• facebook
  • whatsapp
  • telegram

ఆధునిక సాహిత్యం - ధోరణులు - ఉద్యమాలు - జానపద సాహిత్యం

మాదిరి ప్ర‌శ్న‌లు

1. విప్లవ కవుల్లో మొదట పేర్కొనదగిన కవి -
సమాధానం: శ్రీశ్రీ

 

2. శివసాగర్ రచన -
1) ఉద్యమం నెలబాలుడు       2) అగ్నిశ్వాస      3) పునాదిరాయి      4) చండాల చాటింపు
సమాధానం: 1 (ఉద్యమం నెలబాలుడు)

 

3. విరసం కవితా సంపుటి -
1) విప్లవం             2) ఝంఝ         3) రెంజిం         4) దివిటి
సమాధానం: 2 (ఝంఝ)

 

4. శ్రీశ్రీ షష్ఠిపూర్తి సభలో రచయితలకు సవాల్ కరపత్రం పంచినవారు-
సమాధానం: విశాఖ విద్యార్థులు

 

5. 'ఎరుపంటే కొందరికి భయం. పసిపిల్లలు వారి కంటే నయం' అన్న విప్లవ కవి -
సమాధానం: సుబ్బారావు పాణిగ్రాహి

 

6. ఆరుమంది కవులు ప్రారంభించిన కవితా ధోరణి -
సమాధానం: దిగంబర కవిత

 

7. 'నా చెల్లీ చంద్రమ్మ' పాట రచయిత -
సమాధానం: శివసాగర్

 

8. పాటకు ప్రాచుర్యాన్ని కలిగించిన కవితా ఉద్యమం-
సమాధానం: విప్లవ కవితా ఉద్యమం

 

9. విరసం తొలి అధ్యక్షుడు -
సమాధానం: శ్రీశ్రీ

 

10. 'మరో ప్రస్థానం' ఎవరి రచన?
సమాధానం: శ్రీశ్రీ

 

11. పంచతంత్ర కథలను ఆంగ్లంలోకి అనువదించినవారు -
సమాధానం: బెన్ఫె

 

12. జానపదుల ప్రస్తావన కనిపించే గ్రంథం-
సమాధానం: భారతం

 

13. 'గుమ్మడుపాట' ఏ కోవకు చెందిన గేయం?
సమాధానం: భాగవత గేయం

 

14. తాండ్ర పాపారాయుడు, విజయరామరాజ గజపతి, బుస్సీ లాంటి పాత్రలుండే చారిత్రక గేయం -
సమాధానం: బొబ్బిలి యుద్ధం

 

15. 'సర్వాయి పాపడు కథ' - ఎలాంటి రచన?
సమాధానం: అద్భుతరస గేయం

 

16. 'రోకటి పాటలు' ఏ పద్యాల్లో ఉంటాయని విన్నకోట పెద్దన చెప్పాడు?
సమాధానం: తరువోజ

 

17. శారదకాండ్రు ఏ ప్రాంతంలో వ్యాపించి ఉన్నారు?
సమాధానం: తెలంగాణ

 

18. తెలుగు జానపద సాహిత్యాన్ని మానవ శాస్త్ర దృష్టితో పరిశీలించిన తొలి మహిళా పరిశోధకురాలు -
సమాధానం: నాయని కృష్ణకుమారి

 

19. జానపద గేయాల్లో 'రామాయణపు పాటలు' ఏ శాఖకు చెందినవి?
సమాధానం: పౌరాణిక గేయాలు

 

20. 'బిరుదురాజు రామరాజు' ఎందుకు ప్రసిద్ధులు?
సమాధానం: జానపద సాహిత్యంపై మొదట పరిశోధన చేసినందుకు

 

21. కన్నడ సాహిత్యంలోని 'దాసపదావళి' లాంటివి తెలుగులో - వేటికి సామీప్యంగా ఉంటాయి?
సమాధానం: పదకవితలు

 

22. కిందివారిలో విప్లవ కవులు -
ఎ. శ్రీశ్రీ          బి. సముద్రాల        సి. వరవరరావు          డి. ఆత్రేయ
1) ఎ, బి       2) బి, సి               3) ఎ, సి                4) ఎ, డి
సమాధానం: 3 (ఎ, సి)

 

23. తుపాకీ గొట్టం ద్వారా రాజ్యాధికారం కోరే సంస్థ-
సమాధానం: విరసం

 

24. 'సిరిమల్లె చెట్టుకింద లచ్చుమమ్మో - సినబోయి కూర్చున్నావెందుకమ్మా' పాట రచయిత -
సమాధానం: గద్దర్

 

25. ఊగరా ఊగరా ఊరికొయ్య నందుకుని ఊగరా...అన్న కవి -
సమాధానం: శ్రీశ్రీ

 

26. విప్లవ పోరాటంలో పాల్గొని ఉరిశిక్షకు గురైన భూమయ్య, క్రిష్ణాగౌడ్‌లపై శ్రీశ్రీ రచించిన స్మృతి గీతం
సమాధానం: భూమ్యాకాశాలు

 

27. 'లక్ష నక్షత్రాలు రాలందే ఉద్యమ ఉదయం ఉదయించదు' అన్న కవి-
సమాధానం: జ్వాలాముఖి

 

28. 'మా గుండె మా జెండా - మా మనసే మాకండ' - అన్న కవి ఎవరు?
సమాధానం: కె.వి.రమణారెడ్డి

 

29. 'తుది పయనం - తొలి విజయం' ఎవరి విప్లవ గీతం?
సమాధానం: శ్రీశ్రీ

 

30. 'విషం కలిసిన పాయసం మన స్వరాజ్యం - డబ్బున్న భడవా పోషించే ఉంపుడుగత్తె మన ప్రజాస్వామ్యం' అన్న కవులు
సమాధానం: తిరగబడు కవులు

Posted Date : 09-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌