• facebook
  • whatsapp
  • telegram

జానపద సాహిత్యం

మాదిరి ప్ర‌శ్న‌లు 

1. జానపద గేయాలపై మొదటగా పరిశోధన చేసింది ఎవరు?
జ: బిరుదురాజు రామరాజు

 

2. కసిరెడ్డి వెంకటరెడ్డి రాసిన జానపద గ్రంథం ఏది?
జ: పొడుపు కథలు

 

3. పిల్లల పాటల్లో ఏది ప్రధానం?
జ: లయ

 

4. ఏరువాక పాటలు, రోకలి పాటలు దేనికి చెందుతాయి?
జ: శ్రామికుల పాటలు

 

5. స్థల పురాణాలకు సంబంధించినవి దేనికి చెందుతాయి?
జ: ఐతిహ్యాలు

 

6. కృష్ణా జిల్లాలోని 'కూచిపూడి' దేనికి ప్రసిద్ధి?
జ: భాగవత కళకి

 

7. 'మావాఁ పెళ్లాడతావా అంటే నాకెవరిస్తార్రా అబ్బీ' అనే సామెత...?
1) తత్త్వానికి సంబంధించింది    2) ఐతిహాసానికి సంబంధించింది  
3) ప్రకృతికి సంబంధించింది      4) హాస్యానికి సంబంధించింది
జ: 4(హాస్యానికి సంబంధించింది)

 

8. 'కత్తి మీద సాము' అనేది-
జ: జాతీయం

 

9. కిందివాటిలో పొడుపు కథ ఏది?
1) చింత చచ్చినా పులుపు చావదు           2) నిదానం ప్రధానం  
3) ఎర్రటి పండు.. ఈగైనా వాలదు           4) ఏదీకాదు
జ: 3(ఎర్రటి పండు.. ఈగైనా వాలదు)

 

10. జానపద సాహిత్యం అంటే...?
జ: ప్రజల సాహిత్యం

Posted Date : 09-10-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌