• facebook
  • whatsapp
  • telegram

అర్థపరిణామాలు

మాదిరి ప్ర‌శ్న‌లు 

1. వ్యుత్పత్తి స్పష్టంగా నిరూపించలేని పదానికి సామాన్యులు ఒక అర్థాన్ని ఊహిస్తే దాన్ని ఏమంటారు?
జ: లోకనిరూక్తి

 

2. ఒక పదం సూచించే వస్తురూపం, నిర్మాణంలో కాలక్రమేణ వచ్చే మార్పును ఏమంటారు?
జ: వస్తుపరిణామం

 

3. ఒక కాలంలో నిందార్థం లేదా సామర్థ్యార్థంలో వాడే పదాలు విశిష్టార్థ బోధకాలైనప్పుడు ఆ పదాలను ఏమంటారు?
జ: అర్థసామ్యత

 

4. విస్తృతార్థమున్న ఒక పదానికి పరిమితార్థం ఏర్పడినప్పుడు దాన్ని ఏమంటారు?
జ: అర్థసంకోచం

 

5. జన వ్యవహారంలో ఉన్న మౌలిక అర్థానికి నష్టం కలిగి పరిహాసార్థంలో లేదా నిందార్థంలో వాడితే అది
జ: అర్థగ్రామ్యత

 

6. కిందివాటిలో అర్థవ్యాకోచం కాని పదం
     ఎ) చెంబు      బి) ధర్మరాజు      సి) రాక్షసుడు      డి) ఆరాధ్యుడు
జ: డి (ఆరాధ్యుడు)

 

7. కిందివాటిలో అర్థసంకోచం కాని పదం
     ఎ) మృగం      బి) నెయ్యి      సి) నూనె      డి) తద్దినం
జ: సి (నూనె)

 

8. కిందివాటిలో అర్థసామ్యతకు సంబంధించిన పదం
     ఎ) అవధాని      బి) వ్యవసాయం      సి) పత్రం      డి) మర్యాద
జ: డి (మర్యాద)

 

9. కిందివాటిలో అర్థగ్రామ్యతకు సంబంధించని పదం
     ఎ) కంపు      బి) దేవదాసి      సి) ఛాందసుడు      డి) దొర
జ: ఎ (కంపు)

 

10. కిందివాటిలో సభ్యోక్తికి సంబంధించిన పదం
     ఎ) చనిపోవు      బి) సాని      సి) విధవ      డి) ఘటం
జ: ఎ (చనిపోవు)

 

11. కిందివాటిలో లోకనిరూక్తికి సంబంధించిన పదం
     ఎ) చందమామ      బి) శనిగ్రహం      సి) అసహ్యం      డి) అంతస్తు
జ: ఎ (చందమామ)

 

12. 'దీపం కొండెక్కింది' అనేది కిందివాటిలో దేనికి సంబంధించింది?
     ఎ) వస్తుపరిమాణం      బి) లోకనిరూక్తి      సి) సభ్యోక్తి      డి) మృదూక్తి
జ: డి (మృదూక్తి)

 

13. 'సన్యాసి' అనే పదం
జ: అర్థగ్రామ్యత

 

14. 'ఉద్యోగం' అనేది
జ: అర్థసంకోచం

 

15. 'అదృష్టం' అనేది
జ: అర్థసామ్యత

 

16. 'వ్యంగం' అనేది
జ: అర్థగ్రామ్యత

 

17. 'గురుశంక' అనేది
జ: సభ్యోక్తి

 

18. 'మొక్కజొన్న' అనేది
జ: లోకనిరూక్తి

 

19. 'చేదు నిజం' అనేది
జ: అలంకారిక ప్రయోగం

 

20. 'విల్లు, గద' అనే పదాలు కిందివాటిలో దేనికి సంబంధించినవి?
     ఎ) లోకనిరూక్తి      బి) మృదూక్తి     సి) వస్తుపరిణామం      డి) అర్థగ్రామ్యత
జ: సి (వస్తుపరిణామం)

 

21. 'గ్రహచారం' అనే పదం
జ: అర్థగ్రామ్యత

 

22. 'మధుర వాడ' అనేది
జ: లోకనిరూక్తి

 

23. 'చాడీ' అనే పదం
జ: అర్థసంకోచం

 

24. 'వారం' అనే పదం
జ: అర్థవ్యాకోచం

Posted Date : 22-09-2020

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌