1. గ్రామసభలో సభ్యులుగా ఎవరుంటారు?
జ: గ్రామంలోని ఓటర్లందరూ
2. గ్రామసభకు అధ్యక్షుడిగా ఎవరు వ్యవహరిస్తారు?
జ: సర్పంచ్
3. ఒక గ్రామ పంచాయతీలో ఉండే కనీస వార్డుల సంఖ్య?
జ: 5
4. ఒక గ్రామ పంచాయతీలో ఉండే గరిష్ఠ వార్డుల సంఖ్య?
జ: 21
5. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో పోటీచేయడానికి కనీస వయసు ఎంత ఉండాలి?
జ: 21 సంవత్సరాలు
6. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో శ్రీలేఖ అనే అమ్మాయి ఓటు హక్కును వినియోగించుకుంది. ఆమె వయసు ఎంత?
జ: 18
7. స్థానిక సంస్థల ఎన్నికల్లో స్త్రీలకు ఎంత శాతం సీట్లు కేటాయిస్తూ పార్లమెంటు చట్టం చేసింది?
జ: 1/3వ వంతు
8. పంచాయతీరాజ్ సంస్థలకు రాజ్యాంగ భద్రత కల్పించిన ప్రధాని ఎవరు?
జ: పి.వి. నరసింహారావు
9. స్థానిక సంస్థల ఎన్నికల్లో మహిళలకు 50% రిజర్వేషన్లు కల్పించిన తొలి రాష్ట్రం ఏది?
జ: బిహార్
10. సాధారణంగా గ్రామ పంచాయతీకి ఎన్నేళ్లకు ఒకసారి ఎన్నికలు జరుగుతాయి?
జ: 5 సంవత్సరాలు
11. తెలంగాణలో సర్పంచ్‌ను ఏ విధంగా ఎన్నుకుంటారు?
జ: ప్రత్యక్షం
12. కిందివాటిలో సర్పంచ్‌కు సంబంధించి సరైన అంశం?
ఎ) గ్రామానికి ప్రథమ పౌరుడు బి) గ్రామసభకు అధ్యక్షుడు
సి) గ్రామ పంచాయతీకి అధ్యక్షుడు డి) అన్నీ
జ: డి) అన్నీ
13. కిందివాటిలో ఉపసర్పంచ్‌కు సంబంధించి సరైన అంశం?
ఎ) పరోక్ష పద్ధతిలో ఎన్నుకుంటారు బి) వార్డు సభ్యులు ఎన్నుకుంటారు సి) సర్పంచ్ లేనప్పుడు ఆ బాధ్యతలు నిర్వహిస్తారు డి) పైవన్నీ
జ: డి(పైవన్నీ)
14. కిందివాటిలో గ్రామ పంచాయతీ విధి?
ఎ) తాగునీటి సదుపాయం బి) గ్రామీణ రహదారుల నిర్వహణ సి) వీధి దీపాలను ఏర్పాటు చేయడం డి) అన్నీ
జ: డి) అన్నీ
15. గ్రామ పంచాయతీ సమావేశాలు నెలలో ఎన్నిసార్లు నిర్వహిస్తారు?
జ: 1
16. కిందివాటిలో గ్రామ పంచాయతీ ఆదాయ మార్గాలు
ఎ) ఇంటిపన్ను బి) భూమి శిస్తు సి) కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుంచి వచ్చే గ్రాంట్లు డి) పైవన్నీ
జ: డి) పైవన్నీ
17. భారత రాజ్యాంగంలో గ్రామ పంచాయతీల ఏర్పాటును నిర్దేశిస్తున్న ఆర్టికల్?
జ: 40
18. ప్రాచీన భారతదేశంలో గ్రామీణ పాలనను అభివృద్ధి చేసిన రాజవంశం?
జ: చోళులు
19. గ్రామ పంచాయతీ సమావేశాలకు శాశ్వత ఆహ్వానితులు ఎవరు?
జ: ఎంపీటీసీ
20. చోళుల గ్రామీణ పాలన గురించి వివరించే శాసనం?
జ: ఉత్తరమెరూర్
21. ఒక మండల పరిషత్ పరిధిలో ఎన్ని గ్రామ పంచాయతీలు ఉంటాయి?
జ: 20
22. మండల పరిషత్‌కు మైనార్టీ వర్గానికి చెందిన ఎంతమందిని కో- ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేస్తారు?
జ: 1
23. మండల పరిషత్‌లో కనీస ఎంపీటీసీల సంఖ్య?
జ: 7
24. మండల పరిషత్‌లో గరిష్ఠ ఎంపీటీసీల సంఖ్య ఎంత?
జ: 23
25. మండల పరిషత్ అధ్యక్షుడి ఎన్నిక విధానం?
జ: పరోక్షం
26. జిల్లా పరిషత్‌కు మైనార్టీ వర్గాలకు చెందిన ఎంతమందిని కో- ఆప్టెడ్ సభ్యులుగా నామినేట్ చేస్తారు?
జ: 2
27. జిల్లా పరిషత్‌లో ఉండే స్థాయి సంఘాల సంఖ్య ఎంత?
జ: 7
28. తెలంగాణ రాష్ట్రంలో ఆదర్శ గ్రామమైన 'హజిపల్లి' ఏ జిల్లాలో ఉంది?
జ: మహబూబ్‌నగర్
29. కింది వాటిలో హజిపల్లి గ్రామ పంచాయతీలో చేపట్టిన కార్యక్రమం?
ఎ) అంతర్భూభాగ మురికి కాలువల నిర్మాణం బి) ప్రతి ఇంటికీ మరుగుదొడ్ల నిర్మాణం
సి) గ్రామంలో రక్షిత మంచినీటి సౌకర్యం కల్పన డి) పైవన్నీ
జ: డి) పైవన్నీ
30. హజిపల్లి గ్రామ పంచాయతీని ఆదర్శ గ్రామ పంచాయతీగా రూపొందించిన సర్పంచ్ ఎవరు?
జ: జంగమ్మ
31. హజిపల్లి గ్రామానికి 2008లో రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన అవార్డు?
జ: శుభ్రం
32. హజిపల్లి గ్రామానికి 2008 డిసెంబరులో భారత ప్రభుత్వం ఏ అవార్డును ప్రకటించింది?
జ: నిర్మల్ పురస్కారం
33. 'నిర్మల్' పురస్కారాన్ని ఏ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది?
జ: 100 శాతం మరుగుదొడ్ల నిర్మాణం
34. తెలంగాణ రాష్ట్రంలోని 'గంగదేవిపల్లి' గ్రామ పంచాయతీ గ్రామసభను విజయవంతంగా నిర్వహిస్తుంది. ఇది ఏ జిల్లాలో ఉంది?
జ: వరంగల్
35. ఆదర్శ గ్రామపంచాయతీగా పేరొందిన 'రామచంద్రాపురం' ఏ జిల్లాలో ఉంది?
జ: కరీంనగర్
36. ఆదర్శ గ్రామపంచాయతీగా పేరొందిన 'అంకాపూర్' ఏ జిల్లాలో ఉంది?
జ: నిజామాబాద్
37. 'హివరెబజార్' అనే ఆదర్శ గ్రామ పంచాయతీ ఏ రాష్ట్రంలో ఉంది?
జ: మహారాష్ట్ర
38. వరంగల్ జిల్లాలో 'గంగదేవిపల్లి' గ్రామ పంచాయతీలో గ్రామసభ ద్వారా ఏర్పాటైన కమిటీలు ఎన్ని?
జ: 18
39. కిందివాటిలో గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ సాధించిన విజయాన్ని గుర్తించండి.
ఎ) సంపూర్ణ మద్యపాన నిషేధం బి) సంపూర్ణ అక్షరాస్యత సాధన, పాఠశాలలో 100 శాతం పిల్లల నమోదు
సి) అన్ని కుటుంబాలు బ్యాంకు పాసు పుస్తకాలు కలిగి ఉండటం డి) పైవన్నీ
జ: డి) పైవన్నీ
40. కింది వాటిలో గంగదేవిపల్లి గ్రామ పంచాయతీ ఏర్పాటు చేసిన కీలకమైన కమిటీ ఏది?
ఎ) మంచినీటి కమిటీ బి) పారిశుద్ధ్య కమిటీ
సి) ఉత్తర ప్రత్యుత్తరాల కమిటీ డి) అన్నీ
జ: డి) పైవన్నీ
41. హజిపల్లి గ్రామ పంచాయతీ సర్పంచ్‌కు నిర్మల్ పురస్కారం అందించిన భారత రాష్ట్రపతి ఎవరు?
జ: ప్రతిభా పాటిల్
42. 'గ్రామ స్వరాజ్యం ద్వారానే రామరాజ్యం సాధ్యమవుతుందని' ఎవరు పేర్కొన్నారు?
జ: గాంధీజీ
43. మండల పరిషత్‌ను పరిపాలనా సౌలభ్యం కోసం ఎలా విభజిస్తారు?
జ: MPTC
44. మండల పరిషత్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు?
జ: MPDO
45. జిల్లా పరిషత్‌కు ముఖ్య కార్యనిర్వహణాధికారి ఎవరు?
జ: CEO