• facebook
  • whatsapp
  • telegram

కవులు, రచయితలు - విశేషాంశాలు

మాదిరి ప్ర‌శ్న‌లు

1. 'ఆంధ్రావళిమోదము' కోసం రాస్తున్నానన్న కవి ఎవరు?
జ: తిక్కన

 

2. డుమువుల కవి ఎవరు?
జ: శ్రీనాథుడు

 

3. పోతన పలికింది ....
జ: సత్కవుల్ హాలికులైననేమి

 

4. శ్రీపాద సుబ్రహ్మణ్యశాస్త్రి నడిపిన పత్రిక?
జ: ప్రబుద్ధాంధ్ర

 

5. 'తెనుగునకున్న వ్యాకరణ దీపం చిన్నది' అన్నది?
జ: తిరుపతి వేంకటకవులు

 

6. 'వొట్టిమాటలు కట్టిపెట్టోయ్...' అని సందేశమిచ్చిన కవి?
జ: గురజాడ

 

7. దేవులపల్లి కృష్ణశాస్త్రి కవిత్వంలోనిది -
జ: నవ్విపోదురుగాక నాకేటి సిగ్గు

 

8. 'నాలుగు పడగల హైందవ నాగరాజు' అనేది?
జ: గబ్బిలంలోనిది

 

9. 'కాదేదీ కవితకనర్హం' అని చాటిన అభ్యుదయ కవి?
జ: శ్రీశ్రీ

 

10. 'నా తెలంగాణ కోటి రతనాల వీణ' అని గర్జించింది?
జ: దాశరథి కృష్ణమాచార్య

 

11. 'నా యీ వచన పద్యాలనే దుడ్డుకర్రలతో పద్యాల నడుముల్ విరగదంతాను' - అన్నదెవరు?
జ: శిష్ట్లా ఉమామహేశ్వరరావు

 

12. 'చేయెత్తి జైకొట్టు తెలుగోడా...' ఏ కవి పలుకు?
జ: వేములపల్లి శ్రీకృష్ణ

 

13. ద్రౌపది తండ్రి ఎవరు?
జ: ద్రుపదుడు

 

14. కాశీఖండంలో ఉన్న పాత్ర?
       1) గుణనిధి      2) వ్యాసుడు     3) అగస్త్యుడు     4) అందరూ
జ: 4

 

15. 'సీతారామారావు' ప్రధాన పాత్రగా ఉన్న నవల .....
జ: అసమర్థుని జీవయాత్ర

 

16. తెలంగాణ వైతాళికుడెవరు?
జ: సురవరం ప్రతాపరెడ్డి

 

17. గిడుగు రామమూర్తి బిరుదు?
జ: అభినవ వాగనుశాసనుడు

 

18. బుచ్చిబాబు అసలు పేరు ఏమిటి?
జ: శివరాజు వెంకట సుబ్బారావు

 

19. ఆంగ్ల ప్రభుత్వం నిషేధించిన నవల ఏది?
జ: మాలపల్లి

 

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌