• facebook
  • whatsapp
  • telegram

Serious .... Severely

ప్రస్తుతం మనం చర్చించబోయే collocations (వాడుకగా కలిసే మాటలు) అన్నీ నిత్య జీవితానికి సంబంధించినవి. వాటిని ఉపయోగిస్తే మన ఇంగ్లిష్ చాలా effective గా ఉంటుంది.

Nikhila: For a week now the Telangana agitation has rocked the state, with serious consequences for all. Public services have been severely affected.

(వారం రోజులుగా తెలంగాణ ఆందోళన రాష్ట్రాన్ని కుదిపేసింది. ప్రజలందరికీ తీవ్ర పరిణామం కలిగేలా,  ప్రజాసేవలు తీవ్రంగా ప్రభావితం అయ్యేలా.)

Ajitha: The work in government offices has come to a standstill and people have been put to serious inconveniences.

(ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు స్తంభించిపోయాయి. ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.)

Nikhila: The JAC had given a call for a bandh for 48 hours and the support of the people had been whole hearted. They wouldn't mind putting themselves to any inconvenience for the cause of a separate state.

(జేఏసీ 48 గంటల బంద్‌కు పిలుపునిచ్చింది. దీనికి ప్రజల మద్దతు పూర్తిగా ఉంది. ప్రత్యేక రాష్ట్రం కోసం వాళ్లు ఎంత అసౌకర్యానికి గురవడానికైనా సిద్ధంగా ఉన్నట్లున్నారు.)

Ajitha: The streets had been deserted except where the agitators and police had clashed. In some cases the police had to resort to lathi charge and arrests.

(ఆందోళనకారులు, పోలీసులు ఘర్షణకు దిగినచోట్ల తప్పించి వీధులన్నీ నిర్మానుషమైపోయాయి. కొన్ని కొన్ని సందర్భాల్లో పోలీసులు లాఠీఛార్జీకీ, అరెస్టులకూ ఒడిగట్టాల్సి వచ్చింది.)

Nikhila: I wonder what is going to happen to X class and Inter exams.

 (పదోతరగతి, ఇంటర్ పరీక్షలకు ఏం అవబోతోందా అని ఆందోళనగా ఉంది నాకు.)

Ajitha: If the non-cooperation continues, I think the exams will have to be put off till indefinitely.

(ఈ సహాయ నిరాకరణ కొనసాగితే, పరీక్షలు నిరవధికంగా వాయిదా వేయాల్సి వస్తుందనుకుంటున్నా.)

Look at the following expressions:

1) Serious consequences

2) Severely affected

3) Come to a standstill

1) Consequences = పరిణామాలు/ ఒక చర్యకు, సంఘటనకు ఉండే పరిణామాలు

serious = తీవ్రమైన

consequences always collocates with 'serious'.

English లో పరిణామాలు ఎప్పుడూ serious తోనే వాడతాం. అప్పుడప్పుడు 'severe'ను దాదాపు 'తీవ్రమైన' అనే అర్థంతో వాడతాం.

a) A: She has stopped talking to me.

B: Why? what happened?

A: I just cracked a joke and she took it seriously. I never thought that the consequences would be so serious.

(నేనేదో జోక్ చేశాను. ఆమె దాన్ని మరీ పట్టించుకుంది. నా జోక్ పరిణామాలు ఇంత తీవ్రంగా ఉంటాయనుకోలేదు.)

b) Srinivas went just a few minutes late. His boss transferred him. Whoever thought that a few minutes' delay will have such serious consequences?

(శ్రీనివాస్ ఆఫీస్‌కు కొద్ది నిమిషాలు మాత్రం ఆలస్యంగా వచ్చాడు. దానికే వాళ్ల బాస్ అతడిని బదిలీ చేశాడు. కొద్దినిమిషాల ఆలస్యానికింత తీవ్ర పరిణామం ఉంటుందని ఎవరనుకున్నారు?)

Far reaching consequences అనే expression కూడా ఉంది. దీని అర్థం చాలా వాటిమీద చాలా విధాలుగా కలిగే ప్రభావం/పరిణామాలు.

a) The decision the Central Govt. may take on the Telangana issue will have far reaching consequences = తెలంగాణా విషయం మీద కేంద్రం తీసుకునే నిర్ణయం చాలా విషయాల్లో చాలా విధాలుగా పరిణామాలు కలిగించవచ్చు.

b) Some times small actions have far reaching consequences = కొన్ని కొన్నిసార్లు చిన్న చిన్న చర్యలు చాలా ఎక్కువగా చాలా విధాలుగా పరిణామాన్ని కలిగిస్తాయి.

c) Kunthi's indiscretion had the far reaching consequences of Kurukshetra war = కుంతీదేవి అజాగ్రత్త, అనాలోచితమైన పని వల్ల కురుక్షేత్ర యుద్ధమంత తీవ్ర పరిణామం జరిగింది. 

unforeseen consequences = ఊహించని పరిణామాలు

a) I haven't started any action for fear of unforeseen consequences = ఊహించని పరిణామాలుంటాయనే భయంతో నేను ఏ చర్యా తీసుకోలేదు.

b) Fear of unforeseen consequences prevented him from taking any decision = ఊహించని పరిణామాల భయం అతడిని ఏ నిర్ణయం తీసుకోకుండా చేసింది.

2) Severely affected:

Affect = to change something = ప్రభావం చూపడం

affect studies = Strikes cause a change in studies = సమ్మెలు చదువును ప్రభావితం చేస్తాయి.

was/were affected = ప్రభావితం అయ్యింది/అయ్యాయి (passive)

affect ముందు severely ఎక్కువగా వాడతాం, తీవ్రంగా ప్రభావితం చేయడం అనే అర్థంతో.

a) Because of the Rastaroko, transport services were severely affected. 

(రాస్తారోకో వల్ల రవాణా సౌకర్యాలు తీవ్రంగా ప్రభావితం అయ్యాయి/రాస్తారోకో రవాణా సౌకర్యాల మీద తీవ్రమైన ప్రభావం చూపింది.)

b) His health was severely affected by his smoking. 

(తీవ్రంగా ప్రభావితం అయ్యింది . ఇక్కడ చెడిపోయింది అనే అర్థంలో వాడాం)

3) Come to a standstill = standstill = నిలిచిపోవడం

be at a standstill/ come to a standstill = ఏవంటే అవి ఎక్కడికక్కడ నిలిచిపోవడం/స్తంభించడం

a) The traffic came to a standstill as a result of the accident = ప్రమాదం ఫలితంగా రాకపోకలు స్తంభించిపోయాయి.

b) As the snake entered the class the students and the teacher were at a standstill = పాము తరగతిలోకి రాగానే పిల్లలు, టీచర్ నిశ్చలంగా ఉండిపోయారు.

Bring something to a standstill అని కూడా అంటాం = స్తంభింపజేయడం.

Supporters of Telangana brought the Assembly to a standstill.

(తెలంగాణావాదులు అసెంబ్లీని స్తంభింపజేశారు.)

 Exercise 

Choose the word / words that collocate with the word/s given. More than one answer is possible.

1) ----- attractive

A) Brilliantly B) Stunningly C) Charmingly D) Deeply

2) ----- cyclone

A) Deadly    B) Devastating  C) Damaging  D) Serious

3) ----- fashion

A) Latest    B) Attractive     C) Current    D) Timely

4) ----- clean

A) Purely  B) Clearly           C) Greatly     D) Spotlessly

5) ----- of luck

A) A blow  B) Miracle          C) A stroke   D) Support

వివరణలు

1) Answer B:

Attractive = ఆకర్షణీయమైన; Stunningly attractive = highly surprisingly attractive = దిగ్భ్రమ, సంభ్రమం కలిగించే, ఆకర్షణీయంగా ఉన్న;  అత్యంత సుందరమైన అనే అర్థంతో Stunningly beautiful అని కూడా అంటారు.

Wrong choices:

A) Brilliantly = very cleverly/ very brightly/ not used with attractive.

C) Charmingly = attractively/ pleasantly = ఆకర్షణీయమైన /ఆహ్లాదకరమైన. ఇది attractiveతో charmingly అవదు. charmingly అంటేనే attractively కాబట్టి.

D) Deeply= intensely = గాఢంగా (ఎక్కువగా లోతుగా అనే అర్థంతో వాడతాం). Deeply attractive is not in use.

2) Answer B:

Devastating = destructive = వినాశకరమైన. Devastatingను అన్ని విపత్తుల ముందూ వాడతాం.

A devastating earthquake/ floods/ fire. ఇది సరైన collocation.

Wrong choices:

C) Damaging = causing loss = నష్టాన్ని కలిగించే.

D) serious = severe/ తీవ్రమైన. grave = గంభీరమైన.

A) Deadly = capable of causing death/ killing = మరణకారకమైన - ఇవేవీ cycloneతో వాడం.

3) Answer A/C:

latest = అతి నవీనమైన/current = ప్రస్తుతం. fashion తో  ఈ రెండింటినీ తరచూ వాడతాం.

Wrong choices:

B) Attractive is not usually used with fashion though it is not altogether wrong.

Timely = (happening) at the proper time = సకాలమైన.

Timely rain = సకాల వర్షం  not used with 'fashion'.

4) Answer D:

Spotlessly clean = so clean that not even a spot of dirt can be seen = ఏ మచ్చా కనపడనంత శుభ్రంగా ఉన్న. This is the proper collocation for 'clean'.

Wrong answers:

A) purely clean  B) clearly clean and C) Greatly clean are never used.

5) Answer C:

A stroke of luck = By a stroke of luck I met him just when I wanted. 

(అదృష్టవశాత్తు నాకు అవసరమైనప్పుడు నేనతడిని కలిశాను.)

Wrong choices:

D) Support,  A) A blow,  B) Miracle (A strange and surpising event = అద్భుతం) does not collocate with luck.

గమనిక : ప్రతిభ.ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారులు, సంస్థల నుంచి వస్తాయి. మరి కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచి మేరకు కృత్రిమ మేధస్సు సాంకేతికత సాయంతో ప్రదర్శితమవుతుంటాయి. ఆ ప్రకటనల్లోని ఉత్పత్తులను లేదా సేవలను పాఠకులు స్వయంగా విచారించుకొని, జాగ్రత్తగా పరిశీలించి కొనుక్కోవాలి లేదా వినియోగించుకోవాలి. వాటి నాణ్యత లేదా లోపాలతో ఈనాడు యాజమాన్యానికి ఎలాంటి సంబంధం లేదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకు, ఈ-మెయిల్స్ కి, ఇంకా ఇతర రూపాల్లో సమాచార మార్పిడికి తావు లేదు. ఫిర్యాదులు స్వీకరించడం కుదరదు. పాఠకులు గమనించి, సహకరించాలని మనవి.

 
 
 

విద్యా ఉద్యోగ సమాచారం

 
 

లేటెస్ట్ నోటిఫికేష‌న్స్‌