలను కలిగి ఉండాలి.

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌