• facebook
  • whatsapp
  • telegram

పాఠ్యప్రణాళిక, బోధన ఉపగమాలు - పద్ధతులు  

1. 'కరికులమ్' అనేది ఏ భాషా పదం?

జ: ఇంగ్లిష్
 

2. పాఠశాలలో నిర్ధారించిన లక్ష్యాలనూ, ఉద్దేశాలనూ రూపుదిద్దేటట్లు చేయడానికి ఒక కళాకారుడిలాగా ఉపాధ్యాయుడు ఉపయోగించే సాధనమే - కరికులమ్ అని పేర్కొంది-

జ: కన్నింగ్‌హామ్
 

3. ప్రాచీన సంకుచిత దృక్పథంలో పాఠ్య ప్రణాళికగా భావించింది-

జ: పాఠ్యాంశాలు
 

4. పాఠ్య ప్రణాళిక పరిధి-

జ: విస్తృతమైంది
 

5. పాఠశాల జీవితం మొత్తం-

జ: కరికులమ్
 

6. జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం - 2005లో పేర్కొన్న మార్గదర్శక సూత్రం కానిది-

జ: కంఠస్తం చేసే పద్ధతిని పెంపొందించడం
 

7. సైన్స్ సహపాఠ్య కార్యక్రమం-

జ: ప్రయోగశాలల ఏర్పాటు, సైన్స్ కార్నర్‌ల ఏర్పాటు, సైన్స్ సెమినార్లు నిర్వహించడం
 

8. బోధించవలసిన అంశాల విస్తృతిని, పరిమితిని తెలియజేసేది-

జ: సిలబస్
 

9. పాఠశాల వెలుపల, లోపల విద్యార్థులు పొందే అనుభవాల సమగ్ర రూపం-

జ: విద్యా ప్రణాళిక
 

10. VI నుంచి X తరగతుల్లో సామాన్యశాస్త్రం విషయ ప్రణాళిక ఆయా తరగతుల స్థాయిని బట్టి ఎన్ని ప్రధానాంశాల్లో వివరించారు?

జ: 7
 

11. 'పాఠ్యప్రణాళిక అనేది అనుభవాల సమగ్ర రూపం, సమైక్యత, సహ సంబంధం పెంపొందించేది' అని పేర్కొన్నది-
జ: సెకండరీ విద్యాకమిషన్

 

12. 'పరిశోధనల ఆధారంగా పాఠ్య ప్రణాళికలో తరచూ మార్పులుండాలి.' అని పేర్కొంది-
జ: కొఠారి కమిషన్

 

13. 'పాఠ్యప్రణాళికలో మార్పులు వచ్చినప్పుడు ఉపాధ్యాయులకు పునశ్చరణ తరగతులు నిర్వహించాలి'. అని పేర్కొంది-
జ: కొఠారి కమిషన్

 

14. ఎస్.యు.పి.డబ్ల్యు. భావనను ప్రవేశపెట్టింది-
జ: ఈశ్వరీభాయ్ పటేల్

 

15. పర్యావరణ పరిరక్షణ గురించి తెలిపే పరిసరాల విజ్ఞానంలోని ప్రధానాంశం-
జ: పరిసరాల నుంచి అభ్యసనం

 

16. ఎన్.సి.ఎఫ్. - 2005 ప్రకారం పాఠ్య పుస్తకాల్లోని పాఠ్యాంశాలను ఏ ప్రాతిపదికపై రాశారు-
జ: శాంతి కోసం విద్య

 

17. ఎన్.సి.ఎఫ్. - 2005 ప్రకారం పరిసరాల విజ్ఞానం పాఠ్య పుస్తకాల్లో ప్రాధాన్యం ఇచ్చిన అంశాలు-
జ: పరిశీలన, విశ్లేషణ, పరికల్పనలు

 

18. పరిసరాల విజ్ఞానంలో మన శరీరం - ఆరోగ్యం - పరిశుభ్రత, కుటుంబం, గాలి, నీరు, మన నివాసం, మన ఆహారం, మొక్కలు - జంతువులు, మన భూమిలను ఏ విధానంలో అమర్చారు?
జ: సర్పిలాకార విధానం

 

19. 'బడిపిల్లల పుస్తకాల సంచుల బరువును తగ్గించాలి' అని పేర్కొన్న కమిటీ
జ: యశ్‌పాల్ కమిటీ

 

20. జాతీయ విద్యావిధానం ప్రకారం (ఎన్.పి.ఇ.- 1986) జాతీయ సమైక్యతా భావనను పెంపొందించడానికి పాఠ్యప్రణాళికలో చేర్చిన విజ్ఞానశాస్త్ర అంశాలు-
జ: పర్యావరణ పరిరక్షణ, శాస్త్రీయ వైఖరులను పెంపొందించడం, పరిమిత కుటుంబ భావన

 

21. 'విజ్ఞానశాస్త్ర పాఠ్యప్రణాళిక సమస్య పరిష్కార పద్ధతిని, నిర్ణయాలు చేయడంలో నైపుణ్యాన్ని పెంపొందించేదిగా ఉండాలి'. అని పేర్కొంది-
జ: జాతీయ విద్యావిధానం - 1986

 

22. జాతీయ పాఠ్యప్రణాళిక చట్రం - 2005 ప్రకారం సరైంది-
జ: ఎలిమెంటరీ దశ I-VIII, సెకండరీ దశ IX-X, హయ్యర్ సెకండరీ దశ XI-XII

 

23. ప్రత్యేక సత్యాల నుంచి సాధారణ సత్యాలను రూపొందించడమే ఆగమనమని పేర్కొంది-
జ: జీవన్

 

24. నిర్దిష్ట అంశాల నుంచి సాధారణీకరణాలను రూపొందించడాన్ని ఆగమనమని పేర్కొంది-
జ: ఫౌలర్

 

25. నేర్చుకున్న విషయాలు మరచినా, పునఃనిర్మాణానికి అవకాశం ఉన్న ఉపగమం-
జ: ఆగమనం

 

26. వినియోగ లక్ష్యాన్ని సంతృప్తి పరిచే పద్ధతి-
జ: నిగమనం

 

27. సాధారణీకరణాలను, సిద్ధాంతాలను నూతన పరిస్థితులకు అన్వయింపజేసి, వాటి యధార్థతను తెలుసుకునే పద్ధతి-
 నిగమనం

 

28. బట్టీస్మృతిని పెంపొందించే పద్ధతి-
జ: నిగమనం

 

29. విద్యార్థులకు అనుభవంలోలేని కొత్త విషయాలు బోధించడానికి ఉపయోగపడని పద్ధతి-
జ: ఉపన్యాస

 

30. విద్యార్థుల్లో కేవలం పరిశీలనా నైపుణ్యాలను మాత్రమే కొంతవరకు పెంపొందించగల పద్ధతి-
జ: ఉపన్యాస - ప్రదర్శనా పద్ధతి

 

31. విజ్ఞానశాస్త్ర విషయాలను ఆనాటి సాంఘిక, ఆర్థిక, రాజకీయ, సామాజిక పరిస్థితులతో వివరిస్తూ బోధించే పద్ధతి -
జ: చారిత్రక

 

32. విజ్ఞానశాస్త్ర విషయాలను ద్రవ్యాత్మక, సంశ్లేషణాత్మక నిర్మాణాలుగా వివరిస్తూ పాఠ్యాంశాలను బోధించే పద్ధతి -
జ: నిర్మాణాత్మక పద్ధతి

 

33. శాస్త్రీయ పద్ధతిలో అతి కష్టమైన సోపానం-
జ: దత్తాంశాలను ప్రతిక్షేపించడం

 

34. శాస్త్రీయ పద్ధతిలో విద్యార్థి ఆలోచనలు, వివిధ రకాల సామర్థ్యాలు, నైపుణ్యాలు ప్రదర్శించడానికి అనువైన సోపానం-
జ: దత్తాంశాలను ప్రతిక్షేపించడం

 

35. 'హ్యూరిస్టిక్' అనే పదం దేని నుంచి ఉత్పన్నమైంది?
జ: Heuristo

 

36. విద్యార్థి తనకుతానే పరిశీలించడం, తర్కిం చడం, తానే పనిచేయడం, ఆలోచించడం లాంటి స్వయంకృషి ఉన్న పద్ధతి-
జ: అన్వేషణ

 

37. శాస్త్రీయ విధానంలో విద్యార్థికి ఎక్కువ తర్ఫీదు ఇచ్చే బోధన పద్ధతి-
జ: అన్వేషణ పద్ధతి

 

38. 'ప్రయోగశాలల కోసమే విజ్ఞానశాస్త్రం ఏర్పడింది' అనే తప్పుడు భావనను విద్యార్థుల్లో కలిగించే పద్ధతి-
జ: అన్వేషణ పద్ధతి

 

39. ప్రాథమిక తరగతుల్లో అమలుపరచడానికి వీలుకాని బోధన పద్ధతి-
జ: అన్వేషణ పద్ధతి

 

40. ఒక ప్రయోజనం కోసం ప్రణాళికాబద్ధమైన సామాజిక, సహజ పద్ధతుల్లో ఆ ప్రయోజనాన్ని సాధించడం-
జ: ప్రాజెక్టు

 

41. ప్రాజెక్టు పద్ధతికి ఆధారమైంది-
జ: వ్యవహారిక సత్తా వాదం

 

42. విద్యార్థి జీవితం కేంద్రంగా ఉన్న బోధన పద్ధతి-
జ: ప్రాజెక్టు పద్ధతి

 

43. ప్రాజెక్టు పద్ధతిని రూపొందించింది-
జ: జె.ఎ.స్టీవెన్‌సన్

 

44. థారన్‌డైక్ అభ్యాసనా సూత్రాన్ని సంతృప్తిపరిచేది-
జ: ప్రాజెక్టు అమలుపరచడం

 

45. ఆట, పాటల ద్వారా శారీరకధారుడ్యాన్ని పెంపొందించాలని సూచించిన కమిటీ-
జ: ఈశ్వరీభాయ్

 

46. ప్రాథమిక స్థాయిలో అత్యంత ప్రభావపూరితమైన పద్ధతి-
జ: కృత్య పద్ధతి

 

47. ప్రాజెక్టు పద్ధతిలో ఫలిత నియమం ఏ దశలో ఉంటుంది?
జ: మూల్యాంకనం

 

48. పూర్వ ప్రక్రియాత్మక దశ వయసు-
జ: 3 - 6 సంవత్సరాలు

 

49. ప్రాజెక్టు పద్ధతిలో ప్రాజెక్టును ఎంపిక చేసుకునేది-
జ: విద్యార్థులు

 

50. అన్వేషణ పద్ధతి మూలపురుషుడు-
జ: హెచ్.ఇ.ఆర్మ్‌స్ట్రాంగ్

 

51. పాఠశాలలోకి దిగుమతి చేసిన నిజజీవిత భాగమే ప్రకల్పన అని పేర్కొంది-
జ: బల్లార్డ్

 

52. అతి తక్కువ కాలంలో ఎక్కువ సిలబస్‌ను ఎక్కువమంది విద్యార్థులకు బోధించడానికి వాడే పద్ధతి -
జ: ఉపన్యాస

 

53. సిలబస్‌ను పునఃశ్చరణ చేయడానికి వాడే పద్ధతి-
జ: ఉపన్యాస

 

54. 'పాఠ్య ప్రణాళికను విద్యార్థుల అవసరాలకు తగినట్లు రూపొందించడంలో, పాఠశాలలకు స్వేచ్ఛా స్వాతంత్య్రాలు ఉండాలి' అని పేర్కొంది
జ: కొఠారి

Posted Date : 02-12-2021

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 

పేపర్ - II

పాత ప్రశ్నప‌త్రాలు

 

విద్యా ఉద్యోగ సమాచారం

 

నమూనా ప్రశ్నపత్రాలు

 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌